• పిల్ల తెమ్మెర లాంటి సుగంధ పరిమళం వంటి యవ్వన దశ కరిగిపోవటం సహజాతి సహజం. కానీ మీదపడే వయసు తగ్గుతున్నా ఓపిక తీరాల్సిన బాధ్యతలు ఇవి ఇంకెముందిలే మన పనయి పోయిందనే భావన కలిగిస్తాయి. కానీ ఎక్సపర్ట్స్ ఈ ఆలోచనే పొరపాటుంటున్నారు. యువత లో ఉరిమే ఉత్సాహం వుంది. తుళ్ళిపడే జలపాత వేగం వుంది. వాళ్ళతో స్నేహం చేయండి. మీ యవ్వనం మీ దగ్గరే ఉంటుంది అంటున్నారు. అలాగే అవకాశం వచ్చిందంటే ఎపుడూ ఎదో ఒక కొత్త ప్రాంతానికి ప్రయాణానికి సిద్ధం అయిపోండి. ఈ అలవాటు మీ ఆలోచనలు చైతన్యవంతంగా ఉంచుతుంది. అంటున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఎప్పుడూ చిన్నవయసు వాళ్ళ చుట్టూ చేరినప్పుడు వాళ్ళకిసలహాలివ్వటం లేదా గత అనుభవాలు చెప్పటం లాంటి పనులు చేయద్దు. అసలు ముఖ్యంగా మీకు వయసుమీరి పోతుందన్న విషయం మీకు మీతో పాటు అవతలివాళ్ళకీ గుర్తొచ్చేదిప్పుడే. అలాగే వీలైనంత సౌకర్యంగా ఎలా ఉండాలో ఆలోచించుకుని ఆహారం చదివేపుస్తకాలు రోజూ వారి కార్యక్రమాలు విషయంలో కూడా కొత్తగా వచ్చే జీవితానికి అనుగుణమైన ఏర్పాట్లు చేసుకోవాలి. మంచి రొమాంటిక్ జీవితాన్ని గడపాలి. అన్ని బాధ్యతలు తీరిపోయాక జీవిత భగస్వాములతో మంచి జీవితం గడిపే సమయం ఇదే. తలుచుకుంటే 90 వ సంవత్సరంలో కూడా ఫుల్ యూత్ ఫుల్ గా ఎంజాయ్ చేయచ్చు అంటున్నారు నిపుణులు.

    అది కేవలం మీ ఆలోచనలో వచ్చిన మార్పు

    పిల్ల తెమ్మెర లాంటి సుగంధ పరిమళం వంటి యవ్వన దశ కరిగిపోవటం సహజాతి సహజం. కానీ మీదపడే  వయసు తగ్గుతున్నా ఓపిక తీరాల్సిన బాధ్యతలు ఇవి ఇంకెముందిలే…

  • ఒక పరిశోధన ప్రకారం నిదానంగా ప్రశాంతంగా వుండే వారి తో పోల్చితే తరచూ కోపం వచ్చే వారికి గుండె జబ్బు వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువట. అందుకే ప్రతి దానికి హైరానా పడకుండా లైట్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. నెదర్లాండ్ పరిశోధనల ప్రకారం రోజుకు కనీసం ఏడు గంటలు నిద్ర పోయే వారిలో గుండె నొప్పి వచ్చే అవకాశం 65 శాతం తక్కువట. అలాగే గుండె ఆరోగ్యం కోసం డి-విటమిన్ లోపం లేకుండా చూసుకోవాలంటున్నారు. వంటకాల్లో ఉప్పు తక్కువగానే వాడాలి. వేరు వేరు రంగుల పండ్లను రోజుకు కనీసం ఒక్కటైనా తినాలి. వంటనూనెలో గుండెకు మేలు చేసే ఫ్యాటి యాసిడ్స్ ఒక్కో నూనెలో ఒక్కో రకంగా వున్నాయి. కనుక రెండు మూడు రకాల నూనెలు కలిపి వాడాలి. మెంతులు, ఆవాలు, అవిసలు, పాలకూర, చేపలు వుండేలా చూసుకోవాలి. గుండె ఆరోగ్యం కోసం ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి.

    ఈ అలవాట్లు, ఆహారం ఆరోగ్యం కోసం

    ఒక పరిశోధన ప్రకారం నిదానంగా ప్రశాంతంగా వుండే వారి తో పోల్చితే తరచూ కోపం వచ్చే వారికి గుండె జబ్బు వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువట.…

  • పల్లెటూర్లలో పొలాల గట్ల వెంబడి స్వేచ్ఛగా పెరిగే చెట్లలో సీమ చింత కూడా ఒకటి. కాయగా ఉన్నప్పుడు ఆకు పచ్చగా గట్టిగా వగరు రుచితో వుండే సీమచింత పక్వానికి వస్తున్న కొద్దీ బంగారు రంగు గులాబీ ,ఊదీ, ఎరుపు రెంగుల్లోనే మారిపోతుంది. పండిందంటే పై తొక్క ఊడి వచ్చేస్తూ ఉంటుంది లోపల ఒక్కొక కణాలపు తో తెల్లని గుజ్జు మధ్యలో నల్లని గింజ ఉంటాయి. దాన్ని సీమ తమ్మ అని కూడా పిలుస్తారు. తమిళనాడు కేరళ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ ఆంద్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో విరివిగా మొలుస్తాయి. ఈ చెట్టు. నీటిశాతం ఎక్కువ వుండే సీమచింత కాయల్లో పోషకవిలువలు ఎక్కువే. కాల్షియం, పాస్ఫరస్, ఐరన్ నియాసిన్ విటమిన్ సి లు పుష్కలంగా వుండే సీమచింత గొంతు చిగుళ్లు నోటిపూత నివారణకు ఉపయోగపడుతుంది. ఈ విత్తనాల నుంచి తీసిన నూనెను సబ్బుల తయారీలో వాడతారు. క్షయ వ్యాధి నివారణకు ఈ చెట్ల వేర్లు ఉపయోగిస్తారు. ఇప్పుడు సీమచింతకాయలు కూడా అమ్మకానికి పెడుతున్నారు చూడండి.

    తెల్లని గుజ్జు వలిస్తే నల్లని రంగు

    పల్లెటూర్లలో పొలాల గట్ల వెంబడి స్వేచ్ఛగా పెరిగే చెట్లలో సీమ చింత కూడా ఒకటి. కాయగా ఉన్నప్పుడు ఆకు పచ్చగా గట్టిగా  వగరు రుచితో వుండే సీమచింత…

  • పెప్ లమ్ డిజైనర్ డ్రెస్ స్టైలిష్ లేటెస్ట్ అనుకోవాలి. ఇటు స్కర్ట్ లాగా పిటెడ్ జాకెట్ లాగా నడుము దగ్గర టైట్ చేసేలా వుండే పెప్ లమ్ ఫిట్టెడ్ జాకెట్స్ జీన్స్ ధోతీ ప్యాంట్ కు లూజ్ పటియాలా పైకి క్యాజువల్ కంఫర్ట్ లుక్ తో కనిపిస్తాయి. పెప్ లమ్ తో స్లిమ్ గా కనిపించాలంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఎంచుకోవాలి. బాటమ్ గా పెన్సిల్ స్కర్ట్ ప్యాంటు ఎంచుకున్న లేటెస్ట్ స్టైల్ తో కనిపించచ్చు. దీనికి కాంట్రాస్ట్ గా వుండే ఆభరణాలు బావుంటాయి. రెడ్ కార్పెట్ వేదికలపైనా ప్రముఖ సినీ తారల స్టైలిష్ వెరైటీ గా మెరిసిన పెప్ లకు స్లిమ్ గా కనిపించాలనుకునే అమ్మాయిలకు సరైన డ్రెస్. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ని ఎంచుకుంటే సన్నగా కనిపిస్తారు. సంప్రదాయ వేడుకల్లో బరువైన మెరిసే లెహెంగా పైకి నెటెడ్ ఫ్యాబ్రిక్ తో చేసిన పెప్ లమ్ వేసుకుంటే ఇంకా ఆలుక్కే లేదు. ఓసారి చక్కని రంగు డిజైన్లు ఎంబ్రాయిడరీ వెరైటీలకు చూడండి.

    లేటెస్ట్ లో లేటెస్ట్ పెప్ లమ్

    పెప్ లమ్ డిజైనర్ డ్రెస్ స్టైలిష్ లేటెస్ట్ అనుకోవాలి. ఇటు స్కర్ట్ లాగా పిటెడ్ జాకెట్ లాగా నడుము దగ్గర టైట్ చేసేలా వుండే పెప్ లమ్…

  • ఎదో ఒక యాడ్ చాలా ఫ్యాషన్ గా ఉన్న అమ్మాయి చెప్పుల షాపులో కాళ్ళు చూపిస్తే ఆ పగుళ్లు చూసి షాపులో కుర్రాడు అబ్బా ఏమిటంత డర్టీగా అని మొహం పెడతాడు. నిజమే. సౌందర్య పోషణలో ముఖానికి ఇచ్చిన ప్రాముఖ్యం పాదాలకు ఇవ్వకపోతే అలాగే ఉంటుంది. మడమ దగ్గర మురికి పగుళ్లు లేకుండా ఉండాలంటే రాత్రివేళ పాఠాలు శుభ్రంగా కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఫ్రూట్ క్రీమ్ లో గ్లైకోలిక్ యాసిడ్ వున్నది ఎంచుకుంటే పాదాల పగుళ్లు రావు. చర్మం మృదువుగా అయిపోతుంది. క్రీమ్ రాసుకుని సాక్స్ వేసుకుంటే దుప్పట్లు పాడైపోకుండా ఉంటాయి. ఫ్యూమిక్ స్టోన్ తో రుద్ది కడిగి బాదం నూనె కానీ ఆయిల్ కొబ్బరి నూనె ఎదో ఒకటి రాసి మసాజ్ చేస్తే పాదాలకు మంచి విశ్రాంతి లభిస్తుంది. కాండిల్ వాక్స్ ,ఆవ నూనె కలిపి వేడి చేసి పాదాల పగుళ్ల దగ్గర రాసి సాక్స్ వేసుకున్న చక్కగా ఉంటాయి. గోరు వెచ్చని నీటిలో మంచి సుగంధ నూనె వేసి పాఠాలు అందులో మునిగేలా వుంచితే ఎంతో రిలాక్స్ అయిపోవచ్చు.

    పాదాల అందం ఇలా పదిలం

    ఎదో ఒక యాడ్  చాలా ఫ్యాషన్ గా ఉన్న అమ్మాయి చెప్పుల షాపులో కాళ్ళు  చూపిస్తే ఆ పగుళ్లు చూసి షాపులో కుర్రాడు అబ్బా ఏమిటంత డర్టీగా…

  • గ్రీన్ టీ గురించి మాట్లాడుకునివుంటాం. ఎన్నో ఉపయోగాలున్నాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎప్పుడో సరికొత్త అధ్యయనం వల్ల ఇంకో కొత్త అంశం ఈ ఉపయోగాల్లోకి వచ్చి చేరింది. గ్రీన్ టీ తాగితే మొటిమలు మాయం అయిపోయాయంటున్నాయి ఈ సరికొత్త అధ్యయనాలు. మరీ ముఖ్యంగా ,ముక్కు గదమ ప్రాంతాల్లోకి మొటిమలు వెంటనే తగ్గిపోతాయట. గ్రీన్ టీ వల్ల కేసంలోని అంకుర ప్రాంతంలో నూనె స్రవించే గ్రంధుల వద్ద బాక్టీరియా పెరిగేందుకు అనువుగా ఉన్న ప్రాంతంలో సైతం మొటిమలకు కారణమయ్యే బాక్టీరియా అంతగా పెరిగే అవకాశం ఉండదు అంటున్నారు తైవాన్ లోని నేషనల్ యాంగ్ మింగ్ యూనివర్సిటీ పరిశోధకులు గ్రీన్ టీ లోని ఎపిగాలోకే టెచిన్-3 గాల్వేజ్ అనే పోషకం మొటిమల పెరుగుదలకు దోహదం చేసే ప్రాంతంలో బాక్టీరియా పెరగకుండా చేస్తుందిట. దానికి తోడు ఆ పోషకం లోని వాపు మంట తగ్గించే యాంటీ ఇన్ఫలమేటరీ గుణం సైతం మొటిమలు రాకుండా వుండేందుకు దోహదం చేస్తుందని పరిశోధన ఫలితాలు చెప్తున్నాయి.

    గ్రీన్ టీ తో మొటిమలు తగ్గుతాయి

    గ్రీన్ టీ గురించి మాట్లాడుకునివుంటాం. ఎన్నో ఉపయోగాలున్నాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎప్పుడో సరికొత్త అధ్యయనం వల్ల  ఇంకో కొత్త అంశం ఈ ఉపయోగాల్లోకి వచ్చి…

  • మహిళల భాగస్వామ్యంతోనే కుటుంబ నిర్ణయాలకైనా వ్యాపార తీర్మానాల కైనా పరిపూర్ణత వస్తుంది అన్నారుఅరియనా హఫింగ్టన్ అనే రచయిత్రి అందుకే మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తున్నారు కార్పొరేట్ కంపెనీలు. మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. వాళ్లకు అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నారు. 'బెస్ట్ కంపెనీస్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా' పేరిట దేశవ్యాప్తంగా ఉన్న 350 కంపెనీల అవతార గ్రూప్ ఇండియా అండ్ వర్కింగ్ మదర్ మీడియా గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో టాప్ వంద కంపెనీల్లో మహిళా ఉద్యోగినులు 25 శాతంగా ఉన్నారు. వంద శాతం ప్రసూతి సెలవు అనంతరం వచ్చిన తల్లులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఇచ్చారు. వంద శాతం లైంగిక వేధింపుల విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 2015 లో 18 శాతం కంపెనీలు ఉద్యోగినులకు ఆరు నెలల వేతనంలో ప్రసూతి సెలవలు ఇచ్చారు. 70 శాతం బిడ్డను దత్తత టీయూస్కున్న తల్లులకు 28 వారాల పెయిడ్ లీవ్ ఇచ్చారు. పని ప్రదేశంలో మహిళలు స్వేచ్ఛగా హాయిగా పనిచేసే వాతావరణం సృష్టిస్తున్నాయి బెస్ట్ కంపెనీలు.

    ఉద్యోగినులకు అదనపు సౌకర్యాలిస్తున్న కంపెనీలు

    మహిళల భాగస్వామ్యంతోనే కుటుంబ నిర్ణయాలకైనా వ్యాపార తీర్మానాల కైనా పరిపూర్ణత వస్తుంది అన్నారుఅరియనా హఫింగ్టన్ అనే రచయిత్రి అందుకే మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తున్నారు కార్పొరేట్ కంపెనీలు.…

  • చలి రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు. తీవ్రమైన చలి గాలుల కారణంగా కంటిలోని తేమ ఆవిరైపోయింది. కళ్ళు పోదిబరిపోయి ఎరుపెక్కడం, దురద పెట్టడం సాధారణంగా జరిగే అసౌకర్యం కళ్ళకు హాని జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల్లో మొదట గోరు వెచ్చని నీళ్ళు మాటి మాటి కి తాగుతూ వుండటం. వ్యాధి నిరోధక శక్తిని పెంచే నిమ్మ జాతి పండ్లు, ముదురు రంగు ఆకు కూరలు తీసుకోవడంతో పాటు అన్ని రకాల సూప్స్ మేలు చేస్తాయి. ఫ్యాట్ ఆమ్లాలు అధికంగా వుండే ఆహారం తీసుకోవడం తో పాటు విటమిన్-ఏ, విటమిన్-బి లు అధికంగా వుండే ఆహారం తీసుకోవడం తో పాటు హీటర్, ఏసి, బస్సు కిటికీలు వీటిల్లో దేనికి మరీ దగ్గరగా కూర్చోకూడదు. కంప్యూటర్ ముందుకు ఎక్కువ సేపు పని చేసే సమస్యే ఇరవై సెకేన్లకొకసారి విరామం విరామం అనుకోవాలి. ప్రతి ఇరవై నిమిషాలకు కంప్యూటర్ కు దూరంగా 20 అడుగుల దూరం వెళ్ళాలి.

    చలి గాలికి కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి

    చలి రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు. తీవ్రమైన చలి గాలుల కారణంగా కంటిలోని తేమ ఆవిరైపోయింది. కళ్ళు పోదిబరిపోయి ఎరుపెక్కడం, దురద పెట్టడం సాధారణంగా జరిగే అసౌకర్యం…

  • గోళ్ళ అందం గురించి ఇప్పుడు ఖరీదైన జ్యూవెలరీలు , రంగులు డిజైన్లు వస్తున్నాయి. కానీ అసలు గోళ్ళ అందం గురించి ఆరోగ్యం గురించి సంరక్షణ విషయంలోనూ జాగ్రత్తను తీసుకుంటేనే చక్కగా చూసేందుకు బావుంటాయి. అలావుంటేనే వాటిని అలంకరించుకోగలం. వేడి నీళ్ళలో ఆలివ్ ఆయిల్ వెయిస్ గోళ్లను అందులోముంచి కొన్ని నిముషాలు ఉంచాలి. కాస్సేపయ్యాక మర్దనా చేస్తే గోళ్లు బావుంటాయి. రోజ్ వాటర్ తో తుడిస్తే కూడా గోళ్లకు తేమ అంది ఆరోగ్యంగా కనిపిస్తాయి. ప్రతి రోజూ ఏ బేబీ ఆయిల్ తోనో మర్దనా చేసినా గోళ్లు పొడిబారకుండా ఉంటాయి. కీరా రోజ్ ముక్కలతో గోళ్ళని తుడిస్తే మెరుస్తుంటాయి. కొబ్బరినూనెలో వుండే ఆరోగ్యకరమైన కొవ్వులు పోషకాలు గోళ్లకు మేలు చేస్తాయి. పళ్ళుతోమే పేస్ట్ ను గోళ్ళపైన రాసి మృదువుగా రుద్ది కడిగితే వాటిపై పేరుకున్న మురికి పోతుంది. మొహం విషయం లోనే కాదు. చేతులు కళ్ళు గోళ్లు పదాలు పగుళ్లు విషయంలో కూడా శ్రద్ధగా ఉంటేనే అందంగా శుభ్రంగా ఉన్నట్టు.

    ఆలివ్ ఆయిల్ మస్సాజ్ తో మెరుస్తాయి

    గోళ్ళ అందం గురించి ఇప్పుడు ఖరీదైన జ్యూవెలరీలు , రంగులు డిజైన్లు వస్తున్నాయి. కానీ అసలు గోళ్ళ అందం గురించి ఆరోగ్యం గురించి సంరక్షణ విషయంలోనూ జాగ్రత్తను…

  • జీవితంలో ప్రాధాన్యత క్రమాన్ని సరిగా ఆచరించి తీరాలి. లేకపోతే చేసే పని జీవితసమతౌల్యం గాడి తప్పి లేని సమస్యలు వస్తాయి. ప్రతి పనికీ అది చిన్నదైనా పెద్దదైనా ఒక ప్రాధాన్యతా క్రమం ఉంటుంది. ఉదయం నిద్ర లేవటం కూడా ఒక ముఖ్యమైన పనే. అలా అని కాల్కులేటెడ్ గా యాంత్రికంగా సాగనక్కర్లేదు. ఒక అలవాటుగా పద్దతిగా అన్ని పనులు చేసుకుపోవాలి. సరైన వేలకు ఆఫీస్ కు చేరాలి. ఇది అవసరమైన క్రియ కనుక దానికి తగట్టు సరైన వేళల్లో అన్ని పనులు ప్రణాళికా బద్ధంగా చేసుకోవటం అలవర్చుకోవాలి. హడావుడి టెన్షన్ వద్దు. రేపటి ఉదయం గురించి ఈ సాయంత్రం రాత్రి కొంత ఏర్పాటు చేసుకుంటే ఉదయం పని తీరు తేలికవుతుంది. అలాగే ప్రతి విషయంలో కూడా. అవసరం అనవసరం అన్న ప్రాధాన్యతలు నిర్ణయించుకుంటే ఇష్టం లేకపోతే ఎలాంటి ఆపాలజీలు వివరణలు చెప్పుకోకుండానే 'నో' అన్న పదం వాడకుండానే ఇంటి పని ఉద్యోగం రెండు ఒక క్రమంలో పూర్తయి విశ్రాంతి దొరుకుతుంది . కాకపోతే దైనందిన జీవితంలో ప్రాధాన్యతా క్రమం అన్నది తప్పనిసరి అలవాటు కావాలి.

    ప్రాధాన్యతా క్రమాలు తప్పనిసరి

    జీవితంలో ప్రాధాన్యత క్రమాన్ని సరిగా ఆచరించి తీరాలి. లేకపోతే చేసే పని జీవితసమతౌల్యం గాడి తప్పి లేని సమస్యలు వస్తాయి. ప్రతి పనికీ అది చిన్నదైనా పెద్దదైనా …