• నీహారికా, ఇది అడగాల్సిన ప్రస్నే. ఇప్పుడు కొత్త సంవత్సరం రేపు సంక్రాంతి ఇంకో రోజు ఉగాది. ఎప్పుడూ ఆత్మేయులకు మన చుటూ వుండే వాళ్లకు ఇవ్వగలిగే అమూల్యమైన బహుమతి ఎముంటుందీ అన్నావ్. 'మాట '....... అవును మాటే మంత్రం. ఎన్ని మాటలున్నాయిరా ! బావుంది. అరే చక్కగా వుంది. క్షమించండి కృతజ్ఞతలు సుమీ ,థాంక్స్ అండీ, సారీ బాబూ అందించే బహుమానాలు. ఇవి నీకెందరినో స్నేహితులను బహుమతిగా ఇస్తాయి. ప్రతి నిమిషం నీ జీవితంలో శిరస్సు పైన నవ్వులు పువ్వులు పారిజాతాల్లా పున్నాగల్లా రాలుతూనే ఉంటాయి. ఎప్పుడూ ఇలా పాజిటివ్ గా ఉండటం కష్టం. కానీ అసాధ్యం కాదు. నెగిటివ్ మాటలు మాట్లాడిన ప్రతీ సారీ గమనించుకో మన శరీరం తీరుమారి పోతుంది. పరుషమైన వాక్కులతో అవతలి మనిషి మోహంలో వెంటనే ఎదురు దెబ్బ తీయాలనే ఉద్రేకం కనిపిస్తుంది. అదే పాజిటివ్ గా ప్లీజ్ అంటే అసలు వాతావరణమే మారిపోతుంది. ఆంగ్ల భాషలు అత్యంత శక్తిమంతమైన పదం ప్లీజ్ అని తేల్చారు. సైకాలజిస్టులు. అందుకే ప్రతి పండగకేమిటి ప్రతీ సారీ ఒక అద్భుతమైన పదాన్నే కానుకగా ఇవివి నీహారికా.... ఇదే చక్కని వరాలిచ్చే మంత్రం. మంచి మాటకున్న శక్తినే మంత్రం అంటారు. అందరూ బావుండాలి. ఇదే అసలు సిసలు విలువైన గిఫ్ట్. ఏమంటావూ ??

    మాటే మంత్రమూ

    నీహారికా, ఇది అడగాల్సిన ప్రస్నే. ఇప్పుడు కొత్త సంవత్సరం రేపు సంక్రాంతి ఇంకో రోజు ఉగాది. ఎప్పుడూ ఆత్మేయులకు మన చుటూ  వుండే వాళ్లకు ఇవ్వగలిగే అమూల్యమైన…

  • తెల్ల వెంట్రుకలు కనపడితే చాలు ఇక రంగులు అద్దటం తప్పదు. కానీ ఇప్పుడు కలరింగ్ అంటే తెల్ల వెంట్రుకలను దాచేసే డై మాత్రమే కాదు. తలలో అక్కడక్కడ రంగు పాయలు ఆద్దటమే నేటి ఫ్యాషన్. అందుకే డై సంగతి పక్కన పడేసి ఈ పరిస్థితుల వైపు చూడాలి స్త్రీలు. బ్లాండే అంటే అక్కడక్కడ ఫ్యాషన్. ఇక బ్రౌన్ లో ఎన్నో షేడ్స్ ఉంటాయి. గ్లాసీగా అక్కడక్కడ మెరుపుల్లాగా కనిపిస్తాయి. ఇక ఎర్రని రంగు విభిన్నమైన శిరోజాలకు యాక్సెసరీ వంటిది. ఇక ఊదీ రంగు ఎరుపు తో కళకలిపి అక్కడక్కడా షేక్ ఇస్తే మార్పు ఎంజాయ్ చేయచ్చు. ఇలా జుత్తు నెరవటం మొదలు పెట్టగానే ఈ ట్రెండ్స్ ట్రయ్ చేస్తే అతి ఫ్యాషన్లు ఇటు తెల్ల వెంట్రుకలు దాచేసే అవకాశం కూడా కాకపోతే ఇవి సొంతంగా ట్రై చేసే కంటే పార్లర్ లోనే మొదట్లో హేయిర్ స్పెషలిస్ట్ సాయంతో వేసుకోవాలి. రకరకాల వర్ణాలతో హేయిర్ లాస్ కాకుండా వాళ్ళు మంచి సలహా ఇస్తారు.

    తెల్ల వెంట్రుకల్ని దాచేసే టచప్స్

    తెల్ల వెంట్రుకలు కనపడితే చాలు ఇక రంగులు అద్దటం తప్పదు. కానీ  ఇప్పుడు కలరింగ్ అంటే తెల్ల వెంట్రుకలను దాచేసే డై మాత్రమే కాదు. తలలో అక్కడక్కడ…

  • హాట్ ఫుడ్ మార్కెట్ సంస్థ రిపోర్ట్ ప్రకారం ఈ సంవత్సరం ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రజలు బాగా ఆదరిస్తారని తేలిందిట. అలాగే నలుపు రంగులో వుండే ఆహార పదార్ధాలు యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లెవనాయిడ్స్ వృధాప్య లక్షణాలను నిలవరిస్తాయని రిపోర్ట్ చెపుతోంది. అంచేత వంకాయలు కాలీఫ్లవర్ క్యారెట్ ఆలు బెర్రీ ద్రాక్ష నలుపు బియ్యం నలుపు వెల్లుల్లి నల్ల నువ్వులు పేస్ట్ ఎక్కువగా తయారవబోతున్నాయి. ముఖ్యంగా నల్ల వెల్లుల్లి పేస్ట్ తో వంటకాలు రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికీ మంచి చేస్తుంది.అందుకే వీటితో సాస్ చేస్తే మంచిదని ఆహార నిపుణులు సూచించారు. గత సంవత్సరపు రిపోర్టుల ప్రకారం మార్కెట్ లో విపరీతమైన ఆదరణ పెరిగిందీ ఎక్కువగా అమ్ముడయిందీ విశేషమైన ఆదరణ పొందిందీ ఆయర్వేద ఉత్పత్తులు. మరి కొత్త రిపోర్ట్ ను అనుసరించి ఆయుర్వేద మార్కెట్ లో నలుపు వెల్లులి కి ఏ ఏ ప్రాధాన్యతలు ఉంటాయో తెలుసుకోవాలి. ముందైతే వంకాయ తో పాటు అన్ని నలుపు రంగులో వుండే కాయగూరల్ని మరచిపోకుండా తీసుకోండి.

    నలుపు రంగు ఆహారానికి పెరుగుతున్న ఆదరణ

    హాట్ ఫుడ్ మార్కెట్ సంస్థ రిపోర్ట్ ప్రకారం ఈ సంవత్సరం ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రజలు బాగా ఆదరిస్తారని తేలిందిట. అలాగే నలుపు రంగులో వుండే ఆహార పదార్ధాలు…

  • సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో బోల్డ్ గానీ మాట్లాడుతూ ఉంటుంది. పెళ్లి కబుర్లు ప్రేమ ఇష్టమైన పనులు అన్నీ పంచుకుంటూ ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం కూడా తన మనసులో మాటలు చెపుతూ ఈ సంవత్సరం ఐదారు సినిమాలు చేయాలనుకుంటున్నా. లక్ తో పాటు హార్డ్ వర్క్ నన్ను ఈ స్థాయికి తెచ్చింది. నిజమైన సంతోషం నా అనుభవం లోకి వచ్చింది. సహనం బాగా పెరిగిందీ. ఈ ఏడాది సినీ ప్రపంచం బయట పనులు కొన్ని పూర్తి చేస్తానని చెపుతోంది హీరోయిన్ సమంత. తనకు ఫిట్ నెస్ అంటే జీవితంలో ఒక భాగం అంటుంది. హెల్తీ డైట్ ప్రాపర్ వర్కవుట్స్ ఇవే ఫిట్ నెస్ సీక్రెట్స్. ఈ సంవత్సరం నేను ఆరడుగుల ఏతయ్యానాని చిలిపిగా చెప్పింది. ఎలా అంటే 'అఆ ' 'తెరి ' సినిమాల విజయం కొన్ని రోజుల పాటు తను ఎంతో ఎత్తుగా ఉన్నట్లు ఫీలయ్యేట్లు చేశాయన్నది సమంత. ఎంతోమంది ఎంత సాధించినా మన ఇంట్లో మామూలు ఆడపిల్లలాగే సరదాగా సందడి చేస్తూ వుంటారు. ఆలా వుండే వాళ్లలో సమంత కూడా ఉంటుంది.

    నేను ఆరడుగుల ఎత్తయ్యా తెలుసా

    సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో బోల్డ్ గానీ మాట్లాడుతూ ఉంటుంది. పెళ్లి కబుర్లు ప్రేమ ఇష్టమైన పనులు అన్నీ పంచుకుంటూ ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం కూడా…

  • ఆహార వేళలుంటాయి. అంటే మన శరీరానికి అవసరమయ్యే ప్రధాన మైన పోషకాలకు కాంతికీ చీకటితో సంబంధించి వుంది. జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యం సెరోటోనిన్ మెలటోనిన్ సమస్థితి పైన ఆధారపడి ఉంటుంది. పనులు నిద్ర కణ విభజన ఈ రెంటి సమస్థితి పైనే ఆధారపడి ఉంటాయి. సూర్య కాంతి మన శరీర లయను నియంత్రిస్తున్నాదని అర్ధం చేసుకుంటూ దాని ప్రకారం ఆహారం తీసుకోవాలని మోడ్రన్ అధ్యయనాలు చెపుతున్నాయి. వండిన ఆహారం మధ్యాన్న వేళ సూర్యాస్తమయ వేళ పూర్తిగా జీర్ణమవుతుంది. అంచేత ఎక్కువ అరుగుదలశక్తి అదనంగా అవసరమైన వండిన ఆహారం మధ్యాన్నం తీసుకుని మిగిలిన సమయంలో తేలికగా అరిగే తాజా పండ్లు మొలకలు గింజలు తినాలి. ప్రతి రోజూ ఉదయాన్నే ఆయా రకాల పండ్లతో మొదలుపెట్టాలంటారు. రాత్రి భోజనం మొలకెత్తిన ధాన్యాలు కూరగాయలతో వుంటే రాత్రి భోజనం మన శరీర నిర్మాణానికి పనికి వచ్చే కణాల పెరుగుదలకు పునరుత్పత్తి సామర్ధ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది. 15 నిముషాలు సూర్య కాంతి శరీరానికి తగలనివ్వటం ఇంకా మంచిది.

    సూర్య కాంతిని అర్ధం చేసుకుని తినాలి

    ఆహార వేళలుంటాయి. అంటే మన శరీరానికి అవసరమయ్యే ప్రధాన మైన పోషకాలకు కాంతికీ చీకటితో సంబంధించి వుంది. జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యం సెరోటోనిన్ మెలటోనిన్ సమస్థితి…

  • రష్యా కు చెందిన OLGANOSKOVA గాజులాంటి మెరుపుతో మార్బుల్ రాయి వుండే అందమైన వర్షం అద్దం లాగా ఉండటం ఇందులో రకరకాల గీతలూ కనపడేలాంటి అద్భుతమైన కేక్ ని తయారు చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇంకేముంది విపరీతమైన స్పందన. ఆరు లక్షల మంది చూసేసిన ఈ మార్బుల్ మిర్రర్ కేక్ ఎలా తయారీ చేయాలో కూడా చెపేపరికి ప్రపంచవ్యాప్తంగా ఉండే పిల్లల అమ్మలు ఫిదా అయ్యారు. జిలాటిన్ నీళ్లు లిక్విడ్ గ్లూకోస్ పంచదార కండెన్సెడ్ మిల్క్ చాకొలేట్ ఆహారపు రంగులతో మార్బుల్ ఎఫెక్ట్ తేవటం అంటే వేర్వేరు రంగుల ఐసింగ్ కు ఒకేసారి కేక్ పైన పోయాలి. మెరిసే కేకు వెనక కథేమిటో చూడాలని అనుకుంటే యూట్యూబ్ లో తయారీ విధానం వుంది. ఇలాంటివి తయారు చేయాలంటే చేయి తిరిగిన షెఫ్ కు మాత్రమే కుదురుతుందని అనుకునే అక్కర్లేదు. ఈ ప్రపంచ వ్యాప్త ఫెమస్ కేక్ ను టై చేయచ్చు. చూడండోసారి.

    మార్బుల్ మిర్రర్ కేక్ సూపర్

    రష్యా కు చెందిన OLGANOSKOVA   గాజులాంటి మెరుపుతో మార్బుల్ రాయి వుండే అందమైన వర్షం అద్దం లాగా ఉండటం ఇందులో రకరకాల గీతలూ కనపడేలాంటి అద్భుతమైన కేక్…

  • రకుల్ ప్రీత్ సింగ్ సొంత వ్యాపారం లోకి ప్రవేశించాక కొత్త కొత్త పరిచయాలు ఫిట్ నెస్ పట్ల యూత్ లో పెరిగిన శ్రద్ధ చూసాక ఇప్పుడు అందరికీ మంచి సలహాలు ఇస్తోంది. ఎప్పుడైతే మార్పు అవసరం అని భావిస్తారో అప్పుడప్పుడే ఆచరించాలి. కానీ కొత్త సంవత్సరం కోసం ఎదురు చూడనే వద్దు. నేనైతే డిసిప్లిన్ గర్ల్. అలవాట్లు ఖచ్చితంగా మార్పులు చేసుకుంటూ టైం విషయంలో పంక్చువల్ గా వుంటా. ఫిట్ నెస్ పైన మమకారం కొద్దీ విపరార్థేమైన వర్కవుట్స్ చేస్తా. మంచి పర్సనాలిటీ కోసం ఆరోగ్యం కోసం వ్యాయామం జీవితంలో భాగంగా ఉండవలిసిందే. లక్ ఉండాలి కానీ మన తలరాత ను మార్చేది మాత్రం మన కష్టమే. వృత్తి పట్ల అంకిత భావంతో నిజాయితీగా వంద శాతం కష్టపడితే మన తలరాత జీవితం అన్నీ మారిపోతాయి. వృత్తి పరంగా నాకు ఈ ఏడాది చాలా గొప్పగా ఉంటుంది. మహేష్ బాబు సాయి ధరమ్ తేజ్ బెల్లంకొండ శ్రీనివాస్ అక్కినేని నాగార్జున నాగ చైతన్య కళ్యాణ్ కృష్ణ తో నటించే సినిమాలన్నీ ఈ సంవత్సరం రిలీజ్ అవుతాయి. ఈ జీవితంలో నేను ఫుల్ హ్యాపీ అంటోంది రకుల్ ప్రీత్ సింగ్.

    తలరాత మార్చుకోవచ్చంటున్న రకుల్

    రకుల్ ప్రీత్ సింగ్ సొంత వ్యాపారం లోకి ప్రవేశించాక కొత్త కొత్త పరిచయాలు ఫిట్ నెస్ పట్ల యూత్ లో పెరిగిన శ్రద్ధ  చూసాక ఇప్పుడు అందరికీ…

  • హాట్ మిల్క్ తాగాలా వద్దా అని చాలా మంది సందేహ పడతారు. పాలకు వ్యతిరేకంగా రకరకాల థియరీలు వచ్చాయి. కనుక సందేహం నిజానికి కార్బోహైడ్రాట్స్ ,ఫ్యాట్స్ ,ప్రోటీన్స్, అసాధారణ కలయిక గల ఏకైక ద్రవ పదార్ధం పాలే. 100 ఎం. ఎజ్ ఆవు పాలలో 3. 2 గ్రాముల ప్రొటెం 4. 1 గ్రాముల ఫ్యాట్ 4. 4 గ్రాముల కార్బోహైడ్రాట్స్ 97 క్యాలరీలు ఉంటాయి. గేదె పాలు వీటికంటే హెవీ. పాలల్లోని ప్రోటీన్ అత్యధిక బయోలాజికల్ విలువలు కలిగి ఉంటుంది. అంటే పూర్తి ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఉంటాయి. చక్కని గ్రహించే గుణంకలిగిన కాల్షియం ఉంటుంది.కానీ కొందరికి పాలు అరగకపోవచ్చు. దీనిలోని లాక్టోజ్ వల్ల ఈ అరుగుదల సమస్య వస్తుంది. ఒక కప్పు పాలు లేదా పెరుగు ఒకే నిస్పృత్తి లో అంటే 180 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. పెద్దలలో కొందరికి మాత్రమే పెరుగు పాలలో వుండే లాక్టోజ్ వల్ల పాలు సరిపడక పోవచ్చు. కానీ పిల్లలకు హాయిగా పాలు అరిగిపోతాయి. పాలను పెరుగు పనీర్ మజ్జిగ వంటి రూపాల్లో తీసుకున్న సమస్య లేదు. కానీ రోజూ పాలు తాగటం ఆరోగ్యానికి మేలు చేస్తుందని గుర్తుంచుకోమంటున్నారు డాక్టర్లు.

    అసాధారణ మిశ్రమాలున్న పాలు

    హాట్ మిల్క్ తాగాలా వద్దా అని చాలా మంది సందేహ పడతారు. పాలకు వ్యతిరేకంగా రకరకాల థియరీలు వచ్చాయి. కనుక సందేహం నిజానికి కార్బోహైడ్రాట్స్ ,ఫ్యాట్స్ ,ప్రోటీన్స్,…

  • అంతర్జాతీయ ఫ్యాషన్ నిపుణులు ఆకు పచ్చ రంగుకే ఎక్కువ సొగసు అని వంద మార్కులు వేసేస్తారు. కలర్ థెరపిస్టులేమో డిప్రెషనూ ఒత్తిడీ తగ్గిస్తుందంటున్నారు. అద్భుతమైన సువాసన తో ఉండే సంపెంగల రంగూ ఆకు పచ్చే. అందమైన హరిత వర్ణాన్ని అద్దుకున్న జ్యూవెలరీ అయితే ఎప్పటికీ తిరుగులేని ఫ్యాషనే. ఆకుపచ్చ లోనే ఎన్ని ఛాయాలున్నా జ్యూవెలరీ డిజైన్స్ చాలానే ఉన్నాయి. సాధారణంగా సిరి సంపదలకు ప్రతీకగా ఉండే ముదురాకు పచ్చ రాయి ఉంగరాలు ధరించే వాళ్ళ సంఖ్య ఎక్కువే. ఈ ఆకు పచ్చ రాయి సెట్స్ లో అయితే అంతులేనన్ని ఇమేజెస్ కనిపిస్తాయి. ట్రేడిషనల్ ఆభరణాలు నెక్లెస్ లు రాళ్ల గాజులే కాకుండా ప్రత్యేకంగా అమ్మాయిలు ఇష్టపడే రకరకాల డిజైనర్ లాకెట్స్ తో చూడగానే ఆకట్టుకుంటున్నాయి. అమ్మాయిలకు చూడగానే నచ్చేదెందుకంటే వాళ్లలో సృజనాత్మకత భావోద్వేగాల పసితనపు ఛాయలు ఇవన్నీ కలగలిపి ఈ హరిత వర్ణాన్ని ఎంచుకోమంటాయని మానసిక శాస్త్ర వేత్తలు చెపుతారు. ఈ ఆకుపచ్చ రాళ్ళకి ఎరుపు మేజెంటా ఏ రాళ్ళూ కలిపినా కాంబినేషన్ చక్కగా ఉంటుంది. బరువైన సంప్రదాయ డిజైన్ లే కాదు చక్కని తేలికైన ట్రెండీ నగలూ వచ్చాయి.

    బంగారానికి సొగసొద్దే పచ్చ రాళ్లు

    అంతర్జాతీయ ఫ్యాషన్ నిపుణులు ఆకు పచ్చ రంగుకే ఎక్కువ సొగసు అని వంద మార్కులు వేసేస్తారు. కలర్ థెరపిస్టులేమో డిప్రెషనూ ఒత్తిడీ తగ్గిస్తుందంటున్నారు. అద్భుతమైన సువాసన తో…

  • నయన తార ని లేడీ సూపర్ స్టార్ అంటారు. ఇప్పటికే దూర ఇమై క్కనొడిగల్ ,అరమ్ కొలై ఉదిర్ కాలమ్ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది నయన. అలాగే ఈరోజు ఇంటెర్నేష్నల్ సంస్థ నిర్మిస్తున్న రియలిస్టిక్ థ్రిల్లర్ లోనూ నయన కధానాయిక. ఇక తాజాగా ఆమె ఒప్పుకున్నా సినిమాకు భరత కృష్ణమా చారి దర్శకుడు. ఇందులో తన కుటుంబ మూలాలు వెతుక్కుంటూ వెళ్లే జర్నలిస్ట్ పాత్రను నయన చేయనుంది. ఈ సినిమా చిత్రీకరణ అంతా మాంగోలియా లోని మంచు ప్రాంతాల్లో తీస్తున్నారు. పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత లో షూటింగ్ చేస్తున్నారు. సౌత్ లో ఈ సినిమా నయనా తార కు గొప్ప హిట్టవుతుంది. రిస్కీ వాతావరణం లో రిస్కీ ఫైట్స్ ఆమె చేయగలరు. అంటున్నారు దర్శకుడు భరత్. ఇవన్నీ చూస్తుంటే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు నయన మాత్రమే చేయగలదనే భావన అందరికీ వస్తోంది.

    లేడీ ఓరియెంటెడ్ లన్నీ నయన కే

    నయన తార ని లేడీ సూపర్ స్టార్ అంటారు. ఇప్పటికే దూర ఇమై క్కనొడిగల్ ,అరమ్ కొలై ఉదిర్  కాలమ్ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది…