• ఆలు మగలు మధ్య బంధం గట్టిగా ఉండాలంటే ఇద్దరికీ కలిసి సెంటిమెంట్ సినిమాలు చూడమంటున్నారు పరిశోధకులు . విడాకుల కోసం వచ్చిన దంపతులకు మానవ సంబంధాలకు గురించిన కౌన్సిలింగ్ ఇస్తే వారిలో విడిపోవాలన్న కోరిక తగ్గటానికి రెండు మూడేళ్లు పడుతోందిట. దీనికంటే సినిమాలు చూపిస్తే బెస్ట్ కదా అంటున్నారు న్యూయార్క్ లోని బింగ్ టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త మాధ్యు జాన్సన్. సాధారణంగా మనుషులు సినిమాల్లోని పాత్రలతో తమను పోల్చుకుని చూస్తుంటారు కనుకే చాలా సినిమాలు హిట్ అవుతుంటాయంటారు. జీవితంలో కలతలను సెంటిమెంట్ సినిమాల్లో సంఘటనలకు అవ్యయించుకుని వాటని తుడిచేసుకునే అవకాశం ఉందంటున్నారు. అసలు కలతలు రావటానికి ముఖ్యకారణం భార్య భర్తా ఎవరైనా సరే వారికి కొన్ని సొంత ఆలోచనలు ఆశయాలు కోరికలు అభిప్రాయాలు ఉంటాయి. ఈ విషయం లో పరిధిదాటి అవతలివాళ్ళను నొప్పిస్తేనే బంధాలు బలహీనపడతాయి. అలాగే ఇద్దరిమధ్య దాపరికాలు కూడా విభేదాలకు కారణం దాపరికాలు ఉండటం. అందుకే భార్యాభర్తలు స్నేహితులు ప్రేమికులు ఎవరైనా సరే బంధంలో వీలైనంత స్వచ్ఛత పారదర్శకత ఉండటం చాలా అవసరం.

    సెంటిమెంట్ సినిమాలు చూపించండి

    ఆలు మగలు మధ్య బంధం గట్టిగా  ఉండాలంటే ఇద్దరికీ కలిసి సెంటిమెంట్ సినిమాలు చూడమంటున్నారు పరిశోధకులు . విడాకుల కోసం వచ్చిన దంపతులకు మానవ సంబంధాలకు గురించిన…

  • మంచి న్యూస్ వినండి. సింగర్ కొట్టు మిషన్ల సంస్థ కు సంబంధించి కోట్లాది డాలర్ల విలువ చేసే ఆస్తి కి వారసురాలు డెయిసీ అలెగ్జాండర్. 1938 లో ఆస్తి కి విల్లు రాయకుండా ఆమె మరణించింది. ఇంకో చోట అమెరికాలో జాన్ ఉర్మ్ అనే యువకుడు జీవితం పట్ల విసుగుతో ఆత్మ హత్య చేసుకునేందుకు శాన్ ఫ్రాన్సిస్కో తీరం చేరాడు. ఈ సీసా ఎవరికీ దొరుకుతుందో వాడేనా ఆస్తికి వారసులు. వెంటనే మా లాయర్ బ్యారీ కామెన్ ని కలుసుకోగలరు. అవి డెయిసీ సంతకం చేసిన కాయితం ఉంది. జాన్ ఆకాయితం తీసుకుని అడ్రస్ పట్టుకుని వెతికితే ఆమె సింగర్ కుట్టుమిషన్ల తయారీ సంస్థ వారసురాలని ఆమెది ఇంగ్లాండ్ అని తేలింది. డైసీ కి థేమ్స్ నది వడ్డున కూర్చుని సీసాలు విసిరే అలవాటు ఉందని వాళ్ళ బంధువులు లాయర్ చెప్పారు. ఆలా ఆమె విసిరిన సీసా 11 సంవత్సరాల అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణం చేసి జాన్ కి దొరికింది. ఆ తర్వాత మరో ఏడేళ్ల పాటు కోర్టులో ఈ వ్యవహారం నడిచి జాన్ కి ఆస్తి దక్కింది. ఇది కధ కాదు. నిజం స్టోరీ కావాలంటే THE $ MILLION MESSAGE IN A BOTTLE చదువుకోండి.

    సీసా సందేశం తో కోట్ల రూపాయల ఆస్తి

    మంచి న్యూస్ వినండి. సింగర్ కొట్టు మిషన్ల సంస్థ కు సంబంధించి కోట్లాది డాలర్ల విలువ చేసే ఆస్తి కి వారసురాలు డెయిసీ  అలెగ్జాండర్. 1938 లో…

  • రెజ్లర్ గీతాఫోగట్ ఫ్యామిలీ స్టోరీ దంగల్ పేరుతో సినిమాగా రాబోతోంది. గీత తండ్రి ఇంటెర్నేష్నల్ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ పాత్రలో అమీర్ ఖాన్ 8 సంవత్సరాల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మహావీర్ సింగ్ కూతుళ్లు గీత బబిత రీతూ సంగీత ఇంకో ఇద్దరు పెంపుడు కూతుళ్లు వినేష్ ప్రియాబెక అందరు రెజ్లర్స్. అమీర్ ఖాన్ తో పాటు ఈ అమ్మాయిల పాత్రల్లో ఫాతిమా ,సాన్యా, జైరా లను పదివేల మందిని ఆడిషన్ చేసి ఎంచుకొన్నారట. వీళ్లకు రెండేళ్లపాటు కుస్తీ పట్టు నేర్పించారు. అమీర్ ఖాన్ భార్యగా టీవీ నటి మల్లికా షెరావత్ నటించారు. ఈ దంగల్ సినిమా నలుగురు ఆడపిల్లలకు కుస్తీ నేర్పించి అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించుకునేంతగా తీర్చిదిద్దిన ఒక రెజ్లర్ నిజ జీవిత గాధ. అమీర్ ఖాన్ ఈ సినిమా కోసం 90 కిలోల వెయిట్ పెరిగాడట. ఈ సినిమాలో హాని కారక్ బాప్య పాటని అందులో స్ట్రిక్ట్ అమీర్ ఖాన్ ని చూసి ఎంజాయ్ చేయండి. .

    దంగల్ సినిమా రాబోతోంది

    రెజ్లర్ గీతాఫోగట్  ఫ్యామిలీ స్టోరీ దంగల్ పేరుతో సినిమాగా రాబోతోంది. గీత తండ్రి ఇంటెర్నేష్నల్ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్  పాత్రలో అమీర్ ఖాన్ 8 సంవత్సరాల…

  • మంచి నిద్రకు ఆహారానికీ సంబంధం ఉంటుంది. ఉదాహరణకు రాత్రి వేళల్లో వేడి కాఫీ టీ లు తాగితే నిద్రపట్టని వాళ్ళుంటారు. అలాగే ఎన్నో రకాల పదార్ధాలు నేరుగా ప్రభావం చూపించక పోయినా పరోక్షంగా ఆరోగ్యాన్ని దాని ద్వారా నిద్రనూ దెబ్బ తీస్తాయి. ఆరోగ్యకరంగా మంచి నిద్రను ఇచ్చే ఆహారం మాత్రం సంపూర్ణాహారం అని మనం పిలిచే పాలు ఒకటే. ఇందులో అన్ని పోషకాలతో పాటు ట్రెప్టోఫాన్ ,అమైనో యాసిడ్ ఉంటుంది. దీని వల్ల మంచి నిద్ర వస్తుంది. ఇవి గోరువెచ్చగా ఉండేలా నిద్రకు ఉపక్రమించేముందర తీసుకోవాలి. అలాగే ఓట్ మీల్ వరి వంటి కార్బోహైడ్రేట్స్ తిన్నాక కూడా నిద్రవస్తుంది. వీటిలోని మెలటోనిన్ అనే పదార్ధం కండరాలకు రిలాక్స్ చేసి నిద్రను ఇస్తుంది. అలాగే విటమిన్ సి వుండే బొప్పాయి అనాస నిమ్మజాతి పండ్లు సెలెరియం ఎక్కువగా వుండే చేపలు బాదాం వంటి నట్స్ కూడా ఆరోగ్యకరమైన నిద్రను ప్రోత్సహిస్తాయి. బెడ్ రూమ్ నిశబ్ధంగా ప్రశాంతంగా వుంది. మరీ చల్లగా కాకుండా మరీ వేడిగా కాకుండా ఉండాలి. ఎక్కువ వెలుగు లేకుండా ఉండాలి మసక చీకట్లో నిద్రకు తోడ్పడే మెలటోనిన్ రసాయనం విడుదల అవుతోంది.

    మంచి నిద్రకు మంచి భోజనం వాతావరణం

    మంచి నిద్రకు ఆహారానికీ  సంబంధం ఉంటుంది. ఉదాహరణకు రాత్రి వేళల్లో వేడి కాఫీ టీ లు తాగితే నిద్రపట్టని వాళ్ళుంటారు. అలాగే ఎన్నో రకాల పదార్ధాలు నేరుగా…

  • తహిర్ సలహోవ్ రష్యన్ పెయింటర్. ఆయన సోదరి జారీఫా సలహోవా. అజర్ బైజాన్ రాజధాని నగరం బాకు లో ఈమె మినియేచర్ బుక్స్ మ్యూజియం ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ఒకేఒక మినియేచర్ బుక్స్ మ్యూజియం ఇదే. 30 ఏళ్ల పాటు కష్టపడి అజేరా రష్యన్ ఇంగ్లీష్ జర్మన్ వంటి ఎన్నో భాషల్లో వున్న గొప్ప గొప్ప రచయితల పుస్తకాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి. 17వ శతాబ్దం నాటి మినియేచర్ ఖురాన్ ప్రతి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇదే అత్యంత పురాతనమైనది. సైజులో అత్యంత చిన్నదైన దిమోస్టు మిరాక్యులస్ థింగ్ అన్న రష్యన్ పుస్తకం కూడా ఇక్కడే వుంది. దీన్ని మాగ్నిఫయింగ్ గ్లాసెస్ ఉపయోగించి చదవాలి. ఈ బాకు మ్యూజియం లో 6500 పుస్తకాలున్నాయి. 64 దేశాల నుంచి వీటిని కలెక్ట్ చేసింది జరీఫా సలహోవా. రేపటి తరంకోసం సాహిత్యాన్ని సంస్కృతినీ భద్రపరిచి వారికి అందించాలన్నది తన ఉద్దేశమని చెప్పారు జరీఫా. ఆమె స్వయంగా కొన్ని మినియేచర్ పుస్తకాలు ప్రచురించారు కూడా. CHUKOVSKY , BARTO, GOGOL, DOSTO YEVSKY , AS PUSHKIM వంటి మహామహులు రాసిన అపురూపమైన పుస్తకాలూ కూడా ఇక్కడున్నాయి. అన్ని ఇమేజెస్ చూడండి.

    ఈ మ్యూజియం కోసం 30 ఏళ్ళు కష్టపడింది

    తహిర్ సలహోవ్  రష్యన్ పెయింటర్. ఆయన సోదరి జారీఫా సలహోవా. అజర్ బైజాన్ రాజధాని నగరం బాకు లో ఈమె మినియేచర్ బుక్స్ మ్యూజియం ఏర్పాటు చేసింది.…

  • ఖరీదైన బట్టలు కొంటు వుంటాం. కొంత కాలం పాటు ఆ కొత్త దనం పోకుండా వుంటే బాగుంటుంది. ఇస్త్రీల వల్ల చెక్కగా వుతకడంతోనూ సరిపోదు. వాటి గురించి శ్రద్ద తీసుకోవాలి. ఆడపిల్లల డ్రెస్ లు జరీలు, కుట్టు పని, పూసలు, కుందన్ వర్క్ వీటితోనే హెవీగా కనిపిస్తాయి. వాటిని మాములుగా ఉతికి అరేస్తే నాలుగైదు వుతుకులకే వేసుకునేందుకు బాగోవు. అతి జ్యగ్రత్తగా ఏ ఫంక్షన్లోనో వేసుకోవడం వెంటనే బధ్రపరచడం చేయాలి. దుస్తులకి కొత్త అందం కోసం కొన్ని పువ్వులు స్టిక్కర్స్ లేదా రాళ్ళ తో చేసిన గుండిలు వంటివి కుట్టేస్తారు. ఆ కుట్టిన దరంపైన నాచురల్ కలర్ గోళ్ళ రంగులు వేస్తె వూదిపోకుండా వుంటాయి. వేసుకున్న దుస్తులను చెక్కగా హ్యంగర్ కు తగిలిస్తే గాలి తగిలి ఫ్రెష్ గా అయిపోతాయి. రంగుల దుస్తుల్ని నీడ పట్టున అరేయాలి. అలా అయితే సహజమైన రంగు కళ పోకుండా వుంటాయి. మాటి మాటికి వుతికేయకుండా జ్యగ్రత్త తీసుకుంటే సారి.

    ఖరీదైన డ్రెస్ కి ఈ మాత్రం జాగ్రత్త కావాలి

    ఖరీదైన బట్టలు కొంటు వుంటాం. కొంత కాలం పాటు ఆ కొత్త దనం పోకుండా వుంటే బాగుంటుంది. ఇస్త్రీల వల్ల చెక్కగా వుతకడంతోనూ సరిపోదు. వాటి గురించి…

  • మనం ఇష్టపడే రంగులు వేసుకునే దుస్తులు మన వ్యక్తిత్వాన్ని సూచిస్తాయని చెపుతుంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. తెలుపు రంగును స్వచ్ఛతకు గుర్తుగా భావిస్తాం. ఈ రంగుని ఇష్టపడే వాళ్ళు స్వచంగా నిర్మలమైన మనసు తో ఉంటారని ప్రతి విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తారని అంటారు. నలుపు రంగు ఇష్టపడేవాళ్లు బలమైన వ్యక్తిత్వం గలవాళ్ళు. ఇంకొకరి ఆధిపత్యాన్ని సహించరు. ఎరుపు ఇష్టపడేవాళ్ళకు స్వాభిమానం ఎక్కువ. శక్తి సామర్ధ్యాలు ఎక్కువే. కోపిష్టులు కూడా. నీలి రంగు ను ప్రేమించే వాళ్ళు ప్రాక్టికల్ గా వుంటారు. నిలకడగా నిజాయితీగా ఉంటారు. బ్రౌన్ కలర్ ఇష్టం వున్నవాళ్లు నిరాడంబరంగా ప్రశాంత జీవితానికి మొగ్గు చూపిస్తారట. ఇక పసుపు రంగైతే సుభానికీ సంతోషానికీ ప్రతీక. ఈ రంగు ఇష్టపడేవాళ్లు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. కష్టాలు కనీళ్ళు అస్సలు ఇష్టపడరు. ఇది ఆకట్టుకునే రంగు కూడా. ఆరెంజ్ ఇష్టం ఉన్న వాళ్ళు మాటకారులు. పొదుపుగా జీవితం సుఖమయంగా గడపాలని కోరుకుంటారు. గులాబీ రంగును అమ్మాయిలే ఇష్టపడతారు. అందంగా చిలిపిగా మృదుస్వభావంతో ఉంటారు. పనిలో ఖచ్చితమైన తత్వాన్ని కోరుకుంటారు.

    అంతరంగాన్ని ఆవిష్కరించే రంగులు

    మనం ఇష్టపడే రంగులు వేసుకునే దుస్తులు మన వ్యక్తిత్వాన్ని సూచిస్తాయని చెపుతుంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. తెలుపు రంగును స్వచ్ఛతకు గుర్తుగా భావిస్తాం. ఈ రంగుని ఇష్టపడే వాళ్ళు…

  • ఇంగ్లీష్ నవలలు చదివేవాళ్లకి బార్బరా కార్ట్ లెండ్ తెలిసే ఉంటుంది. ఆమె రాసిన రొమాంటిక్ నావెల్స్ ఇరవైయవ శతాబ్దపు బెస్ట్ సెల్లర్స్. కమర్షియల్ నవలా రచయితగా ఆమెకు ప్రపంచవ్యాప్తమైన ప్రఖ్యాతి వుంది. ఆమె రాసిన 723 నవల్లో 38 భాషల్లోకి అనువాదమై ఆవిడ గిన్నిస్ బుక్ ఆఫహ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు. పింక్ గౌను టోపీతో అలనాటి బ్రిటన్ మీడియా పర్సనాలిటీగా ఎంతో యాక్టీవ్ గా 98 ఏళ్ళు జీవించిన బార్బరా తన పుట్టిన రోజులు స్నేహితుల మధ్య జరుపుకునేదిట. ఆవిడ అడుగుజాడల్లో రొమాంటిక్ పుస్తకాలు రాసి మన తెలుగు రైటర్స్ కూడా ఎన్టీజో పేరు తెచుకున్నవాళ్లున్నారు. బార్బరా ప్రత్యేకత ఏమిటంటే జీవించినంత కాలం 90 ఏళ్ళు దాటాక కూడా ఆరోగ్యం పైన ఎన్టీజో శ్రద్ధ గా ఉండటం వయసు తక్కువగా కనిపించేలా మంచి మేకప్ విటమిన్లు వాడటం పోషకాహారం తీసుకోవటం వృధాప్య ఛాయల దగ్గరకి రాకుండా చాలా సరదాగా జీవించటం ఇవన్నీ 60 ఏళ్ళు వచ్చేసరికి చావు మొహం పెట్టేఎందరికో స్ఫూర్తి కావాలని ఈ పరిచయం 723 నవలలు కూడా రొమాంటిక్ గానే ఉండటం వీటితో పాటు ఎన్నో నాటకాలు పాటలు మ్యాగజిన్ ఆర్టికల్స్ రాస్తూ జీవితమంతా చైతన్యంగా జీవించారమే. ఏ బుక్ స్టాల్ లో నైనా దొరుకుతాయి ఇప్పటికీ ఈమె పుస్తకాలు.

    ఈమె రొమాంటిక్ సాహిత్య సృష్టికర్త

    ఇంగ్లీష్ నవలలు చదివేవాళ్లకి బార్బరా కార్ట్ లెండ్  తెలిసే ఉంటుంది. ఆమె రాసిన రొమాంటిక్ నావెల్స్ ఇరవైయవ శతాబ్దపు బెస్ట్ సెల్లర్స్. కమర్షియల్ నవలా రచయితగా ఆమెకు…

  • ఒక అమ్మాయి పెద్ద పళ్లతో చేయికరిచేస్తూ ఉంటుంది. నా జుట్టు పట్టుకున్నావే బాబు అని ఒకబ్బాయి ఏడుస్తూ ఉంటాడు. ఒక అందమైన బాబు చేయి అందిస్తూ ఉంటాడు. ఒకాయన ఏకంగా ఒక తాబేలు పీకపట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఏమిటనుకున్నామా ? క్రియేటివ్ గా తయారుచేసిన ఇమేజెస్ ఉన్న మాములు షాపింగ్ బ్యాగులు. కాస్త కనికట్టు కాస్త సరదా కాస్త తెలివీ జోడిస్తే ఇలాంటి బ్యాగ్స్ తయారవుతున్నాయి. కొన్ని వ్యాపార సంస్థలు కూడా ఇలాంటి సరదా బ్యాగులకు ఓకే చెపుతున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు ఎన్నో విభిన్నమైన ఆలోచనలు చేయాలి. పదేపదే ఓ విషయాన్నీ చుస్తే మనసులో ముద్రించుకుపోతుంది కదా. అందుకే ఈ క్రియేటివ్ బ్యాగ్స్. మీరూ చూడచ్చు. వందల కొద్దీ ఐడియాలు. వరసాగ్గా చూస్తూ పోతే కొత్త సంవత్సరం గిఫ్ట్ గా ఇచ్చేందుకు ఇంకో కొత్త ఐడియా తట్టచ్చుగా.

    కన్ను పడితే గేలం వేస్తాయి

    ఒక అమ్మాయి పెద్ద పళ్లతో చేయికరిచేస్తూ ఉంటుంది. నా జుట్టు పట్టుకున్నావే బాబు అని ఒకబ్బాయి ఏడుస్తూ ఉంటాడు. ఒక అందమైన బాబు చేయి అందిస్తూ ఉంటాడు.…

  • పిల్లలు వాళ్లకు కావలిసిన సరంజామా లగేజీ ఎక్కడికి పోయినా అందరి చాకిరీ తల్చుకుని ఆడవాళ్లు వెనకాడేవాళ్లేమో గానీ ఏ చిన్న అవకాశం వచ్చినా ఎవ్వళ్ళనీ పట్టించుకోకుండా మగవాళ్ళు దూరప్రయాణాలకు సిద్ధం అయిపోయేవాళ్లు కానీ ఇప్పుడొచ్చిన రిపోర్ట్ ఒకమారిపోయిన కాలాన్ని కళ్లముందుంచుతుంది. ఒక సర్వే లో 75 శాతం మహిళలు ట్రావెల్ ప్లాన్స్ లో ముందున్నారట. 63 శాతం మంది స్త్రీల ట్రావెలింగ్ తమని విజ్ఞానవంతుల్ని చేస్తారన్నారు. 36 శాతం మంది ట్రావెల్ తమ ఆలోచనా తీరుపై జీవనశైలి పై ప్రభావం చూపెడుతుందంటున్నారు. 57 శాతము మంది కొత్త విషయాలు నేర్చుకుంటామని రిలాక్స్ అవుతామంటున్నారు. 35 శాతం మంది తమ జీవిత భాగస్వాములతో ట్రావెల్ చేద్దామనుకుంటే 16 శాతం మంది కుటుంబ ప్రయాణాలు ఇష్టమంటున్నారు. మొత్తానికి స్త్రీలు హ్యాపీగా యాత్రలకు సిద్దపడుతున్నారని తేలుతోంది. ఆ నాలుగ్గొడలే ప్రపంచంగా ఇల్లే వైకుంఠం అనే భావన పోవటం మాత్రం స్త్రీలందరినీ అభినందించాల్సినవిషయం. నాలుగుళ్లు తిరిగితే లోకజ్ఞానం పెరుగుతుంది. ఆడది తిరిగి చెడింది మగాడు తిరగక చెడ్డాడు అనే సామెత ను సృష్టించిన వాడెవడో ఈ సర్వే చదివితే తప్పక చచ్చుంటాడు.

    జోరుగా హుషారుగా షికారు పోదామా

    పిల్లలు వాళ్లకు కావలిసిన సరంజామా లగేజీ ఎక్కడికి పోయినా  అందరి చాకిరీ తల్చుకుని ఆడవాళ్లు వెనకాడేవాళ్లేమో గానీ ఏ చిన్న అవకాశం వచ్చినా  ఎవ్వళ్ళనీ  పట్టించుకోకుండా మగవాళ్ళు…