• బేబీ ఆయిల్ వురికే పిల్లల కోసం అని వదిలేస్తాం కానీ ఆ తేలికైన, పసి బిడ్డ చర్మం కోసం సున్నితమైన మర్దనా కోసం ఉపయోగ పడే బేబీ ఆయిల్ మన చర్మనికే చాలా మంచిది. కాలం ఏదైనా చర్మం తేమగా ఉండాలంటే స్నానం చేయగానే చర్మం తడిపొడిగా ఉన్నప్పుడే ఈ ఆయిల్ రాసుకోవాలి. అలంకరణ తొలిగించు కొనేందుకు బేబీ ఆయిల్ శ్రేయస్కరం. చేతులు, కాళ్ళపై అవాంచిత రోమాలు తొలగించాక మంట పెట్టకుండా చర్మం బారకగా అయిపోకుండా బేబీ ఆయిల్ వాడాలి. కళ్ళ చుట్టూ నల్లని వలయాల కోసం, పగిలే పెదవులకోసం ఈ ఆయిల్ వాడకం మంచిది. జుట్టు ఎండిపోయి జుట్టు కుదుళ్ళు బలహీనమై వెంట్రుకలు రాలిపోతున్నాయి అనిపిస్తే బేబీ ఆయిల్ పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచిది. గోళ్ళు పగినట్లుగా ఈ బేబీ ఆయిల్ లో ముంచి చిన్నగా మర్దనా చేస్తే ఎంతో మంచిది. ఈ తెలికైన నూనె చేసే మేలు అంతా ఇంతా కాదు.

    అస్సలు బేబీ ఆయిల్ వాడి చూడండి

    బేబీ ఆయిల్ వురికే పిల్లల కోసం అని వదిలేస్తాం కానీ ఆ తేలికైన, పసి బిడ్డ చర్మం కోసం సున్నితమైన మర్దనా కోసం ఉపయోగ పడే బేబీ…

  • పచ్చిగా తిన్నా ఉడికించి తిన్నా పెద్దగా పశాకల విలువలు మారని కూరల్లో మొట్ట మొదటిగా చెప్పుకోవలసింది పాలకూర. ఇందులో చాలా పోషకాలున్నాయి. కెరోటినాయిడ్స్, బీటాకెరోటిన్, లుటిన్, విటమిన్-కె, ఫోలెట్ ఇంకా ఎన్నో లవణాలు పుష్కలంగా దొరుకుతాయి. పీచు ఎక్కువే ఉడికిస్తే కెరోటినాయిడ్స్ కొంత తగ్గుతుంది. మిగతా పోషకాలు, విటమిన్లు తేడాలేవు. అయితే ఒకే ఒక్క నిమిషం పలకూరని ఉడకనిచ్చి అందులో నీళ్ళను పరబోయాలి. అలా చేస్తే నీటి లోని అక్సాలిక్ యాసిడ్ బయటకి పోతుంది. శరీరానికి కాల్షియం అందకుండా చేసేది ఇది. దాన్ని బయటకి పంపించాక ఇక ఆకు కురలోని కాల్షియం పూర్తి స్థాయిలో శరీరానికి పడుతుంది. అప్పుడిక ఎలా ఇష్టం అయితే అలా తినొచ్చు. ఇన్ఫెక్షన్లు రానీయదు, మలబద్దకం నియంత్రిస్తుంది, రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. జీవక్రియలు సాఫీగా జరిగేందుకు ఉపయోగ పడే ఈ పలకూర ఆహారంలో తప్పని సరిగా చేర్చాలి.

    ఎలా తిన్నా పోషకాల విలువలు పోవు

    పచ్చిగా తిన్నా ఉడికించి తిన్నా పెద్దగా పశాకల విలువలు మారని కూరల్లో మొట్ట మొదటిగా చెప్పుకోవలసింది పాలకూర. ఇందులో చాలా పోషకాలున్నాయి. కెరోటినాయిడ్స్, బీటాకెరోటిన్, లుటిన్, విటమిన్-కె,…

  • నాలుగు మొక్కలుంటే చుట్టూ పచ్చదనం వుంటే ఎంతో బావుంటుంది. అలా కుండీల్లో మొక్కలు పెంచుకునే సౌకర్యం లేకపోతె ఏకంగా గోడలకే మొక్కలు అతికించి పెంచే అవకాశం వచ్చింది. మట్టి లేని చోట అపార్ట్ మెంట్స్ లో మొక్కలు పెంచాలంటే అదీ బాల్కనీ పిట్ట గోడలకు మొత్తం ఇంటి చుట్టూరా పచ్చదనం ఉండాలనుకుంటే వర్టికల్ గార్డెన్ మంచి ఆప్షన్. ఇంట్లో కార్బన్ డయాక్సడ్ తొలగించి స్వచ్చమైన ఆక్సిజన్ అందించటానికి గ్రీన్ వాల్ ఉపయోగ పడుతుంది. ఈ వర్టికల్ గార్డెన్స్ కోసం మట్టి అవసరం లేదు. షీట్ లో కొబ్బరి పొడి నింపుతారు. ఇందులోనే మొక్కలు పెరుగుతాయి. మొక్కలకు కావాల్సిన ఎరువును కాయర్ పిచ్ లో కలుపుతారు. మట్టి అంటే కాయిర్ పిట్ లోనే మొక్కలు ఏపుగా బలంగా పెరుగుతాయి. ఇంట్లో చల్లదనం వుంటుంది. నగరం మొత్తంగా నిండి ఉన్న కాలుష్యం నుంచి బయటపాడేందుకు ఈ మొక్కలే ఆధారం. గ్రీన్ వాల్ కు డ్రాప్ ఇరిగేషన్ పద్దతిలో నీటి సరఫరా చేసుకోవచ్చు. కాబట్టి నీటి వృధా వుండదు.

    గోడ మొక్కలు పెంచితే చల్లదనం

    నాలుగు మొక్కలుంటే చుట్టూ పచ్చదనం వుంటే ఎంతో బావుంటుంది. అలా కుండీల్లో మొక్కలు పెంచుకునే సౌకర్యం లేకపోతె ఏకంగా గోడలకే మొక్కలు అతికించి పెంచే అవకాశం వచ్చింది.…

  • వేసవిలో ఎక్కువగా వచ్చే పాళ్ళల్లో తియ్యని కర్భూజా పండ్లు కూడా తింటే ఎన్నో విధాలా శరీరానికి మేలు చేకూర్చేవే. నీటి శాతం ఎక్కువ కాబట్టి చల్లగా హాయిగా వుంటుంది. పండ్లలో వుండే పొటాషియం హైపర్ టెన్షన్ ను దూరంగా ఉంచుతుంది. విటమిన్-ఎ, బీటా కెరోటిన్ ద్రుష్టిని మెరుగు పరచి శుక్లాలు రానివ్వదు. కర్భూజాలోని చక్కెరను శరీరం చాలా ఈజీగా జీర్ణం చేసుకుంటుంది. దానిలో వుండే ప్రత్యేకమైన పీచు వల్ల బరువు తగ్గే అవకాశము వుంది. రక్తంలోని చక్కెర స్థాయిలు సిద్ధంగా ఉంటాయి. దీని లోని విటమిన్-సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తెల్ల కణాల సంఖ్య పెంచే వ్యాధికారక బాక్టిరియా వైరస్ ల నుంచి రక్షణ కల్పిస్తుంది. కండరాళ్ళు, నరాలు రిలాక్స్ అయి మంచి నిద్ర పడుతుంది. నెలసరి నొప్పులు తగ్గుతాయి.

    బెస్ట్ సమ్మర్ ఫ్రూట్ కర్భూజా

    వేసవిలో ఎక్కువగా వచ్చే పాళ్ళల్లో తియ్యని కర్భూజా పండ్లు కూడా తింటే ఎన్నో విధాలా శరీరానికి మేలు చేకూర్చేవే. నీటి శాతం ఎక్కువ కాబట్టి చల్లగా హాయిగా…

  • సీజన్ తో టైమ్ తో సంబంధం లేకుండా పల్లీలు ఎప్పుడైనా తిన బుద్దేసే స్నాక్ లాంటివి. కానీ పల్లీలు ఆరోగ్యానికి మంచిది కాదనే వాటిని తీసుకుంటే కొవ్వు పెరుగుతుందనే అనుమానాలు చాలా మందికి వుంటుంది. ఇవి కేవలం అపోహేనని ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివంటున్నారు పరిశోధనలు. మధ్యాహ్నం భోజనంలో పాటు కొన్నిపల్లీలు నేరుగా కానీ షేక్ రూపంలో గానీ తీసుకుంటే గుండె ఆరోగ్యంగా వుందని పరిశోధనల్లో వెల్లడైంది. పల్లిలు తింటే ట్రైగ్లిజరైడ్స్ తగ్గిన విషయం తెలిసిందట మాములుగా భోజనం అనంతరం రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ స్థాయి పెరుగుతుంది. రక్తంలో వీటి స్థాయి పెరిగితే గుండె సంబందిత అనారోగ్యాలు వస్తాయట. ఈ పల్లిల వల్ల ఈ సమస్య ఉండదని, హాయిగా వస్తాయిట. ఈ పల్లిల వల్ల ఈ సమస్య ఉండదని, హాయిగా పూటకో గుప్పెడు తినండి అంటున్నారు పరిశోధకులు.

    పల్లీలు తింటే గుండెకి సమస్యే రాదు

    సీజన్ తో టైమ్ తో సంబంధం లేకుండా పల్లీలు ఎప్పుడైనా తిన బుద్దేసే స్నాక్ లాంటివి. కానీ పల్లీలు ఆరోగ్యానికి మంచిది కాదనే వాటిని తీసుకుంటే కొవ్వు…

  • నీహారికా, నా స్నేహితులు నా చుట్టూ ఉన్నప్పుడే నేను భద్రంగా, సుఖంగా ఉన్నట్లు అనిపిస్తుంది అన్నావు, చాలా కరెక్ట్. స్నేహితులు లేకుండా మనసుని పంచుకోనేవాళ్ళు లేకుండా జీవితం సమగ్రంగా ఉండదు. మన బాధలు, సంతోషాలు వాళ్ళతో పంచుకొంటేనే మనం పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తాం. అందుకే ఎంత పని ఒత్తిడి వున్నా గంటో, అరగంటో వాళ్ళ కోసం కేటాయించి తీరాలి. స్నేహితులు చెప్పేది శ్రద్ధగా వినాలి. మొత్తం మనమే మాట్లాడాలని కూడా అనుకోకూడదు. వాళ్ళ మాటలకీ ప్రాధన్యం ఇవ్వాలి. మరి స్నేహితులను కోరుకుంటే వాళ్లకు ప్రత్యేకత ఇవ్వాల్సిందే కదా. అలాగే ఆపదలో ఉన్న స్నేహితులను ఆదుకునేందుకు ముందుండాలి. వాళ్ళకు వచ్చిన కష్టం ఏదో తెలుసుకుని ధైర్యం చెప్పాలి. వాళ్ళా ఆపదలోంచి బయటకు వచ్చేదాకా ఫోన్ లో టచ్ లో ఉండాలి. మనతో అయ్యే ఎలాంటి సాయం అయినా చేయాలి. ఒక్కోసారి ఫ్రెండ్స్ కు నచ్చింది మనకు నచ్చకపోవచ్చు, వెంటనే నాకు నచ్చలేదు అనక్కర్లేదు. ఎదుటి వాళ్ళ అభిప్రాయాలకు విలువిస్తేనే స్నేహం నిలబడేది. అలాగే కొన్ని పొరపాట్లు జరగచ్చు.అప్పుడూ ఆ పొరపాటు గురించి చక్కగా మాట్లాడుకొని, చర్చించుకొని పరిష్కరించుకోవాలే గానీ స్నేహాలు పోగొట్టుకోకూడదు.

    చెప్పడం కాదు కాసేపు వినాలి కూడా

    నీహారికా, నా స్నేహితులు నా చుట్టూ ఉన్నప్పుడే నేను భద్రంగా, సుఖంగా ఉన్నట్లు అనిపిస్తుంది అన్నావు, చాలా కరెక్ట్. స్నేహితులు లేకుండా మనసుని పంచుకోనేవాళ్ళు లేకుండా జీవితం…

  • ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఓ చందా కొచ్చార్, తన కుమార్తె ఆర్తి కొచ్చర్ కు రాసిన లేఖ ఇప్పుడో సంచలనం సుధామీనన్ రాసిన లెగసీ లెటర్స్ ఫ్రొం ఎమినెంట్ పేరెంట్స్ టు దెయిర్ డాటర్స్ అన్న పుస్తకంలో ఈ లేఖ అచ్చయిది 13వ ఏటనే తండ్రిని పోగొట్టుకొన్న చందా కొబ్బరి తన తల్లి ద్వారా జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను ఈదడం నేర్చుకున్నారు. ఈ ఉత్తరంలో కొబ్బరి తన కూతురు ఆర్తికి కేవలం వర్కింగ్ ఉమెన్ గా వుంటే సరిపోదు కుటుంబ బాధ్యతల్ని కూడా నిర్లక్ష్యం చేయొద్దని చెపుతారు. 'నీ కుటుంబానికి ఏం కావలో మవు సమకూరుస్తు పొతే నీకేం కావాలో నీ కుటుంబం సమకూరుస్తు వస్తారంటారు. "నేను నాకెరీర్ లో తలమునకలుగా వున్నా. మీ నాన్న నా పైన చిన్ని ఫిర్యాదు కూడా లేకుండా చేశానన్నారు. నువ్వు కుడా నాలాగే జీవితంలో అన్ని క్లిష్టమైన సమయాల్లోనూ జీవిత భాగస్వామి తో సర్వమైన బంధాల్ని కొనసాగించాలి అంటే వృత్తిని కుటుంబాన్ని సమర్ధంగా నడిపిస్తానని నమ్ముతున్నానన్నారు. మన జీవితాలను నిలబెట్టడంలో కఠోర శ్రమ పాత్ర కీలకం, మనం నిర్ణయించుకునే దారిని మనమే ఏర్పరుచుకోవాలి. జీవితం మనపదీ ఇవ్వదు. మనం కష్ట పది నిర్మించుకున్నదే అన్నారామె. ఒక తెలివైన సమర్దురాలైన తల్లి రాసే లేఖ ఇంకోలావుండే అవకాశమే లేదు. ఈ లేఖ ఇవ్వాల్టి అమ్మాయిల కోసమే కదా.

    కుటుంబానికి నువ్వేదిస్తే అదే దొరుకుతుంది

    ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఓ చందా కొచ్చార్, తన కుమార్తె ఆర్తి కొచ్చర్ కు రాసిన లేఖ ఇప్పుడో సంచలనం సుధామీనన్ రాసిన లెగసీ లెటర్స్ ఫ్రొం ఎమినెంట్…

  • అంత ఎండకి ఈ మాత్రం జాగ్రత్త కావాలి

    మండే ఎండల్లో చర్మ సంరక్షణ చాలా అత్యవసరం ఇందుకు గానూ కొంత ప్రత్యేక మైన శ్రద్ధ తీసుకోవాలి. ఎంత తొందర పని వున్నా. ముందుగా సన్ స్క్రీన్…

  • కర్పూరపు చెట్టు నీలగిరి కొండల్లో పెరుగుతుంది చక్కని సువాసన గలిగిన బెరడు వుంటుంది. కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్ళలో వేసి మరిగించి డిస్టిలేషన్ పద్దతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చ కర్పూరం అంటారు. రెండు పలుకుల పచ్చకర్పూరం తీసుకుని కొంచం మంచి గంధం, వెన్న కలిపి తమల పాకులోని వేసుకుని నమిలి రసం మింగితే కళ్ళు బైర్లు కమ్మడం, తలతిరగడం, కడుపులో వికారం, అతిగా చమటలు పట్టడం తగ్గిపోతాయి. ఒంట్లో వేడి తగ్గుతుంది. ఈ వేసవి ఎండలకు వడదెబ్బ, అతి దాహం, శరీరం చమటలు పట్టడం, శోష రావడం మొదలైనవి కూడా ఈ పచ్చకర్పూరం తీసుకుంటే తగ్గిపోతుంది. కంటికి సంబందించిన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు రావు. ప్రచీన వైద్య విధానంలో పచ్చ కర్పూరం వాడకం వుంది. ఆరోగ్యం పచ్చగా వుండాలంటే ఒక చిన్నపలుకు పచ్చ కర్పూరం తీసుకుంటే మంచిదే. ఇంకా ఉపయోగాల కోసం ఆయుర్వేద వైద్యులను సంప్రదించవచ్చు.

    చిన్న పలుకు తీసుకుంటే ఎంతో మేలు

    కర్పూరపు చెట్టు నీలగిరి కొండల్లో పెరుగుతుంది చక్కని సువాసన గలిగిన బెరడు వుంటుంది. కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్ళలో వేసి మరిగించి డిస్టిలేషన్ పద్దతిలో…

  • చెరుకు రసాన్ని వేసవి పానీయం అంటారు. డీ హైడ్రేషన్ కు గురైతే తక్షణ శక్తి ఇస్తుంది చెరుకురసం. ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా వుంటుంది. అంచేత మధుమేహం వున్న వాళ్ళు కూడా ఈ రసం తాగొచ్చు. చెరుకురసంలోని ఫినాల్, ఫ్లేవనాయిడ్ లు శరీరంలోని చెడు బాక్టీరియా తొలగిస్తాయి. కాలేయ వ్యాధులు రాకుండా కామెర్లు రాకుండా కాపాడుతుంది. అలసట నివారించగల మెగ్నీషియం, పోటాషియం, పాస్పరస్, కాల్షియం, ఎలక్ట్రోలైట్స్ చెరుకురసం లో పుష్కలంగా ఉన్నాయి. దాహం తీర్చి బలాన్ని ఇస్తుందీ రసం. ఇందులో పుదీనా అల్లం నల్లరాతి ఉప్పు కలిపి తాగితే వేసవి తాపం భాదించదు. ఇది నూరు శాతం సహజమైన తియ్యదనం ౩౦ గ్రాములుటుంది. 18 శాతం కాలరీలుంటాయి ఆరోగ్య కరమైన పీచు 13 గ్రాములు వుంటుంది. ఇందులో వుండే సుక్రోజ్, ఫ్రక్టోజ్ ఇతర గ్లూకోజ్ పదార్ధాల ద్వారానే సహజమైన తియ్యదానం వస్తుంది.

    తక్షణ శక్తికి చెరుకురసం

    చెరుకు రసాన్ని వేసవి పానీయం అంటారు. డీ హైడ్రేషన్ కు గురైతే తక్షణ శక్తి ఇస్తుంది చెరుకురసం. ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా వుంటుంది. అంచేత…