• చాలా మందికి చిన్న వయసులోనే పెదవుల చుట్టూ ముక్కు దగ్గర చెంపల పై సాగినట్లు పెద్దవాళ్లుగా కనిపిస్తాయి. ఇంట్లోనే ఈ సమస్య కో కొన్ని మంచి చికిత్సలున్నాయి. అనాస పండు యాంటీ ఏజింగ్ ఏజెంట్ రెండు ముక్కలు అనాస పండు మెత్తగా చేసి ఆ రసం ముఖానికి రాస్కుంటే ఫలితం ఉంటుంది. ఆముదంలో ప్లాటీ ఆమ్లాలుంటాయి. ఇవి సాగిన చర్మాన్ని బిగుతుగా చేస్తాయి. ఏదైనా నూనెలో ఆముదం కలిపి మర్దనా చేస్తే ఫలితం ఉంటుంది. బాదం నూనె తోకూడా ఇదే ఫలితం. రెండు పూటలా బాదం నూనె తో మర్దనా చేయాలి. చక్కెర మెత్తగా పొడిగా చేసి అందులో తేనె కలిపి పూతలా వేసుకుంటే చర్మానికి తేమ అంది సాగిపోకుండా ఉంటుంది. గుడ్డులోని తెల్లసొన తో పూతలాగా వేసినా మంచిదే. కలబంద గుజ్జయితే ప్రతిరోజు వాడవచ్చు. ఫ్రెష్ గా ఉన్న కలబంద నుంచి గుజ్జు తీసి పూతలా వేసి మర్దనా చేస్తే మంచి ఫలితాలుంటాయి.

    కలబంద తో చర్మం బిగుతవుతుంది

    చాలా మందికి చిన్న వయసులోనే పెదవుల చుట్టూ ముక్కు దగ్గర చెంపల పై సాగినట్లు పెద్దవాళ్లుగా కనిపిస్తాయి. ఇంట్లోనే ఈ సమస్య కో కొన్ని మంచి  చికిత్సలున్నాయి.…

  • ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన మెక్సికన్ మెడిటేరియన్ థాయ్ వంటకాల్లో కూడా మన వంటింట్లో వుండే కారం పసుపు ఆవాలతో పాటు ధనియాలు కారం వెల్లుల్లి జీలకర్ర వాడతారు . మెక్సికన్ వంటకాల్లో మనం కరివేపాకు వేసినట్లు బరిగానోని ప్రయోగిస్తారు. ఇవి చూసేందుకు మరువం ఆకుల్లా ఉంటాయి. మెడిటేరియన్ వంటకాల్లో బరిగానో తో పాటు థైమ్ మనం వాడే బిర్యానీ ఆకులు తులసి ఆకులు ఎక్కువగా వాడతారు. వీటితో పాటు యాలకులు దాల్చిన చెక్క అల్లం ధనియాలు ఎక్కువగా వాడతారు. ఫ్రాన్స్ లో అయితే మాత్రం బిర్యానీ లో వాడే చిన్న చిన్న జాజికాయల్ని ఎక్కువగా వాడతారు. వీటితో పాటు థైమ్ రోజ్ మేరీ ఒరేగానో ఆకుల్ని ఎక్కువగా వాడతారు. థాయ్ వంటకాల్లో తులసి పసుపు యలకుల్ని అరేబియన్ వంటకాల్లో ఆల్ స్పైస్ లేదా జమైకా మిరియాలు వాడతారు. అల్లం లవంగాలు దాల్చిన చెక్క వాళ్ళ వంటకాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.

    అందరు వాడేవి ఇవే

    ప్రపంచ వ్యాప్తంగా  పేరు పొందిన మెక్సికన్ మెడిటేరియన్ థాయ్ వంటకాల్లో కూడా మన వంటింట్లో వుండే కారం పసుపు ఆవాలతో  పాటు ధనియాలు కారం వెల్లుల్లి జీలకర్ర…

  • అమ్మాయిలు మహిళలు కూడా సాధారణంగా ఎదుర్కునే సమస్యల్లో మూత్ర నాళ ఇన్ఫెక్షన్ ముఖ్యం. వైద్యుల్ని సంప్రదించినా రోజువారీ కొంత పర్సనల్ శ్రద్ధ తీసుకుంటే ఈ సమస్య నుంచి తేలికగా బయట పడవచ్చు. ఆఫిసుల్లో పనిచేయటం మొదలుపెట్టాక మొదటిగా చాలా సేపు బాత్ రూమ్ వైపు వెళ్లకుండా ఉండటం ఆడవాళ్ళూ చేసే తప్పుల్లో మొదటిది. దీనివల్లే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మూత్రం రంగు మారితే మంచినీళ్లు ఎక్కువ తాగటం పండ్ల రసం లేదా నీటి శాతం ఎక్కువ వున్న పండ్లు తీసుకోవాలి. ముందు బాత్ రూమ్ కు వెళ్ళటం నామోషీ అనుకోవటం మానేయాలి. వీలైనంత వరకు నూలు తో దుస్తులను ఎంచుకోవాలి. గాఢత వాసన తక్కువగా ఉన్న సబ్బులు వాడుకోవాలి. లో దుస్తులు ఎప్పుడు వెనీళ్ల తో ఉతికి ఎండలో ఆరేసుకోవాలి. దీనివల్ల బాక్టీరియా సమస్య తగ్గుతుంది. నెలసరి సమయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. శానిటరీ నాప్కిన్స్ మార్చుకోవాలి. వీటివల్లనే సగం అనారోగ్యాలు వస్తాయి . రెండు పూట్లా మార్చుకుని వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తేనే సగం జబ్బులు కనిపించకుండా పోతాయి.

    వ్యక్తిగత పరిశుభ్రతే పరిష్కారం

    అమ్మాయిలు మహిళలు కూడా సాధారణంగా ఎదుర్కునే సమస్యల్లో మూత్ర నాళ  ఇన్ఫెక్షన్ ముఖ్యం. వైద్యుల్ని సంప్రదించినా రోజువారీ కొంత పర్సనల్ శ్రద్ధ  తీసుకుంటే ఈ సమస్య నుంచి…

  • సమంత నిస్సందేహంగా సక్సెస్ ఫుల్ కధానాయిక. అందం అభినయం తో ఏ పాత్రలో నైనా ఒదిగిపోతుంది . ఇదే ఆమె సక్సెస్ సూత్రం కష్టపడి పనిచేయటం ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి ఒక చిత్రం నటిస్తోంది. స్టార్ హీరోయిన్ అయ్యాక జయాపజయాలు విషయంలో మీ వైఖరి ఏదైనా మార్పులొచ్చాయా అని అడిగితే అప్పుడు ఇప్పుడు ఒకేలాగా వున్నానంది సమంత. విజయం పరాజయం రెండు పోరాటమే నేర్పాయి ఈ రెండు నాకు ఒక్క విషయాన్నీ తెలియజెప్పటం వల్ల నెమో ఒక సక్సెస్ వస్తే ఇంకా కష్టపడాలి అనుకుంటాను. ఇక పరాజయం ఎదురైతే నా దృష్టిలో అదో ముచ్చట. నా వంతు కృషి చేసిన తృప్తి మాత్రం నాకుంటుంది . ఆ మచ్చ వీలైనంత త్వరగా మానిపోయేందుకు కొత్త సినిమాలు ఇంకా ఎక్కువ కష్టపడతా. నేనేత చేయాలో అంతా చేస్తాను. అంటూ చెప్పింది సమంత . ఈ లక్షణమే ఆమెని అగ్రస్థానంలో కూర్చోబెట్టింది. తోటి కథానాయికలకు స్ఫూర్తిగా నిలబెట్టింది.

    సక్సెస్ వచ్చినా కష్టపడాలనే చూస్తా

    సమంత నిస్సందేహంగా సక్సెస్ ఫుల్ కధానాయిక. అందం అభినయం తో ఏ పాత్రలో నైనా ఒదిగిపోతుంది . ఇదే ఆమె సక్సెస్ సూత్రం కష్టపడి పనిచేయటం ఇప్పుడు…

  • అలస్కా నుంచి బయలుదేరి సాన్ ఫ్రాన్సిస్కో వెళుతున్న విమానంలో సహాయకురాలు షీలా ఫ్రెడె రిక్ ఒక మామూలు దుస్తులతో ఓ పెద్ద మనకిషి వెనక సీట్లో కూర్చున్న అమ్మాయిని చూసింది. ఆ సూటూ బూటు వేసుకున్న మనిషి ఈ పిల్లతో ఎదో మాట్లాడుతున్నాడు. ఆ చిన్న పిల్ల భయంభయంగా చుట్టూ చూస్తోంది. పక్కన కూర్చున్న వ్యక్తితో ఎదో మాట్లాడాలని చూస్తోంది. షీలా కు ఇది చుస్తే ఎదో అనుమానం వచ్చింది. వెంటనే ఆ అమ్మాయి కళ్ళతో మూత్ర శాల వద్దకు రమ్మని సైగ చేసి అక్కడో పెన్ను పేపరు పెట్టింది.దాంతో బాలిక ఐ నీడ్ హెల్ప్ అని రాసి బయటకు వచ్చేసింది. షీలా ఆ పాపకు ఎదో అపకారం జరగబోతుందని ఊహించి పైలెట్ కు చెప్పింది . పైలెట్ నావిగేషన్ ద్వారా పోలీసులకు సమాచారం పంపాడు. విమానము శాన్ ఫ్రాన్సిస్కో లో ఆగేసరికి పోలీసులు వచ్చి ఆ నిందితుడ్ని అరెస్ట్ చేసారు. ఆ బాలిక షీలా ను కౌగలించుకుని తనను తల్లితండ్రుల నుంచి తప్పించి అక్రమ రవాణా చేస్తున్నాడని చెప్పింది. షీలా అలర్ట్ అయ్యి ప్రమాదం ఊహించి పాపను కాపాడినందుకు అందరు అభినందించారు ఒక అమాయకురాలి జీవితం కాపాడింది షీలా

    అక్రమ రవాణా అడ్డుకున్న షీలా

    అలస్కా నుంచి బయలుదేరి సాన్ ఫ్రాన్సిస్కో వెళుతున్న విమానంలో సహాయకురాలు షీలా ఫ్రెడె  రిక్ ఒక మామూలు దుస్తులతో ఓ పెద్ద మనకిషి వెనక సీట్లో కూర్చున్న…

  • అమ్మ జయలలిత నివాసం పోయెస్ గార్డెన్స్ వీధుల్లో ఒకచక్కని పాట గిరికీలు కొట్టింది. ఫైర్ బ్రాండ్ ర్యాప్ సింగర్ సోఫియా అష్రఫ్ తమిళ రాజకీయాల పై భగ్గుమంది. శాసన సభ పక్ష నేతగా శశికళ ను ఎన్నుకున్న నేపథ్యంలో చెన్నయ్ కు చెందిన సోఫియా అష్రఫ్ తన పాటతో నిరసన వ్యక్తం చేసింది . ప్రజలచే ఎన్నిక కానివారు మంత్రులుగా ఉండేందుకు అనర్హులు. అనే మాటే పాటగా సోషల్ మీడియాలో కూడా విహారం చేసింది. శశికళ ఎంపిక ధర్మసమ్మతం కాదని ఆమె తన ఆక్షేపణ వ్యక్తం చేసింది. తన ప్రదర్శన కు ఆపేందుకు ఓ పోలీస్ ప్రయత్నం చేసాడని తన వస్త్ర ధారణ ను కూడా ఆక్షేపించాడని సోఫియా ఫేస్ బుక్ పోస్ట్ చేసింది. ఈ పాటకు ఈ అమ్మాయి కోపానికీ నిరసనకీ నెటిజన్లు బ్రహ్మాండంగా స్పందించారు.

    శశికళ ఎంపిక ధర్మమా ?

    అమ్మ జయలలిత నివాసం పోయెస్ గార్డెన్స్ వీధుల్లో ఒకచక్కని పాట  గిరికీలు కొట్టింది. ఫైర్ బ్రాండ్ ర్యాప్ సింగర్ సోఫియా అష్రఫ్  తమిళ రాజకీయాల పై భగ్గుమంది.…

  • డాన్స్ థెరపీ అన్నదొక సరికొత్త ప్రయోగం. ఇందులో నదుల్ని కదిలించే నడక. ప్రశాంతత ఇచ్చే యోగా నాజూగ్గా తీర్చిదిద్దే ఏరోబిక్స్ కలిసి ఉంటాయి. అమెరికాలోని ప్రతి ఆస్పత్రికీ ఒక డాన్స్ థెరపిస్ట్ తప్పని సరిగా ఉంటారు. వీళ్ళు ఫిజియో థెరపిస్ట్ లతో అనుసంధానం అయి వుంటారు. కీళ్ల నొప్పులున్న పేషేంట్లకి ఈ థెరపీ ఎంతో ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి మనసుకి ప్రశాంతత కూడా. ఈ డాన్స్ థెరపీ లో శాస్త్రీయంగా చెప్పాలంటే ఎండార్ఫిన్ హార్మోన్ రీలీజవుతుంది. ఒత్తిడి తగ్గి తేలిగ్గా ఉంటుంది. శరీరానికి సానుకూల దృక్పధం కలిగితే మంచి హార్మోన్లు విడుదల అవుతాయి. శరీరంలోని అవయవాలు కదిలించేలా చేసే ఈ డాన్స్ కొన్ని నీడల పైన కీళ్ల పైన పనిచేస్తుందని ఇదే ఒక అద్భుతమైన ఔషధం లాంటిదని వైద్యులు సిఫార్స్ చేసారు. శరీరానికి మనసుకీ ఆహ్లాదకర వ్యాయామం డాన్స్ థెరపీ. కొన్ని భంగిమలను స్థిరంగా నిలబెట్టటం ద్వారా ఆయా అవయవాలకు ఉత్తేజం కలుగుతోంది. పేరు పొందిన కళాకారులు ఎందరో ఇప్పటికే ఈ థెరపీ పైన ప్రయోగాలు చేశారు. ఇంకా చేస్తున్నారు.

    డాన్స్ థెరపీ తో ప్రయోజనాలు

    డాన్స్ థెరపీ అన్నదొక సరికొత్త ప్రయోగం. ఇందులో నదుల్ని కదిలించే నడక. ప్రశాంతత ఇచ్చే యోగా నాజూగ్గా తీర్చిదిద్దే ఏరోబిక్స్  కలిసి ఉంటాయి. అమెరికాలోని ప్రతి ఆస్పత్రికీ…

  • ఎన్ని షాంపూలు వాడుతున్నా డామేజీ అయిపోతున్న జుట్టుని కాపాడు కోలేక పోతుంటే కొన్నబీ హోమ్ రెమిడీస్ ట్రై చేస్తే బావుంటుంది. వేడి నీళ్లతో స్నానం అస్సలు చేయకూడదు. జుట్టును సంరక్షించే నూనె డ్రై గా మారిపోతుంది. ఫలితంగా జుట్టు పొడిబారిపోతుంది. సొరకాయ రసం జుట్టుకు పట్టించేసి అరగంట తర్వాత కడిగేసుకోవాలి. యాపిల్ సిడార్ వెనిగర్ ను గోరు వెచ్చని నీటిలో కలిపి జుట్టుకు పట్టించి ఐదు నిముషాలు ఆగి స్నానం చేయాలి. ఎగ్ వైట్ వల్ల కూడా ఎంతో మంచి ఫలితం వుంటుంది. జుట్టు రాలేందుకు చుండ్రు ముఖ్య కారణం కావచ్చు. కనుక తల శుభ్రంగా ఉంచుకోవాలి. బాదం నూనె ను కొంచెం వేడి చేసి తలకు పట్టించి అరగంట ఆగి స్నానం చేసేయచ్చు. స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టటం వల్ల హానికరమైన కెమికల్స్ తో జుట్టు పాడైపోతుంది . స్విమ్మింగ్ చేసే ముందర జుట్టుకు కండీషనర్ అప్లయ్ చేయాలి. అరకప్పు తేనె లో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ఒక కోడిగుడ్డు పచ్చి సోనా కలిపి జుట్టుకు అప్లయ్ చేసి అరగంట తర్వాత స్నానం చేస్తే సరి. జుట్టు బాగా ఆరాకే దువ్వుకోవాలి. పండ్లు కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. హెల్త్ డైట్ తోనే జుట్టు ఆరోగ్యాంగా ఉంటుంది.

    శిరోజాల సమస్య ఉంటే ఇలా చేస్తే సరి

    ఎన్ని షాంపూలు వాడుతున్నా డామేజీ అయిపోతున్న జుట్టుని కాపాడు కోలేక పోతుంటే కొన్ని హోమ్ రెమిడీస్ ట్రై చేస్తే బావుంటుంది. వేడి నీళ్లతో స్నానం అస్సలు చేయకూడదు.…

  • మహిళల హక్కులు స్వావలంబిన గురించి భావాలున్న తాప్సీ నిజమైన ఫెమినిస్ట్ నని నిరూపించుకుంది. మహిళల హక్కుల గురించి జైపూర్ లో ఏర్పాటు చేసే ఓ ఈవెంట్ కు తాప్సీ పన్ను కు ఆహ్వానం అందింది. ఈ ఈవెంట్ స్పాన్సర్ ఒక ఫెయిర్నెస్ బ్రాండ్ అని తెలిసాక ఆ ఈవెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ ఫెయిర్ నెస్ క్రీమ్ బ్రాండ్ ఉంటుంది కనుక ఆ కార్యక్రమానికి రానని చెప్పేసింది తాప్సీ . నేను ఫెయిర్ గా ఎన్నో నిర్ణయాలు తీసుకునేదాన్ని. ఈ ఫెయిర్ నెస్ ను ఎందుకు సపోర్ట్ చేస్తాను అంటూ సమాధానం ఇచ్చిందిట తాప్సీ . ఈ తెలుపు రంగు కోసం ఇప్పటికీ అందరూ మోజు పడతారు కనుకనే ఈ ఫెయిర్ నెస్ క్రీమ్ బ్రాండ్స్ రాజ్యమేలుతున్నాయి. నిజానికి శరీరపు రంగు అందానికి కాలమానం కాదు. దానికి నేను సపోర్ట్ చేయను అన్నది తాప్సీ. ఇలా సౌందర్య పాఠనాల తయారీ బ్రాండ్ల ప్రచారాన్ని వ్యతిరేకించే తారల్లో తా ప్సీ తో పాటు కల్కి కోయచ్లీన్ కంగనా రనౌత్ లు కుడా ఉన్నారు. యాంటీ ఏజింగ్ క్రీమ్ తానూ ప్రచారం చేయనని కల్కి చెప్తే ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ కోసం నటించే యాడ్ కి వచ్చే రెండు కోట్ల కాంట్రాక్ట్ వదులుకుంది కంగనా రనౌత్ .. ఆడవాళ్ళలో ఈ భవాజాలం పోయేందుకు ఇంకెంత మంది ముందుకొచ్చి చెప్పాలో

    ఫెయిర్ నెస్ ను సపోర్ట్ చేయటమా , నెవ్వర్ !

    మహిళల హక్కులు స్వావలంబిన గురించి భావాలున్న తాప్సీ  నిజమైన ఫెమినిస్ట్ నని నిరూపించుకుంది. మహిళల హక్కుల గురించి జైపూర్ లో ఏర్పాటు చేసే ఓ ఈవెంట్ కు…

  • నీహారికా , గంటసేపు ఏం మాట్లాడవు ఫ్రెండ్ తో అంటే ఎదో ఫార్మాలిటీ అన్నావు. కానీ నీహారికా కబుర్లు చెప్పటం ఒక ఆర్ట్. మాట్లాడే కళను అభ్యాసం చేయాలి. మాట్లాడటం కంటే మాటలు వినటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మంచి సంభాషణల మాధుర్యం ఓర్పు గల చెవిలో దాక్కుని ఉంటుందిట. మనం గ్రూపుగా ఉంటే ఒకళ్ళ తోనే కబుర్లు మొదలుపెట్టకూడదు. మన వంతు వచ్చే వరకు వేచి చూడాలి. మాటకు ముందు ఆలోచన ఉండాలి. నాకే బాగా తెలుసన్న దృక్పధం కబుర్లలో దొర్ల కూడదు. ముఖ్యంగా మాట్లాడుతూ సెల్ ఫోన్ చేతిలోకి తీసుకున్నావా ఇక సంభాషణలు వద్దనుకొంటున్నావని మెసేజ్ ఇచ్చినట్లు. ఎదుటివాళ్ళ మౌనాన్ని అర్ధం చేసుకోవాలి. సంభాషణలో నైపుణ్యాన్ని అలవర్చుకోవటం లాంటిదే ఇది కూడా . ఇతరులతో మాట్లాడటం ద్వారా మనం అర్ధం చేసుకునే విషయాలు కాలక్రమేణా మన ఆలోచనలు భావాలకు ఓ కొత్త రూపం ఇస్తాయి. అన్నాడో ప్రొఫెసర్. అంటే ఇతరులతో మనం మాట్లాడే మాటలు మనల్ని మనం తెలుసుకోవటానికి ఉపయోగపడతాయన్నమాట. సంభాషణలంటే మనల్ని మనం టచ్ లో ఉంచుకోవటం . మన ఇంప్రూవ్మెంట్ మనకే తెలుస్తుంది. మాటలంటే బంగారం కంటే విలువైనవి అపురూపమైనవి నిహారికా!!

    కబుర్లు చెప్పటం ఒక ఆర్ట్

    నీహారికా , గంటసేపు ఏం  మాట్లాడవు ఫ్రెండ్ తో అంటే ఎదో ఫార్మాలిటీ అన్నావు. కానీ నీహారికా కబుర్లు చెప్పటం ఒక ఆర్ట్. మాట్లాడే కళను అభ్యాసం…