దక్షిణాఫ్రికా లోని సన్ సిటీ లో జరిగిన 44వ మిస్ వరల్డ్ పోటీల్లో 87 దేశాల పోటీదారులను ఓడించి ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నది. అంతకుముందే మిస్ మిరాక్యులస్, మిస్ పర్ ఫెక్ట్ టెన్, మిస్ పాపులర్, మిస్ క్యాట్ వాక్ వంటి టైటిల్ గెల్చుకుందామే. ప్రపంచ సుందరి పోటీల్లో కిరీటం తో పాటు మిస్ ఫోటో జెనిక్ మిస్ వరల్డ్ కాంటినెంటల్ క్వీన్ ఆఫ్ బ్యూటీ టైటిల్ కూడా అందుకున్నారు ఐశ్వర్య ప్రపంచ సుందరి అయ్యాకనే ఆమె సినిమాల్లో నటించింది. లండన్ లో ఒక సంవత్సరం శాంతి రాయబారిగా పనిచేసింది. ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోసం బ్రాండ్ అంబాసిడర్ ఐశ్వర్య.













