• న నాకోసం కొత్త పాత్ర సృష్టించండి అనే సాహసం చేయను . ఎందుకంటే ప్రయోగాలు ప్రతిసారీ సక్సెస్ కాకపోవచ్చు. నాలో వీటిని సంతృప్తి పరిచేందుకు సినిమాలతో ప్రయోగాలు చేయను అంటోంది రకుల్ వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ నుంచి ఆమె కెరీర్ ఎక్స్ ప్రెస్ లాగే దూసుకుపోతోంది. ధ్రువ దాకా అన్నీ సక్సెస్ లే. మహేష్ బాబు రామ్ చరణ్ వంటి స్టార్స్ తో నటిస్తోంది. ఇటు యువతరం కధా నాయకుల లోనూ సినిమాలు చేస్తోంది. కెరీర్ కొత్తల్లో నాకు వచ్చిన పాత్రలు చేసేదాన్ని . అప్పుడు ఎంపిక అన్న క్వశ్చన్ లేదు. ఇప్పుడు రొటీన్ పాత్రలు వస్తున్నాయి. ఇప్పుడు నా ఆప్షన్ ఏవీ లేదు. ఉన్నంతలో ఎదో ఒక కొత్త దానం చూపించేలా ఆలోచిస్తానంటే అంటోంది. రకుల్. సినిమాల్లో సాహసాల మాటెలావున్నా వ్యాపారంలో మాత్రం ఏ మాత్రం వెనకడుగు వేయలేదు రకుల్. జిమ్ బిజినెస్ బ్రహ్మాండంగా సాగుతూ ఇంకో రెండు మూడు సెంటర్ లు పెట్టేవరకు విస్తరిస్తోంది.

    ప్రయోగాలు చేయటం ఇష్టం లేదు

    నాకోసం కొత్త పాత్ర సృష్టించండి అనే సాహసం చేయను . ఎందుకంటే ప్రయోగాలు ప్రతిసారీ సక్సెస్ కాకపోవచ్చు. నాలో వీటిని సంతృప్తి పరిచేందుకు సినిమాలతో ప్రయోగాలు చేయను…

  • పెళ్లి జీవితంలో ఒకే ఒకసారి వచ్చే ప్రత్యేకమైన పండగ లాంటిది. ఆ రోజు ఎలా ఉండాలో ఇన్విటేషన్ ప్రింటింగ్ నుంచి పెళ్లి కాన్సెప్ట్ ఎవ్వరికీ లేనంత గొప్పగా ఉండాలనుకుంటున్నారు ఆలా అవకాశం సముద్ర గర్భంలో ఏకంగా గాలిలో ఎగిరే బెలూన్ లో కూడా పెళ్లిలవుతున్నాయి . ఇక పెళ్లికూతురు ఎలా ఉండాలి. ప్రధానం రోజు మెహేందీ పండగ రోజు ఏకంగా పెళ్లి రోజు ఆమె అలంకరణ ఆహార్యం ఎంత గొప్పగా ప్రత్యేకంగా ఉండాలి. సంప్రదాయం ఆధునికత కలిసిన డిజైనర్ లుక్ తో అమ్మాయి మెరిసిపోవాలి. ఒక సోయగాల చీర అయి ఉండచ్చు. చీరని అనార్కలీ ఫ్యాషన్ నేలను జారాడే లెహెంగా మోడల్ లో కావచ్చు. లంగా వోణీ కలిపి కొట్టేసి మొత్తంగా బంగారు జరి పనితనం ఉట్టిపడేలా ఎంబ్రాయిడరీ చేసి పెళ్లి దుస్తుల్ని కూడా ఫ్యాషన్ డిజైనర్స్ చేతిలో మంత్రదండం అనే క్రియేటివిటీ తో అద్భుతాల సృష్టిస్తున్నారు. అలాంటి లేత రంగుల ఉషోదయాలు చీకటి వెలుగులు మెరుపులు పట్టు చీరలపై పూర్తీ ఖరీదైన ముత్యాలు రాళ్ల ఎంబ్రాయిడరీ లు ఆన్ లైన్ లో సందడి చేస్తున్నాయి. పెళ్లి స్పెషల్ చీరల పై వీలుంటే ఓ లుక్ వేయండి.

    స్పెషల్లీ డిజైన్డ్

    పెళ్లి జీవితంలో ఒకే ఒకసారి వచ్చే ప్రత్యేకమైన పండగ లాంటిది. ఆ రోజు ఎలా ఉండాలో ఇన్విటేషన్ ప్రింటింగ్ నుంచి పెళ్లి కాన్సెప్ట్ ఎవ్వరికీ  లేనంత గొప్పగా…

  • ఇప్పుడు నారింజ పండ్లు బాగా దొరికే రోజులు. ఏ కాలానికి వచ్చే పండ్లు ఆ కాలంలో తప్పనిసరిగా తినాలి. సీజనల్ ఫ్రూట్స్ వదులుకుంటే ఇంకోసారి వెంటనే దొరకవు కదా . అలాగే చాలా త్వరలో మామిడిపండ్లు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ తియ్యని నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఐరన్ మేగ్నేషియం సోడియం తో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. ఈ పండ్ల లో నీటి శాతం ఎక్కువ. నోటి దుర్వాసన పోగొట్టే గుణం ఈ పండ్లకి వుంది. ఆకలి తక్కువగా ఉంటే ఆరెంజ్ తింటే ఆకలి బాగా పుడుతుంది. అధికంగా వుండే బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. గుండె వ్యాధులు వచ్చే అవకాశం సమస్యలు పోతాయి. కీళ్ల నొప్పులు తగ్గే అవకాశం వుంది. ప్రతి రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగితే కిడ్నీ లో వుండే స్టోన్స్ కరిగిపోయే అవకాశాలున్నాయి. కొవ్వును తగ్గించటం తో పాటు వ్యాధి నిరోధిక శక్తిని పెంచుతాయి నారింజలు

    తియ్యని నారింజ లో ఉపయోగాలనేకం

    ఇప్పుడు నారింజ పండ్లు బాగా దొరికే రోజులు. ఏ కాలానికి వచ్చే పండ్లు ఆ కాలంలో తప్పనిసరిగా తినాలి. సీజనల్ ఫ్రూట్స్ వదులుకుంటే ఇంకోసారి వెంటనే దొరకవు…

  • టెక్సాస్ లోని ఓ డే కేర్ సెంటర్ దగ్గర గెట్ ఆఫ్ యువర్ ఫోన్ అని ఒక నోట్ అంటించారట. ఆడే కేర్ సెంటర్ నుంచి పిల్లలను తీసుకుపోవడానికి వచ్చే పేరెంట్స్ అందరిచేతుల్లో ఫోన్లే . ఆ బిజీ గా మాట్లాడటం పిల్లలను మెకానికల్ గా ఎదో వస్తువుల్ని కలెక్ట్ చేసుకున్నట్లు తీసుకుపోవటం చూసి వళ్ళు మండి వర్కింగ్ పేరెంట్లు స్మార్ట్ గా వుండే అమ్మానాన్నలు మీ పిల్లల కోసం ఆ ఫోన్ లు కాసేపు అవతల పారేసి నవ్వు మొహాలేసుకుని పిల్లల కోసం రండి. పిల్లాడ్ని ఎత్తుకుని వాడి మొహం వాడి ఆటపాటలు కాస్సేపైనా చూడండి. అవి నోట్ అర్ధం వచ్చేదెలా వుంది. ఆ నోట్ ను చూసి ముచ్చట పడి టెక్సాస్ కు చెందిన మజూత్ క్వీజ్ అన్నావిడ ఆ నోట్ ఫోటో తీసి పేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తే ఆ పోస్ట్ ని లక్షల మంది చూసి తమ స్పందన తెలియజేసారు. బోలెడు మంది పేరెంట్స్ ఆ నోట్ చూసి నాలుక కొరుక్కున్నారట . కరెక్ట్ కదా !!

    ఫోన్ కాస్సేపు ఆపండి బాబూ

    టెక్సాస్ లోని ఓ డే కేర్ సెంటర్ దగ్గర గెట్ ఆఫ్ యువర్ ఫోన్ అని ఒక నోట్ అంటించారట. ఆడే కేర్ సెంటర్ నుంచి పిల్లలను…

  • ప్రెగ్నెన్సీ సమయంలో కాబోయే తల్లి తీసుకునే ఆహారం బిడ్డ ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుందని డాక్టర్లు చెపుతున్నారు. ఆ సమయంలో విటమిన్ల తో కూడిన ఆహారం చాలా అవసరం పుట్టబోయే బిడ్డకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఆహారంలో ఉండే ఐరన్ గర్భశక్తి శిశువు ఆరోగ్య వృద్ధికి రోగ నిరోధిక శక్తి పెంచేందుకు సాయపడుతుంది. అలాగే నిద్ద రక్త కణాల వృద్ధికి ఫోలిక్ యాసిడ్ దోహదం చేస్తుంది. విటమిన్ బి - 12 తో శిశువు శరీరంలో కొత్త కణాలు ఏర్పడతాయి. ఎముకల పటుత్వానికి విటమిన్ డి ఎంతో యూఏపీయోగం. ప్రెగ్నెన్సీ తొలినాళ్లలో ఈ డి విటమిన్ ఉపయోగం ఎంతగానో ఉంటుంది. ఐరన్ రక్తకణాల లోపాల్ని తగ్గిస్తుంది అనీమియా ను నిరోధిస్తుంది. ఎముకల నిర్మాణం లోనే కాదు శరీరంలోని ఇతర అవయవాల పని తీరుకు కూడా కాల్షియం ఆవశ్యకత వుంది. గర్భవతి గా ఉన్నప్పుడు అన్ని రకాల విటమిన్ల తో కూడిన ఆహారం ఎలా తీసుకోవాలో న్యూట్రషియన్ల సలహా తీసుకోవాలి .

    పుట్టబోయే శిశువు ఆరోగ్యం వీటితోనే

    ప్రెగ్నెన్సీ సమయంలో కాబోయే తల్లి తీసుకునే ఆహారం  బిడ్డ ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుందని డాక్టర్లు చెపుతున్నారు. ఆ సమయంలో విటమిన్ల తో కూడిన ఆహారం  చాలా…

  • మందార పూలు ఎంతందంగా వుంటాయో అవి జుట్టుజు అంత మేలు చేస్తాయి. మందార పూలు ఎండబెట్టి దానిని మెంతిపిండి కలిపి కొబ్బరి ఆలివ్ నూనెల్ని సమపాళ్లలో తీసుకుని అందులో కలిపేసి మరగనిచ్చి సీసాలో భద్రపరుచుకుని ప్రతిరోజు తలకి రాసుకుని తలస్నానం చేయచ్చు . కుదుళ్ళు ఆరోగ్యాంగా జుట్టు ఒత్తుగా మారుతుంది. అలాగే పొడిబారిన నిర్జీవమైన జుట్టుకు పచ్చి మందార పూలను మెత్తగా పేస్ట్ గా చేసి ప్యాక్ వేసుకుని అరగంట పోయాక స్నానం చేయచ్చు. మందార పూవుల్లోనే కాదు ఆకుల్లోను సౌందర్య కరమైన ఔషధ గుణాలున్నాయి. శాకాయ కుంకుడు కాయ వంటి వాటిలో స్నానం చేస్తుంటే జుట్టు డ్రై గా ఆయిపోకుండా అందులో మందారాకులు కలిపి స్నానం చేయచ్చు. నేరుగా గోరింటాకు పొడిని పట్టించటం వల్ల జుట్టు పొడిగా అయిపోతుంది. ఈ సమస్య పోవాలంటే దానికి రెండు చెంచాల మందారాకు పొడి కలుపుకుని నాననిచ్చి తలకు పెట్టకుంటే జుట్టు మృదువుగా ఉంటోంది.

    మేలు చేసే మందార పూలు

    మందార పూలు ఎంతందంగా  వుంటాయో అవి జుట్టుజు అంత మేలు చేస్తాయి. మందార పూలు ఎండబెట్టి  దానిని మెంతిపిండి కలిపి కొబ్బరి ఆలివ్ నూనెల్ని సమపాళ్లలో తీసుకుని…

  • రుజుత్ దివేకర్ కు రుణపడి ఉండచ్చు అందరు. ఆవిడ ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించి పూజించినా పర్లేదు. అలాంటి బంపర్ ఆఫర్ ఇచ్చిందీ డైటీషియన్ . కరీనా కపూర్ ఆలియా భట్ వరుణ్ ధావన్ ఇలా ఎందరో సెలబ్రెటీల ఫెవరెట్ డైటీషియన్ రుజుత్. డైటీషియన్లు ఏవీ తినద్దు మొర్రో అని మొత్తుకుంటారు కదా. ఈవిడైతే అన్నం నెయ్యి చక్కెర జీడిపప్పు ఇలా బలాన్నిచ్చే ఏ ఆహారమూ వదులుకోవద్దు. సంప్రదాయ భారతీయ ఆహారం శుభ్రంగా తినండి. అంటే తృప్తిగా వ్యాయామం చేయండి. హాయిగా నిద్రపోండి అంటుందామె . స్థానికంగా వుండే పండ్లు సీడ్ ఆయిల్ కొబ్బరి పోహా ఉప్మా తెల్లన్నం ప్రతిరోజు నెయ్యి పళ్లతో చక్కగా నమిలి తినగలిగే పండ్లు కూరగాయల చేరుకులు ఇలా అన్నీ ఆకలేసినంత తినండి ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ఈవిడ శిష్యరికం చేసి 18 నెలల్లో 180 కిలోల బరువు తగ్గాడు. బహుశా ఈవిడ ట్రీట్మెంట్ విధానాలు మన దగ్గరకువచ్చే ఉంటాయి. వేతకండి ఆమె వెబ్సైట్ ని.

    బాగా తిని తగ్గదంటున్న రుజుత్

    రుజుత్  దివేకర్ కు  రుణపడి ఉండచ్చు  అందరు. ఆవిడ ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించి పూజించినా పర్లేదు. అలాంటి  బంపర్ ఆఫర్ ఇచ్చిందీ  డైటీషియన్ . కరీనా…

  • బాంద్రా లో రెండు కోట్ల విలువ చేసే ఫ్లాట్ ని గురువు గారు సూర్య నారాయణ సింగ్ కు కానుక గా ఇచ్చేసిందిట. కంగనా రనౌత్. ఈ బాలీవుడ్ క్వీన్ కు ఎంతో అందమైంది అని రుజువైంది. బాలీవుడ్ లో అడుగుపెట్టక ముందే కంగనా కు ముంబై లో పరిచయం అయినా జిమ్నాస్టిక్స్ యోగా శిక్షకుడు సూర్య నారాయణ సింగ్ దగ్గరే యోగా నేర్చుకోవటం మొదలు పెట్టిందిట. కంగనా . కెరీర్ కు సంబంధించి కూడా ఆయన సలహాలే నమ్ముతుందిట. ఆయనకు ఏదైనా మేలు చేయాలనే ఉద్దేశ్యంతో బాంద్రా ఫ్లాట్ ఆయన నచ్చేసింది కంగనా. ఆ ఫ్లాట్ చాలా విశాలంగా వుండి యోగా తరగతులకు అనుకూలంగా వుందిట. యోగా శిక్షణ కోసం అనుకూలంగా ఉండేలా అన్ని వసతులు కల్పించే పనిలో ఉందిట . ఈమె ఇంతకుముందు తన సోదరికి కూడా రెండు పడకల గదిని కానుకగా ఇచ్చిందిట. కంగనా. మానవ సంబంధాలు పదిలంగా వుండాలనుకునేవాళ్ళు కంగనా ముందుంటుందని అందరు ఏకగ్రీవంగా ఆమోదించారట. దటీజ్ కంగనా రనౌత్.

    గురువుకి రెండు కోట్ల కానుక

    బాంద్రా లో రెండు కోట్ల విలువ చేసే ఫ్లాట్ ని గురువు గారు సూర్య నారాయణ సింగ్ కు కానుక గా ఇచ్చేసిందిట. కంగనా రనౌత్. ఈ…

  • హసీనా పేరుతో టైటిల్ పాత్రలో శ్రద్ధ కపూర్ నటిస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. నిప్పులు చెరిగే కళ్ళు. కనుసైగ తో శాసించే దర్పం ఉట్టిపడే కళ తో శ్రద్దా కపూర్ పోస్టర్ అచ్చమైన లేడీ డాన్ లాగే వుందని మంచి ప్రశంసలు దక్కుతాయి . అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్. దావూద్ లాగే ముంబై లో తిరుగులేని ఆధిపత్యం చలాయించింది హసీనా పార్కర్. ఇప్పుడామె జీవితం హసీనా పేరుతో వెండి తెరకు ఎక్కుతుంది. హసీనా కు 17 సంవత్సరాల వయసు నుంచి 43 ఏళ్ల వయసు వరకు క్వీన్ ఆఫ్ ముంబాయి గా ఎదిగిన క్రమం ఈ చిత్రంలో చూపెడుతున్నారు. ఇందులో దావుద్ పాత్రలో శ్రద్ధ కపూర్ సోదరుడు సిద్దార్ధ కపూర్ నటిస్తున్నాడు. ఈ చిత్రం జులై 14 న విడుదలవుతోంది . ఇంతవరకు ఎన్నో చిత్రాల్లో గ్లామర్ పాత్రల్లో నటించిన శ్రద్దా ఈ చిత్రంలో డీ గ్లామర్ గా కనిపిస్తోంది.

    ఈమె క్వీన్ ఆఫ్ ముంబాయి

    హసీనా పేరుతో టైటిల్ పాత్రలో శ్రద్ధ  కపూర్ నటిస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. నిప్పులు చెరిగే కళ్ళు. కనుసైగ తో శాసించే దర్పం ఉట్టిపడే కళ…

  • నీహారికా , ఈ మధ్య కాలంలో ప్రపంచం చాలా మారిందంటావు. ఎలా మారిందో ఒక్క ఉదాహరణ చెప్పు అన్నావు . సరే విను. ఫ్యాషన్ రంగం. వంటల రంగం ప్రముఖంగా వినిపంచేవి మగవాళ్ల పేర్లే. అద్భుతమైన జ్యూవెలరీ తయారీ మగవాళ్లదే. ఆడవారికి అవసరమైన వన్నీ సృష్టించేది మగవాళ్లే. అలాగే వాళ్ళ ఇష్టాయిష్టాలన్నీ బాగానే పసిగడుతున్నారా ? లేదా ? వంటలతో బెస్ట్ చెఫ్స్ గా మగవారే కదా. డాన్సింగ్ స్కూల్స్ మగవాళ్లవేనా ? ఫ్యాషన్ రంగాన్నీ వాళ్లే. షాపింగ్ ఎంత కంఫర్టబుల్ గా చెయ్యాలో ఎలా ఉంటే ఆడవాళ్లు షాపులకు పరుగెత్తుకొస్తారో డిజైన్ చేసేది ఎవరు ? ఆడవాళ్ళ సంపాదన ఎక్కువైతే ఇంటి పట్టున ఉంది హౌస్ హస్బెండ్స్ గా బాధ్యత తీసుకునేవాళ్ళు ఎక్కువవడం లేదా ? భార్య భర్తలకు సమాజం నిర్దేశించిన బాధ్యతలకు దాటి ముందుకెళుతున్నారా ? లేదా ? నా సంపాదన మీద పెత్తనం నాదేనన్న భావన పోతుంది . ఇద్దరు రాబడి తో బడ్జెట్ వేసుకుని ఇల్లు నిజమైన పొదరిల్లు గా మారిపోవటం లేదా ? కెరీర్ లో దూసుకుపోతున్న ఆడవాళ్ళ వెనక భర్తల సాయం ఉంటోంది. ఈ సామజిక సంసారిక సంస్కరణలు వచ్చాయి. జీవితం అనే దీపాన్ని భార్య భర్తా చెరో రెండు చేతులు అడ్డం పెట్టి కాపాడుకోవాలని చాలా మందికి అర్ధం అయ్యింది . చూద్దాం ఇంకా సమాజం మారిపోవచ్చు.

    ఎవరన్నారు మారలేదని

    నీహారికా , ఈ మధ్య కాలంలో ప్రపంచం చాలా మారిందంటావు. ఎలా మారిందో ఒక్క ఉదాహరణ చెప్పు అన్నావు . సరే విను. ఫ్యాషన్ రంగం. వంటల…