• ఆరోగ్యం ముఖ్యం అనుకొన్నప్పుడు ప్రతి చిన్న విషయం లోనూ ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సిందే. మేకప్ బ్రష్ లు పదే పదే వాడుతుంటారు. అవి రోజు క్లీన్ చేసేందుకు సమయం ఉండకపోవచ్చు. కనీసం వారానికి ఒక రోజన్నా శుబ్రం చేయాలి. ఆలివ్ నూనె లో ముంచిన దూదితో బ్రష్లు తడుపుతూ వుంటే వాటి పైన పేరుకొన్న అలంకరణ సామాగ్రి తలూకు అవశేషాలు క్రిములు పోతాయి. బ్రష్ కుచ్చుళ్ళు ఎక్కువ రోజులు నాణ్యంగా ఉంటాయి. కొబ్బరి నూనె లో యంటి బాక్టీరియల్ గుణాలన్నాయి. అవి బ్రష్ల పైన పేరుకున్న క్రిములు దూరం చేస్తాయి. ఒక్క గిన్నెలో కాస్తా కొబ్బరి నూనె తీసుకున్నా అందులో బ్రష్ లు ముంచి ఉంచేసి మర్నాడుఉదయం షాంపూ కలిపి నీళ్ళతో కడిగి ఆరబెడితే బావుంటాయి. అలాగే బేబీ షాంపూ వేసిన నీళ్ళలో బ్రష్లు పడేసి ఓ అరగంట తర్వాత శుబ్రంగా కడిగేసి నీడలో ఆరనిస్తే అంటుకున్న క్రిములూ, క్రీములూ రెండూ వదులుతాయి. అలాగే నిమ్మ గుణాలున్న ఫేస్ వాష్ ని నీళ్ళలో వేసి, బ్రష్ లు అందులో ముంచి కడిగేసినా అలంకరణ కోసం అడ్డుకున్న క్రిములు, పౌడర్లు వదిలి పోయి ఫ్రెష్ గా ఉంటాయి.

    కడిగితే క్రిములూ, క్రీములూ వదుల్తాయి

    ఆరోగ్యం ముఖ్యం అనుకొన్నప్పుడు ప్రతి చిన్న విషయం లోనూ ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సిందే. మేకప్ బ్రష్ లు పదే పదే వాడుతుంటారు. అవి రోజు క్లీన్ చేసేందుకు…

  • కొన్ని రుచికి బావుండవు అయినా తింటే బరువు తగ్గుతారు. కొన్ని పనులు చేయాలంటే ఎంతో బద్ధకంగా వుంటుంది. కానీ కాస్త హుషారు తెచ్చుకుంటే ఆరోగ్యం, శరీర సౌందర్యం రెండూ మెరుగవ్వుతాయి. కాఫీ, టీ లకు బదులు గ్రీన్ టీ, వైట్ బ్లాక్ టీ తాగితే మంచిదంటారు బ్రిటిష్ డైటింగ్ అసోసియేషన్ కు చెందిన నిపుణులు. ఓపికగా వాళ్ళు సూచించిన పనులు చేయాలి. ఆలస్యంగా నిద్రపోవడం, తినడం ఏదీ మంచిది కాదు. ఇలాంటి జీవన శైలి ఊబకయానికి దరి తీస్తుంది. ఆహారం మానేస్తే బరువు తగ్గడం ఎమీ వుండదు. శరీరానికి సరిపడా శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. రాత్రి సమయంలో లేవాల్సి వస్తుందని నీళ్ళు తాగారు. కానీ మధ్యమధ్యలోనీళ్ళు తాగాలి. ఆ నీళ్ళల్లో కీరదోస ముక్కలు, పుదీన, నిమ్మకాయ పడేసి ఆ నీళ్ళు తాగితే శరీరంలోని వ్యర్ధాలు బయటకు పోతాయి. అదనపు కొవ్వును కరిగించేందుకు ఈ నీళ్ళు ఉపకరిస్తాయి. జిమ్ యోగా చేయక పోయినా ఉదయం వేళ నడక, ఈత, టెన్నిస్ ఆడటం వంటివి చేస్తేనే ఏ కాలంలోనైనా బద్ధకం వుండదు. రాత్రి పూట తక్కువ తినడం మంచిదే కానీ నీరసం రాకుండా పళ్ళు, మజ్జిగా తప్పనిసరిగా తినాలి.

    ఆహారం కాదు జీవన శైలి మార్చాలి

    కొన్ని రుచికి బావుండవు అయినా తింటే బరువు తగ్గుతారు. కొన్ని పనులు చేయాలంటే ఎంతో బద్ధకంగా వుంటుంది. కానీ కాస్త హుషారు తెచ్చుకుంటే ఆరోగ్యం, శరీర సౌందర్యం…

  • ఈ పాత్రని నేను చేయక పొతే ఇంకెవరు చేస్తారనుకుంటాను. అందుకే ఆ ఆత్మవిశ్వాసంతోనే నా కెరీర్ ఆరంభం నుంచి ఫలానా పాత్ర చేయలేనని నేనే సినిమా వదులుకోలేదు అంటోంది కధానాయిక శృతి హాసన్. కాటమరాయుడు సక్సెస్ తర్వాత ఆమె తమిళ సినిమాలో బిజీగా వుంది. అసౌకర్యం అన్న పదం నానిఘంటువులో వుండదు. చిన్నప్పటి నుంచి నువ్వు చేయలేవని నాతో అన్న పనులని చేసేందుకు సిద్ధ పడే దాన్ని స్కూల్ లో సంగీతం, ఆటలు లాంటి విషయాల పైన మనస్సు పెట్టి చదువు నిర్లక్ష్యం చేసేదాన్ని కానీ తీరా పరీక్షలోచ్చాక రేయిబవళ్ళు చదివి మంచి మార్కులు సాధించేదాన్ని. వేరే వాళ్ళు ఈ కాస్త సమయం సరిపోతుందా అని భయపడతారు. నాకెప్పుడు భయం లేదు. చినప్పటి పరీక్షల రోజుల్లాగే ఇప్పుడు రంగం లోకి దూకితే ఆ పని పూర్తి చేస్తా. ఈ మానవత్వం వృత్తి పరంగా నేకేంతో మేలు చేసింది అంటోంది శ్రుతి. నిజమే సంకల్ప బలం ముందు ఏదైనా ఓడిపోతుంది అంటారు.

    ఎప్పుడూ నేనింతే

    ఈ పాత్రని నేను చేయక పొతే ఇంకెవరు చేస్తారనుకుంటాను. అందుకే ఆ ఆత్మవిశ్వాసంతోనే నా కెరీర్ ఆరంభం నుంచి ఫలానా పాత్ర చేయలేనని నేనే సినిమా వదులుకోలేదు…

  • ఎలాంటి వాతావరణంలోనైనా కంచి, నూలు చీరలు ఏ వయస్సు వారికైనా ఎప్పుడు బావుంటాయి. నిజానికి ఈ మధ్యకాలంలో చేనేతలు, పటోలా, పోచంపల్లి, ఇకత్ గద్వాల్ చీరలకు ఆదరణ పెరిగింది కూడా బావుంటుంది. అయితే అంచు లేని చీరలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అదే ఫ్యాషన్ కూడా అంచు లేకున్నా కొంగు భారీగానే ఉంటాయి చేనేత పట్టులో కనుక బ్లవుజ్ భారీ పనితనంతో వుండాలి. ఆధునిక డిజైన్లలో క్రాప్ టాప్ తరహ బావుంటాయి. పల్చగా తేలికగా ఉండే డాకా మన్లిన్ చీరె నేత లో కొత్త అందాల్ని తెస్తుంది. పీచ్, ఐస్ బ్లూ, సీ గ్రీన్, ముత్యపు ఛాయల్లో ఈ చీరను ఎంచుకోవాలి. నేత చీరలు ఎండలకి హాయిగా ఉంటాయి. పార్టీ వేర్ గా ఎంచుకున్నా, రోజు కట్టుకున్నా ఏ వయస్సు వాళ్ళకైనా చాలా కళగా ఉంటాయి. పార్టీ వేర్ గా ఎంచుకున్నా ఏ వయస్సు వాళ్ళకైనా చాలా కళగా ఉంటాయి. అంతులేనన్ని రంగుల్లో దోరుకుతాయి కాబట్టి అందమైన రంగు ఎంచుకునే బాధ్యత అమ్మాయిలదే

    ఎన్నో వన్నెల కలబోత ఈ చేనేత

    ఎలాంటి వాతావరణంలోనైనా కంచి, నూలు చీరలు ఏ వయస్సు వారికైనా ఎప్పుడు బావుంటాయి. నిజానికి ఈ మధ్యకాలంలో చేనేతలు, పటోలా, పోచంపల్లి, ఇకత్ గద్వాల్ చీరలకు ఆదరణ…

  • బాహుబలి లో అవంతిక పాత్రలో ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన తమన్నా, "నన్ను వైవిద్యభరితమైన పాత్రల్లో చూసేందుకు ఇష్టపడతారని తేలిపోయింది. ఈ సారి వషు భగ్నానీ చిత్రంలో బధరురాలి పాత్రలో నటిస్తున్నానన్నది. తన కొత్త సినిమా గురించి చెప్తు నాయనతార ప్రధాన పాత్రలో తమిళంలో విడుదలకు సిద్ధమైన 'కొలైయ తూర్ కాలమ్' సినిమాకు రీమేక్ ఇది ఈ సినిమాలో నాది చెమిటి, మూగ పాత్ర అంటూ చెప్పింది. తమన్నా కొత్త దారిలో నటించేందుకు సిద్ధంగా వుంది. ఇప్పుటి వరకు గ్లామర్ పాత్రల్లో నటించిన తమన్నా ప్రభుదేవాతో కలిసి హిందీలో టుక్ టుక్ టుటియా లో నటించింది. తెలుగులో అభినేత్రిగా వచ్చింది. ఇప్పుడు హిందీలో ప్రభు సరసన నటిస్తోంది తమన్నా.

    నన్ను వైవిధ్యంగా చూడాలనుకొంటున్నారు

    బాహుబలి లో అవంతిక పాత్రలో ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన తమన్నా, “నన్ను వైవిద్యభరితమైన పాత్రల్లో చూసేందుకు ఇష్టపడతారని తేలిపోయింది. ఈ సారి వషు భగ్నానీ చిత్రంలో బధరురాలి…

  • నీహారికా, కొన్ని అధ్యాయినాల వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇతరులకు సయం చేయడం అంటే సామజిక జీవనంలో పలు పంచుకోవడం కనీసం వారానికి ఒక్కసారైనా నలుగురితో కలిసిపోవడం ఎంతో ప్రయోజనం అని కొన్ని నివేదికలు స్పష్టం చేసాయి. సామజానికి పనికి వచ్చే ఎదో ఒక్క పని లో భాగంగా వుంటే, అంటే అది నలుగు మొక్కలు పెంచే పని కావొచ్చు, నలుగురు పేద పిల్లలకు భోజనం పెటోచ్చు, చదువు చేపోచ్చు, పాత బట్టలు సేకరించి ఇవ్వోచ్చు. ఇలా ఎదో ఒకటి జీవితానికి ధ్యేయంగా వుండాలి. అలావుంటే, ముందుగా మన ఆరోగ్యం బావుంటుంది అంటున్నాయి రిపోర్టులు. ఇటీవల ఒక లక్షా 80 వేల మంది పైన జరిపిన అధ్యాయినంలో సామాజిక జీవితానికి వుద్రోగాలకు వున్న సంబంధం ఏమిటో తెలుస్తుంది. సామజిక జీవితానికి దూరంగా వున్న వారిలో గత 21 సంవత్సరాల కాలంలో 4600 మంది గుండె జబ్బులతో బాధ పడుతున్నారట. మరో 3600 మందికి పక్షవాతం వచ్చిందట. ఒంటరి భావనలతో మనకెవ్వరు లేరన్న దిగులు తో అందరికి ఎదో ఒక అనారోగ్యం. అలా కాకుండా, చుట్టూ వున్న వాళ్ళ జీవనం లో కలిసిపోయి, ఎదో ఒక పనిలో పలు పంచుకుంటూ, సేవా చేస్తూ ,అభిమానం ప్రేమా పంచుతూ వున్న వారికీ ఎలాంటి గుండె జబ్బులు లేవు. హాయిగా ఉన్నారు. ఈ అధ్యాయినం ముందుగా చుట్టూ వున్న వాళ్ళతో మంచి సంబందాలతో వుండండి. నలుగురికీ ఉపయోగ పడే పనులు చేస్తూ ఆరోగ్యంగా ఉండమని చేప్పుతుంది.

    నలుగిరికీ సాయ పడితే ముందు మనం బాగుంటాం

    నీహారికా, కొన్ని అధ్యాయినాల వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇతరులకు సయం చేయడం అంటే సామజిక జీవనంలో పలు పంచుకోవడం కనీసం వారానికి ఒక్కసారైనా నలుగురితో కలిసిపోవడం…

  • మూడు సంవత్సరాల వయస్సు నుంచి కిక్ బాక్సింగ్ నేర్చుకుంది రితికా సింగ్ ముంబాయి కి చెందిన ఈ అమ్మాయిఇరుదు చుట్రు(చివరి రౌండ్) సినిమా తో సినీరంగ ప్రవేశం చేసి పెద్ద విజయం సాధించింది. గురు తో వెంకటేష్ తో నటించింది. ఆ సక్సెస్ లో మునిగి తేలుతుంది. ద్రుష్టి అంతా కిక్ బాక్సింగ్ పైనే వుండేది. పైగా కెరీర్ ప్రారంభంలోనే సీనియర్స్ తో నటించడం కకాస్త కష్టమే. గురులో నా పాత్రకు పెద్దగా మెకప్ లేదు. కానీ శివలింగా లో మాత్రం చీరకట్టు కోవాలి. మెకప్ ఎక్కువే. పైగా లారెన్స్ . నేనేమో కిక్ బాక్సర్ ని, ఆయనేమో మంచి డాన్సర్. ఆయన తో పోటీ పడి డాన్స్ చేయడం చాలా కష్టం. ప్రతి రోజు షూటింగ్ లో చుక్కలు కనిపించేవి అంటోంది రితికా సింగ్. బాక్సింగ్ అంట ఈజీ కాదు. వెండి తెర పైన నటించడం. అది నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విద్య. ఇందులో ఓనమాలు నేర్చుకోవడం ఒక్కసారి ప్రోఫెషన్ మార్చుకోవడం కష్టమే. కానీ నెమ్మదిగా అలవాటు చేసుకుంటున్నా. ఇక్కడ గ్లామర్ తో సహా అన్ని రకాల పత్రలు ఉంటాయి. ఇప్పుడు ఇంకా కొన్ని కధలు విన్నా తమిళంలో ఓ సినిమాతోనే ఇంత గుర్తింపు వస్తుందని మాత్రం నేను అనుకోలేదు అన్నది రితికా సంతోషంగా.మూడు సంవత్సరాల వయస్సు నుంచి కిక్ బాక్సింగ్ నేర్చుకుంది రితికా సింగ్ ముంబాయి కి చెందిన ఈ అమ్మాయిఇరుదు చుట్రు(చివరి రౌండ్) సినిమా తో సినీరంగ ప్రవేశం చేసి పెద్ద విజయం సాధించింది. గురు తో వెంకటేష్ తో నటించింది. ఆ సక్సెస్ లో మునిగి తేలుతుంది. ద్రుష్టి అంతా కిక్ బాక్సింగ్ పైనే వుండేది. పైగా కెరీర్ ప్రారంభంలోనే సీనియర్స్ తో నటించడం కకాస్త కష్టమే. గురులో నా పాత్రకు పెద్దగా మెకప్ లేదు. కానీ శివలింగా లో మాత్రం చీరకట్టు కోవాలి. మెకప్ ఎక్కువే. పైగా లారెన్స్ . నేనేమో కిక్ బాక్సర్ ని, ఆయనేమో మంచి డాన్సర్. ఆయన తో పోటీ పడి డాన్స్ చేయడం చాలా కష్టం. ప్రతి రోజు షూటింగ్ లో చుక్కలు కనిపించేవి అంటోంది రితికా సింగ్. బాక్సింగ్ అంట ఈజీ కాదు. వెండి తెర పైన నటించడం. అది నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విద్య. ఇందులో ఓనమాలు నేర్చుకోవడం ఒక్కసారి ప్రోఫెషన్ మార్చుకోవడం కష్టమే. కానీ నెమ్మదిగా అలవాటు చేసుకుంటున్నా. ఇక్కడ గ్లామర్ తో సహా అన్ని రకాల పత్రలు ఉంటాయి. ఇప్పుడు ఇంకా కొన్ని కధలు విన్నా తమిళంలో ఓ సినిమాతోనే ఇంత గుర్తింపు వస్తుందని మాత్రం నేను అనుకోలేదు అన్నది రితికా సంతోషంగా.

    సినిమా ముందు కిక్ బాక్సింగ్ తేలిక

    మూడు సంవత్సరాల వయస్సు నుంచి కిక్ బాక్సింగ్ నేర్చుకుంది రితికా సింగ్ ముంబాయి కి చెందిన ఈ అమ్మాయిఇరుదు చుట్రు(చివరి రౌండ్) సినిమా తో సినీరంగ ప్రవేశం…

  • గోళ్ళ పై పసుపు పచ్చని మరకలు పడిపోతూ ఉంటాయి. నెయిల్ పాలిష్ రిమూవర్ సరిగా లేకపోయినా, లేదా తరచుగా నెయిల్ పెయింట్ వేస్తున్నా. నెయిల్ కలర్ సరిగా వదలదు. ఇలాంటి సమస్య ఎదురవ్వుతుంది. వీటిని సాదరంగా పాలిష్ తో కవర్ చేస్తారు. ఇవి ఎప్పటికీ పోకుండా అలాగే ఉంటాయి. తాజా నిమ్మ రసం ఒక్క బౌల్ లోకి తీసుకుని మరకలు పడ్డ గోళ్ళని కొద్ది నిమిషాలు అందులో ముంచి, తర్వాత పొడి గుడ్డతో తుడిచి కొద్ది చుక్కలు ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల అదనపు తేమ సమకూరి గోళ్ళు మెరుస్తాయి, మరకలు పోతాయి. హైడ్రోజిన్ పెరాక్సైడ్ కూడా గోళ్ళ పై మరకలు తొలగించడంలో సయం చేస్తుంది. దీనిలో వైటనింగ్ గుణాలు ఎక్కువ. ఒక వేళ ఫంగస్ సంబందిత మరకలు పడితే లవెందర్ లేదా టీట్రీ ఆయిల్ తో కొంత ఉపసమనం వస్తుంది. స్వచ్చమైన నూనె నెయిల్ బడ్స్ ఐడ్రాపర్ తో వేసి కొద్దిసేపు వుండ నివ్వాలి. అరోమా ధెరఫి వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయిమరకలు కనిపించగానే వెంటనే ఎదో ఒక పద్దతిలో వాటిని వదిలించుకోవాలి. లేదా గోళ్ళ అందం పోతుంది. పాడైపోతాయి కూడా.

    గోళ్ళ పై మరకలకు నిమ్మరసం వాడండి

    గోళ్ళ పై పసుపు పచ్చని మరకలు పడిపోతూ ఉంటాయి. నెయిల్ పాలిష్ రిమూవర్ సరిగా లేకపోయినా, లేదా తరచుగా నెయిల్ పెయింట్ వేస్తున్నా. నెయిల్ కలర్ సరిగా…

  • ఆమె గురించి నిమిషం ఆలోచిస్తున్నారా?

    ఇంట్లో అందరికీ తెల్లారేసరికి, అమ్మకి తెల్లారి మూడు గంటలు దాటిపోయి ఉంటాయి. ఆమె అంత ముందరగా లేస్తేనే అందరికి సకల సదుపాయాలు. ఆమె ఒక్క రోజు అనారోగ్యంతో…

  • రాగి వంటి తృణ ధాన్యానికి వందల కోట్ల రూపాయిలు మార్కెట్ ఉందిట. ఓట్ మీల్ వంటి విదేశీ హెల్త్ ఫుడ్ తో పోలిస్తే మన ప్రాంతంలో పాండే రాగులు చాలా చవక కూడా. పాలిష్ చేసిన బియ్యం, గోధుమల వల్ల ఒరిగింది ఏమి లేదని తేలాక అందరి దృష్టి రగుల్లాంటి తృణ ధాన్యాల వైపు మళ్ళింది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు పళ్ళెంలో ముందుగా చోటు కల్పించ వలసింది రాగులకే అంటారు న్యుట్రీషనిష్టులు. రాగుల్లోని ట్రెపోఫాన్ అనే అమైనో ఆమ్లం ఆకలిని తగ్గిస్తుంది. రాగుల్లో కాల్షియం ఎక్కువ కనుక ఎదిగే పిల్లలకు రాగులు ఎదో ఒక రూపంలో ఇవ్వాలి. గర్భిణులకు ఇది మంచిదే మహానగరాల్లో రాగులకు ఆదరణ పెరుగుతుంది. స్టాక్ రెస్టారెంట్స్ లో రాగి ముద్ద, రాగి పుట్టు, రాగి దోస, రాగి కుకీస్, రాగి కేకు కనిపిస్తాయి. రెడీ టు కుక్ రాగి దోస, రెడీ టు కుక్ రాగి రవ్వ ఇడ్లి మిక్స్ లు అందుబాటులో కొచ్చాయి. బ్రిటానియా రాగి బిస్కెట్ లు వచ్చాయి. గత ఎడేళ్ళల్లో రాగుల ధరలు 270 శాతం పెరిగాయట. ఇంత మంచి రాగులను ఆహారం లో చేర్చుకుని హాయిగా ఆరోగ్యంగా ఉండొచ్చు కదా! పోషకాహర లోపం సరిదిద్దేది రాగి ఒక్కటేనని అంతర్జాతీయ ఆహార సంస్థ తెలుపుతుంది మరి!

    ఈ రారజుకు మీ ఇంట్లో చోటుందా?

    రాగి వంటి తృణ ధాన్యానికి వందల కోట్ల రూపాయిలు మార్కెట్ ఉందిట. ఓట్ మీల్ వంటి విదేశీ హెల్త్ ఫుడ్ తో పోలిస్తే మన ప్రాంతంలో పాండే…