ఉల్లిపాయల రైతులను నష్టాల్లోంచి బయటపడేసి వారికి ఒక నికారమైన ఆదాయానికి మార్గం చూపించిన 23 సంవత్సరాల కళ్యాణి రాజేంద్ర సిండే ను ఆనియన్ ట్విన్ అని పిలుస్తారు మహారాష్ట్రలోని లాసల్గావ్ అనే ఊరిలో పుట్టిన కళ్యాణి ఉల్లి రైతు కూతురే. ఉల్లి కోతకు వచ్చి వాటిని నిల్వ చేయడానికి రైతులు పడే బాధ చూశాక ఇంజనీరింగ్ చదువుతున్న కళ్యాణి రైతుల సమస్యలు క్షేత్రస్థాయిలో శాస్త్రీయంగా అధ్యయనం చేసే డిజిటల్ ఇంపాక్ట్ స్క్వేర్ కోర్స్ చేసింది. ఆ అధ్యయనం తర్వాత ఉల్లిపాయలు దెబ్బతినడాన్ని ముందుగానే గుర్తించగల ఒక పరికరం కనిపెట్టింది. దాని పేరు గోదామ్ సెన్స్. నాసిక్ లో గోదామ్ ఇనోవేషన్స్ పేరుతో ఒక స్టార్టప్ మొదలు పెట్టింది ఆమె తయారు చేసిన పరికరం ఎన్నో రాష్ట్రాల రైతులకు ఉపయోగపడుతోంది.













