• మాయిశ్చరైజర్ ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అదేంపెద్ద కష్టం కాదు ఇంట్లో ఉండే వస్తువుల తోనే చెంచా తేనె అంతే కొబ్బరి నూనె నిమ్మరసం కలిపితే అదే సహజమైన మాయిశ్చరైజర్. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదినిమిషాల [ఆటు మృదువుగా రుద్దుతూ ఉండాలి. కాస్సేపటికి కడిగేసుకోవచ్చు. రాత్రిపూట పడుకునే ముందర అప్లయ్ చేసి రాత్రంతా ఉంచుకున్నా పర్లేదు. ఆలాగే పాలు నిమ్మరసం ఆలివ్ ఆయిల్ మిశ్రమం కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. పాలల్లో వుండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఆలివ్ నూనె చర్మాన్ని మెరిపిస్తుంది . నిమ్మరసం మృతకణాలను తొలగించటం తో పాటు మొటిమలు రాకుండా కాపాడుతుంది.చర్మం మెత్తగా తాజాగా ఉంటుంది. అలాగే ఒక కప్పుడు గులాబీ రెక్కల్ని కప్పు వేడి నీళ్ళల్లో మరిగించాలి. అందులో కొంత రోజ్ వాటర్ చేర్చాలి. ఈ నీళ్లు చల్లారాక నాడులో చెంచా ఆలివ్ ఆయిల్ కలిపి ఫ్రిజ్ లో పెట్టేసుకోవచ్చు . ఈ నీటిని ముఖానికి రాస్తుంటే తేమగా కనిపిస్తుంది. ఇవన్నీ మాయిశ్చరైజర్ లాగే పనిచేస్తాయి.

    సహజమైన మాయిశ్చరైజర్ ఇదే

    మాయిశ్చరైజర్ ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అదేంపెద్ద కష్టం కాదు ఇంట్లో ఉండే వస్తువుల తోనే  చెంచా తేనె  అంతే కొబ్బరి నూనె నిమ్మరసం కలిపితే అదే…

  • హీరోయిన్స్ తెరపైన కనిపించగానే ఒక్క క్షణంలో బావున్నరానో బాలేరనో ఒక స్టేట్ మెంట్ వచ్చేస్తూ ఉంటుంది. తెర పైన అందంగా కనిపించాలంటే వాళ్లకు ఎన్నో కష్టాలుంటాయి. పాత్ర స్వభావాన్ని బట్టి కిలోల కొద్దీ బరువైన నగలు దుస్తులు ధరిస్తారు. ఈ మధ్య విడుదలకు సిద్ధమైన కాబిల్ సినిమాలు సారా జమానా అనే ఐటెం సాంగ్ కోసం ఊర్వశీ రౌతీలా అన్న హీరోయిన్ 150 కిలోల బరువున్న కాస్త్యుమ్ వేసుకుని షూటింగ్ లో డాన్స్ చేస్తూ ఆ దుస్తుల బరువుకు కిందపడిపోయిందట. ఇలాంటి అనుభవాలు ఎంతో మంది హీరోయిన్స్ కి కూడా ఉన్నాయి. దీపికా పడుకునే రామ్ లీలా లో 130 కిలోల బరువున్న గాగ్రా బాజీరావ్ మస్తానీ లో 20 కిలోల బరువున్న కాస్ట్యూమ్స్ వేసుకుంది. ఐశ్వర్య రాయ్ జోధా అక్బర్ లో 30 కిలోల దేవదాస్ లో మాధురీ దీక్షిత్ 30 కిలోలున్న దుస్తులు వేసుకుని తంటాలుపడితే అనుష్కా శర్మ శ్రీదేవి లు కూడా బరువైన నగలు దుస్తులు వేసుకుని ఆపసోపాలు పడ్డవారే.తెరపైన కేవలం అందం అభినయంతో ఆకట్టుకోవడం కాదు. ఇంతింత బరువైన దుస్తులు వేసుకోవటం ఛాలెంజ్ అంటారు వీళ్లంతా !!

    దుస్తుల బరువుతో పడిపోయింది

    హీరోయిన్స్ తెరపైన కనిపించగానే ఒక్క క్షణంలో బావున్నరానో బాలేరనో ఒక స్టేట్ మెంట్ వచ్చేస్తూ ఉంటుంది. తెర పైన అందంగా కనిపించాలంటే వాళ్లకు ఎన్నో కష్టాలుంటాయి. పాత్ర…

  • మన దేశంలో పెర్ ఫ్యూమ్ మార్కెట్ లో పది వేలకోట్ల రూపాయల పైగా ఉందని ,అర్కెట్ వర్గాల అంచనా. వచ్చిన పెర్ ఫ్యూమ్ స్ప్రే చేసుకోవటం లైఫ్ స్టయిల్ లూకా భాగంగా వుంది . దేశీ అతార్లు విదేశీ సెంట్లు కొన్ని వందల వెరైటీలున్నాయి. పూల పరిమళం వుండే దేశీ అత్తర్లు తోడు ఫ్లోరల్ గ్రీన్ అక్వాటిక్ సిట్రస్ ఫ్రూట్ పరిమళాల తో వుండే మోడ్రన్ పెర్ ఫ్యూమ్స్ కూడా బాగా అమ్మాయుడవుతున్నాయి. అగర్వుడ్ అనే బెరడు నుంచి తయారయ్యే జాద్ అత్తర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదని చెపుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో టాప్ బ్రాండ్ గా చెప్పే DKNY డొన్నా కరన్ న్యూయార్క్ విడుదల చేసిన గోల్డెన్ డెలీషియస్ ఖరీదు ఆరుకోట్ల రూపాయలు. ఈ పెర్ ఫ్యూమ్ బాటిల్ ను 183 నీలాలు 2700 వజ్రాలు బంగారంతో తయారుచేశారట. ఎప్పటిలాగే ప్రతి వస్తువు స్టార్ గ్లామర్ యాడైతే మార్కెట్ ఎక్కువగా వుంటుందనే ఆలోచనలో స్టార్స్ పేరుతో పెర్ ఫ్యూమ్స్ ని ఎప్పటినుంచో విడుదల చేస్తున్నారు. ఎప్పుడో 1990 లో జానల్ అమన్ పేరు మీద నుంచి ఇప్పుడు శిల్పా శెట్టి సిగ్నేచర్ వరకు క్రికెటర్ ధోని అమితాబ్ బచ్చన్ పేరుతొ పెర్మ్యాల్స్ మంచి మార్కెట్నే ఇచ్చాయి. సువాసనలు వెదజల్లటం ఎవరికీ ఇష్టం వుండదు.

    లైఫ్ స్టైల్ లో సెంట్ స్థానం పదిలం

    మన దేశంలో పెర్ ఫ్యూమ్ మార్కెట్ లో పది వేలకోట్ల రూపాయల పైగా ఉందని ,మార్కెట్ వర్గాల అంచనా. వచ్చిన పెర్ ఫ్యూమ్ స్ప్రే చేసుకోవటం లైఫ్…

  • విత్తు ముందా చెట్టు ముందా అనే ప్రశ్నకి తెగని సమాధానంగా ఉంటుంది. నూనె వాడకం విషయం ఎక్కువ వేస్తె సమస్య. తక్కువ వేస్తే రుచి తక్కువ. అప్పుడేంచేయాలి. అంటే ఒక సమాధానం రెండు పరికరాలొచ్చాయి. అవి fat magnet gravy seperator కూర వండేశాక దానిపై ఫ్యాట్ మ్యాగ్నెట్స్ పెట్టి బటన్ నొక్కితే కూరలో అధికంగా ఉండే నూనె తీసేస్తుంది.అంటే ఎక్కువగా వుండే నూనె బయటకి వచ్చేస్తుంది కానీ రుచిలో ఎటువంటి మార్పు ఉండదు. అధికమైన బరువుండి ఇక నూనెతో చేసిన కూరలు తినలేం అని నోరు కట్టేసుకునే వాళ్లకి ఈ ఫ్యాట్ మ్యాగ్నెట్ బాగా ఉపయోగపడుతుంది. ఇక గ్రేవీ సెపెరేటర్ అయితే గ్రేవీ లో అధికంగా ఉన్న నూనెను తేలిగ్గా వేరుచేస్తుంది. కూర గిన్నెలోంచి ఎంత బాగా వంచిన నూనె పూర్తిగా తీసివేయలేం. కానీ గ్రేవీ సెపెరేటర్ లో గ్రేవీ మొత్తం పోస్ట్ నూనె పైకి తేలుతుంది . దీంతో వుండే పైపు ద్వారా దేన్నీ తేలిగ్గా తీసేయచ్చు. మిగిలిన గ్రేవీ కూరల్లో వాడుకోవచ్చు. మాడిపోయిన పోపు దినుసులు ఫిల్టర్ చేసేలా దీనికో జాలీ కూడా వుంది. కూర రుచిగా వండుకునేందుకు కాస్త నూనె ఎక్కువ వేసి దీన్ని పూర్తిగా పిండేయచ్చు ఈ రెండు పరికరాలతో.

    కూరలో నూనె తీసేస్తుంది

    విత్తు ముందా చెట్టు ముందా అనే ప్రశ్నకి తెగని సమాధానంగా ఉంటుంది. నూనె వాడకం విషయం ఎక్కువ వేస్తె సమస్య. తక్కువ వేస్తే రుచి తక్కువ. అప్పుడేంచేయాలి.…

  • వింటర్ కేర్ ప్రాడక్ట్స్ ఎన్నో కనిపిస్తాయి మార్కెట్ లో. ఒక్కటి తెచ్చి నాలుగు రోజులు వాడి చూసుకునే సరికి చలికాలం కాస్తా వెళ్లిపోతుంటుంది. ఇక మళ్ళీ సమ్మర్ కేర్ కోసం పరుగెత్తాలి. ఇప్పడూ ఇంట్లో చేసుకున్న వస్తువులతో ఆ ప్రయత్నాలు ఏవో చేస్తే సగం సమయం కలిసొస్తుంది. ఎంత ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటున్నా చర్మం చక్కగా కనిపించటం కోసం కొంత పోషణ అవసరం. రసాయనాల కంటే సహజ మైన వస్తువులు నయం కదా. ముఖ చర్మం ఎండిపోయి పగుళ్లు వచ్చినట్లు అయితే బనానా ఫేస్ మాస్క్ ట్రై చేయచ్చు. అరటిపండు పేస్ట్ గా చేసి కొత్త వెన్న కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. వెన్న లేకపోయినా మీగడ అయినా సరే. ఇవే ముఖానికి కావలిసినంత తేమను ఇస్తాయి. అరటిపండు గుజ్జు ఆ తేమను ఇంకొంత సేపు నిలబెడుతుంది. అలాగే అరటిపండు గుజ్జుకు తేనె ఒక టీస్పూన్ రోజ్ వాటర్ జతచేసి ఆ మిశ్రమాన్ని అప్లయ్ చేసినా ఇది ఫలితం ఉంటుంది. తేనె సహజమైన మాయిశ్చరైజర్ గా రోజ్ వాటర్ టోనర్ గా పనిచేస్తాయి. చలికాలంలో చర్మకాంతి కోసం ఈ కాంబినేషన్ ట్రై చేయండి.

    ఇంట్లోనే వింటర్ కేర్ ఫేస్ మాస్క్

    వింటర్ కేర్ ప్రాడక్ట్స్ ఎన్నో కనిపిస్తాయి మార్కెట్ లో. ఒక్కటి తెచ్చి నాలుగు రోజులు వాడి చూసుకునే సరికి చలికాలం కాస్తా వెళ్లిపోతుంటుంది. ఇక మళ్ళీ సమ్మర్…

  • ఎన్నో రకాల మౌత్ ఫ్రెష్నర్స్ అందుబాటులో వున్నాయి కానీ ఇంట్లో చేసే చిన్న టిప్స్ ఎక్కువ ఉపయోగపడతాయి . అసలు బ్యాగ్ లో లవంగాలు యాలకులు వుంచుకుంటే అంత కంటే మౌత్ ఫ్రెష్నర్స్ ఏముంటాయి. అలాగే సోంపు కూడా. ఆహారం జీర్ణం అవ్వాలంటే భోజనం తర్వాత సోంపు తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. సోంపు జీర్ణ శక్తిని పెంచటమే కాదు . నోటి దుర్వాసనకు కారణం అయ్యే బ్యాక్తీరియా తో పోరాడి సమస్య ను దూరం చేస్తాయి. నోటి దుర్వాసనతో ఇబ్బందిపడేవారు సోంపు అందుబాటులో ఉంచుకుంటే చాలు. యాపిల్ లో ఎన్నో రకాల యాసిడ్స్ ఉంటాయి. బయటకు వెళ్లే ముందర ఓ యాపిల్ ముక్కలు నమిలితే చాలు. ఇందులో వుండే యాసిడ్లు యన్తీ ఆక్సిడెంట్లు హానికరమైన బాక్టీరియా ను నివారించి నోటిని తాజాగా ఉంచుతాయి. దుర్వాసన ఇందులోని పాలినాయిడ్స్ లాలాజలం లోని దుర్వాసనతో పోరాడతాయి. నోటిని తాజాగా ఉంచటం లో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే పెరుగు మంచిదే. బయటకు వెళ్లే ముందర నాలుగైదు చెంచాల పెరుగు తింటే సరి.

    సహజమైన మౌత్ ఫ్రెష్నర్స్ ఇవి

    ఎన్నో రకాల మౌత్ ఫ్రెష్నర్స్ అందుబాటులో వున్నాయి కానీ ఇంట్లో చేసే చిన్న టిప్స్ ఎక్కువ ఉపయోగపడతాయి . అసలు బ్యాగ్ లో లవంగాలు యాలకులు వుంచుకుంటే…

  • అమ్మాయిలకు కుర్తీలెప్పుడూ బావుంటాయి. చీరలు వెస్ట్రన్ టైప్ దుస్తులకంటే కుర్తీలు సౌకర్యంగా చూసేందుకు చాలా బావుంటాయి . అయితే కుర్తీలు సింథటిక్ కంటే నూలు లినెన్ తరహావి అయితే తేలికగా చెమటలు అతుక్కుపోకుండా ఉంటాయి. పొదుపుగా సన్నగా కనిపించాలనుకుంటే మోకాళ్ళు దాటినా పొడవాటి కుర్తీలు ఎంచుకోవాలి. నేలకు జారాడుతూ వుండే అనార్కలీ ఫ్యాషన్ ఇప్పటి ట్రెండ్. ఈ డ్రెస్ లో పొడుగ్గా కనిపంచాలంటే సరైన ఎతైన హీల్స్ వేసుకోవాలి . లైనింగ్ ఉన్న కుర్టీలయితే పల్చగా కనిపించకుండా లోపలి దుస్తులు పైకి తెలియకుండా ఉంటాయి. చుడీదార్ లో కుర్తీలు విషయంలో చేతుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్లీవ్ లెస్ మెగా స్లీవ్స్ నిండు చేతులు త్రీ ఫోర్త్ లు శరీర ఆకృతిని బట్టి ఎంచుకోవాలి. కొందరికి చేతులు లావుగా ఉంటే అప్పుడు స్లీవ్ లెస్ బావుండవు. పొడవాటి చేతులు ఉండాలంటే నెట్ షిఫాన్ జార్జెట్ వస్త్రశ్రేణి ఎంచుకుంటే కుర్తీలకు అందం వస్తుంది.

    పొడుగ్గా కనిపించాలంటే హీల్స్ తప్పదు

    అమ్మాయిలకు కుర్తీలెప్పుడూ బావుంటాయి. చీరలు వెస్ట్రన్ టైప్ దుస్తులకంటే కుర్తీలు సౌకర్యంగా చూసేందుకు చాలా బావుంటాయి . అయితే కుర్తీలు సింథటిక్ కంటే నూలు లినెన్ తరహావి…

  • చిన్న పిల్లల పాటల కోసం యూట్యూబ్ లో ఇన్ఫో బెల్స్ అని కొడితే చిన్న పిల్లల పాటలు 3 డి యానిమేషన్ తో కనిపిస్తాయి. మా ఇంటిలోనే ఒక పాప ఉన్నది. ఎత్తుకోకపోతే ,ఆరో కోపమొస్తుంది అన్న పాట కన్నడ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన పిల్లల పాట బేబీ సాంగ్స్ చిన్నూ తెలుగు రైమ్స్ అని కొడితే కనిపిస్తుంది. గత సంవత్సరం నుంచి ముప్పై కోట్ల మంది వీక్షకులు దీన్ని చూసారు. మనం మరచిపోయిన చిట్టి చిలకమ్మా దగ్గర నుంచి అన్ని పాటలు కనిపిస్తాయి ఈ యూట్యూబ్ ఇన్ఫో బెల్స్ లో. ఇంత కష్టపడ్డందుకు గానూ ఇన్ఫో బెల్స్ సంస్థ యూట్యూబ్ నుంచి ప్రశంసలు బంగారు పథకం వచ్చాయి. దేశవ్యాప్తంగానే కాదు 200 దేశాలకు చెందిన తెలుగు పిల్లలందరూ చూసే ఈ యూట్యూబ్ ఛానల్ ని నిర్వహించేది జయలక్ష్మి. కోయంబత్తూర్ లో పుట్టిన జయలక్ష్మి పెళ్లైయ్యాక బెంగళూరు వచ్చి ఈ ఇన్ఫో బెల్స్ ని 2 డో యానిమేషన్ తో ప్రారంభించారు. ఈ పిల్లల పాటలను చిన్నూ అనే ఐదారేళ్ళ పల్లెటూరి పాపను తోడుగా పప్పూ అనే కుక్క పిల్లనూ రూపకల్పన చేసారు. ఇంట్లో చిన్న పిల్లలుంటే ఈ ఇన్ఫో బెల్స్ ని ఓసారి చూడండి.

    పాపాయి పాటకు 30 కోట్ల వీక్షకులు

    చిన్న పిల్లల పాటల కోసం యూట్యూబ్ లో ఇన్ఫో బెల్స్ అని కొడితే చిన్న పిల్లల పాటలు 3 డి యానిమేషన్ తో కనిపిస్తాయి. మా ఇంటిలోనే…

  • స్లిమ్ గా కనిపించాలంటే బరువు తగ్గటం కోసం వర్కవుట్స్ చేస్తూవుంటే డైట్ లో కొబబ్రిని చేర్చమని చెపుతున్నాయి కొత్త అధ్యయనాలు. కొబ్బరి నీళ్లు లేత కొబ్బరి ముక్కలు కొబ్బరితో చేసిన కుకీస్ ఇలా కొబ్బరి ఉపయోగించి చేసిన ప్రతి పదార్థంలోనూ బరువు తగ్గించే గుణం ఉందన్నారు. సాధారణంగా వుండే కొవ్వులు కాకుండా మీడియం సైజు ట్రైగ్లినరైడ్ ఫ్యాట్లు ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోవడం అంటూ జరగదు. కొబ్బరిలో లభించే కొవ్వులు శక్తిని ఇస్తాయి. అంతే కాకుండా ఒంట్లో చక్కెరల స్థాయిని ఏమాత్రం పెంచవని తాజా అధ్యయనం వెల్లడైంది. ప్రతి 100 గ్రాముల కొబ్బరి లో 15 గ్రాముల కార్బోహైడ్రాట్స్ ఉంటాయి. కార్బోహైడ్రాట్స్ తక్కువగా తీసుకోవాలని భావించే వారు కొబ్బరి ఆహారంగా తీసుకోవచ్చు. వంద గ్రాముల కొబ్బరిలో 354 కీలకాల శక్తీ లభిస్తుంది. ఇది చాలా ఎక్కువ కాబట్టి తక్కువ పరిమాణంలో కొబ్బరిని తీసుకోవాలి. శరీరానికి అవసరమైన కీలకాల్లో ఏడోవంతు కొబ్బరి ద్వారా తీసుకోవచ్చని డైటీషియన్లు సూచిస్తున్నారు.. పచ్చి కొబ్బరి గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. శారీరికంగా అలసటగా వుంటే కొబ్బరి తినటం వల్ల వెంటనే శక్తి లభిస్తుంది. ధైరాయిడ్ సమస్యలు అదుపులో వుంటాయి.

    బరువు తగ్గించే కొబ్బరి

    స్లిమ్ గా కనిపించాలంటే బరువు తగ్గటం కోసం వర్కవుట్స్ చేస్తూవుంటే డైట్ లో కొబబ్రిని చేర్చమని చెపుతున్నాయి కొత్త అధ్యయనాలు. కొబ్బరి నీళ్లు లేత కొబ్బరి ముక్కలు…

  • నీహారికా , చదువుఒక్కటే చాలదు జీవితంలో గెలవాలంటే ఇంటి బాధ్యత తీసుకోవటం నేర్చుకోవాలి. అని మీ అమ్మ అంటోందనీ అన్నీ సమర్ధించగలమా అన్నావు. ఈ మాట పెప్సీకో సీఈఓ ఇంద్రా నూయీ కూడా చెప్పింది. మా అమ్మాయిలు ఎదిగిన తర్వాత నన్ను పొడుగుతున్నారు కానీ పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యత తెలుసుకోలేక మా అమ్మను పిలిపించుకొన్నాను. మా అమ్మ కూడా ఇంట్లో నువ్వు తల్లివి కోడలివి అనేది అమ్మాయిలకు అన్నీ కావాలంటే కుదరవు అని ఆమె ఒక ఇంటర్వ్యూ లో చెపితే మహిళా సంఘాలు ఆమెను తప్పు పట్టాయి. కెరీర్ త్యాగం చేసి పిల్లలను పెంచి మంచి తల్లి అనిపించుకున్నా కెరీర్ లో వచ్చిన అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చాక పైకిఎదిగినా ఎదో లోటు ఒకటి వుంటుంది గా. అందుకే నీహారికా అందుకోలేని వాటి గురించి అనవసరపు ఆలోచనలు వదిలేసి నువ్వు నీ చదువు ఉద్యోగం ఆద్వారా ఆదాయం పెళ్ళైతే కుటుంబం నిశ్చింతగా ఉండటం పిల్లలమంచి చదువులు జీవితంలో స్థిరపడటం ఇవన్నీ ఆలోచించుకో. మన ప్రాధాన్యతాక్రమాలుంటాయి. మనకు కావలిసినవన్నీ ముందున్నాయి. చదువుకుని ఉద్యోగంలోఉన్నత స్థానంలోకి వెళ్లి భర్త తో పాటు కలిసి సంపాదించి ఇల్లు దిద్దుకో. భవిష్యత్తులో ఎక్కే మెట్లే నీ గమ్యం అనుకో . అనవసరపు అపరాధ భవనాలు మనసులోంచి తుడిచేసి ముందుకు నడవటం నేర్చుకో

    సర్టిఫికెట్స్ కావాలా ? కెరీరా ?

    నీహారికా , చదువుఒక్కటే చాలదు జీవితంలో గెలవాలంటే ఇంటి బాధ్యత తీసుకోవటం నేర్చుకోవాలి. అని మీ అమ్మ అంటోందనీ  అన్నీ సమర్ధించగలమా అన్నావు. ఈ మాట పెప్సీకో…