• ఎన్నో ఆహార పదార్దాలు నిల్వ చేసే టప్పుడు, వాటిని వండేటప్పుడు చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంగాళా దుంపలు బాగా పెద్దవిగా వస్తు వున్నాయి మార్కెట్ లో కానీ చిన్న దుంపల్ని తీసుకుంటే వాటిని చెక్కు తీసె పని ఉండదు. ఆ చెక్కులో వుండే పిచులో మనకు 50 శాతం ఫాలి ఫినాల్స్ అందుతాయి. పాలకూర సలాడ్ లో వేసే ముందర కొన్ని నిమిషాలు పెనం పైన వేడి చేస్తే అందులోని విటమిన్-ఎ శాతం మూడు రెట్లు పెరుగుతుంది. ద్రాక్ష పండ్లు ఫ్రిజ్ లో పెట్టక పోవడం మంచిదే. బయట టేబుల్ పైన గాలి లో ఉంచితే వాటి పైన పేరుకున్న రాసాయినాలు పోతాయి. బజార్లో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు దొరుకుతాయి. వీటిని ఎప్పటి కప్పుడు వంటల్లో వదేయాలి. నిల్వ ఉంచితే పొట్టు ఉంటేనే మంచిది. గాలికి వెలుతురికి వాటిల్లో వుండే వాసన రుచి పోతుంది. టొమాటో ఫ్రిజ్ లో ఉంచితే వాటిల్లో వుండే పోశాకాలైన లికోపిన్ ఫైటో న్యూట్రియంట్లు యంటి ఆక్సిడెంట్ గుణాలు తగ్గిపోతాయి.

    అన్ని ఒకేలా వుండవు

    ఎన్నో ఆహార పదార్దాలు నిల్వ చేసే టప్పుడు, వాటిని వండేటప్పుడు చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంగాళా దుంపలు బాగా పెద్దవిగా వస్తు వున్నాయి మార్కెట్ లో…

  • ఈ పరిమళాన్ని పరిమితంగా వాడాలి

    అత్యుత్తమ సౌందర్య రక్షణకు నిపుణులు ఆరు రకాల ఎసెన్షియిల్ ఆయిల్స్ సూచిస్తున్నారు. గులాబీ, వీట్ జెర్మ్, ఇలాంగ్ ఇలాంగ్, రోజ్ మేరి, లైట్ లోటస్, లావెండర్ ఇవి…

  • ముత్యాల్లాంటి బార్లీ గింజలు నీళ్ళల్లో వేసి మరిగించి చల్లార్చి ఆ నీళ్ళలో పాలు లేదా మజ్జిగ కొద్దిగా ఉప్పు వేసి తాగితే శరీరానికి పోశాకాలందుతాయి ఆరోగ్యం బావుంటుంది. బార్లీ అద్భుతమైన అపురూప శక్తిగత గింజ ధాన్యం. రుచి పరిమళం కూడా వుంటుంది. బార్లీ ప్రపంచంలో ప్రధానమైన నల్గోవ పంట. శరీరానికి ద్రుడంగా దేహక్రుతి చెక్కగా తీర్చిదిద్దుకోవడానికీ ఈ చిన్ని గింజలు ఎంతో దోహదం చేస్తాయి. ఈ గింజల్లో పీచు, సెలీనియం పుష్కలంగా వున్నాయి. ఖనిజ లవణాలు ఫాస్పరస్, కాంపర్ మంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా వున్నాయి. బార్లీ శరీరంలో చెడు కొలెసస్ట్రోల్ తగ్గిస్తుంది. మోనోపాజ్ దాటిన మహిళలు ఇవి తీసుకుంటే రక్త నాళాలు పుడుకు పోవడం రక్త ప్రసరణ జరిగే నాళాలు కుచించు పోయేలా చేసే ఫ్లాక్ ఏర్పడటం గణనీయంగా తగ్గుతాయి. రొమ్ము క్యాన్సర్ ప్రమాదం రానీయదు. పిండి పదార్ధాలు మాంసాకృతులు, విటమిన్లు, ఖనిజాలు, పోషక ఔషధ గుణాలున్న బార్లీ గింజలు ఆరోగ్య సిరులు.

    ఆరోగ్య సిరి ఔషద గని బార్లీ

    ముత్యాల్లాంటి బార్లీ గింజలు నీళ్ళల్లో వేసి మరిగించి చల్లార్చి ఆ నీళ్ళలో పాలు లేదా మజ్జిగ కొద్దిగా ఉప్పు వేసి తాగితే శరీరానికి పోశాకాలందుతాయి ఆరోగ్యం బావుంటుంది.…

  • ఈ తమిళనాడు టీచరుగారు గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసం మూడు లక్షలు విలువ చేసే -నగలు అమ్మేసి తరగతి గదిని మోడ్రన్ గా అలంకరించేసారు. ఈ పాఠశాల తమిళనాడులో విల్లిపురం అనే ప్రాంతంలో వుంది. ఆ పాఠశాలలో ఆంగ్లం భోదిస్తారు అన్నపూర్ణ మోహన్. పిల్లలకు ఇంగ్లీష్ అంత సులభంగా రావడం లేదని అర్ధం అయ్యింది ఆమెకు. మూడో తరగతి వరకు వచ్చాక పిల్లలు నేర్చుకునేందుకు సిద్దంగా వుంటారు. వాళ్ళకి ఏదైనా చూపిస్తూ నేర్పిస్తూ వుంటే త్వరగా నేర్చుకోగలరు. ప్రభుత్వ పాఠశాలలకు ఏ వస్తువు కొనాలన్నా నిధులు లేవు. ఆమె తన విద్యార్ధుల కొసం తన నగలు అమ్మేసింది. మూడు లక్షల రూపాయిలతో స్మార్ట్ బోర్డు పెద్ద ఎల్ సి డీ తెర పిల్లలు కుర్చునేందుకు అధునాతన ఫర్నీచర్, గోడల నిండా విజ్ఞానం పంచె రంగు రంగుల బొమ్మలు ఇవన్నీ తన వైపు కనుకగా ఇచ్చింది. పుస్తకాలు, బ్యాగులు కూడా కనుకగా ఆ పిల్లలకు అందాయి. అన్నపూర్ణా మోహన్ తల్లి లాంటి టీచర్.

    ఆధునిక బోధనా కోసం నగలు అమ్మేసింది

    ఈ తమిళనాడు టీచరుగారు గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసం మూడు లక్షలు విలువ చేసే -నగలు అమ్మేసి తరగతి గదిని మోడ్రన్ గా అలంకరించేసారు. ఈ పాఠశాల…

  • కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది రవీనా టాండన్. ఇప్పుడు కొన్నాళ్ళ విరామం తర్వాత నాయికా ప్రాధాన చిత్రం మాత్ర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె యువత కోసం ఒక ఉత్తరం రాసింది. ఆడ పిల్లలు ఓ సారి చదువుకుంటే బావుంటుంది కూడా. " ఆడపిల్లల్లారా ఈ సమాజం మాకు రక్షణ కల్పించడం లో వైఫల్యమైంది. మారక్షణ మాచేతుల్లోనే వుంది. సమస్య ఎదురైతే న్యాయం కోసం మాట్లాడటం నేర్చుకోండి. వేధించే వారిని, వెకిలిగామాట్లాడే వారిని, మనల్ని తాకాలని చూసే వాళ్ళకి ఎదురు తిరగండి. ఏటా అమ్మాయిల పైన ౩౦ వేలకు పైగా అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటిని ఆపాలంటే అబ్బాయిల్లో, అమ్మాయిల్లో, తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. అబ్బాయిలు, అమ్మాయిలను అర్ధం చేసుకోవాలి. వారి తిరస్కారణకు కారణం తెలుసుకోండి. వారి వైపు చూసే చూపుల్లో ఆలోచనల్లో సానుకులత తప్ప ఇంకో భావం ఉండకూడదు, ఇలా సాగిన ఈ ఉత్తరం సోషల్ మీడియాలో ఎంతో మంది ద్రుష్టిని ఆకట్టుకొంది. పూర్తి పథం కావాలంటే చూడొచ్చు.

    మిమ్మల్ని మీరే కాపాడుకొండి

    కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది రవీనా టాండన్. ఇప్పుడు కొన్నాళ్ళ విరామం తర్వాత నాయికా ప్రాధాన చిత్రం మాత్ర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె యువత…

  • హైహీల్స్ ఇష్టంలేని అమ్మాయిలు ఉన్నారా? ఇందులో బోలెడన్ని ఫ్యాషన్ వెరైటీలు కిచెన్, పెన్సిల్, పంప్స్, వెడ్జేస్, కొన్...... ఇలా దుస్తుల్ని బట్టి ఒక్కటి ఎంచుకొంటారు. కానీ ఈ హీల్స్ వాడుతున్నప్పుడు కాలి బొటన వేలి పైన బరువు పడుతుంది. ఎత్తు మడమల చెప్పుల తో పాదం లోని నరాలు శ్రమకు గురవ్వుతాయి. పిక్కలు కండరాళ్ళ పైన ఒత్తిడి పడుతుంది. దీర్ఘ కాలం పాటు ఇవి వాడితే పిక్కల పైన కండరాళ్ళు కుచించుకు పోతాయి. పాదాల అడుగున వంపు తగ్గి పదాలు చడురుగా అయ్యిపోతాయి. దీని వల్ల ప్లాంటర్ ఫాసియైటిస్ అనే మడమ నొప్పి బాధ పెడుతుంది. ఒక్క సారి ఈ ఎత్తైన హీల్స్ తో స్లిప్ అయి పాదం మడత బడ్డ లేదా విరిగిన ఇక శాశ్వత ఇబ్బందే, కనుక ఎంత ఫ్యాషన్ అయినా ఈ హీల్స్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి.

    అందం సరే… నొప్పోస్తే

    హైహీల్స్ ఇష్టంలేని అమ్మాయిలు ఉన్నారా? ఇందులో బోలెడన్ని ఫ్యాషన్ వెరైటీలు కిచెన్, పెన్సిల్, పంప్స్, వెడ్జేస్, కొన్…… ఇలా దుస్తుల్ని బట్టి ఒక్కటి ఎంచుకొంటారు. కానీ ఈ…

  • పుట్టగొడుగులు నుంచి పోషక విలువలున్న శక్తి ఇచ్చే ఆహారం సాధారణంగా వీటిని సూప్ లు, సలాడ్ లు, సండ్ విచ్ లేదా ఆకలి పుట్టించే సూప్ లుగా తాయారు చేస్తారు. ఎక్కువగా పౌష్టికాహార ఉత్పత్తుల్లో స్పోర్ట్స్ డ్రింక్స్ లో ఉపయోగిస్తారు. వీటిల్లో 80 శాతం నీరు తక్కువ కేలరీలు సోడియం, ప్యాట్ కూడా చాలా తక్కువ. పొడిగా వుండే పుట్ట గోడుగుల్లో ఫైబర్ 8 నుంచి 10 శాతం వుంటుంది. ఒక అరటి పండు లేదా, బత్తాయి రసంలో లభించే పొటాషియం కంటే కొంత తక్కువే వీటిలో లభిస్తుంది. రోజుకు ఒక్క సారి పుట్టగొడుగుల కూర తింటే ఆ రోజుకు అవసరమైనంత రాగి ఇందులో దొరుకుతుంది. పుట్టగొడుగుల్లో ఇంకా రిబో ఫ్లానిన్, నియాసిన్, సిలికానియం ఉంటాయి. సిలీనియం విటమిన్-ఇ తో కలిపి ప్రీరాడికల్స్ నుంచి కణజాలన్నీ రక్షించడానికి పోరాడుతుంది.

    పోషకాల నిలయం పుట్టగొడుగులు

    పుట్టగొడుగులు నుంచి పోషక విలువలున్న శక్తి ఇచ్చే ఆహారం సాధారణంగా వీటిని సూప్ లు, సలాడ్ లు, సండ్ విచ్ లేదా ఆకలి పుట్టించే సూప్ లుగా…

  • కలిసి పోవటం కనీస మర్యాద

    నీహారికా, ఏది మందిలోకి వెళ్ళే సందర్బాలు ఎన్నో వస్తాయి. ప్రతి దానికి వెళ్ళాలి కూడా అందుకు ముందు స్నేహితులు, బంధువులు మధ్యకి వెళ్ళే సందర్బంలో పాటించిన మర్యాదలు…

  • ఇలాoటి ప్యాక్ ట్రై చేయండి

    ముప్పయిలు దాటి నలభైల్లోకి అడుగుపెడుతూ ఉండగానే అప్పటివరకు నున్నగా అందంగా కనబడే ముఖంపైన చిన్న మచ్చలు మొదలవుతాయి. రొటీన్ గా ఎదురయ్యే ముడతలకు తోడుగా అన్నమాట. దీన్ని…

  • ఎండకు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేవి కళ్ళు. అత్యంత కాంతివంతమైన వాతావరణంలోకి వెళ్ళే సమయంలో కళ్ళకు తప్పనిసరిగా సన్ గ్లాస్సెస్ వాడతారు. ఏ రంగైనా పర్లేదు కంటికి పూర్తి రక్షణ ఇచ్చేదిగా వుండాలి. పోలరైజ్ డ్ సన్ గ్లాస్సెస్ వల్ల అంత ఉపయోగం లేకపోవచ్చు తెల్లని చాయ గలవారు సన్ స్క్రీన్ లోషన్ మొఖానికి అప్లయ్ చేయాలి. అంత పెద్దగా వున్న టోపీలు ధరిస్తే కళ్ళ పైకి నేరుగా ఎండ పడకుండా వుంటుంది. కళ్ళని చల్లని నీళ్ళతో కడుక్కుంటూ వుండాలి. పిల్లల్లో కంటి పోర పెద్దదిగా వుంటుంది. ఎండల్లో ఎక్కువగా ఆడుతుంటారు. వీలైనంత వరకు ఎండ ప్రభావం తగ్గే వరకు పిల్లల్ని ఎండలోకి వేల్లనివ్వక పోవడం మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ వుండే మంచి పోషకాహారం పిల్లలకు ఇవ్వాలి. పెద్దలూ తీసుకోవాలి. అప్పుడే ఎండ నుంచి మనల్ని రక్షించుకో వచ్చు. ఎట్టి పరిస్తితుల్లోనూ సూర్యుడిని నేరుగా చూడకూడదు. ఇది వేసవికే కాదు అన్ని కాలాలకూ వర్తిస్తుంది.

    ఎండల్లో పిల్లలు జాగ్రత్త

    ఎండకు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేవి కళ్ళు. అత్యంత కాంతివంతమైన వాతావరణంలోకి వెళ్ళే సమయంలో కళ్ళకు తప్పనిసరిగా సన్ గ్లాస్సెస్ వాడతారు. ఏ రంగైనా పర్లేదు కంటికి పూర్తి…