• నీహారికా , నేను పెరుగుతున్నప్పుడు నేనడిగిన ఏ ప్రశ్నకు సరైన సమాధానం అమ్మా నాన్నల దగ్గర నేను తెలుసుకోలేదు. నాలాంటి అమ్మాయిలంతా నాలాగే శరీరానికి సంబంధించిన విషయాల్లో అజ్ఞానంతో వుంటారు కనుకనే వాళ్ళు సులువుగా మోసపోతారని నువ్వన్నమాట మనసుని గాయం చేస్తోంది. నిజమే. పదేళ్ల వయసు వచ్చాక శరీరంలో చోటు చేసుకునే మార్పులు అకస్మాత్తుగా ఆడ మగ పిల్లల మధ్య కలిగే ఆకర్షణ పిల్లల మనసు అల్లకల్లోలం చేస్తాయి. సరైన లైంగిక ఒక్కటే వాళ్ళని ఆ స్థితి నుంచి బయట పడేస్తుంది భయాలు పోగొడుతుంది. లైంగిక విద్య గురించి అవగాహనా కల్పిస్తే ప్రయోగాలు చేస్తారనే మాట కేవలం అపోహ. మన సమాజం లోని విలువల్ని నేర్పేదే ఈ విద్య. మనం భోజనం చేయటానికీ రోడ్డు పై నడిచేందుకు కొన్ని విధులున్నాయి. శృంగారం కూడా ఇలాంటిదే ఇద్దరు వ్యక్తులు పెళ్లితో ఒక్కటై ప్రేమనే గోడల పై ఏకాంతంగా ఆస్వాదించే మాధుర్యమనీ పిల్లలు ఇంకో రకంగా ప్రవర్తించి జీవితం పాడు చేసుకోవద్దనీ తమ శరీరం విషయంలో శ్రద్ధగా ఉండమని చెడ్డ స్పర్శ ని దూరంగా వుంచమనీ ప్రేమకి ఆకర్షనికీ మధ్య వున్నతేడానీ పదే పదే పిలల్లకు చెప్పుకోవాలి. తల్లితండ్రులే పిల్లల గురువులుగా వాళ్ళకి వాళ్ళ గురించి చెప్పి హెచ్చరించాలి. వాళ్ళు ప్రతిదశ లోనూ తల్లితండ్రుల దగ్గర తమ సమస్యలకు చెప్పుకునేంత స్వేచ్ఛ తల్లితండ్రులు ఇవ్వాలి. అలా పిల్లలకు కాపాడుకోకపోతే కష్టం ఎవరికీ చెప్పు.

    పిల్లలకి చెప్పకపోవటం తప్పే కదా

    నీహారికా , నేను పెరుగుతున్నప్పుడు నేనడిగిన ఏ ప్రశ్నకు సరైన సమాధానం అమ్మా నాన్నల దగ్గర నేను తెలుసుకోలేదు. నాలాంటి అమ్మాయిలంతా నాలాగే శరీరానికి సంబంధించిన  విషయాల్లో…

  • కొన్ని పదార్ధాలను పేర్లను బట్టి నమ్ముతారా ? దానిలోని కంటెంట్ ను బట్టి వాడతారా అర్ధం కాదు. ఈ మధ్య కాలంలో పెద్ద హోటల్స్ లో బ్రౌన్ షుగర్ తో చేసిన పదార్ధాల లిస్ట్ కనిపిస్తోంది అలాగే కేకులు పేస్ట్రీ లు డిజర్ట్ లు కాఫీ లు కూడా బ్రౌన్ షుగర్ వాడటం ఎక్కువై ఫ్యాషనై పోతుంది. ఇలా వాడేవారికి అసలు వైట్ షుగర్ కు బ్రౌన్ షుగర్ కు మధ్య తేడా ఏవిటో కనీసం ఏ గుగూల్ సెర్చో చేసి తెలుసుకుంటునారా ? తెల్లని పంచదార మొలాసిస్ ను తొలగించి తయారుచేస్తారు . మళ్ళీ చక్కెర మొలాసిస్ ను కలిపేసి బ్రౌన్ షుగర్ చేస్తారు. ఒక టీ స్పూన్ తెల్లని పంచదార లో 16 క్యాలరీలు ఉంటే అదే స్పూన్ బ్రౌన్ షుగర్ లో 17 క్యాలరీలున్నాయి. ఇక పోషక పరంగా చుస్తే రెండూ ఒకటే. ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు లేవు. బ్రౌన్ రైస్ మంచిదన్నారు కనుక బ్రౌన్ షుగర్ కూడా మంచిదనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారో ఏమో.. నిజానికి అసలు ఏ పంచదార వద్దనీ పంచదార లీని జీవితాన్ని జీవించమనీ అధ్యయనాలు చెపుతున్నాయి.

    బ్రౌన్ షుగర్ ఎందుకు మంచిదంటారు ?

    కొన్ని పదార్ధాలను పేర్లను బట్టి నమ్ముతారా ? దానిలోని కంటెంట్ ను బట్టి వాడతారా  అర్ధం కాదు. ఈ మధ్య కాలంలో పెద్ద హోటల్స్ లో బ్రౌన్…

  • మేం ఇంటి పనులు చేసున్నాం. ఎంతో శక్తి ఖర్చవుతోంది. శరీరం ఎంతో శ్రమ కు గురవుతోంది. కనుక వ్యాయామాలు అక్కర్లేదనుకుంటారు. ఇలా చేస్తే కొవ్వు కరిగిపోతుందనే భ్రమ తోనే ఉంటారు. ఇల్లు దుమ్ము దులిపితేనూ వ్యాక్యూమ్ క్లీన్ చేస్తేనూ ఇంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేతి కందిన వందలాది పనులు చేస్తుంటేనూ ఎక్సర్ సైజ్ చేసినట్టు కాదంటారు నిపుణులు . ఈ ఇంటి పనులన్నీ వారానికి 150 నిమిషాల తగు మాత్రం వ్యాయామం తో సాటిరావు. తాము చేసే ఈ పద్ధతి లేని పనుల వల్ల కొవ్వు కరిగి శరీరం స్లిమ్ గా అవుతోందని ఊహించటం. శరీరం యధాతధంగా ఎప్పటిలా స్పూను కొవ్వు కూడా కరగకుండా ఉండటం చూసి దిగులుపడటం మామూలే. సైక్లింగ్ వాకింగ్ రన్నింగ్ తదితర వ్యాయామాలు పోలిస్తే ఇంటిపని ఎక్సర్ సైజ్ కిందకి రానే రాదు . ఉదాహరణకు 30 నిమిషాల వ్యాక్యూమింగ్ వల్ల 130 క్యాలరీలు ఖర్చయితే 30 నిముషాల సైక్లింగ్ వల్ల 400 క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇంటి పనులు శారీరిక చురుకుదనం ఇస్తాయి. కానీ వ్యాయామాలకు సమానం రావు.

    ఇంటిపని వ్యాయామం కానే కాదు

    మేం ఇంటి పనులు చేసున్నాం. ఎంతో శక్తి  ఖర్చవుతోంది. శరీరం  ఎంతో శ్రమ కు గురవుతోంది. కనుక వ్యాయామాలు అక్కర్లేదనుకుంటారు. ఇలా చేస్తే కొవ్వు కరిగిపోతుందనే భ్రమ…

  • పాదాల అందాన్ని పెంచటంలో గోళ్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి వాటిని ఎప్పుడూ పర్ ఫెక్ట్ గా ఉంచుకోవాలి. గోళ్లు ప్రోటీన్ కెరాటిన్ తో తయారవుతాయి. ఆరోగ్యవంతమైన ఎదుగుదల కోసం నెయిల్ ప్లేట్ ను కొంత మోతాదులో ఫ్లెక్సిబిలిటీ తేమ అవసరం. కఠినమైన రసాయనాలతో నెయిల్ ప్లేట్స్ చిట్టి గోళ్లు విరిగిపోతాయి. కాలి గోళ్లు ఎపుడూ ఓంపుగా కాకుండా స్ట్రయిట్ లైన్ లో కట్ చేయాలి. సరిగ్గా కట్ చేయకపోతే గాయపడటం లేదా షూ ఫిట్టింగ్ సరిగ్గా లేకపోతే కాలిగోళ్ళు మూలల్లో విరిగిపోతూ ఉంటాయి. దీనివల్ల ఇన్ గ్రోన్ నెయిల్స్ వచ్చే అవకాశం వుంది గోళ్లు కొంచెం పెరగగానే కట్ చేసేస్తూ ఉండాలి.లేకపోతే దేనికోదాని తగిలి గాయపడతాయి. అలాగే చేతి గోళ్ళకైనా కాళీ గోళ్ళకైనా పెయింట్ వేసాక చిప్ అవుతుంటే పెయింట్ పొరపాటున కూడా స్క్రాప్ చేయద్దు. నెయిల్ పాలిష్ రిమూవర్ వాడాలి. డార్క్ నెయిల్ పాలిష్ ను పీల్ చేసినా చిప్ అయినా అసహ్యంగా కనపడతాయి. క్లియర్ టాప్ కోట్ పాలిష్ లేదా స్కిన్ కలర్ పాలిష్ వేసినా అందంగానే ఉంటాయి.

    స్ట్రెయిట్ లైన్ కట్ చేస్తేనే బావుంటాయి

    పాదాల అందాన్ని పెంచటంలో గోళ్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి వాటిని ఎప్పుడూ పర్ ఫెక్ట్ గా ఉంచుకోవాలి. గోళ్లు  ప్రోటీన్ కెరాటిన్ తో తయారవుతాయి. ఆరోగ్యవంతమైన…

  • అందమైన చీరల్లోకి కనిపిస్తూ ఉంటుంది విద్యా బాలన్. కేన్స్ రెడ్ కార్పెట్ పైన విద్య తన సకల వస్త్ర కళలను ప్రదర్శించింది. సవ్య సాచి రూపొందించిన అందమైన చీరలకు అందం విద్యా బాలన్ వస్త్ర ధారణ లో యాక్సిసరీస్ లో తనదైన ప్రత్యేకత నిలుపుకునే విద్యా బాలన్. ఇష్టమైన డ్రెస్ చక్కని చీరలే. ఆమెకు గౌన్లు కుర్తీలు షార్ట్ కట్స్ అనార్కలీలు అస్సలు నప్ప వనే మనకే తెలిసిపోతుంది. కానీ చీరల్లోకి ఎందుకామే బావుంటుందీ అంటే అసలు చీరల క్వాలిటీ అంచులు పమిట కొంగులు కుచ్చిళ్ళు కట్టే తీరు ఇవన్నీ కలిసి అసలు ప్రపంచంలోనే అత్యంత క్లవర్ గార్మెంట్ చీర ఒక్కటే కనుక. అందుకే దీన్ని ఎంచుకొంటానంటోంది విద్యా. చీరల అంచులు రివర్స్ ఆఫ్ లైట్ లాగా పనిచేస్తాయి. ఇవి నాజూకు తనాన్ని ఎత్తునూ అందాన్ని తెలివిగా నిర్దేశిస్తాయి. ఒక్కసారి వీటికి జోడీగా వుండే యాక్సెసరీస్ కూడా చీరకి న్యూలుక్ ఇచ్చి మరింత అందాన్నిస్తాయి. విద్యాకయితే చిన్న రంగులు మరీ పెద్దవికాని నెక్లెస్ లు చుంకీ బ్యాంగిల్స్ బ్రేస్ లెట్స్ వదిలేసిన జుట్టు లేదా పాతకాలంలో లాగా చక్కని జడ అన్నీ కలిపి ఆమెను సంప్రదాయ సుందరిని చేసేస్తాయి. చీర చేసే మ్యాజిక్ ఇదే.

    విద్యాబాలన్ కిది పర్ఫెక్ట్ డ్రెస్

    అందమైన చీరల్లోకి కనిపిస్తూ ఉంటుంది విద్యా బాలన్. కేన్స్ రెడ్ కార్పెట్ పైన విద్య తన సకల వస్త్ర కళలను ప్రదర్శించింది. సవ్య సాచి రూపొందించిన అందమైన…

  • సహజమైన ముత్యాల గురించి కవుల కవితలల్లారు. అందమైన యువతి పళ్ళను ముత్యాలతో పోల్చారు. నవ్వులను ముత్యాల జల్లుతో పోల్చారు. ఈ అద్భుతమైన అత్యంత విలువైన ముత్యాలు నత్త గుల్లల్లోని మృదువైన టిష్యు లోపల ఉత్పత్తి అయ్యే గట్టి గింజల్లాంటివి. క్రిస్టలైన్ రూపంలో కాల్షియం కార్బోనేట్ తో రూపొందుతాయి. మిగతా జెమ్స్ కంటే ఇవి ఎందుకు విభిన్నమైనవీ అంటే వీటిని అమ్మకానికి ముందు మిగతా వాటిలాగా ఏ షాపింగ్ లు చికిత్సలూ అవసరం లేదు. సముద్రపు లోతుల్లో జీవరాసుల ద్వారా ఇవి పరిపూర్ణనత తో తయారవుతారు. మెరుపు లీనే ఈ గుండ్రని తెల్లని విలువైన స్వచ్ఛమని ముత్యాలను ధరించటం సోషల్ స్టేటస్ ఎన్నో వందల సంవత్సరాలుగా ముత్యాల అన్వేషణ సాగుతోంది. ముత్యాల ఆల్చిప్పలను టన్నుల కొద్దీ సేకరిస్తే అందులో ఏ మూడో నాలుగో ఆల్చిప్పల్లో సరైన ముత్యాలు సిద్ధంగా ఉంటాయి. అందుకే స్వచ్ఛమైన ముత్యాల ఖరీదు ఎక్కువ. కల్చర్ ముత్యాలు వచ్చేదాకా ఇదే ప్రక్రియ. సహజ పరిస్థితిలో ముత్యపు చిప్పల్లోకి ఇరిటెంట్ మార్గం చూసుకుంటే దానికి స్పందన ఆస్టర్ మృదువైన క్రిస్టలైన్ పదార్ధం నేకేడ్ ను విడుదల చేయటం ఆరంభిస్తుంది. కొద్దీ సమయంలో ఇది సరైన మెరుపు లీనే ముత్యం అవుతోంది. ఇదే విలువైన ముత్యం కల్చర్ ముత్యాల కధ ఇంకోసారి.

    మంచి ముత్యం ఇలా వస్తుంది

    సహజమైన ముత్యాల గురించి కవుల కవితలల్లారు. అందమైన యువతి పళ్ళను ముత్యాలతో పోల్చారు. నవ్వులను ముత్యాల జల్లుతో పోల్చారు. ఈ అద్భుతమైన అత్యంత విలువైన ముత్యాలు నత్త…

  • ద్రాక్ష పండ్లు రోజు తింటే వయస్సు వల్ల కలిగే లక్షణాలు దూరంగా ఉంచవచ్చునని పరిశోధనలు చెపుతున్నాయి. ద్రాక్ష లో ఐరన్, ఇతర ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తేలిక రంగులో వున్న ద్రాక్ష మాత్రమే ఐరన్ స్థాయిని పెంచుతుంది. డార్క్ గ్రేప్స్ వల్ల ఈ ప్రయోజనం దక్కదు. ఇది ఇలా ఉంచితే ద్రాక్ష లో లెక్క లేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ద్రాక్ష రక్తలో నిట్రిక్ ఆక్సాయిడ స్థాయి ని పెంచుతుంది. బ్లడ్ క్లాట్స్ అరికట్టడంలో సహకరిస్తాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్స్ నివారించ వచ్చు. యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి కనుక హానికరమైన కొలెస్ట్రాల్ ను తగ్గించ గలవు. లాక్సిటివ్ ఎక్కువగా వుండే ద్రాక్ష పండ్లు మలబద్దకాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. అజీర్ణం, ఉదరం ఇరిటేషన్ నుంచి రక్షిస్తాయి. పర్పుల్ గ్రేప్ జ్యూస్ బ్రెస్ట్ కాన్సర్ ను అరికట్టే గుణం వుందని పరిశోధనలు చెపుతున్నాయి. యాంటి ఆక్సిడెంట్లు ఫ్లేవనాయిడ్లు, ఖనిజాలు ఇంకెన్నో విటమిన్లు గల ద్రాక్ష రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయగలదు.

    ఆరోగ్య కారకం ద్రాక్ష

    ద్రాక్ష పండ్లు రోజు తింటే వయస్సు వల్ల కలిగే లక్షణాలు దూరంగా ఉంచవచ్చునని పరిశోధనలు చెపుతున్నాయి. ద్రాక్ష లో ఐరన్, ఇతర ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అయితే…

  • Donna Ferrato గృహ హింస పైన ఫోటో తీసిన మహిళా ఫోటో గ్రాఫర్ 1982 లో ఫోటో తీసింది. నాలుగు గోడలు మధ్య భర్త భార్య ఎలా వుంటారో ఎవ్వరికి తెలియదు. కానీ భర్తలు భార్యల పైన చేయిచెసుకుంటారు అన్నది జగమెరిగిన సత్యం. తన ఆధిపత్య ప్రదర్శనకు పురుషుడు స్త్రీ ని లొంగదీసు కుంటాడు. దాన్ని ఇప్పుడు గృహ హింస అంటున్నాం. ఆప్తులకు కూడా చెప్పుకోలేని గృహ హింసకు తోలి సాక్షి ఈ ఫోటో. ఆమె తనకు పరిచయం వున్న ఒక జంట ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ భర్త భార్య పైన స్నానాల గదిలో దాడి చేయడం చుసిన డోనా గబగబా హింసను క్లిక్ చేసింది. ఇదే గృహ హింస తోలి చిత్రీకరణ కానీ ఏ పత్రికల వాళ్ళు వేసుకోలేదు.1991 లో ఫోటో తీసిన 11 ఏళ్ళ తర్వాత తనే సొంతంగా తన ఫోటోలను పుస్తక రూపం లో తెచ్చింది డోనా. ఇక ఆ తర్వాత ఎన్ని వేల గృహ హింస సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయో లెక్కలు చెప్పలేము.

    గృహ హింస పై తోలి ఫోటో

    Donna Ferrato గృహ హింస పైన ఫోటో తీసిన మహిళా ఫోటో గ్రాఫర్ 1982 లో ఫోటో తీసింది. నాలుగు గోడలు మధ్య భర్త భార్య ఎలా…

  • ఏడు సూపర్ పదార్ధాలను అధ్యయన కారులు ఎంపిక చేసారు.ఈ ఏడింటినీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల గుండె పదిలంగా వుంటుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించింది. ఇవి కొలెస్ట్రాల్, రక్త పోటు, గుండె జబ్బులకు కారణం అయ్యే ఇతర సమస్యలు తగ్గిస్తాయి. వారానికి రెండు స్పూన్లు వెల్లుల్లి తింటే వీటి లో వుండే యాంటి ఆక్సిడెంట్ల వల్ల 21 శాతం రిస్క్ తగ్గుతుంది. చేపల్ని వారంలో నలుగు సార్లు అయినా తింటే వీటిలో వుండే ఒమేగా-3 ప్యాటి యాసిడ్స్, ఆర్టరీ క్లాగ్గింగ్ ప్లెక్ ఏర్పడటాన్ని నెమ్మదించేలా చేసి 14 శాతం రిస్క్ తగ్గిస్తాయి. రోజుకు కొన్ని బాదాం పప్పులు విటమిన్-ఇ లభించి, రిస్క్ 12.5 శాతం తగ్గుతుంది. రోజుకో గ్లాసు అంటే ఐదు ఓన్సుల వైన్ తాగితే యంటి ఆక్సిడెంట్స్ లభించి, ౩2 శాతం రిస్క్ తగ్గుతుంది. పెద్ద డార్క్ చాక్లెట్ కాండి బార్ రోజుకోకటి తింటే ఫాలి ఫెనాల్స్ లభించింది రిస్క్ 21 శాతం తగ్గిపోతుంది.

    ఈ ఏడింటినీ తీసుకోవడం మేలు

    ఏడు సూపర్ పదార్ధాలను అధ్యయన కారులు ఎంపిక చేసారు.ఈ ఏడింటినీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల గుండె పదిలంగా వుంటుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించింది. ఇవి…

  • గోల్డెన్ మిల్క్ తగైతే అది యాంటీ ఆక్సిడెంట్ గా బ్రహ్మాండంగా పనిచేతుందని ప్రాచీన ఆయుర్వేద విజాననఁ చెప్పిందనీ నవీన యుగం దాన్ని తుచా తప్పకుండ ఆచరిస్తా నంటోంది. మరి గోల్డెన్ మిల్క్ తయారీ ఎలాగా అంటే వేడి పాలలో అర స్పూన్ పసుపు వేయటం అది చక్కగా బంగారపు రంగు పాలయిపోతుంది. ఇప్పుడీ అలవాటు ప్రపంచవ్యాప్తంగా మారుతోంది. పాలతో పాటు అల్చిన చెక్క మిరియాలు శొంఠి వంటివి జత చేసి పంచదార లేకుండా తాగితే ఆరోగ్యం మహత్తరంగా ఉంటుందని అందరు అంగీకరిస్తున్నారు. కాఫీ టీ చాక్లేట్ వంటి పానీయాల బదులు ఈ గోల్డెన్ మిల్క్ తగైతే వాపులు తగ్గిస్తుందని కాన్సర్ రాకుండా చేస్తుందనీ చెపుతున్నారు. పాలల్లోని పసుపు మనలోని హ్యాపీనెస్ హార్మోన్ అయిన సెరటోనియన్ ఉత్తేజితం చేసి జీర్ణవ్యవస్థను బాగుచేస్తుంది. శరీరంలోని విషతుల్యాలు బయటకి పోతాయి . పసుపు మిరియాలు కలిపి ముద్దగా నూరి కొబ్బరిపాలు లేదా సొయా పాలు లేదా బాదం పాలు కలపాలి. ఒక చుక్క కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ వేయాలి. పంచదార వేయకుండా రుచికోసం తేనె దాల్చిన చెక్క చేర్చాలి. వేడివేడిగా తాగితే ఈ శీతాకాలపు దివ్యౌషధం ఇదే అవుతుంది.

    శీతా కాలపు దివ్యౌషధం

    గోల్డెన్ మిల్క్ తగైతే అది యాంటీ ఆక్సిడెంట్ గా బ్రహ్మాండంగా పనిచేతుందని ప్రాచీన ఆయుర్వేద విజాననఁ చెప్పిందనీ నవీన యుగం దాన్ని తుచా తప్పకుండ ఆచరిస్తా నంటోంది.…