• మనస్సు విసుగ్గా వున్నా అలసిపోయినట్లున్నా పచ్చదనం, పువ్వులు, పచ్చిక వుండే ప్రాంతానికి వెళితే చాలు సేద తీరినట్లే. ప్రకృతిలోకి తొంగి చూడటం చాలా అవసరమైన సందర్భం ఇదే. పచ్చని చెట్లు మనస్సులో అలజడిని తగ్గిస్తాయి. ఎటువంటి మూడ్ లో వున్నా సరే ప్రేశాంతను ఇవ్వగలిగే శక్తి ఆకుపచ్చ రంగుకే వుంది. ఆ రంగును చూడగానే మెదడు శుభాన్ని వుహిస్తుంది. ఆకు పచ్చ రంగంటే ప్రశాంతత అభివృద్ధి ఎదుగుదల. కొత్త ఉత్సాహం అందించి చెక్కని ఆలోచన వైపు మనస్సుని మరల్చే శక్తి మొక్కలకు ఉంది గనుకనే మనం ప్రక్రుతి లోకి వేల్లాలనుకుంటాం. లాన్ పైన చెప్పులు లేని కళ్ళతో నడుస్తుంటే అదొక కొత్త ఉత్సాహం. అందుకే పని చేసే చోట ఓ మూలగా పచ్చని ఆకులున్న కుండీని పెట్టాలి. కిటికీలో నుంచి పచ్చదనం కనిపించిందిఅదో శాంతి. అందుకే హాస్పిటల్ల్లో ఆపరేషన్ రూమ్స్ లో ఎక్కువ పచ్చదనం తో వుండే రంగులు వుండే కర్టెన్ లు, రోగుల మంచం పైన కూడా ఆకుపచ్చని దుప్పట్లే వుంటాయి. ఆఫీస్ గది గోడలకు లేత రంగు వుంటే ఉత్సాహంగా పని చేయగలుగుతాము.

    ఆకు పచ్చని రంగుతోనే ఉత్సాహం

    మనస్సు విసుగ్గా వున్నా అలసిపోయినట్లున్నా పచ్చదనం, పువ్వులు, పచ్చిక వుండే ప్రాంతానికి వెళితే చాలు సేద తీరినట్లే. ప్రకృతిలోకి తొంగి చూడటం చాలా అవసరమైన సందర్భం ఇదే.…

  • అస్తమానం పెరిగే బరువు గురించి మాట్లాడుకుంటాం గానీ ఇప్పుడు బారువు తగ్గుతుంటే చూసుకోండి. చాలా ప్రమాదం అంటున్నాయి అధ్యాయనాలు. కిలో అరకిలో బరువు పెరిగినా తగ్గినా పర్లేదు మాములే కానీ ప్రత్యేకించి ఆహార నియమాలు పాటించక పాయినా వ్యయామాలు చేయకపోయినా అదే పనిగా బరువు తగ్గుతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. ఇది మధుమేహం తోలి లక్షణం కావచ్చు. మన శరీరంలోని ప్రతి కారణానికి శక్తి అవసరం. ఇది మనం తిన్నా ఆహారంలోని గ్లుకోజ్ నుంచి లభిస్తుంది. కణాల్లోకి గ్లూకోజ్ చేరుకునేలా చూడటంలో ఇన్సులిన్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తోంది. కనాల్లోకి గ్లూకోజ్ చెరకపొతే శరీరం తగినంత ఆహారం లభించలేదని ఇతర మార్గాలు అన్వేషిస్తూ కొవ్వును, కండరాళ్ళను వేగంగా కర్చుచేసుకోవటం ద్వారా శక్తిని సృష్టిస్తుంది. ఇది బరువు తగ్గేందుకు దారి తీస్తుంది. ఇది కిడ్నీలు కూడా రక్తంలో అధికంగా వున్న చక్కెరలను తొలగించుకోవడానికి ఎక్కువగా శ్రమించవలసివస్తుంది. ఇందుకు అధిక శక్తి అవసరం అవుతుంది. ఇది కిడ్నీలు దెబ్బతినేందుకు దారి తియోచ్చు. కనుక అకారణంగా బరువు తగ్గుతుంటే ఏ సూత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

    బరువు తగ్గినా నష్టమే

    అస్తమానం పెరిగే బరువు గురించి మాట్లాడుకుంటాం గానీ ఇప్పుడు బారువు తగ్గుతుంటే చూసుకోండి. చాలా ప్రమాదం అంటున్నాయి అధ్యాయనాలు. కిలో అరకిలో బరువు పెరిగినా తగ్గినా పర్లేదు…

  • నీహారికా, ఎంతోసేపు ఫేస్ బుక్ లోనే ఉంటున్నాను, వదలలేను, టైమ్ గడిచిపోతుంది అంటున్నావు. ఇవ్వాల్టి యువతకు ఫస్ట్ ప్రాబ్లమ్ ఇదే. స్నేహితుల్ని కోరుకుంటారు యువత, సరే, ఫేస్ బుక్ మిత్రులు నిజమైన మిత్రులు కాదు అంటోంది ఒక అధ్యయనం. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతంగా కలవలేదు, స్నేహంతో సన్నిహితంగా మెలగలేదు కనుక, ఎఫ్ బి కేవలం టైం కిల్లింగ్ కోసమే అంటారు పరిశోధకులు. జీవితంలో ఇంతగా మమేకమైన ఎఫ్.బి. వదిలేందుకు, ఆ అలవాటు తప్పించేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేశారు. ఫేస్ బుక్ అకౌంట్ క్లోజ్ చేయండి. ఖచ్చితంగా దాన్ని చూడను అని నిర్ణయం తీసుకోండి. ఫేస్ బుక్ కారణం గా కోల్పోతున్న గంటలన్నీ, సంతోషాన్ని, సరదాలని ఒక పేపర్ పైన నోట్ చేసుకోవాలి. ఫేస్ బుక్ చూడాలనిపించినప్పుడల్లా ఈ పేపర్ ఒకసారి చూడమంటున్నారు. వీలైతే ఇంటర్నెట్ కనెక్షన్ తొలగించండి అంటున్నారు. ఫేస్ బుక్ ద్వారా పంచుకొనే కబుర్లని ఇంట్లో సభ్యులతోనో, దగ్గరగా వుండే ఒకరిద్దరు స్నేహితులతోనో షేర్ చేయండి అంటున్నారు. ఇంటర్నెట్ అనేది ఒక అపురూపమైన నెట్ వర్క్. సరిగ్గా ఉపయోగించుకొంటే అదొక పెద్ద గ్రంధాలయం, డిక్షనరీ, ఇన్ఫర్మేషన్ సెంటర్. దాని దుర్వినియోగం చేసుకొంటే అదొక విష వలయం. విజ్ఞతతో మనకు అందుబాటులోకి వచ్చిన విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి/ ప్రతి చిన్న సందేహానికి సమాధానం ఇంటర్నెట్ తో అనుసంధానమైన సెర్చ్ ఇంజన్. దేన్నయినా తెలివిగా వాడుకోవాలి.

    తెలివిగా వాడుకొంటే అది అపురూపం

    నీహారికా, ఎంతోసేపు ఫేస్ బుక్ లోనే ఉంటున్నాను, వదలలేను, టైమ్ గడిచిపోతుంది అంటున్నావు. ఇవ్వాల్టి యువతకు ఫస్ట్ ప్రాబ్లమ్ ఇదే. స్నేహితుల్ని కోరుకుంటారు యువత, సరే, ఫేస్…

  • పాద రక్షలు ఇప్పుడు ఫ్యాషన్ లో అతి ముఖ్యమైన భాగం. ఎన్నో రకాలు, కొత్త డిజైన్స్, చాలా ఎత్తయినవి, చాలా టైట్ గా ఉండేవి, కొన్నయితే మోకాళ్ళ వరకూ పట్టేసినట్లు ఉండేవి వస్తున్నాయి. ఫ్యాషన్ సంగతి ఎలా ఉన్నా సరైన పాద రక్షలు ధరించకపోతే పలు అనారోగ్యాల బారిన పడక తప్పదంటున్నారు డాక్టర్లు. మూడువేల మందిపైన ఒక సంవత్సరం పైగా అధ్యయనం నిర్వహించారు. ఎంతో మంది తమ పాదాల కంటే చిన్నవో లేదా పెద్దవో వేసుకొంటున్నవారే ఎక్కువని సర్వే రిపోర్ట్. మరి శారీ మ్యాచింగ్ అని ఒక డిజైనర్ షూ ని కాస్త టైట్ గా వున్నా పర్లేదనుకొంటారు. కాస్త వదులైతే ఏమైoదనుకొంటారు. బిగుతుగా వుండే చెప్పులు ధరించినవారు నడుస్తూ అదుపు తప్పి పడిపోవడం, పాదాల నొప్పులు, నడకలో మార్పులు తదితర సమస్యలు గుర్తించారు. ఈ సమస్యలే భవిష్యత్తులో ప్రాణాంతకం కావొచ్చని వీరు హెచ్చరించారు. పాద రక్షణ విషయంలో సరైన కొలతలు ఎంచుకోవడం, ఫ్యాషన్ కోసం రక్త ప్రసరణ సరిగా జరగకుండా అడ్డుకొనే చెప్పులను అవతల పెట్టడం మంచిది.

    ఎంత కొత్త డిజైన్లయినా సరే వద్దు

    పాద రక్షలు ఇప్పుడు ఫ్యాషన్ లో అతి ముఖ్యమైన భాగం. ఎన్నో రకాలు, కొత్త డిజైన్స్, చాలా ఎత్తయినవి, చాలా టైట్ గా ఉండేవి, కొన్నయితే మోకాళ్ళ…

  • నెలల తరబడి వ్యాయామాలు, ఆహార నియమాలు పాటిస్తున్నా ఏమాత్రం బరువు తగ్గకపోతే ఎంతో నిరాశగా వుంటుంది. దానికి ఫిట్ నెస్ శిక్షకులు ఏమంటారంటే ఒకే రకమైన వ్యాయామాలు ఏళ్ల తరబడి చేస్తే దాని వల్ల శరీరం వాటికి అలవాటు పడిపోయి కేలరీలు తగ్గడం మానేస్తాయి. అందుకే మేం ఎప్పటికప్పుడు శరీరం బరువు శరీర స్థితిని బట్టి రకరకాల వ్యాయామాలు మారుస్తూ వుంటాం అంటారు. అలాగే బరువులు ఎత్తే వ్యాయామాల వల్ల కండలు తిరిగి చూసేందుకు బావుండమని అమ్మాయిలు అపోహ పడతారంటారు. అసలు సాధరణంగా ఆడవాళ్ళలో టెస్టో స్టేరాన్ హార్మోన్ తక్కువగా వుంటుంది కాబట్టి ఎంత బరువులెత్తినా కండలు పెరగవు. బరువు తగ్గలనుకొంటే కండరాల రాశి పెంచుకోవాలి. వాటి వల్ల కొవ్వు పెరిగే ఆస్కారం వుండదు. వేగవంతమైన పరుగూ, నడక వంటి వ్యాయామాలకు పరిమితమైతే గుండె ఆరోగ్యం బావుంటుంది కానీ ఇవి మానేస్తే శరీరం యధావిధిగా తయారవుతుంది. శక్తిని పెంచేవి, కండరాల రాసిని పెంచేవి, శ్రమతో, సహనంతో చేయవలిసిన వ్యాయామాలను శిక్షకుల సాయంతోనే చేస్తే తగిన ఫలితం ఉంటుందంటున్నారు.

    ఏళ్ల తరబడి ఒకే వ్యాయామం వేస్టే

    నెలల తరబడి వ్యాయామాలు, ఆహార నియమాలు పాటిస్తున్నా ఏమాత్రం బరువు తగ్గకపోతే ఎంతో నిరాశగా వుంటుంది. దానికి ఫిట్ నెస్ శిక్షకులు ఏమంటారంటే ఒకే రకమైన వ్యాయామాలు…

  • చక్కెర తింటే మంచిది కాదంటారు కానీ చర్మ రక్షణకు, అందాన్ని ఇవ్వడంలో అంతులేని ఫలితాలు ఇస్తుoదంటున్నారు. షుగర్ స్క్రబ్ ద్వారా చర్మం ప్రకాశవంతంగా ఆరోగ్యంగా వుంటుంది. నిమ్మరసం, తేనే మిశ్రమంలో చక్కర కలిపి ముఖానికి పట్టించి ఆరాక కడిగేస్తే చర్మం కాంతిగా కనిపిస్తుంది. ఇది అద్భుతమైన ఫేస్ మాస్క్. వేడి నీళ్ళలో నిమ్మరసం, చక్కర కలిపి ముఖానికి పట్టించి చల్లని నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. బ్రౌన్ షుగర్ లో కొంచెం ఆలివ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమం చర్మం పైన అప్లయ్ చేస్తే మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా షుగర్ తో స్క్రబ్ చేసుకొంటే వృద్ధాప్య ఛాయలు రానివ్వదు. చక్కెరలోని గైకోనిక్ ఆసిడ్ చర్మం ద్వారా వెళ్లి దుమ్ము వల్ల ఏర్పడే మొటిమలు, మచ్చలు రాకుండా శుభ్రం చేస్తుంది. పెదవులకు లిప్ గ్లాన్ లాగా ఉపయోగపడుతుంది. ఆలివ్ ఆయిల్ లో కాస్ట్రో షుగర్ వేసి పెదవులపైన సున్నితంగా మర్ధన చేస్తే పెదవులు పొడిబారటం వుండదు. కప్పు వేడి నీళ్ళలో స్పూన్ ఆలివ్ ఆయిల్, స్పూన్ పంచదార కలిపి జుట్టుపైన స్ప్రే చేసి కాసేపాగి స్నానం చేస్తే మెత్తగా నిగనిగలాడుతుంది.

    చక్కెరతో చక్కదనం

    చక్కెర తింటే మంచిది కాదంటారు కానీ చర్మ రక్షణకు, అందాన్ని ఇవ్వడంలో అంతులేని ఫలితాలు ఇస్తుoదంటున్నారు. షుగర్ స్క్రబ్ ద్వారా చర్మం ప్రకాశవంతంగా ఆరోగ్యంగా వుంటుంది. నిమ్మరసం,…

  • పెంపుడు జంతువులతో చక్కని ఆరోగ్యం సొంతం చేసుకోమంటున్నారు నిపుణులు. ఇంటా బయటా సమస్యలతో మూడ్స్ మారిపోతుంటాయి అలంటి బ్యాడ్ మూడ్ లో పెంపుడు జంతువుల సహచర్యం ఎంతగానో సేదదీరుస్తుంది అంటున్నారు. అది ఆక్వేరియం లో చేపలు కావచ్చు, కుక్క, పిల్లి, రామచిలుక ఏదైనా సరే. రక్తపోటును తగ్గించి గుండెకు సాంత్వన కలిగిస్తాయంటున్నారు. పెంపుడు జంతువులతో గడపటం ఒక్కటే డిప్రెషన్ కు మందు. ఉత్సాహం, ఉల్లాసం వచ్చి చేరతాయని నిపుణుల సూచన. ఉదయాన్నే పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ చేస్తే చుట్టూ స్నేహితులు లేరని, ఉద్యోగం తర్వాత ఒంటరిగా అయ్యమనే భావన దూరం అవుతుందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు ఎక్కడో దూరంగా ఉండటం, వాళ్ళ ప్రేమ అభిమానానికి దూరం అయ్యామని తల్లిదండ్రులు భావించడం సహజం. ఇంట్లో ఒకటి, రెండు పెంపుడు జంతువులు వుంటే మనసు నిండిన భావన వుంటుందిట. కేవలం ప్రేమను మాత్రం పంచగలిగిన ఈ జంతువుల మధ్యన గడపడం మిగతా విచారాలను దూరం చేస్తుందట. అచ్చం పిల్లల్లాగా యజమాని వవెంటే ఉంటూ, తిరుగుతూ, కాళ్ళకు అడ్డం పడుతూ, తోడుగా ఉంటూ ఇవి మనిషికి చేసే మేలు అంతా ఇంతా కాదు.

    పెంపుడు జంతువులు తోడుంటే చాలు

    పెంపుడు జంతువులతో చక్కని ఆరోగ్యం సొంతం చేసుకోమంటున్నారు నిపుణులు. ఇంటా బయటా సమస్యలతో మూడ్స్ మారిపోతుంటాయి అలంటి బ్యాడ్ మూడ్ లో పెంపుడు జంతువుల సహచర్యం ఎంతగానో…

  • పొడుగ్గా కనిపించాలి అని అందరికి ఇష్టమే. కానీ అందరూ పుట్టుక తో పొడవుగా ఉండరు కదా. కానీ వస్త్ర ధారణతో పొడువుగా కనిపించేలా నిపుణులు ఎన్నో సలహాలిస్తున్నారు. వినెక్స్ వల్ల కాళ్ళు నిలువుగా సాగి పొడవుగా వున్న బ్రాంతి కలుగుతుంది. బోల్డ్ ప్రింట్స్ కాకుండా చిన్న చిన్న ప్రింట్స్ ఎంచుకోవాలి. అడ్డ చరలున్నా వస్త్రాలకు దూరంగా వుండాలి. వెర్టికల్ ప్రింట్స్ అయితే పొడవుగా నాజుకుగా వుంటారు. కాంట్రాస్ట్ కలర్ కంటే మాచింగ్ గా వేసుకుంటే పొడవుగా అనిపిస్తారు. తక్కువ ఎత్తు వుంటే స్కర్టులు సూట్ అవ్వవు. మిడ్, ఫుల్ లెంగ్త్ స్కిర్టులు అస్సలే వద్దు. ఇవి బొద్దుగా ఉన్నట్లే చూపెట్టడం వల్ల ఎత్తు తక్కువగా కనిపిస్తారు. హై వెస్ట్ స్కిర్ట్లు మంచి ప్రత్యామ్నాయం. శరీరానికి అంటి పెట్టుకుని వుండే దుస్తుల్లో పొడవుగా వుంటారు. స్కార్ఫ్ ను మెడకు చుట్టి కట్టడం కంటే కిందకు వేలాడదిస్తే బావుంటారు. చొకార్ నెక్ పిసుల్ని కాకుండా పొడవాటి నేక్లెస్లు పెండెంట్స్ ఎంచుకోవాలి. హీల్స్ చెప్పల్సే ధరించాలి. ఇలాంటి చిన్న ట్రిక్స్ తో పొడవుగా కనిపించ వచ్చు.

    పొడుగ్గా కనిపించాలంటే

    పొడుగ్గా కనిపించాలి అని అందరికి ఇష్టమే. కానీ అందరూ పుట్టుక తో పొడవుగా ఉండరు కదా. కానీ వస్త్ర ధారణతో పొడువుగా కనిపించేలా నిపుణులు ఎన్నో సలహాలిస్తున్నారు.…

  • గతంలో వున్న కుటుంబ వాతావరణంలో పిల్లలకు క్రమశిక్షణ, మంచి అలవాట్లు, నిద్రా సమయం, భోజన సమయం అంటూ వుండేవి. ఇప్పిడా పరిస్థితి లేదు. తల్లిదండ్రులకు పరుగులెత్తే ఉద్యోగాలు, పిల్లలకు వత్తడి తెచ్చే వాతావరణంఎక్కువ కాలరీలున్న భోజనం, తియ్యని డ్రింకులు, తల్లిదండ్రుల కోసం ఎదరు చూస్తూగంటల కొద్దీ టీ.వి ల ముందు కూర్చోవడం పెద్దలతో సమానంగా నిద్ర ఇవన్నీ పిల్లల్ని ఉబకాయం వైపుగా లాగుతున్నాయి. తొందరగా తిని తొందరగా నిద్ర పొతే ఈ సమస్య వుండదు అంటారు పరిశోధకులు. కోరుకున్న స్థాయిలో లేదా అవసరమైనంత నిద్ర పోయేవారుతినే తిండి కంటే తక్కువ క్యాలరీలు తీసుకుంటారు. ఈ నిద్ర తోనే పిల్లల్లో తిండి పరిమాణం తగ్గడం గమనించారు. మితిమీరిన బరువు వల్లన వచ్చే బద్ధకం కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల కూడా శ్రద్ధ తక్కువై పోతుంది. తల్లిదండ్రుల గారాబం వల్లనే పిల్లలకు జంక్ ఫుడ్ తినడం ఎక్కువ అయ్యింది అని, పిల్లల క్షేమం కోరితే ముందుగా వాళ్ళ ఆహారం, నిద్ర, ఆటలాడే వేళల పైన దృష్టి పెట్టాలని పరిశోధనలు గట్టిగా చెపుతున్నాయి.

    నిద్ర తగ్గడం వల్లనే ఈ శరీర భారం

    గతంలో వున్న కుటుంబ వాతావరణంలో పిల్లలకు క్రమశిక్షణ, మంచి అలవాట్లు, నిద్రా సమయం, భోజన సమయం అంటూ వుండేవి. ఇప్పిడా పరిస్థితి లేదు. తల్లిదండ్రులకు పరుగులెత్తే ఉద్యోగాలు,…

  • తల్లి పాలతో బ్రహ్మాండమైన వ్యాపారం జరుగుతుంది. అమెరికాలో తల్లి పాల విక్రయం ఎప్పటి నుంచో వున్నాప్పటికి వాళ్ళ చూపు ఇప్పుడు బీద దేశాల పైన పాడింది. బన్లీదబ్రెస్ట్, బ్రెస్ట్ మిల్క్ ఫర్ సేల్,కిజిజి క్రెగ్ లిన్ద్, కిన్ కీ రామ్ ఇలా బోలెడన్ని కామ్ లో తల్లి పాలను విక్రయం చేస్తున్నారు. ఈ సైట్లు తల్లుల్ని గుర్తించి డబ్బాకు పాలను కొంటున్నారు. ఇటు అవసరమైన క్లయింట్ ను గుర్తించి అమ్ముతాయి. జున్ను పాలకు ఐదు డాలర్లు అంటే మన భాషలో 325 రూపాయలు. ఫుడ్ అండ్ డ్రగ్ నిషేదాలున్నాసరే ఈ తల్లి పాల విక్రయం భేషుగ్గా కోనసగుతుంది. కంబోడియాలో ఈ వ్యాపారం దారుణంగా వుంది. పిల్లలకు చుక్క పాలు దొరక నట్లే. పైకి దాతృత్వం అంటారు కానీ దాని చాటున ఈ తల్లి పాల వ్యాపారం చేక్కగా సాగుతుంది. కంబోడియా మొదలైన ఈ వ్యాపారం ఇంకా మన దేశానికి ఇంకా పాకిందో లేదో తెలియలేదు. ఈ పాటికి మొదలైన ఆశర్యం ఏమి లేదు.

    అమెరికాలో అమ్మపాలకి భలే గిరాకీ

    తల్లి పాలతో బ్రహ్మాండమైన వ్యాపారం జరుగుతుంది. అమెరికాలో తల్లి పాల విక్రయం ఎప్పటి నుంచో వున్నాప్పటికి వాళ్ళ చూపు ఇప్పుడు బీద దేశాల పైన పాడింది. బన్లీదబ్రెస్ట్,…