• తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యాంగా ఉంటుందని వైద్యులు చెపుతూ వుంటారు. ఇది పూర్వీకుల నుంచి వింటున్నదే. తల్లి తీసుకునే ఆహారంపైనే కడుపులో బిడ్డ జీవితం పర్యంతం ఆరోగ్యాంగా వుంటాడని ఇటీవల పరిశోధన చెపుతోంది. గర్భవతి తగినంత మోతాదులో ఆహారం ద్వారా యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోకపోతే పుట్టబోయే బిడ్డకు గుండె సంబంధిత సమస్యలు బిడ్డ అకాల వృధాప్యనికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. తల్లి తీసుకునే ఆహారం ద్వారానే బిడ్డకు ఆక్సిజన్ అందుతోంది. తల్లి సరైన ఆహారాం తీసుకోకపోతే బిడ్డకు శ్వాసకోశాలు గుండె పనితీరు స్వయంగా వుండవనీ వీటిని సంబంధించిన అనారోగ్యాలు ఎదుర్కొంటారని చెపుతున్నారు. తల్లి ఆహారం పైన బిడ్డ భవిష్యత్తు ఆధార పడి వుంటుందంటున్నారు. బిడ్డ కడుపులో వుండగానే రూపం దిద్దుకునే అవయవాలు ఉంటుందని రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.

    బిడ్డ ఆరోగ్యానికి గర్భంలోనే బీజాలు

    తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యాంగా ఉంటుందని వైద్యులు చెపుతూ  వుంటారు. ఇది పూర్వీకుల నుంచి వింటున్నదే. తల్లి తీసుకునే ఆహారంపైనే కడుపులో బిడ్డ జీవితం పర్యంతం…

  • ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఏ పనైనా తేలికే. ఒక్కసారి ఎలాంటి అవసరం ఉన్నా అంతర్జాలం లోకి తొంగిచూస్తే చాలు . వెంటనే సమాధానం దొరికిపోతుంది. నెలనెలా జిమ్ కి వెళితే తీరైన శరీరం సాధించవచ్చు. నిజమే. మరి ఉన్న బడ్జెట్ లో అన్నీ సాధ్యమౌతాయా ? కష్టమే . ఇప్పుడు చాలా చౌకగా దొరికే కొన్ని వస్తువులతో వ్యాయామం జిమ్ కంటే బాగా చేయచ్చు. జంప్ రోప్. ఇది తాడాట. భుజాలు తొడలు కాలికండరాలకు సరైన వ్యాయామం అందుతుంది. అలాగే రెసిస్టెంట్ బ్యాండ్స్ కొన్ని రకాల వ్యాయామాలకు శరీరం అంత తేలికగా ఎటు పడితే వంగి సహకరించదు. అలాంటప్పుడు రెసిస్టెంట్ బ్యాండ్లు ఉపయోగపడతాయి. ఒక తాడు దాన్ని పట్టుకునే పరికరం ఉంటుంది. దీని సాయంతో కష్టమైన స్ట్రెచెస్ ని వ్యాయామాలనీ చాలా సులభంగా చేసుకోవచ్చు. అలాగే డంబెల్స్. మహిళలు ఒక్క కేజీ బరువున్న డంబెల్స్ ఎంచుకుంటే చాలాతేలికగా ఉంటుంది. వీటితో జిమ్ మాదిరి వ్యాయామం ఇంట్లోంచే చేయవచ్చు.

    వీటితో అచ్ఛం జిమ్ కి వెళ్లనట్లే

    ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఏ పనైనా తేలికే. ఒక్కసారి ఎలాంటి అవసరం ఉన్నా అంతర్జాలం లోకి తొంగిచూస్తే చాలు . వెంటనే సమాధానం దొరికిపోతుంది. నెలనెలా జిమ్…

  • జుట్టు వుంటే ఏ స్టయిల్ అయినా ఫాలో కావచ్చు. నల్లగా ఒత్తుగా ఆకర్షనీయంగా కనిపంచే కేశాలంటే ఇష్టపడనివాళ్ళు ఎవరుంటారు. కాస్త ఓపికా శ్రద్ధ వుండాలే కానీ సంప్రదాయ పద్ధతుల్లో ఇంట్లోనే కురుల అందాలకు మెరుగులు దిద్దుకోవచ్చు. ఒకవంతు నిమ్మరసం రెండు వంతుల కొబ్బరినూనె కలిపి కుదుళ్ళలో మృదువుగా మస్సాజ్ చేయాలి. ఇలా చేస్తే జుట్టు తెగిపోవటం రాలిపోవడం తగ్గిపోతాయి. మెంతులు నానబెట్టి తెల్లరాక మెత్తగా రుబ్బి ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు దురద సమస్యలు కూడా పోయి జుట్టు ఆరోగ్యాంగా ఉంటుంది. గుడ్డు తెల్ల సొనలు తగినంత పెరుగు కలిపి కుదుళ్లకు పట్టిస్తే జుట్టు ఆరోగ్యాంగా ఉంటుంది. వేపాకులు నీళ్లలో మరిగించి ఆ నీళ్లతో స్నానం చేయటం మంచిదే. వారంలో మూడు రోజులు కొబ్బరి ఆలివ్ నూనెలతో తలకు మస్సాజ్ చేసుకుని తలస్నానం చేస్తే పట్టులాంటి జుట్టు సొంతం చేసుకోవచ్చు .

    కురుల అందం కోసం

    జుట్టు వుంటే  ఏ స్టయిల్ అయినా ఫాలో కావచ్చు. నల్లగా ఒత్తుగా ఆకర్షనీయంగా కనిపంచే కేశాలంటే ఇష్టపడనివాళ్ళు ఎవరుంటారు. కాస్త ఓపికా శ్రద్ధ  వుండాలే కానీ సంప్రదాయ…

  • ఇప్పడూ ఇవి మన దేశపు పండ్లు. హైద్రాబాద్ అనాబ్ షావీలు , నూజివీడు మామిడికాయలు అంటూ మురిసిపోవటానికి ఏవీ లేదు. దేశ విదేశాల పండ్లు మ్మన పండ్ల మార్కెట్ లో ప్రత్యక్షమై అవే మన పండ్లనీ అంత రుచికరమైనవి తినకపోతే జన్మ సార్ధకంకాదనీ అనిపించేస్తూన్నాయి. ఒకప్పుడు న్యూజిలాండ్ లో మాత్రమే పండే కివి పండు ఇప్పుడు మార్కెట్ లో ఎటు చూసినా కనిపిస్తాయి. కమలాలకు రెట్టింపుగా విటమిన్ సి ఆపిల్ లో కన్నా ఐదు రెట్లు ఎక్కువ పోషకాలు దీని సొంతం పీచు పదార్ధం విటమిన్ ఇ పొటాషియం కెరోటినాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు మరెన్నో పోషకాల నిలయం ఈ కివీ పండు. కొవ్వులా సోడియం తక్కువగా ఉండటం వల్ల హృద్రోగులు మధుమేహం వ్యాధి వున్నవాళ్లు దేన్నీ హాయిగా తినవచ్చని వైద్యుల సలహా . బరువు తగ్గించుకోవాలంటే ఇది మంచి నేస్తం. దేనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల బీపీ కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. పోషకాలే కాదు నోరూరించే రుచితో కివి పండు పై చేయిగానే ఉంటుంది.

    ఇప్పుడది మన పండే

    ఇప్పడూ ఇవి మన దేశపు పండ్లు. హైద్రాబాద్ అనాబ్ షావీలు , నూజివీడు మామిడికాయలు అంటూ మురిసిపోవటానికి ఏవీ లేదు. దేశ విదేశాల పండ్లు మన పండ్ల…

  • సమంత స్టార్ హీరోయినే కాదు. అందమైన అమ్మాయి. మంచి అభిరుచులు ఆలోచనలు తెలివితేటలు పుష్కలంగా ఉన్న ఇవాల్టి అమ్మాయి. ఆమె సినిమాలేనంత పాప్యులరో ఆమె కాబోయే పెళ్లి కూడా అంత సెన్సేషన్. ఎంతో బాగా మాట్లాడుతుంది కూడా. సినిమాల్లో ఎంత సంపాదించావు ఎంత వెనకేశవు అని చాలా మంది అడుగుతారు. దానికి నేను వెలకట్టలేను. అంటోందీ అమ్మాయి. నేను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. సినిమా రంగం నాకు సుఖవంతమైన జీవితాన్ని అంతులేనంత ఆత్మ విశ్వాసాన్ని నాపిల్ నాకు నమ్మకాన్ని ఇచ్చింది. ఇలాంటి సౌకర్యవంతమైన జీవితాన్ని కనుక ఇచ్చిన ఈ సినిమాలు నేను మానేయ వచ్చు. ఈ రంగానికి దూరంగా కూడా వుండచ్చు. అప్పుడు కూడా ఇంతే ఆనందంగా ఉంటాను అది కూడా నాకు సినిమానే నేర్పించింది. నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేయటమే కాకుండా నాకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేసింది . నేను ఎన్నో నేర్చుకున్నాను. నా చేతి కందిన జీవితాన్ని ఎంజాయ్ చేయగలను అని చెప్పుకొచ్చింది ఒక ఇంటర్వ్యూ లో. నిజమే సమంత చెప్పినట్లు ఇది విలువైన జీవితం అని తెలుసుకోవటమే ఎవరికి వాళ్ళు చేయవలసిన పని.

    సినిమా నాకన్నీ ఇచ్చిందన్న సమంత

    సమంత స్టార్ హీరోయినే కాదు. అందమైన అమ్మాయి. మంచి అభిరుచులు ఆలోచనలు తెలివితేటలు  పుష్కలంగా ఉన్న ఇవాల్టి  అమ్మాయి. ఆమె సినిమాలేనంత పాప్యులరో ఆమె కాబోయే పెళ్లి…

  • పెళ్లి ఏదైనా స్పెషల్ అకేషన్ వస్తే డ్రెస్ లు డిజైన్ చేయించుకోవటం దానికి జ్యూవెలరీ ఏం బావుంటుందో చూసుకోవటం ఇవన్నీ అమ్మాయిలు ఒక్కటీ వదలరు . ప్రత్యేకంగా అన్నీ ఉండాలి. ప్రత్యేకంగా కనిపించాలి. మరిన్ని స్పెషల్ గా ఉంటె చెప్పులు మాత్రం ప్రత్యేకంగా ఉండద్దా !! అందుకే ఈ వెడ్డింగ్ షూస్ ఐడియాస్ యాప్. ఇందులో ఎన్నో చెప్పుల వరసలు డిసప్లే వుంది. కానీ ఇందులో ఓ ప్రత్యేకత వుంది. ఏ ముచ్చటైన డిజైన్లతో రౌండ్ టో వెడ్డింగ్ ఫ్లిప్ ఫ్లాప్స్ బాలే పంప్స్ ఇలా బోలెడన్ని రకాలున్నాయి కదా. అయితే వీటిలో ఎదో ఒకటి ఎంచుకునే పనిలేదు. అందమైన రంగుల్లో అందుమీద మెరిసే రాళ్లు జర్దోసీలు లేస్ లు ఇవన్నింటిలో డిజైన్ చేసిన చెప్పుల్ని హీల్ ఇంకాస్త పెద్దదిగా ఉండాలంటే ఫలానా డిజైనర్ చెప్పులు ఫ్లాట్ గా వుండాలనో లేదా ఫలానా రకం రాళ్ళుఉంటే చీరకు మ్యాచవుతుందనో మన ఇష్టాలు చెపితే అలా తయారై వస్తాయి. వున్నవాటి గురించిన సమాచారం ఇచ్చారు.ఏవీ నచ్చకపోతే మన సొంత డిజైన్ చెప్పేస్తే సరి!!

    వాళ్ళ ఫ్యాషన్ కు అణా ఐడియా జోడిస్తారు

    పెళ్లి ఏదైనా స్పెషల్ అకేషన్ వస్తే డ్రెస్ లు డిజైన్ చేయించుకోవటం దానికి జ్యూవెలరీ ఏం బావుంటుందో చూసుకోవటం ఇవన్నీ  అమ్మాయిలు ఒక్కటీ వదలరు . ప్రత్యేకంగా…

  • గుడి కట్టి పూజించేంతమంది అభిమానులను దక్కించుకోవటం కొంత మంది హీరోయిన్లకే దక్కింది. ఆ కొద్దీ మందిలో హన్సిక పేరు కూడా ఉంటుంది. ఒకప్పుడు కోలీవుడ్ లోఒకేసారి ఐదారు సినిమాలు చేసిన హన్సిక ఇప్పడూ ఒకే ఒక్క సినిమా చేస్తోంది. ఈ విషయం అడిగితే హన్సిక ఈ హవాలు జోరు అన్న పదాలు నేను నమ్మను. ఐదారు స్క్రిప్టులు చేస్తూ బిజీ గా ఉన్నా ఇప్పుడు ఒక్క సినిమా చేస్తున్నా అవన్నీ అప్పటికప్పుడు ఒప్పుకున్నవేవీ కాదు. ఎప్పుడో ఒప్పుకుని ఎప్పుడో చేసేవి. అంతే తప్ప ఏ హీరోయినూ ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయరు. కొంత కాలం క్రితం ఒప్పుకున్న తెలుగు సినిమాలు ఇప్పుడు మొదలయ్యాయి. పైగా స్టార్ హీరోలు చిన్న హీరోలు యువ కధానాయకులా అని నేనెప్పుడూ ఆలోచించలేదు. కధ నచ్చితేనే సినిమా. నా అభిమానులు నొచ్చుకోకుండా ఉండేటట్లు కథలుంటే బావుండనుకుంటా. ఇప్పుడు నాకు ఫేస్ బుక్ అభిమానులే 60 లక్షల మంది ఉన్నారు. ఇంతమంది మనసులో నాకు స్థానం ఉండటం కంటే ఇంతకంటే కోరుకునేది ఏముంటుంది? నేనెప్పుడూ సక్సెసే అనుకుంటానంటోంది హన్సిక. చిన్న వారులో సినిమాలోకొచ్చాను. ఇది పూర్తిగా నా లైఫ్ అనిపిస్తూ ఉంటుంది. సినిమాలేని రోజుని నేనెప్పటికీ ఊహించలేనంటోంది హన్సిక.

    ఎప్పుడో ఒప్పుకున్న సినిమాలిప్పుడు మొదలయ్యాయి

    గుడి కట్టి పూజించేంతమంది అభిమానులను దక్కించుకోవటం కొంత మంది హీరోయిన్లకే దక్కింది. ఆ కొద్దీ మందిలో హన్సిక పేరు కూడా ఉంటుంది. ఒకప్పుడు కోలీవుడ్ లోఒకేసారి ఐదారు…

  • నాలుగు రోజులు ఖాళీ దొరికితే తోచదంటారు. వయసు పెరిగితే డిప్రెషన్ అంటారు. ఇంకా జీవితం చుట్టూ ఎన్నో కంప్లైంట్స్. కానీ మంచి హాబీ డెవెలప్ చేసుకుంటే జీవితానికో ధ్యేయం ఉంచుకుంటే కాదు ఎదో ఒకటి మన మనసు సంతోషపడే కార్యక్రమం ఎంచుకోవాలి. జర్మన్ మహిళ పెట్రా ఏంజిల్స్ చిన్నప్పటి నుంచి ఎరేజర్స్ కలక్షన్ మొదలుపెట్టింది. పెన్సిల్ తో పిల్లలు రాసే అక్షరాలు చెరిపేసి ఎరేజర్. ఎన్నో రకాల్లో రంగుల్లో ఆకారాల్లో వస్తున్న ఎరేజర్స్ ని 112 దేశాలకు సంబంధించి 19571 కలెక్ట్ చేసింది. ఒక్కరోజులో ఇది సాధ్యమా ? ఒక సరదా . అలా సంపాదించినందుకు ఆమెకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు నమోదైంది. ఆలోచించండి. అన్ని ఎరేజర్స్ సంపాదించటం అంత తేలికా.. ఆ గౌరవం దక్కటమూ అంత తేలిక కాదు. ఇంకో ఆమె జర్మనీకి చెందినదే. పేరు మార్చినా షెల్లేన్ బెర్గ్. నాప్కిన్స్ కలెక్ట్ చేసింది. రకరకాల చేతులు తుడుచుకునే నాప్ కీన్స్ లక్షా ఇరవై ఐదు వేలకు పైగా సేకరించి గిన్నీస్ లోచోటు సంపాదించింది. జీవితం నిండుగా ఉండాలంటే మనం ఇతరులకి భారమై బోర్ కొట్టకుండా ఉండాలంటే ఎదో ఒక హాబీ అలవర్చుకోవాలి.

    ఎరేజర్స్ నాప్కిన్స్ తో గిన్నీస్ లో చోటు

    నాలుగు రోజులు ఖాళీ దొరికితే తోచదంటారు.  వయసు  పెరిగితే డిప్రెషన్ అంటారు.  ఇంకా జీవితం  చుట్టూ ఎన్నో  కంప్లైంట్స్. కానీ మంచి హాబీ డెవెలప్ చేసుకుంటే జీవితానికో…

  • రిలాక్సింగ్ టెక్నీక్స్ చాలా బావుంటాయి. కానీ అన్నింటి లోనూ హాయి నిచ్చేది స్నానం. అలసట తగ్గి కంటినిండా నిద్ర పట్టే స్నానాలు చాలా ఉన్నాయి. లావెండర్ నూనె వాసన చాలా బావుంటాయి. శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది. నీళ్లలో కొన్నిచుక్కల లావెండర్ నూనె అరకప్పు ఎప్పంసాల్ట్ . కప్పు వంట సోడా కలిపి స్నానం చేయాలి. ఒక వేళ టబ్ లో స్నానం చేస్తే ఇవన్నీ కలిపి టబ్ లో పోసి ఆ నీళ్లలో సేద తీరితే ఇంకా మంచిది. ఒత్తిడీ అలసటా తగ్గిపోతుంది. ఇలాంటి స్నానాన్ని వారానికి రెండు సార్లు చేసినా చాలు. చర్మం ఆరోగ్యాంగా అయిపోతుంది. చెంచా దాల్చిన చెక్క పొడి చెంచా పసుపు కలిపిన నీళల్లో స్నానం చేసినా అలసట దూరం అవుతుంది. చర్మం తాజాగా మెరుస్తుంది. పసుపు లోని యాంటీ సెప్టిక్ గుణాలు చర్మ సమస్యల్ని తగ్గిస్తాయి. స్నానం చేసే నీళ్లలో మూడు చెంచాల ఆలివ్ నూనె చెంచా ఎప్పమ్ సాల్ట్ కలపాలి. ఈ నూనె లో ఏ , డి , కె విటమిన్లు యాంటీ ఏజింగ్ కారకాలు చర్మాన్ని ఆరోగ్యాంగా ఉంచుతాయి. అలాగే ఆలివ్ నూనె ఎప్పమ్ సాల్ట్ లో కొద్దిగా చక్కెర కలిపి ముఖానికి చేతులకు మర్దన చేసుకున్నా మంచి ఫలితం వుంటుంది. గ్రీన్ టీ కూడా చర్మ ఆరోగ్యానికి మేలు. వేడి నీళ్లల్లో గ్రీన్ టీ బాగ్స్ వుంచి ఆ నీళ్లలో స్నానం చేస్తే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి అంది ఒత్తిడి అలసట మాయం చేస్తాయి.

    అలసట పోగొట్టే స్నానం

    రిలాక్సింగ్ టెక్నీక్స్  చాలా బావుంటాయి. కానీ అన్నింటి లోనూ హాయి నిచ్చేది స్నానం. అలసట తగ్గి కంటినిండా నిద్ర పట్టే  స్నానాలు చాలా ఉన్నాయి. లావెండర్ నూనె…

  • నిహారికా , భవిష్యత్తులో నేనేం అవ్వాలో నాకేది మంచి ఫ్యూచరో ఎప్పుడూ కన్ఫ్యూజన్ అంటున్నావు, ఇందుకు నువ్వు నిన్ను బేరీజు వేసుకుంటేనే మంచి సమాధానం దొరుకుతుంది. నీ స్వభావం నీ ప్రత్యేకతలు నీ నైపుణ్యాలు అన్ని కోణాలను నిస్పక్షపాతంగా జడ్జ్ చేసుకుంటే నీకేం కావాలో తేలుతుంది. సినిమాలు రాజకీయాలు క్రీడలు టెక్నాలజీ ఏ రంగం విజేతల జీవితాలని పరిశీలించినా ఓ విషయం అర్ధం అవుతుంది. వీళ్లంతా తమకు ఆసక్తి వున్న రంగాన్ని ఎంచుకున్నారు. సత్య నాదెళ్ల అయినా ఏ ఆర్ రెహమాన్ అయినా వాళ్లకిష్టమైన రంగం లోనే ముందుకు వెళ్లి టార్గెట్ రీచ్ అయ్యారు. చాలా మందికి వాళ్ళ ఆసక్తి గురించి వాళ్ళకే స్పష్టమైన అభిప్రాయం లేదు. అసలు మన దేశంలో నిరుద్యోగానికి ఇది ప్రధాన కారణం తెలుసా.. చదువుకీ ఆసక్తికీ వృత్తికీ బలమైన సంభంధం ఉంది. ఈ మూడు ఒక్కటే కావాలి. నీలాంటి టీనేజర్ ఈ నిముషంలో తీసుకునే నిర్ణయం కాదు. నువ్వు నిన్ను శోధించుకుంటూ అసలు నీ ఇష్టం ఎటువైపుని వుందో తేల్చుకో. ఆ చదువు ద్వారా వచ్చే ఉద్యోగం నీ అభిరుచికి సరిపోతుందా ఆ కెహెచ్డీవువులో ఆ ఉద్యోగం తో చేసే పని నీకు సంతృప్తి ఇస్తుందా లేదా తేల్చుకుంటే ముందుగా నువ్వేం చదువుకోవాలో తెలుస్తుంది. ఇలాగే జీవితం కూడా. ఏమంటావు. ఇలా తేల్చుకోలేనని తేల్చేసుకుంటే అప్పుడిక సైకోమెట్రిక్ పరీక్షకు పోదాం !!

    చదువుకీ ఆసక్తికీ వృత్తికీ లింకుంది

    నిహారికా , భవిష్యత్తులో నేనేం అవ్వాలో నాకేది మంచి ఫ్యూచరో ఎప్పుడూ కన్ఫ్యూజన్ అంటున్నావు, ఇందుకు నువ్వు నిన్ను బేరీజు వేసుకుంటేనే మంచి సమాధానం దొరుకుతుంది. నీ…