• ఆలియా భట్, కరీనాకపూర్, కీర్తిసనన్, దీపికా పాడుకొనే లాంటి వాళ్ళు ఈ సంవత్సర కాలంగా ఎన్నో సార్లు జంప్ సూట్, తో రాంప్ వాక్ చేస్తున్న ఫోటోలు కనీస్తున్నాయి. ఇవి సినిమా హీరోయిన్లకే కాదు అమ్మాయిలెవరైనా మోడ్రన్ ఫ్యాషన్ ఇష్టపడే వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది.నడుము తీరైన ఆకృతిలో కనిపిస్తూ పై నుంచి కింద వరకు ఒకే డిజైన్ లో ఈ జంప్ సూట్వంటికి అతుక్కు పోయి కనిపిస్తుంది. సాధారణంగా ఎలాస్టిక్ వుంటుంది. లేదా అదే వస్త్రంతో తాయారు చేసిన బెల్ట్ వుంటుంది కనుక నడుమును పట్టి ఉంచుతుంది. లెనిన్, నూలు, డెనిమ్ వస్త్రాలతో చేసిన జంప్ సూట్ సౌకర్యంగా వుంటుంది. శాటిన్ సిల్క్ చూసేందుకు ఆడంబరంగా కనిపించవచ్చు కానీ ఏ కొద్ది సేపోతప్ప సాయంత్రం వరకు ఏ పార్టీ లోనో వుండాలంటే కష్టం. చిన్నప్రింటు గళ్ళు చిన్ని డిజైన్స్లో వుంటాయి కనుక వీటి మీదకి ఫంకీ జ్యూవెలరీ బాగుంటుంది. టీనేజ్ అమ్మయిలకు ఈ జంప్ సూట్ చాలా బాగుంటుంది. స్టాక్ ఫొటోస్ కనిపిస్తాయి చూసి ఎంచుకోవచ్చు.

    టీనేజ్ అమ్మాయిలకు ఈ డ్రెస్ బాగుంటుంది

    ఆలియా భట్, కరీనాకపూర్, కీర్తిసనన్, దీపికా పాడుకొనే లాంటి వాళ్ళు ఈ సంవత్సర కాలంగా ఎన్నో సార్లు జంప్ సూట్, తో రాంప్ వాక్ చేస్తున్న ఫోటోలు…

  • ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా, పార్లర్ కు పోకుండా ఎలాంటి రాసాయినాలు వాడకుండా ఇప్పటికిప్పుడు మొహం మెరిసిపోవాలంటే బొప్పాయి గుజ్జుని మనసులో తలచుకోవాలి. బొప్పాయి లోని ఏ పైన్ అనే ఎంజైమ్ మొహానికి తక్షణం మెరుపులిస్తుంది. గుజ్జులో అరచెంచా గంధం, కలబంద గుజ్జు కలిపి రాసి పదే పది నిమిషాల్లో చల్లని నీళ్ళతో కడుక్కొని చుస్తే. ఏ పార్టీకొ వెళితే ప్రత్యేకంగా కనబడేంత మేరుపోస్తుంది. అలాగే గుజ్జులో తేనె, పెరుగు, రోజ్వాటర్ కలిపినా సేమ్ ఎఫెక్ట్. అలాగే ఓట్స్ కూడా మంచి సౌందర్య పోషకమే. ఓట్స్ ఓ గుప్పెడు వేడి నీళ్ళల్లో నానబెట్టి గంధం పెరుగు వేసి కలిపి ఫేస్ పాక్ వేసినా చెక్కని కళే. పాలు కూడా మంచి ఎఫెక్ట్ ఇస్తాయి. పాలు గంధం, బొప్పాయి గుజ్జు, తేనె కలిపి ఫేస్ పాక్ వేస్తె ఎంత అందం మొహం పైకి వస్తుందో న్యాయంగా చూసి తలుసుకోవచ్చు. ఎలాంటి రసాయనాలు వాడకుండా వచ్చేదే అసలైన అందం.

    మొహం వెన్నెల కాంతితో మెరవాలంటే

    ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా, పార్లర్ కు పోకుండా ఎలాంటి రాసాయినాలు వాడకుండా ఇప్పటికిప్పుడు మొహం మెరిసిపోవాలంటే బొప్పాయి గుజ్జుని మనసులో తలచుకోవాలి. బొప్పాయి లోని…

  • సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్స్ కై ఐరాస యంగ్ లీడర్ గా నామినేట్ అయిన యువ న్యాయవాది త్రిషాశెట్టి బహిష్ట సమయంలో స్త్రీలు వాడే సానిటరీ నాప్కీన్స్ పై టాక్స్ తీసేయాలంటూ పిటిషన్ వేసారు. షి సేవ్ అనే స్వచ్చంద సంస్థను గత ఏడాది ప్రారంభించిన త్రిష ఈ సంస్థ ద్వారా మన దేశంలో స్త్రీలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా మహిళలు చైతన్యవంతం చేయడం, వారికి పునరావాసం కలిపించడం సాధికారంగా తాయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సానిటరీ నాప్ కీన్స్ పై పన్ను వేయడం వల్ల వాటిని కొనుక్కోలేకపోతున్నారు అని మన దేశంలో కండోమ్స్, కంట్రోసెప్టిక్స్ పై టాక్స్ లేదు అలాగే స్త్రీల ఆరోగ్యరిత్య నాప్ కీన్స్ పై పన్ను విధించడం అన్యాయం అంటున్నారు త్రిష షి నెస్ సంస్థ వివిధ స్థాయిల్లో స్త్రీల పై జరుగుతున్న లైంగిక వేదింపుల పై పోరాడేందుకు ఎడ్యుకేషనల్ వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది త్రిష.

    వీటి పైన పన్ను వేయడం న్యాయమా?

    సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్స్ కై ఐరాస యంగ్ లీడర్ గా నామినేట్ అయిన యువ న్యాయవాది త్రిషాశెట్టి బహిష్ట సమయంలో స్త్రీలు వాడే సానిటరీ నాప్కీన్స్…

  • నాలుక ఎప్పుడు తియ్యదనాన్ని కోరుతూనే వుంటుంది. అనారోగ్యం రానీ, శరీర బరువు పెరగనీ, ఇలాంటి సమస్యలున్నా సరే స్వీట్ తినాలన్న కోరిక పోదు. స్వీట్ లో వున్న స్వీట్ రుచి గొప్పదనం ఇదే. మాములుగా డాక్టర్లు ఎం చేపుతరంటే ఒత్తిడి, అలసట శరీరానికి తినాలనిపించడానికి కారణాలు శక్తి తగ్గితే తీపి ద్వారా శరీరానికి తక్షణ సాయం అందుతుంది. ఈ కబుర్లు అలా వుంచి స్వీట్లు జోలికి వెళ్ళకుండా వుండాలంటే ముందస్తుగా వ్యాయామం చేయాలంటున్నారు డాక్టర్లు, అలాగే శరీరంలోని నీటి శాతం తగ్గినప్పుడు కూడా చెక్కర తినాలని పిస్తుందిట. ఈ ఫిలింగ్ వదిలించుకునేలా మనసుని కంట్రోల్ చేసుకుని తీరాలి. అలా తీపీ లేని జీవితాన్ని అలవరుచుకునే క్రమంలో మరీ వుండలేక పోతే 70 శాతం డార్క్ చాకొలెట్ ను రెండు ముక్కలు మాత్రం తినాలి. స్వీట్ పొటాటో, స్వీట్ కార్న్, ఖర్జూర పళ్ళు, అప్రికాట్స్, ఎండు ద్రాక్ష, అంజీర ఎదో ఒకటి తినాలి. స్వీట్స్ ఎంతో బాగుంటాయి. కానీ తింటే నష్టం మరీ ఎక్కువ.

    స్వీట్ బదులు ఇవి ట్రై చేస్తే బెటర్

    నాలుక ఎప్పుడు తియ్యదనాన్ని కోరుతూనే వుంటుంది. అనారోగ్యం రానీ, శరీర బరువు పెరగనీ, ఇలాంటి సమస్యలున్నా సరే స్వీట్ తినాలన్న కోరిక పోదు. స్వీట్ లో వున్న…

  • ఉలి దెబ్బలు తినే రాయి శిల్పంగా మారుతుంది. నిప్పు సెగ తగిలి కరిగి జారి తినే బంగారం అందమైన ఆభరణం రూపంలోకి మారుతుంది. మనిషి అంటే కష్టాల కొలిమిలో కరిగితే జీవితం విలువ తలిసి వస్తుంది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన పత్తి త్రిపాఠీ కూడా అంతే అమెరికా వలన వెళ్ళిన అమ్మా నాన్న ఆంక్షల మద్యని పెరిగింది. వైవాహిక జీవితం కూడా సాఫీగా నడవలేదు. ఒక ఛానల్ లో యాంకర్ గా చేరాక, ఆర్ధికంగా స్థిరంగా నిలబడ గలిగాక స్వీయ అనుభావల నేపధ్యంలో ఎదిగిన తనలాంటి ఎందరో మహిళల స్ఫూర్తిని ఇతరులకు పంచాలి అనుకుంది. గత ఐదేళ్ళుగా శారీ టు సూట్స్ పేరు తో వ్యాపార వేత్తలు, విజయ పదంలో ఎదిగిన వాళ్ళ ముఖ చిత్రాలతో కేలెండర్ లో వేస్తుంది. ఇందుకు అమెరికా లొనీ 15 స్వచ్చంద సంస్థలు సాయం అందిస్తున్నాయి. 2017 కాలెండర్ లోమాలాలా, రేణు ఖతార్, రూపా ఉన్నికృష్ణన్ లాంటి వాళ్ళ ఫోటోలున్నాయి. ఫోటోలతో పాటు వాళ్ళ విజయ గాధలు కాలెండర్ లో వుంటాయి.

    ‘శారీటు సూట్స్’ ఎందరికో స్ఫూర్తి

    ఉలి దెబ్బలు తినే రాయి శిల్పంగా మారుతుంది. నిప్పు సెగ తగిలి కరిగి జారి తినే బంగారం అందమైన ఆభరణం రూపంలోకి మారుతుంది. మనిషి అంటే కష్టాల…

  • 'మీ పెదవుల మీద పడిన కన్నీటి రుచిని మిగిలిన ఏ రుచులు గెలువలేవు'.అన్న సంకేతం తో కన్నీటితో ఉప్పు తాయారు చేసి అమ్ముతుంది హక్ స్టన్ మూన్ స్టార్ సప్లయ్ అన్న లండన్ కంపెనీ. ఆ ఉప్పు పేరు Salt made from human tears. మనిషి కన్నీటిని నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి ఆ ఆవిరి చల్లరిస్తే అది ఉప్పు అవుతుందిట. ఇదే వింత అయితే ఇందులో వెరైటీ ఉప్పులు వున్నాయి. బాధ, సంతోషం, కోపం లాంటి బావోద్వేగాలతో కరచిన కన్నీటి తో ఐదు రకాల ఉప్పులు తాయారు చేస్తారు. సాల్ట్ మేడ్ ఫ్రమ్ టియర్స్ ఆఫ్ సారో కొట్టండి ఆన్లైన్ లో బిరడా వేసిన సిసాలో Saddest salt in the world కనిపిస్తుంది. సంతోష సమయంలో జాలువారిన కన్నీటి ఉప్పు ఖరీదు ఎక్కువట. దీన్ని గురించి పెద్ద పెద్ద రివ్యూలు, రిపోర్ట్లు వున్నాయి. ఆన్ లైన్ లో చదువుకోండి.

    ఈ ఉప్పు మేడ్ విత్ కన్నీళ్ళు

    ‘మీ పెదవుల మీద పడిన కన్నీటి రుచిని మిగిలిన ఏ రుచులు గెలువలేవు’.అన్న సంకేతం తో కన్నీటితో ఉప్పు తాయారు చేసి అమ్ముతుంది హక్ స్టన్ మూన్…

  • 1960, 70 ల్లో స్టార్ హీరోలతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అలనాటి నటి కాంచన ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్ళా మేకప్ వేసుకుంటున్నారు. పెళ్ళి చూపులు ఫేంమ్ దేవరకొండ విజయ్ హీరోగా నటిస్తున్న అర్జున్ రెడ్డి సినిమాలో ఆమె నటిస్తున్నారు. దర్శకుడు సందీప్ వంగా కాంచన పాత్ర గురించి చెపుతూ మాములు సినిమా భామ్మ లాగా రొటీన్ గా ఉండరు. మొడ్రన్ భామ్మగా వుంటారు. మనుమలు ఏదైనా తప్పు చేస్తే సినిమాల్లో భామ్మ దానిని సరిగ్గా అర్ధం చేసుకుంటుంది. ఇది వరకు ఆత్మ గౌరవం, మంచి కుటుంబం, నవరాత్రి, వీరాభిమన్యు, అనేక తదితర చిత్రాల్లో నటించి తనదైన ముద్రని వేసుకున్న కాంచన ౩౦ సంవత్సరాల తర్వాత మళ్ళి తెలుగులో నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.

    మళ్ళి సినిమాల్లోకి అలనాటి కాంచన

    1960, 70 ల్లో స్టార్ హీరోలతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అలనాటి నటి కాంచన ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్ళా మేకప్ వేసుకుంటున్నారు. పెళ్ళి చూపులు…

  • మేనేజ్ మెంట్ గురులు ఏమంటున్నారంటే స్త్రీలలో వుండే సున్నితత్వమే ఆమె బలం ప్రేమగా వుండే గుణమే విజయ రహస్యం అంటూ మెచ్చుకుంటున్నారు. ఆమె ఒక విషయాన్నీ సాలెగూడులా అల్లుకుపోతూ అలోచిస్తుందిట. సమస్య, పరిష్కారం, ఏదిమంచి, ఏది చెడు, ఎంత మంచి, ఎంత చెడు అన్న విషయాలు మెరుపులా అలోచిస్తుందిట. ఆమె ఆలోచనల్లో విస్తృతి ఎక్కువ ఒక సమస్యకు ఎన్ని పరిష్కారాలు ఆలోచించ గలదు, కార్పోరేట్ వ్యవస్థ విషయంలో అయితే ఆమె మార్కెట్ ను అంచనా వేయడం, వినియోగదారుల అవసరాలను అర్ధం చేసుకోవడం, సిబ్బంది నైపున్యాలని పసిగట్టడం ఆమెకు మెదడు వ్యవస్థాపరంగా చాలా తేలికగా చేయగల శక్తి వుంది. దీన్ని వ్యుహా ప్రపంచం గుర్తించింది. మార్కెటింగ్, ప్లానింగ్, డిజైనింగ్ విషయాల్లో ఆమెకే ప్రయారిటి ఇస్తుంది. ఆమె మెదడులో దీర్ఘకాలిక ఆలోచనలకు, వ్యూహాలకు సంబందించిన అరలున్తాయని నిపుణులు గుర్తించారు. పురుషులతో పోలిస్తే మహిళల మెదడులో భరీ పాదరసం వుంటుంది, దాన్ని ఎంత సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలో ఆమెకు బాగా తెలుసు కర్పోరేట్ డిల్స్ కుదర్చడంలో ,మొండికేసిన క్లాయిట్స్ ని ఒప్పించడంలో, బెట్టు చేస్తున్న యూనియన్ లీడర్లను మెప్పించడంలో ఆమె సంభాషణ చాతుర్యం, ఉద్వేగా పూరితమైన పదకోశం ఎంతో బాగా ఉపయోగ పడతాయన, ఆమెలో పుట్టుకతోనే నాయిక లక్షణాలున్నాయని ఇప్పటి ఫ్రెష్ రిపోర్ట్.

    భారతీయ మహిళలకు తిరుగు లేదు

    మేనేజ్ మెంట్ గురులు ఏమంటున్నారంటే స్త్రీలలో వుండే సున్నితత్వమే ఆమె బలం ప్రేమగా వుండే గుణమే విజయ రహస్యం అంటూ మెచ్చుకుంటున్నారు. ఆమె ఒక విషయాన్నీ సాలెగూడులా…

  • ప్రతి పనిలో ఎదో ఒక కష్టం వున్నట్లే డబ్బు లెక్కపెట్టడంలో కూడా రిస్క్ ఉందిట. ఇంకేం లెక్క బడతాం ఇప్పుడు అసలు చేతిలో డబ్బు ఆడితే కదా అనకండి. తీరిగ్గా వున్నాకదా ఇప్పుడు ముఖ్యమైన విషయం చెప్పుకుందాం. ఇచ్చి పుచ్చుకునే క్రమంలో కరెన్సీ నిత్యం కొన్ని వేల లక్షల మంది చేతులు మారుతూ వుంటుంది. వైద్య రంగంలో వున్న వాళ్ళను మినాహాయిస్తే మేగతా సామాన్య ప్రజలు అందరి చేతుల్లోను కాస్తో, కుస్తో బాక్టిరీయా వుండే వుంటుంది. డబ్బు జేబుల్లో, పర్సుల్లో, బ్యాగుల్లో, వుంచేస్తూవుంటాం వాటికి రకరకాల ప్రదేశాల్లోనుంచి డబ్బు కరెన్సీ లోకి చేరిపోతుంది. పరిశోధకుల లెక్కల ప్రకారం 78 రకాల బాక్టిరియాతో పాటు యంటి బయాటిక్ నిరోధక జీవులు కూడా ఈ నోట్ల కట్టలపై ఉంటాయిట. ఇవన్నీ ముట్టుకుని లెక్క పెట్టడం వల్ల ఎన్నో రకాల చర్మ వ్యాధులు, ఇతర అంటు వ్యాధులు వచ్చె అవకాసం వుందని ముఖ్యంగా 10,20,100 రూపాయిల నోట్లపై ఈ బాక్టిరియ కుప్పలుగా వుందని అంటున్నారు. కనుక ప్లాస్టిక్ కరెన్సీ గనుక వస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చంటాయి అడయాయినాలు. క్రిడిట్, డెబిట్ కార్దుల తో పాటు బ్యాంకు కార్డుల వినియోగం పెరిగితే సమస్య నుంచి బయట పడవొచ్చు అంటున్నారు పరిశోధకులు.

    కరెన్సీ లెక్క పెడుతున్నా సమస్యే

    ప్రతి పనిలో ఎదో ఒక కష్టం వున్నట్లే డబ్బు లెక్కపెట్టడంలో కూడా రిస్క్ ఉందిట. ఇంకేం లెక్క బడతాం ఇప్పుడు అసలు చేతిలో డబ్బు ఆడితే కదా…

  • ఆఫీసులో ఎప్పుడు సినిమేటిక్ గా వుంటాయి. వారంలో ఆరు రోజుల పాటు రోజుకు 8 గంటలు పని చేస్తాం. అయినా పని ఎందుకో ముందుకు జరగదు. ఎందుకింత స్లో? డెడ్ లైన్లు దటేసెంత స్లో ఎందుకు వర్క్ మిగిలిపోతుంది? ఈ ప్రస్నలకు సమాధానం ఇస్తున్నారు సైకాలజిస్ట్ లు. మందు మన ఎదురుగా డెస్క్ క్లీన్ గా ఉంచుకోవాలి. మాటి మాటికి టైం చూసుకోవడం వల్ల ఔట్ పుట్ పైన ఆ ఎఫెక్ట్ పడుతుంది. మనకిష్టమైన వారి ఫోటో ఎదురుగా వుంటే మనసు రిలాక్స్డ్ గా వుంటుంది. మంచి ప్రిటిన్స్ వున్న స్నాక్స్, భోజనం తింటే మనసు రిలాక్స్డ్ గా వుంటుంది. అసలు ఆఫీస్ డేకోరేషన్ లో పచ్చదనం ఒక భాగంగా వుండాలి. కళ్ళు మాటి మాటి కి ఆ పచ్చ దానం వైపుకు మళ్ళాలి. అస్తమానంకూర్చునే ఉండకుండా గంటకో సారి లచి నడవాలి. పని చేసే కుర్చీలో సరైన పోశ్చర్ లో కూర్చోవాలి. ఇమ్యున్ సిస్టం మెరుగు పరుచుకోవడం కోసం లెమన్ టీ, నిమ్మరసం తీసుకోవాలి. వర్క్ మొదలు పెట్టాక దాని పై నుంచి దృష్టి మరల్చ వొద్దు. అంటే మనం పని చేసే వర్క్ ని డిస్ట్రబ్ చేసే ఆలోచనలు దూరంగా వుంచేయాలి. ఆఫీస్ గురించి ఇంట్లో, ఇల్లు గురించి ఆఫీసులో మాట్లాడక పొతే నూరు పాళ్ళు పర్ ఫెక్ట్ గా ఉన్నట్లే.

    పనికి కూడా ఓ విధానం వుండాలి

    ఆఫీసులో ఎప్పుడు సినిమేటిక్ గా వుంటాయి. వారంలో ఆరు రోజుల పాటు రోజుకు 8 గంటలు పని చేస్తాం. అయినా పని ఎందుకో ముందుకు జరగదు. ఎందుకింత…