• వయోతారతమ్యాలు ,చదువు సంధ్యలు సామాజిక హోదాలు ఆర్థిక స్తితిగతులతో సంబంధం లేకుండా మహిళలంతా ఎదో రకమైన హింసకు గురవుతున్నారని కాకపోతే హింసకు వ్యతిరేకంగా 119 దేశాల్లో చట్టాలు అమలుచేస్తున్నాయి. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 125 దేశాల చట్టాలు అమలు చేస్తున్నాయి. కానీ ఈ చట్టాలు మహిళలలకు సత్వర న్యాయం కల్పిస్తున్నాయనే దాఖలాలు మాత్రం ఏవీ లేవు. చట్టాలున్నా బాధ్యత మహిళలు ఫిర్యాదు చేసేందుకుఅనుకూలమైన పరిస్థితులు లేవు. మూడేళ్ళలో గృహ హింసకు సంబంధించి దేశవ్యాప్తంగా 3. లక్షల కేసులు నమోదయ్యాయి. కాలం గడుస్తుంటే హింస రూపం మార్చుకుంటుంది. ఇప్పుడైతే ఇల్లు, బడి, గుడి, ఆఫీస్ ,బస్స్టాండ్ ,సినిమా హాల్ ,షాపింగ్ మాల్ , జన నమ్మకం ఉన్న ప్రదేశాలు ఏవీ మహిళలలకు వంద శాతం సురక్షితమైన ప్రదేశాలు కానేకావు. రేపు నవంబర్ 25వ తేదీన ఇంటర్నేషనల్ డే ఆన్ వయొలెన్స్ ఎగైనెస్ట్ ఉమెన్. కానీ హింసధ్వని అసలు ఎప్పటికైనా ఆగుతుందా?

    ఈ హింసధ్వని అసలు ఆగుతుందా ?

    వయోతారతమ్యాలు ,చదువు సంధ్యలు సామాజిక హోదాలు ఆర్థిక స్తితిగతులతో సంబంధం లేకుండా మహిళలంతా ఎదో రకమైన హింసకు గురవుతున్నారని కాకపోతే హింసకు వ్యతిరేకంగా 119 దేశాల్లో చట్టాలు…

  • చలి కాలం చలి వణికిస్తూ ఉంటే అందమైన మెత్తని మేలైన వగైరా వగైరా సుగుణాలున్న డ్రెస్ ల గురించి ఆలోచించే అవకాశమూ లేదు. అలంటి ప్రయోగాలు చేస్తే చలికి వొళ్ళంతా పగిలిపోతుంది కూడా. ఇప్పుడు నిండా స్వేట్టర్ వేసుకున్నాక దానికి సంబంధించిన ఫ్యాషన్ గురించి ఆలోచిస్తే స్కిన్నీ జీన్స్ వెచ్చగా సౌకర్యంగా బావుంటాయనిపిస్తోంది. ఫ్యాషన్ గానూ ఉంటుంది దానిపైన లూజ్ గా వుండే స్వేట్టర్ వేసుకున్న లేదా మంచి లెథర్ జాకెట్ వేసుకున్నా బావుంటుంది. స్వెట్టర్స్ లేత రంగుల్ని ఎంచుకోవాలి. మెడ చుట్టూ కప్పి వుండే కాశ్మీర్ క్రూనెక్ ఉలెన్ కోట్లు కాలర్ ఉన్న షర్టుల పై వేసుకుంటే బావుంటాయి. ఈ చలికి తగట్టు బ్లాంకెట్ ర్యాప్ స్కొర్క్ రకాలు పెద్దవిగా కనిపించేవి ఒక భుజానికి వేసుకున్నా మెడ చుట్టూ చుట్టుకున్నా అందమే.

    స్వెట్టర్లతో కూడా ఫ్యాషన్ లుక్

    చలి కాలం చలి వణికిస్తూ ఉంటే అందమైన మెత్తని మేలైన వగైరా వగైరా సుగుణాలున్న డ్రెస్ ల గురించి ఆలోచించే అవకాశమూ లేదు. అలంటి ప్రయోగాలు చేస్తే…

  • కాలీఫ్లవర్స్ ఒక్క తెలుపు రంగులోనే వచ్చేవి. ఇప్పుడైతే మొత్తం రెయిన్బో కలర్స్. నారింజ, ఆకుపచ్చ, వంకాయ, గులాబీ ఒకలాంటి ఎరుపు ఇవన్నీ ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో ఆహార ప్రియుల్ని ఆకర్షిస్తూనే ఉన్నాయి. రంగుల కాలీఫ్లవర్ల లో ఆంఠో నైనిమ్లా బీటా కెరోటిన్లు ఎక్కువగా లభిస్తాయి కనుక అనేక వ్యాధుల్ని అరికడతాయి. పోషకాలు ఎక్కువగా పిండి పదార్ధాలు తక్కువ కనుక అన్నం బంగాళా దుంపలకు బదులు వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. ఈ రంగుల కాలీఫ్లవర్ల కొవ్వులు ప్రోటీన్లు విటమిన్ C, E, K కాల్షియం ,ఇరన్ ఇంకా ఎన్నెనో ఉన్నాయి కనుక ఈ రంగుల కాలీఫ్లవర్స్ అన్నీ కలిపి తీసుకోవాలనీ అలాగే నూనెలో వేయించటం ఉడికించటం వద్దని కేవలం ఆవిరిపైన ఉడికించి సలాడ్ల రూపంలో తీసుకుంటూ ఇందులోని పోషకాలన్నీ శరీరానికి చక్కగా అందుతాయంటున్నారు పోషక నిపుణులు.

    రంగుల కాలీఫ్లవర్స్ తో పోషకాలు జాస్తి

    కాలీఫ్లవర్స్ ఒక్క తెలుపు రంగులోనే వచ్చేవి. ఇప్పుడైతే మొత్తం రెయిన్బో కలర్స్. నారింజ, ఆకుపచ్చ, వంకాయ, గులాబీ ఒకలాంటి ఎరుపు ఇవన్నీ ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో ఆహార…

  • జీవన శైలి, పని విధానాన్ని బట్టే శిరోజాల కటింగ్, స్టయిలింగ్ ఎంచుకోవాలి. ఇదే సమయంలో ముఖాకృతిని దృష్టిలో ఉంచుకుని హెయిర్ స్టయిలిస్ట్ సలహా వినాలి. గుండ్రని ముఖం గల వాళ్ళకి బాబ్ బాగుంటుంది. ఓవెల్ ముఖాకృతి అయితే ఎటువంటి కటింగ్ అయినా నప్పుతుంది. అలాగే నలభై ఏళ్ళు దాటితే క్లాసిక్ లుక్స్ బాగుంటుంది. ఈ వయస్సులో బుజాల దాకా వుండే విస్సి లేయర్స్ నప్పుతాయి. ఈ లేయర్స్ ఒక దాని' వెంట ఒకటి క్లోజ్ లెంగ్త్ లో వుండాలి. అలాగే పల్చని జుట్టు అయితే నడి నెత్తి పైన వాల్యుమైజ్ చేసే కట్ అసలు బాగుండదు అలాగే పొడవుగా వుండే వాళ్ళకు సూట్ అయ్యే క్లాసిక్ లెంగ్త్ జుట్టు మొత్తం వెనక్కి లాగి టైట్ గా పోనీ టేయిల్ బిగించి కడితే చాలా బాగుంటుంది. స్టయిలింగ్ విషయం స్వయం నిర్ణయం కంటే హెయిర్ స్టైలిస్ట్ సలహా స్వీకరించడం మంచిది.

    ఏ ముఖాకృతికి ఏ హెయిర్ స్టయిల్

    జీవన శైలి, పని విధానాన్ని బట్టే శిరోజాల కటింగ్, స్టయిలింగ్ ఎంచుకోవాలి. ఇదే సమయంలో ముఖాకృతిని దృష్టిలో ఉంచుకుని హెయిర్ స్టయిలిస్ట్ సలహా వినాలి. గుండ్రని ముఖం…

  • ఫ్యాషన్ స్టైల్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తుంటాయి వాటిలో మునివేళ్ళ పై అందాలు దిద్దు చోటు ఒకటి నెయిల్ ఆర్ట్ రకరకాల హంగులలో ఫ్యాషన్ పోకడగా నిలిచింది ఫ్రెంచ్ మనిక్యూర్, బ్లాక్ టిప్స్ నుంచి గ్లిట్టర్ పెయింట్స్ దాకా ట్రెండి నెయిల్ స్టైల్స్ రంగం పైకి వచ్చాయి. కానీ ఈ నెయిల్ ఆర్ట్ ని కాస్త క్రియేటివ్ గా ఆలోచించాలి. ఒక్క గోటికి జిగ్ జాగ్ మనే వెండి మెరుపులు వేసి మిగతా గోళ్ళని డార్క్ రెడ్ లేదా ఒక్క గోటిని ఒక్క కలర్ డిజైన్ లో నింపేయడం లేటెస్ట్ ట్రెండ్ నిండు నీలమ్, టర్నోయిన్, పసుపు, నియాన్ గ్రీన్, బ్లాక్ మాత్రమే ట్రెండి కాదు ఈ గోళ్ళను దుస్తులతో కాంట్రస్ట్ గా లేదా పూర్తి మాచింగ్ టీమ్ గా వేసుకోవాలి. దుస్తులు, వేలి కొసలు ఒక దానికి ఒకటి ధీటుగా వుండాలి.

    మునివేళ్ళ ముచ్చట్లు

    ఫ్యాషన్ స్టైల్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తుంటాయి వాటిలో మునివేళ్ళ పై అందాలు దిద్దు చోటు ఒకటి నెయిల్ ఆర్ట్ రకరకాల హంగులలో ఫ్యాషన్ పోకడగా…

  • సినిమాలకు కొత్తదనం కావాలి. ఫ్యాషన్ ఎప్పుడూ కొత్తదనాన్ని చుట్టుకునే ఉంటుంది. మేడలో వేసుకుని ముత్యాల మిలమిలల్ని కళ్లద్దాల అలంకరణ లో భాగంగా చేసారు ఛానెల్ కంపెనీ వాళ్ళు గుండ్రని అద్దాల చుట్టూ అందంగా పొదిగిన ముత్యాలతో ఛానెల్ పెరల్ సన్ గ్లాసెస్ ఇప్పటికే కోలీవుడ్ హీరోయిన్స్ కళ్ళకు పెట్టేసుకుని చక్కగా కనిపిస్తున్నారు. కొన్నింటికి చిన్న ముత్యులు మరికొన్నింటికి పెద్ద ముత్యాలు పొడిగారు. రంగు రంగు సన్ గగ్లాసెస్ ముత్యాల్ని అమర్చుకుని చమక్ మంటున్నాయి. ఓసారి చూడండి. చూసాక కొనకుండా ఉండలేక పోయారు అంటారు.

    కళ్లద్దాలను ముత్యాలంకరణ

    సినిమాలకు కొత్తదనం కావాలి. ఫ్యాషన్ ఎప్పుడూ కొత్తదనాన్ని  చుట్టుకునే ఉంటుంది. మేడలో వేసుకుని ముత్యాల మిలమిలల్ని కళ్లద్దాల అలంకరణ లో భాగంగా చేసారు ఛానెల్ కంపెనీ వాళ్ళు…

  • గ్రాండ్ లుక్ కావాలంటే పట్టును మించిన వస్త్రం ఇంకేదీ లేదు. పట్టు మెరుపుతోనే ఓ అందం వుంది. ఇంకా పట్టుతో జరీ కలిపేసి అందమైన దుపట్టా డిజైన్ చేస్తే అతి సామాన్యమైన పాత ఫ్యాషన్ అనార్కలీ సల్వార్ పైకి కూడా ఈ బెనారస్ కంచి ఉప్పాడ చాందేరా పోచంపల్లి బాందినీ టై అండ్ డై ఇలా పట్టు పట్టుకు దగ్గరగా వుండే సిల్క్ క్లాత్ తో దుపట్టాలు మార్కెట్ లో కొచ్చాయి. సాదా సీదా డ్రస్ పైకి నిండు జరీ తో పట్టు వేసేస్తే మొత్తం డ్రెస్ కి కట్టలేక పోతున్నామని కాస్త దిగులూ పోగొట్టేస్తున్నాయి ఈ పట్టు దుపట్టాలు.

    సాదా డ్రెస్ ప్యూర్ సిల్క్ దుపట్టా

    గ్రాండ్ లుక్ కావాలంటే పట్టును మించిన వస్త్రం ఇంకేదీ లేదు. పట్టు మెరుపుతోనే ఓ అందం వుంది. ఇంకా పట్టుతో జరీ కలిపేసి అందమైన దుపట్టా డిజైన్…

  • పేరు డబ్బు కెరీర్ లో పైపైకి దూసుకుపోతుంటే వాళ్ళని అదృష్టవంతులనే పేరుతో పిలుస్తూ ఉంటాం. నిజానికి మనం చేసే కష్టమే అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. సినిమా నటులు ఇలాగె ఎంతో కష్టం చేస్తారు రిస్క్ లు తీసుకుంటారు. గంటల రోజుల కొద్దీ జిమ్ లలో చెమటలు కారుస్తారు. నీరజ్ పాండే యాక్షన్ థ్రిల్లర్ బేబీ సినిమా కోసం తాప్సీ కొన్ని స్టంట్లు చేయాలి. ఇందుకోసం తాప్సీ సీరియస్ గా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటుంది. సిరిల్ రేఫల్లీ బాగా పేరు పొందిన ఆర్టిస్ట్. అనేక హాలీవుడ్ హిట్స్ లో పని చేసాడు. అలాంటి స్టంట్ మాన్ దగ్గర తాప్సీ శిక్షణ తీసుకుంటుంది. సుకుమారుల్లా అనిపిస్తారు. కానీ ఎవళ్ళూ కష్టానికి భయపడరు. అలాగుంటేనే అదృష్టవంతులవుతారు.

    మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్న తాప్సీ

    పేరు డబ్బు కెరీర్ లో పైపైకి దూసుకుపోతుంటే వాళ్ళని అదృష్టవంతులనే పేరుతో పిలుస్తూ ఉంటాం. నిజానికి మనం చేసే కష్టమే అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. సినిమా నటులు ఇలాగె…

  • ఈ కాలం అమ్మాయిలు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్స్ ఇంటి పనులు పిల్లల పనులు ఉద్యోగాలు ఇలా ఎన్నో పనులు చేయాలంటే మానసికంగా శారీరికంగా చాలా శక్తిగా ఉండాలి. అంచేత తీసుకునే ఆహారంలో పాల కూర అవిసెలూ టమాటాలు ఓట్స్ ఉండేలా చూసుకోండి. అంటున్నారు. న్యూట్రిషనిస్టులు. పాల కూరలో మేగ్నేషియం పుష్కలంగా ఉంటుంది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అవిసెల్లో వుండే యాంటీ ఇన్ఫమేటరీ గుణాలు జీర్ణక్రియను సవ్యంగా ఉంచుతాయి. టొమాటోలు కొలెస్ట్రాల్ ను తగ్గించటం తో పాటు గుండె జబ్బులు దాడి చేయకుండా కాపాడతాయి. ఇక ఓట్స్ జీర్ణశక్తిని పెంచి బి.పి ని కంట్రోల్ లో ఉంచుతాయి. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. మనిషిలో ఉత్సాహం పెంచుతాయి. ఈ నాలుగు ఆహారంలో ఉండేలా చూసుకుంటే ఆరోగ్యం గా ఉంటారు.

    అమ్మాయిలూ… ఇవి ఆరోగ్యం

    ఈ కాలం అమ్మాయిలు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. చదువుకుంటూ పార్ట్ టైమ్  జాబ్స్ ఇంటి పనులు పిల్లల పనులు ఉద్యోగాలు ఇలా ఎన్నో పనులు చేయాలంటే మానసికంగా…

  • తరచుగా తలనొప్పి బాధిస్తున్నా వర్కవుట్స్ కు ఇబ్బవండిగా ఉన్నా ఒక్కసారి శరీరానికి పై భాగం లో వుండే లో దుస్తులపై ఓ కన్నేసి చూడండి. అంటున్నారు లండన్ నిపుణులు. సరిగా ఫిట్ గానీ బ్రా స్ట్రాప్స్ ఇరిటేట్ చేసి ట్రాప్ జయిస్ కండరం పై వత్తిడి తెస్తాయి. ఈ కండరం మెడకు అక్కడ నుంచి భుజాలకు అనుసంధానం అవుతుంది. ఈ కండరం స్ట్రాప్స్ వత్తిడికి బిగుతైపోతూ మెడలు తలలో టెన్షన్ కు దారి తీస్తుంది. కణతలు వద్ద నొప్పి కళ్ళ వెనుక లేదా పుర్రె కిందుగా నొప్పి వంటి లక్షణాలుంటాయి. కాబట్టి మహిళల దీర్ఘ కాలిక నొప్పులతో బాధపడుతుంటే ఈ విషయం పరిగణలోకి తీసుకోమంటున్నారు నిపుణులు. విశాలమైన ప్యాడెడ్ స్ట్రాప్స్ వేసుకుంటే కారణం తెలియని తలనొప్పులు మాయం అవుతాయి. బిగుతైన లో దుస్తులు వేసుకుంటే ఎప్పటికైనా ప్రాబ్లమే.

    బహుశా ఈ సమస్య కావచ్చు

    తరచుగా తలనొప్పి బాధిస్తున్నా  వర్కవుట్స్ కు ఇబ్బవండిగా ఉన్నా  ఒక్కసారి శరీరానికి పై భాగం లో వుండే లో దుస్తులపై ఓ కన్నేసి చూడండి. అంటున్నారు లండన్…