ప్రపంచంలోనే అత్యంత కఠినంగా చెప్పే అల్ట్రా రన్ బ్రెజిల్ 135 ను పూర్తి చేసిన పూజా కృష్ణమూర్తి ఈ సాహసం సాధించిన మొదటి భారతీయురాలు. ముంబై లో పుట్టి పెరిగిన పూజా ఆమె అక్క ప్రియా మౌంటెనీరింగ్ లో శిక్షణ తీసుకున్నారు. 2011లో హాఫ్ మారథాన్ కు పేరు నమోదు చేసుకున్నారు. పోటీలో పాల్గొన్నారు.అల్ట్రా మారథాన్ కు సహాయక బృందం లో పాల్గొన్న తరువాత పూజ తాను అల్ట్రా రన్నర్ నని తేల్చుకున్నారు. లండన్ పూణే మారథాన్ లో పూర్తి చేశాక ఆ ధైర్యంతో బ్రెజిల్ అల్ట్రా మారథాన్ కు వెళ్లారు. 135 పరుగెత్తే దూరం కానీ అందులో 217 కిలోమీటర్లు కొండలపైన నడిచి వెళ్ళాలి ఈ పరీక్ష 60 గంటల్లో పూర్తి చేయవలసి ఉండగా పూజ దాన్ని నలభై ఎనిమిది గంటల్లోనే ముగించి అల్ట్రా రన్ లో అదరగొట్టారు .














