• శరీరం తీరు అందరికీ ఒకే రకంగా ఉండదు. అలాగే శరీరపు కొలతలు కరెక్ట్ గా ఉండాలని రూలేం లేదు. కొందరికి భుజాలు విశాలంగా ఉంటాయి. కొందరికి దవడ ఎముకలు ఎత్తుగా ఉంటాయి. ఇక మొహాలు రకరకాలు షేపులు. ఒకళ్ళకీ ఒకళ్ళకీ దాదాపు పోలికే ఉండదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని హైలైట్ కాకుండా చూడచ్చు . ఇప్పుడు విశాలమైన భుజాలున్నవాళ్ళు వస్త్ర ధారణ లో విశాలమైన పై భాగం కింద న్యారో బాడీల నడుమ చూసేందుకు వీలైన సమతౌల్య భ్రాంతిని కలిగించే జాగ్రత్తలు ఎంచుకోవాలి. భుజాలు సమంగా కనిపించే వస్త్రాలు ఎంచుకోవాలి. చూపు భుజాలవైపు వెళ్లకుండా చేసేలా షోల్టర్ ప్యాడ్స్ జోలికి వెళ్ళకూడదు. స్లీవ్స్ విషయంలో ఒకటికి రెండుసార్లు ట్రైల్ చూసి ఏది నప్పితే దాన్ని ధరించాలి. నిలువు చీరలు కొంత సహకరిస్తాయి. నిండురంగు టాప్ లైట్ కలర్ బాటమ్ బావుంటాయి. బోట్ నెక్స్ వైడ్ నెక్ లైన్స్ భుజాల్ని మరింత విశాలంగా చూపే అవకాశాలుంటాయి. న్యారో వినెక్ ఎంచుకోవాలి. నెక్లెస్ లేదా ఇయర్ రింగ్స్ ఆకర్షణీయమైనవి ధరించాలి. కాలర్ లెస్ షర్ట్స్ సూటవుతాయి. ఇది ఉదాహరణ కోసం ఇలాంటి మార్పులతో అందం పెరుగుతోంది అనుకుంటే ఎక్స్ పెర్ట్స్ ని సంప్రదించాలి. సినిమా యాక్టర్స్ ఫోటో షూట్ లతో తేల్చేది ఇదే. వాళ్ళు ఏ యాంగిల్ లో బావుంటారో ఫొటోల్లో తేల్చుకుంటారు.

    వస్త్ర ధారణ తో లోపాలు కప్పేయచ్చు

    శరీరం తీరు అందరికీ ఒకే రకంగా ఉండదు. అలాగే శరీరపు కొలతలు కరెక్ట్ గా ఉండాలని రూలేం లేదు. కొందరికి భుజాలు విశాలంగా ఉంటాయి. కొందరికి దవడ…

  • నీహారికా , ఇవ్వాళ ఓ అధ్యయనం రిపోర్ట్ వచ్చింది. ఒక ప్రముఖ హార్డ్ వేర్ సంస్థ చేసిన అధ్యయన రిపోర్ట్ లు సంస్థలు ఓ కొత్త ప్రాజెక్ట్ చెప్పటలంటే అమ్మాయిలు దానిపైన వాళ్లకు పూర్తీ అవగాహనఉంటేనే ముందుకొస్తున్నారట. అదీ అబ్బాయిలు దానిపై 40 శాతం అవగాహన వున్నా అవకాశం వదులుకోకూడదు అని దూకేస్తున్నారట. మరి అమ్మాయిలు అంత సహనంగా ఆ అవకాశం ఉపయోగించుకుందామని ఎందుకు అనుకోరు ? అంటే చాల విషయాల్లో వెనుకడుగు వేసి సిగ్గుపడి . మొహమాటపడి బావుందనుకుని వెనకే వుంటారు . కానీ అధ్యయనకారులు ఆలా వెనక్కి తగ్గద్దు మీరు పడ్డ శ్రమ మీకు తెలిసినదాన్ని మీ నైపుణ్యాలనీ జీతం పదోన్నతీ విషయంలో దాచుకోకండి. మీ శక్తి సామర్ధ్యాలని తప్పకుండా ప్రచారం చేసుకోండి అంటున్నారు. ఒక జాబ్ లో చేరాక ఎంతో పని చేస్తారు నేర్చుకుంటారు . చదువుకునే కళాశాల నుంచి ఆ విఙానం తో గొప్ప విజయాలు సాధించేందుకు ఉద్యోగంలో అడుగుపెడతారు. అక్కడ ఏ అవకాశమూ వదులుకోవద్దు. మీరు సాధించిన విజయాలు సొంత డబ్బా అనుకుంటారేమో అన్న భయంతో మనసులోనే ఉంచుకోవద్దు. తప్పకుండా ప్రతి అవకాశం అందిపుచ్చుకోమంటున్నారు. చక్కగా ప్రతి ఇంప్రూవ్మెంట్ ని బయోడేటా లో చేర్చుకోండి. అదే మిమ్మల్ని కోరుకున్న గమ్యానికి చేరుస్తుంది. అంటున్నారు. ఈ రిపోర్ట్ ని నోట్ చేసి పెట్టుకుజో. ఫ్యూచర్ లో పనికి వస్తుంది.

    మిమల్ని మీరు పొగుడుకుంటే తప్పేం కాదు

    నీహారికా , ఇవ్వాళ ఓ అధ్యయనం రిపోర్ట్ వచ్చింది. ఒక ప్రముఖ హార్డ్ వేర్ సంస్థ చేసిన అధ్యయన రిపోర్ట్ లు సంస్థలు ఓ కొత్త ప్రాజెక్ట్…

  • సంప్రదాయకంగా ఆధునికంగా కంఫర్ట్ గా అన్ని రకాలుగా బావుంటుంది ఫ్యూజన్ గౌను. అనార్కలీలకు కొత్త డిజైన్లు కలిపేసి నెట్టెడ్ తరహాలో కాస్త బరువుగా కిందకు వేలాడే తరహాలో కుట్టిస్తున్నారు ఈ గౌన్లు. చక్కని కుచ్చుళ్ళు కిందకి సిల్క్ లాగా జాలువారుతూ ఈ గౌన్లు ఫలానా వేడుకలని లేదు.ఎప్పుడూ ఫ్యాషన్ పెద్దగా ఊగాడే చెవి రంగులు బరువైన బుట్టలు తరహాలో చక్కని వెండినగలు మ్యాచ్ అవుతాయి. లేత రంగులు ఎక్కువ వెడల్పు పెద్దగా ఎంబ్రాయిడరీ లేకుండా సింపుల్ గా ఆఫ్ షోల్డర్ లేదా కోల్డ్ షోల్డర్ లతో ఇంకా బావుంటాయి. పట్టు వస్త్ర శ్రేణి లో పై భాగంలో సగం కుచ్చిళ్ళు ఓణీ జత చేసి వస్తున్నాయి. ఎంచుకునే ముందర ఎన్నో ఇమేజెస్ రెడీగా ఉన్నాయి చూసి ఆర్డరిచుకోవచ్చు. .

    ఫ్యూజన్ గౌన్లు చక్కగా ఉన్నాయి

    సంప్రదాయకంగా ఆధునికంగా కంఫర్ట్ గా అన్ని రకాలుగా బావుంటుంది ఫ్యూజన్ గౌను. అనార్కలీలకు కొత్త డిజైన్లు కలిపేసి నెట్టెడ్ తరహాలో కాస్త బరువుగా కిందకు వేలాడే తరహాలో…

  • ఏం తొమ్మిది సంవత్సరాల అలెగ్జాన్డరా ఆండర్సన్ ప్రపంచంలో అతి చిన్న వయస్కురాలైన బిలినియర్ గా ఫోర్బ్స్ జాబితాకు ఎక్కింది. ఈ నార్వే అమ్మాయి సంపద ఎనిమిది వేల కోట్ల రూపాయలు. 19 సంవత్సరాల అమ్మాయి అలెగ్జాన్డరా తన పూర్వీకుల నుంచి తనకు దక్కిన ఆస్తిని రెట్టింపు చేయటయే హాబీగా పెట్టుకుంది. ఊహా తెలిసినప్పటి నుంచి దాదాపు పదేళ్ల నుంచి తన ఆస్తిని రెట్టింపు అయింది ఆలా ఫోర్బ్స్ లో బిలియనీర్ గా స్థానం దక్కింది. ఈ అమ్మాయి ఇంత ఆస్తి వున్నప్పుడు దర్పంగా లేదు. వేలకోట్ల ఆస్తి ఉన్న పాత కార్ల లోనే తిరిగేది. గుర్రపు రేస్ లు క్విజ్ పోటీల్లో పాల్గొని అలా వచ్చిన ప్రైజ్ మనీ తో అవసరాలు తీర్చుకునేది. అంటే డబ్బు కూడా బెట్టటమే అలెగ్జాన్డరా నేర్చుకున్న విద్య. ఈ అమ్మాయిని ఎవరైనా ఆదర్శంగా తీసుకోబోతున్నారా ??

    కూడబెట్టి ఫోర్బ్స్ లో కెక్కింది

    ఏం  తొమ్మిది సంవత్సరాల అలెగ్జాన్డరా  ఆండర్సన్ ప్రపంచంలో అతి చిన్న వయస్కురాలైన బిలినియర్ గా ఫోర్బ్స్ జాబితాకు ఎక్కింది. ఈ  నార్వే  అమ్మాయి సంపద ఎనిమిది వేల…

  • భవిష్యత్తు కోసం అండాల్ని దాచుకోవటం మన దేశంలో ఇప్పుడు చర్చకు వస్తోంది. దాచే అవకాశాలు రానున్నాయి స్త్రీల అండాన్ని వెలికి తీసి శీతలీకరించి వాటిని భద్రంగా దాచిపెడతారు. భవిష్యత్తు లో వారికీ అవసరమైనప్పుడు ఇస్తారు. అభివృద్ధి చెందిన దేశాల్లో 30 ఏళ్ళు దాటని ఉద్యోగినులు ఇప్పుడు దానివైపు ఆలోచిస్తున్నారు. పాతికేళ్లకే జాబ్ లో చేరి ఉద్యోగంలో కీలకమైన మొదటి ఐదేళ్లు కష్టపడి పనిచేసి నిచ్చెన మెట్లు ఎక్కాలి . ఆ దశ లో పిల్లలు పుడితే వాళ్ళను పెంచటం ఇటు కెరీర్ కోసం పరుగులు తీయటం చాలా కష్టం. ఒకవేళ జాబ్ లో స్థిరాపడి 30 ఏళ్ళు దాటాక పెళ్లాడాలనుకుంటే అప్పుడు పిల్లలు కలిగే అవకాశాలు సన్నగిల్లిపోవచ్చు. అందుకనే మంచి వయసులో అండాల్ని యధాతధంగా దాచి తర్వాత పిల్లలు కంటే బావుంటుందనే స్త్రీల సంఖ్య పెరిగింది. ఇందుకు ఖర్చు ఎక్కువే. యాపిల్ ఫెస్ బుక్ వంటి సంస్థలు తమ ఉద్యోగినుల కోసం ఈ విషయంలో ప్రత్యేక భీమా కూడా కల్పిస్తున్నాయి.

    చిన్న వయసులో అండాల్ని దాస్తున్నారు

    భవిష్యత్తు కోసం అండాల్ని  దాచుకోవటం మన దేశంలో ఇప్పుడు చర్చకు వస్తోంది. దాచే అవకాశాలు రానున్నాయి స్త్రీల అండాన్ని  వెలికి తీసి శీతలీకరించి వాటిని భద్రంగా దాచిపెడతారు.…

  • రెండు అరటిపండ్లు తింటే 90 నిముషాల సేపు సంపూర్ణమైన శక్తి లో శరీరానికి శ్రమ ఇచ్చే పనులు ఈజీగా చేయవచ్చునని పరిశోధనలు ఏనాడో రుజువు చేసాయి. క్రీడా కారులు అరటిపండ్లు తప్పనిసరిగా తింటారు. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు అరటిపండ్లు మంచి ఆహారం. శక్తి తో పాటు జీర్ణ వ్యవస్థని బాగు చేస్తుంది . ప్రీ మేనుస్ట్రువల్ సిండ్రోమ్ తో బాధ పడుతుంటే అరటిపండు చక్కని ఆహారం. ఆందోళన ఉద్వేగాలు అదుపులో ఉంటాయి. ఇందులో ఐరన్ సమృద్ధిగా వుంది. ఎనిమీయా అరికడుతుంది. బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉంచుటుంది. ఇందులోని పొటాషియం మెదడును అప్రమత్తంగా ఉంచుతుంది. కొన్ని వందల మంది విద్యార్థులకు అరటిపండు బ్రేక్ ఫాస్ట్ లో కానీ మధ్యాహ్నం భోజనం తర్వాత కానీ అరటిపండు తినే అలవాటు చేసుకోమంటున్నారు పరిశోధకులు. చక్కెర సుక్రోజ్ ఫ్రక్టోజ్ గ్లూకోజ్ పీచు వంటివి ఇందులో సహజ రూపంలో ఉన్నాయి . రెండు అరటిపండ్లు తింటే 90 నిముషాల సేపు సంపూర్ణమైన శక్తి లో శరీరానికి శ్రమ ఇచ్చే పనులు ఈజీగా చేయవచ్చునని పరిశోధనలు ఏనాడో రుజువు చేసాయి. క్రీడా కారులు అరటిపండ్లు తప్పనిసరిగా తింటారు. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు అరటిపండ్లు మంచి ఆహారం. శక్తి తో పాటు జీర్ణ వ్యవస్థని బాగు చేస్తుంది . ప్రీ మేనుస్ట్రువల్ సిండ్రోమ్ తో బాధ పడుతుంటే అరటిపండు చక్కని ఆహారం. ఆందోళన ఉద్వేగాలు అదుపులో ఉంటాయి. ఇందులో ఐరన్ సమృద్ధిగా వుంది. ఎనిమీయా అరికడుతుంది. బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉంచుటుంది. ఇందులోని పొటాషియం మెదడును అప్రమత్తంగా ఉంచుతుంది. కొన్ని వందల మంది విద్యార్థులకు అరటిపండు బ్రేక్ ఫాస్ట్ లో కానీ మధ్యాహ్నం భోజనం తర్వాత కానీ అరటిపండు తినే అలవాటు చేసుకోమంటున్నారు పరిశోధకులు. చక్కెర సుక్రోజ్ ఫ్రక్టోజ్ గ్లూకోజ్ పీచు వంటివి ఇందులో సహజ రూపంలో ఉన్నాయి .

    మెదడు చురుకు అధిక శక్తి

    రెండు అరటిపండ్లు తింటే 90 నిముషాల సేపు సంపూర్ణమైన శక్తి లో శరీరానికి శ్రమ ఇచ్చే పనులు ఈజీగా చేయవచ్చునని పరిశోధనలు ఏనాడో రుజువు చేసాయి. క్రీడా…

  • పెదవులు గులాబీ రంగులో లేదా చక్కని ఎరుపు తో వుండాలనుకునేవాళ్లు కొత్తిమీర రసం ట్రై చేయమంటున్నారు. సౌందర్య నిపుణులు. పెదవులు నల్లగా ఉంటే ఈ రసం తో ఆ నలుపు పోతుంది. అలాగే పెదవులు పొడిబారి పోకుండా ఆర్గానిక్ లిప్ బామ్ ఎప్పుడూ రాస్తూనే ఉండాలి. ఉల్లిపాయల్లో వుండే సల్ఫర్ జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. వారానికి ఒకసారి ఉల్లిపాయ రసం కొబ్బరి నూనెతో కలిఫై మాడుకు రాసి మెల్లగా మస్సాజ్ చేయాలి . అరగంట తర్వాత షాంపూతో స్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఒక్కసారి ఎండకో లేదా పని చేస్తూ తడిగా ఉంచుకోవటం వల్లనో చేతులపై చర్మం రంగు తగ్గి ముడతలు తేలినట్లు ఉంటుంది. ఎండిన చేమంతుల పొడి కోకో బటర్ ఒక స్పున్ వెన్న రెండు టేబుల్ స్పూన్ల ఆప్రికాట్ ఆయిల్ రెండు టీ స్పూన్లు కలిపి ఈ మిశ్రమం పాన్ పై ఉడికించి చల్లారాక దాన్ని సీసాలో భద్రం చేయాలి . ప్రతి రాత్రి పడుకునే ముందర దీన్ని చేతులకు అప్లయ్ చేస్తే చేతుల చర్మం రంగు తేలి మృదువుగా అయిపోతుంది. ముడతలు మాయమైపోయి చర్మం యవ్వనవంతంగా ఉంటుంది .

    ఉల్లిపాయ రసం చేసే అద్భుతం

    పెదవులు గులాబీ రంగులో లేదా చక్కని ఎరుపు తో వుండాలనుకునేవాళ్లు కొత్తిమీర రసం ట్రై చేయమంటున్నారు. సౌందర్య నిపుణులు. పెదవులు నల్లగా ఉంటే ఈ రసం తో…

  • సెల్ఫీలు తీసుకోవటం జీవితంలో ఒక భాగం అయిపొయింది. స్నేహితులతో కొత్త ప్రదేశాల్లో సెల్ఫీ తీసుకోవటం ఫెస్ బుక్ లో వెంటనే అప్లోడ్ చేయటం అమ్మాయిలకు సరదా. ఇప్పుడు ఫోటో చక్కగా రావాలంటే మొహం పైనే కాదు వేసుకున్న దుస్తులపైనా కూడా వెలుగుచేరి కొత్త అందం తీసుకువస్తాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు సమయంలో సెల్ఫీలు నీరసంగా కనిపిస్తాయి. ఉదయం సాయంత్రం ఫ్రెష్ లుక్ తో ఉన్నప్పుడే ఫోటో కళ్ళు అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఫోటో తీసుకోవాలనుకున్నప్పుడు కళ్ళ పై దృష్టి పెట్టాలి. కాను బొమ్మల్ని దిద్దుకుని మస్కారా వేసుకుని లేత ఛాయలో ఐషాడో అద్దుకుని అప్పుడు ఫోటో తీసుకుంటే కళ్ళ అందం ముఖాన్ని వెలిగించేస్తుంది. వేసుకునే దుస్తులు నగలు ఫొటోలపై ప్రభావం చూపిస్తాయి. మెడ పొడుగ్గా చక్కగా కనిపించాలంటే వి ఆకారంలో మెడ ఉన్న దుస్తుల్ని ఎంచుకోవాలి. మరీ పెద్ద జుంకీలు భారీ నగలు లేకుండా ఉండాలి. మొహం వేసుకున్న దుస్తులు బాగా కనిపంచాలంటే కెమెరా ఎత్తుగా ఉండాలి. అదే నిలబడితే సెల్ ఫోన్ సమానమైన ఎత్తులోనే ఉండాలి.

    సెల్ఫీ కి అందం కళ్ళే

    సెల్ఫీలు తీసుకోవటం జీవితంలో ఒక భాగం అయిపొయింది. స్నేహితులతో కొత్త ప్రదేశాల్లో సెల్ఫీ తీసుకోవటం ఫెస్ బుక్ లో వెంటనే అప్లోడ్ చేయటం అమ్మాయిలకు సరదా. ఇప్పుడు…

  • ిన్న పిల్లలు చాలా మందికి నోట్లో వేసుకునే అలవాటు ఉంటుంది. అలా నోట్లో వేలుంచుకుని చప్పరించటం వల్ల పళ్ళు ఎత్తుగా వస్తాయని అది మంచి అలవాటు కాదనీ తల్లులు శతధా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ అలవాటు కూడా మంచిదేనంటారు పరిశోధకులు. ఈ కెనడా ఎక్స్ పెర్ట్స్ ఏం చెపుతారంటే నోట్లో వేలు వేసుకోవటం నిజానికి చెడ్డ అలవాటే. కానీ పిల్లలు ఎప్పుడూ నోట్లో వేలు తీస్తూ వేస్తూ ఉండటం ఈ మధ్యలో ఎక్కడో చోట చేతులు పెట్టటం వల్ల క్రిములు కొన్నయినా కడుపు లోకి వెళతాయి. సహజంగా ఈ క్రిముల్ని ఎదుర్కునే రోగనిరోధక శక్తి శరీరంలో అంతా పసితనం నుంచే పెరుగుతూ వస్తుంది. ఈ క్రిములు పెరిగే కొద్దీ శరీరంలో వుండే రోగనిరోధక శక్తి వాటిని సమర్ధవంతంగా ఎదుర్కుంటుందనీ అంటున్నారు. క్రిములు చేరినా ఆయోగ్యాంగా తట్టుకుని ఎదిగే పిల్లలు పెద్దయిన తర్వాత ఎలాంటి అనారోగ్య సమస్యనైనా సమర్ధవంతంగా ఎదుర్కోగలరని చెపుతున్నారు. నోట్లో వేలు వేసుకోవటం మంచిదని చెప్పటం తమ ఉద్దేశ్యం కాదనీ కానీ ఈ అలవాటు గురించి తల్లులు మరీ కంగారు పడద్దనీ చెపుతోంది ఈ రిపోర్ట్.

    ఈ అలవాటు వల్ల మరీ నష్టం లేదు

    చిన్న పిల్లలు చాలా మందికి నోట్లో వేలు వేసుకునే అలవాటు ఉంటుంది. అలా  నోట్లో వేలుంచుకుని చప్పరించటం వల్ల పళ్ళు ఎత్తుగా వస్తాయని అది  మంచి అలవాటు…