ఇవి పిల్లలకెందుకు?

ఇవి పిల్లలకెందుకు?

ఇవి పిల్లలకెందుకు?

పవర్ డ్రింక్ లుగా భావిస్తున్న స్పోర్ట్స్ పానీయాలు, విటమిన్ వాటర్స్ కు బరువు పెంచే శక్తి తప్పా ఇంకా అదనపు ఉపయోగం ఏదీ లేదని తేల్చాయి పరిశోధనలు వివిధ రుచులు, విటమిన్లు, ఖనిజాలు వుండే విటమిన్ డ్రింక్స్  కుడా సాధారణంగా అదనపు క్యాలరీలు కలిగి ఉంటాయి. వీటిలో ఉపయోగించే స్వీట్ నర్లు, కెఫైన్ లేదా హెర్బల్ పదార్ధాలు పిల్లలకు అపకారం చేస్తాయంటున్నారు. పవర్ డ్రింక్స్ లో వుండే ఎలక్ట్రోడ్స్, కార్బోహైడ్రేడ్స్ ఏడ తెరిపి లేకుండా ఆటలాడే వారికే ఉపయోగం. మామూలుగా ఆడుకునే పిల్లలకు ఆరోగ్య వంతమైన ఆహారం, మంచి నీళ్ళు ఇస్తేనే చాలు వాళ్ళకి కావలసిన పోషకాలు అందుతాయని చెప్పుతున్నారు పరిశోధకులు.