• వాముని కిచెన్ కెమిస్ట్ అంటారు. ఘాటుగా వుండే వాసన కొంచెం కారంగా ..ఇంకొంచెం నోట్లో వేసుకుంటే మౌత్ ఫ్రెషనర్గా వాము ఒక మంచి ఔషధం మందు,బోలెడన్ని ఉదర సంబంధమైన సమస్యలకు సరైన సమాధానం కూడా. కిచెన్ గార్డెన్ లో వాము మొక్క పెంచుకోవచ్చు. మధ్యాహ్నం భోజనం తర్వాత రాత్రి డిన్నర్ తర్వాత నువ్వులు వాము నిమ్మరసం ఉప్పు కలిపి కాస్త వేడి చేస్తే వచ్చిన మిశ్రమాన్ని తింటే కడుపుకు సంబంధించి ఎన్టీజో ప్రయోజన కారి. జలుబు తలనొప్పి ఫ్లూ దగ్గు ఇతర సమస్యలు ఈ మిశ్రమంతోనే తగ్గించవచ్చు. ఆలా కారంగా వుంటుందనే రుచిగా లేదనో తినలేకపోతే ఏరోటీ లో రోటీల పిండిలోనో కలుపుకోవచ్చు. వాటికి రుచి వాసన పెరగటం తో పాటు ఆరోగ్యము దక్కుతుంది. బీన్స్ వంటి కూరల్లో కూడా వాముపొడి జలుబు సెనగపిండితో చేసిన ఏ వంటకం తో అయినా వాము చేరిస్తేనే మంచిది.

    వంటింట్లో డాక్టర్ ఈ వాము

    వాముని కిచెన్ కెమిస్ట్ అంటారు. ఘాటుగా వుండే వాసన కొంచెం కారంగా ..ఇంకొంచెం నోట్లో వేసుకుంటే మౌత్ ఫ్రెషనర్గా వాము ఒక మంచి ఔషధం మందు,బోలెడన్ని ఉదర…

  • గోళ్లపై వజ్రాల తళుకులు కనిపిస్తాయి. ఇక ఉంగరాలు కూడా పెట్టుకోవటం దండగ అని వాళ్ళు చెప్తారు కానీ మనకు మాత్రా, ఆ నెయిల్ పాలిష్ ఖరీదు వింటే కళ్ళు తిరుగుతాయి. లాస్ ఏంజెల్స్ జ్యూవెలరీ బ్రాండ్ అంబాసిడర్ ఈ నెయిల్ పాలిష్ విడుదల చేసింది. ఒక్క సీసా ఖరీదు 2,50,000 డాలర్లు అంటే కోటీ ఇరవై లక్షలు సుమారుగా. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్. 267 క్యారెట్ల బ్లాక్ డైమండ్స్ కలగలిపి తయారుచేశారట ఈ నెయిల్ పాలిష్. ఈ బ్రాండ్ వాళ్ళు ఇంతకుముందు ఖరీదైన చాక్లేట్లు కూడా తయారు చేశారట. కానీ నెయిల్ పాలిష్ సంగతే ఓసారి నెట్ లో చూసేయండి.

    నెయిల్ పాలిష్ కోటీ 25 లక్షలు

    గోళ్లపై వజ్రాల తళుకులు కనిపిస్తాయి. ఇక ఉంగరాలు కూడా పెట్టుకోవటం దండగ అని వాళ్ళు చెప్తారు కానీ మనకు మాత్రా, ఆ నెయిల్ పాలిష్ ఖరీదు వింటే…

  • హిందువుల శుభకార్యాలన్నింటిలోనూ తమలపాకు వక్క సున్నం తప్పనిసరిగా ఉంటుంది. మొఘల్ మహారాణి నూర్జహాన్ తాంబూల సేవనాన్ని స్త్రీలలో ప్రచారం చేసిందిట. ఆ కాలంలో స్త్రీలు అందంగా కన్పించేందుకు ప్రకృతి సిద్ధంగా లభించే రకరకాల లేపనాలు మూలికలు వాడేవారు. ఆ రోజుల్లో లిప్ స్టిక్ లేదు కనుక తాంబూలమే పెదవులకు అలంకారం నూర్జహాన్ తమల పాకులు రకరకాల సుగంధ ద్రవ్యాలు కలపటం వల్ల దాన్ని తింటే పెదవులు ఎర్రగా సహజసిద్ధంగా అందంగా ఉంటాయని గ్రహించింది పాత రోజుల్లో భోజనం అయ్యాక తాంబూలం వేసుకోవటం అలవాటుగా ఉండేది కానీ పళ్ళు పాడైపోతాయని మానేశారు. కానీ తాంబూలం లేదా తమలపాకు కిళ్ళీలో వేసే సుగంధ ద్రవ్యాలతో నూరు కడుపు బాగుపడతాయి . భారత దేశంలో కొన్ని లక్షల మంది కిళ్ళీల తయారీలో పొట్ట పోసుకునే వాళ్ళున్నారు. మిఠాయి కిళ్ళీల కొబ్బరి తురుము చక్కర ఖర్జురం ముక్కలు గుల్ కంద్ చెర్రీ ముక్కలు సోంపు వక్క పలుకులు ఉంటాయి. కాకపోతే అతి ఎప్పటికీ అనర్ధ దాయకమే కనుక ఈ పండగ పూటో తాంబూలం రుచి చుస్తే చాలు.

    ప్రకృతి సహజమైన లిప్ స్టిక్ ఇది

    హిందువుల శుభకార్యాలన్నింటిలోనూ తమలపాకు వక్క సున్నం తప్పనిసరిగా ఉంటుంది. మొఘల్ మహారాణి నూర్జహాన్ తాంబూల సేవనాన్ని స్త్రీలలో ప్రచారం చేసిందిట. ఆ కాలంలో స్త్రీలు అందంగా కన్పించేందుకు…

  • కేరళ టూరిజం నిర్వహించే స్వర్గాలయ క్రాఫ్ట్ విలేజ్ ఓసారి ఆన్ లైన్లో చూడండి. హ్యాండ్ లూమ్ టెక్స్టైల్స్ జ్యూవెలరీ శిల్పాలు ఆధునికమైన బ్యాగ్స్ యాక్సెసరీస్ ఎన్నెనో అందమైన వస్తువులున్నాయి. కొబ్బరి పీచు అరటి వెదురు ఫైబర్ కొబ్బరి చిప్పలు గవ్వలతో చేసిన ఎన్నో కళాఖండాలున్నాయి. సంప్రదాయ క్రాఫ్ట్ తో పాటు ఆధునికమైన వస్తువులు ఎన్నో వున్నాయ్. ఈ స్వర్గాలయ క్రాఫ్ట్ విలేజ్ కొజె కోడి ,కన్నూర్ జాతీయ రహదారి పైన ఇరంగల్ వద్ద 20 ఎకరాల విస్తరంలో 27 కాటేజీలున్నాయి. కొత్త సంవత్సరం కోసం ఆత్మీయులకు ఏదైనా ప్రత్యేకమైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇలాంటివి వెతకాలి. ప్రపంచపు ఏ మూల నుంచైనా ఆన్ లైన్లో వేలు పెట్టేసి ఆత్మీయుల ముంగిటికి ఇచ్చేయమనచ్చు . అవేనా ? మన కొండపల్లి బొమ్మల దగ్గరనుంచి కాకినాడ వరకూ దేన్నయినా పంపచ్చు ఏమంటారు ?

    ఆత్మీయులకో బహుమతి కోసం

    కేరళ టూరిజం నిర్వహించే స్వర్గాలయ క్రాఫ్ట్ విలేజ్ ఓసారి ఆన్ లైన్లో చూడండి. హ్యాండ్ లూమ్ టెక్స్టైల్స్ జ్యూవెలరీ శిల్పాలు ఆధునికమైన బ్యాగ్స్ యాక్సెసరీస్ ఎన్నెనో అందమైన…

  • సంక్రాంతి రోజులు బావుంటాయి. ఇప్పుడీ పల్లెటూరి సంక్రాంతి అందాలు సినిమాల్లో చూడాల్సిందే. అపార్ట్మెంట్ కల్చర్ తో సంక్రాంతి వేడుక ఇంకో విధంగా వుంటుందనుకోండి. గంగి రెద్దు మేళం రాదుగా సన్నాయి వాయిస్తూ ముందర ఒకడువస్తుంటే శృతిని వాయిస్తూ మద్దెలతో ఇంకొకరు వెనకగా నడుస్తూ ఉంటే ఇద్దరి మధ్యను అలంకారంతో గంగిరెద్దు. ఈ ఎద్దు ఏం చెపుతుందంటే ? ఓ యజమానీ అన్నదాతా ఆషాడంలో తొలకరి తొలిచినుకు పడిన దగ్గర నుంచి మీ ఏఇంట్లో గేదెలు నిండేవరకు చక్కని శ్రమ చేసి నిన్న ధనవంతుడిని చేసిన శ్రామికుడిని నన్ను గుర్తించు. అంటుందిట. మేత పెట్టి నీళ్లు తాగించి వీపు నిమిరితే ఆనందించే ఎద్దు అల్ప సంతోషం జీవితంలో మానసిక ఆనందాన్ని ఇస్తుందని అదే దివ్యౌషధం అని చెపుతోంది. అహంకారం లేకుండా ఆనందంగా వుండు అని చెప్పేందుకే ఈ గంగిరెద్దు సన్నాయి మేళం అంటారు పెద్దలు. మనిషి జీవితంలో కొందరికి రుణపడి ఉండాలి కొందరి రుణం తీర్చుకోవాలి.

    ధనమిచ్చే శ్రామికుడు

    సంక్రాంతి రోజులు బావుంటాయి. ఇప్పుడీ పల్లెటూరి సంక్రాంతి అందాలు సినిమాల్లో చూడాల్సిందే. అపార్ట్మెంట్ కల్చర్ తో సంక్రాంతి వేడుక ఇంకో విధంగా వుంటుందనుకోండి. గంగి రెద్దు మేళం…

  • అమెరికా జీవితాన్ని అమెరికాను తల్చుకుని అదొక భూతాల స్వర్గం అన్న భావనతో ఎంతోమంది ఉంటారు. అక్కడ వస్తువులు రాళ్ళూ రత్నాలు చాక్లేట్లు తినటం తెచ్చుకోవటం గిఫ్ట్లుగా రావటం ఇంకెంతో గొప్ప అనుకునేవాళ్లు వున్నారు. అభివృద్ధి చెందిన అమెరికా ఐరోపా వాసులు తినేదే బలవర్ధకమైన ఆహారం మనమైతే ఎదో కాస్త వేళకి వండుకు తింటాం. అనుకునే వాళ్ళకి గోల్డ్ న్యూస్ శాక్స్ అన్న సంస్థ వేడివేడిగా వండుకుని అప్పటికప్పుడు అరిటాకులో భోంచేస్తే భారతీయ భోజనమే పోషకాలకు నిలయం అని విశ్లేషించింది. నిల్వ చేసిన ఆహారం తినే అమెరికన్ల కంటే అన్నం పచ్చడి .పప్పు పాయసం సాంబారు పెరుగు ఊరగాయల్లో ఎన్నెనో క్యాలరీలు. అత్యంత రుచీ ఉన్నాయని పరిశోధన సారాంశం. పైగా మనం తినే భోజనం ఖర్చు తక్కువదీ పోషకాలు ఎక్కవదీ అనేసింది. ఊరగాయలు అప్పడాలు వడియాలు ఒరుగులూ తప్ప మనం అప్పటికప్పుడు ఫ్రెష్ గా కూరలు కోసి వండుకుని తింటాం కనుక ఈ అలవాటే ఎంతో మంచిదనీ పోషక విలువల తో కూడి వుంటుందని తేల్చింది.

    మన విస్తరి భోజనం బెస్ట్ అండ్ టేస్ట్

    అమెరికా జీవితాన్ని అమెరికాను తల్చుకుని అదొక భూతాల స్వర్గం అన్న భావనతో ఎంతోమంది ఉంటారు. అక్కడ వస్తువులు రాళ్ళూ రత్నాలు చాక్లేట్లు తినటం తెచ్చుకోవటం గిఫ్ట్లుగా రావటం…

  • కర్ణాటక లో ఇల్కాల్ ఎక్కడఅంటే చెప్పలేరేమో కానీ ఇల్కాల్ చీరలంటే మాత్రం చాలా పాప్యులర్. ఇల్కాల్ గ్రామం మొత్తం ఈ నేత వేయటంలో నిమగ్నమై వుంటారు. పేల్ స్టైపెడ్ పల్లు అంచుల దాకా సాగే బోర్డర్ తో కలిసిపోవడం ఇల్కాల్ చీరల స్పెషాలిటీ. ఇవి చాలా భాగం మగ్గాల పైనే నేస్తారు. సాధారణంగా చీర పమిటి కొంగు విడిగా తయారు చేసి జాయింటుచేస్తారు. ఐదు వేల పోగులతో చేత్తో ముడులు వేస్తూ కూల్ బ్రైట్ కలర్స్ తో నేశాక చీరలు కొత్త రంగు చేత్తో అద్ది ట్విస్ట్ చేస్తారు. నిండు నూలు దారాలతో రంగుల సిల్క్ లేదా రేయాన్ అంటే ఆర్ట్ సిల్క్ పోగుల్ని ఓ రోజులో అల్లిక పూర్తి చేస్తారు. కసూటి ఎంబ్రాయిడరీ అదనపు హంగుగా ఉంటుంది. శంఖు పూలు ,కలువ పూలు రధాలు ఏనుగులు దీపాలు వంటి డిజైన్స్ వేస్తారు. చీర చాలా అందంగా ఉంటుంది.

    అందానికే అందం ఇల్కాల్ శారీస్

    కర్ణాటక లో ఇల్కాల్ ఎక్కడఅంటే చెప్పలేరేమో కానీ  ఇల్కాల్ చీరలంటే మాత్రం చాలా పాప్యులర్. ఇల్కాల్ గ్రామం మొత్తం ఈ నేత వేయటంలో నిమగ్నమై వుంటారు. పేల్…

  • మంచి ఆరోగ్యం కావాలంటే ఉప్పు వాడకాన్ని వీలైనంత తగ్గించాలని నిపుణులు చెపుతూనే ఉంటారు. సోడియం నరాల ఇంపల్స్ ని ట్రాన్స్మిట్ చేయటానికీ మజిల్ ఫైబర్ తో కాంట్రాక్ట్ రావటానికి సాయ పడుతుంది. ఇందుకు కొద్దిపాటి ఉప్పు చాలు. అంటే రోజుకు సగం కంటే ఎక్కువ టీ స్పూన్ పరిమాణం చాలు. ఉప్పును అధికంగా వాడితే కార్డియో వాస్క్యుల్లర్ వ్యవస్థకు హాని కలిగిస్తుంది. దైనందిన ఆహారంలో ఉప్పు వాడకాన్ని వీలైనంత తగ్గించి సహజ రుచిని ఇచ్చే వాటిని ప్రత్యామ్నాయం చేసుకోవాలి. స్పైస్ లు డ్రై లేదా తాజా హెర్బ్స్ వాడుతుండాలి. మిరియాలు దాల్చిన చెక్క పసుపు ఆవాలు యాలకులు తులసి ఆకులు కసూరీమేతి వంటి వాటిని వాడాలి. క్వాన్ట్ ట్రిన్స్ట్ లేదా ప్రాసెస్ ఉత్పత్తులు తగ్గించాలి. కూరగాయల్ని గ్రిల్ చేయటం రోస్ట్ చేయటం ద్వారా వాటిలోని సహజమైన తీపిని వెలికి తీయాలి. వీటికి కొద్దిపాటి ఉప్పు జతచేస్తే రుచి దక్కుతుంది. ఏ పదార్ధాలు కొని ఉడికించినా తక్కువ స్థాయిలో ఉప్పు అన్న సూత్రాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

    కాస్తంత తక్కువ స్థాయిలో

    మంచి ఆరోగ్యం కావాలంటే ఉప్పు వాడకాన్ని వీలైనంత తగ్గించాలని నిపుణులు చెపుతూనే ఉంటారు. సోడియం నరాల ఇంపల్స్ ని ట్రాన్స్మిట్ చేయటానికీ మజిల్ ఫైబర్ తో కాంట్రాక్ట్…

  • నీహారికా కొత్త సంవత్సరం రాబోతోంది. ఇంకా నాలుగు అడుగులే. ఇప్పుడు నీ ప్రశ్న జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ చావడులోనే పరిష్కారం ఎందుకు వెతుకుతున్నారు? అని సమాధానం తనను తానూ ప్రేమించే వ్యక్తి తనను తానూ ఎలా చంపుకుంటాడు ? అంటాడు జాషో. నిజమే. సకల సమస్యలకు మూలం భయం. నిరుద్యోగం ఆర్థిక సమస్య ప్రేమ వైఫల్యం విడాకులు ఆత్మీయుల మరణాలు నమ్మక ద్రోహాలు ఏదైనా కానీ. సమస్య తీవ్రత ఒక శాతం. మిగతా అంతా భయం. ఏ సమస్య పరిష్కించలేనంత క్లిష్టతరం కాదు. భయంతోనే మనిషిలో తెలివి తేటలు శక్తి సామర్ధ్యాలు మట్టికొట్టుకుపోతాయి. అప్పుడే పరిష్కారం ఒక్క బావే అన్న నిర్ణయానికి వస్తారు. ఇప్పుడు చెప్పు ఏదీ సాధించకుండా ఏ ఒక్క మంచి పనీ చేయకుండా ఏ ఒక్క జీవితాన్ని మార్చకుండా జీవితం వద్దనుకోవటం ఎంత వరకు న్యాయం. కఠిన పరీక్షలు పెట్టినప్పుడు వైమీ అనుకోకూడదు. ట్రై మీ .... అని సవాలు స్వీకరించాలి. సర్వస్వం కోల్పోయినా భవిష్యత్తు ఒకటుంటుంది. అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో నెగ్గుకొస్తేనే సమర్ధుడైన నావికుడవుతాడు. ఎత్తు పల్లాలు ఎదుర్కుంటేనే మనిషి రాటుదేలుతారు. సమస్యల్లోనే సమర్ధత బయటపడుతుంది. ఇప్పుడు చెప్పు ప్రతి మనుషులు సమస్యల్ని ఎదుర్కునే ఇన్స్టింట్ సామర్ధ్యాలు ఉంటాయి. వాటని సమర్ధవంతంగా వాడుకుంటే చావు ఆలోచనలను చావు దెబ్బ తీయచ్చు. ఏమంటారు.

    ఎంత అందమైందీ జీవితం

    నీహారికా కొత్త సంవత్సరం రాబోతోంది. ఇంకా నాలుగు అడుగులే. ఇప్పుడు నీ ప్రశ్న జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ చావడులోనే పరిష్కారం ఎందుకు వెతుకుతున్నారు? అని సమాధానం…

  • ఫ్యాషన్ స్టయిలిస్ట్ లు ఒక బ్యూటిఫుల్ రిపోర్ట్ ఇచ్చారు. ఎర్రని రంగు ఎపుడూ ఫ్యాషన్ ఐకాన్ గా వుంటుందిట. ఆకర్షణీయమైన ఈ రెడ్ కలర్ ఎలాంటి డిజైన్ నయినా అద్భుతంగా ఆవిష్కరిస్తుందిట. రెడ్ కార్పెట్ సెలబ్రెటీలు ఏ రంగుల్లోనే డివైన్ లుక్ లో కనిపిస్తారట. వాళ్ళ దృష్టిలో ఇదో శక్తిమంతమైన రంగు. ఇటీవలే ఒక పరిశోధనలో కూడా ఎర్రని రంగు దృఢమైన ఆల్చనాలు సామర్ధ్యంతో కూడిన సున్నితమైన మనస్సుకు సూచన అంటున్నారు. చైనాలో ఎర్రని రంగును లక్కీ కలర్ గా పరిగణిస్తారు. ఇది ఆధిక్యతను సూచించే కలర్ కూడా . ఎరుపు హార్ట్ రేట్ ను శ్వాసకు ఉద్దీప్తం చేస్తుంది. ఒత్తిడి ఫ్రేస్తేషన్ కోపం కూడా ఎక్కువ చేస్తుందీ రంగు. తమాషా ఏమిటంటే రాయబారుల్లో ఇలాంటి రంగు దుస్తులు ధరిస్తే ఇక అంతే సంగతులు. ఈ తీవ్రమైన రంగు ప్రశాంతమైన వాతావరణం ఇవ్వదంటున్నారు. సో ఇది అద్భుతమైన అందమైన రంగు. ఎర్రనీదుస్తులు ఎవరికైనా అందాన్ని ఇస్తాయి. అలాగే మనల్ని సీరియస్ గా ఉండేట్టు చేస్తాయి.

    ఎంత అందమో అంత డేంజర్

    ఫ్యాషన్ స్టయిలిస్ట్ లు ఒక బ్యూటిఫుల్ రిపోర్ట్ ఇచ్చారు. ఎర్రని రంగు ఎపుడూ ఫ్యాషన్ ఐకాన్ గా వుంటుందిట. ఆకర్షణీయమైన ఈ రెడ్ కలర్ ఎలాంటి డిజైన్…