• మాయిశ్చరైజర్ ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అదేంపెద్ద కష్టం కాదు ఇంట్లో ఉండే వస్తువుల తోనే చెంచా తేనె అంతే కొబ్బరి నూనె నిమ్మరసం కలిపితే అదే సహజమైన మాయిశ్చరైజర్. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదినిమిషాల [ఆటు మృదువుగా రుద్దుతూ ఉండాలి. కాస్సేపటికి కడిగేసుకోవచ్చు. రాత్రిపూట పడుకునే ముందర అప్లయ్ చేసి రాత్రంతా ఉంచుకున్నా పర్లేదు. ఆలాగే పాలు నిమ్మరసం ఆలివ్ ఆయిల్ మిశ్రమం కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. పాలల్లో వుండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఆలివ్ నూనె చర్మాన్ని మెరిపిస్తుంది . నిమ్మరసం మృతకణాలను తొలగించటం తో పాటు మొటిమలు రాకుండా కాపాడుతుంది.చర్మం మెత్తగా తాజాగా ఉంటుంది. అలాగే ఒక కప్పుడు గులాబీ రెక్కల్ని కప్పు వేడి నీళ్ళల్లో మరిగించాలి. అందులో కొంత రోజ్ వాటర్ చేర్చాలి. ఈ నీళ్లు చల్లారాక నాడులో చెంచా ఆలివ్ ఆయిల్ కలిపి ఫ్రిజ్ లో పెట్టేసుకోవచ్చు . ఈ నీటిని ముఖానికి రాస్తుంటే తేమగా కనిపిస్తుంది. ఇవన్నీ మాయిశ్చరైజర్ లాగే పనిచేస్తాయి.

    సహజమైన మాయిశ్చరైజర్ ఇదే

    మాయిశ్చరైజర్ ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అదేంపెద్ద కష్టం కాదు ఇంట్లో ఉండే వస్తువుల తోనే  చెంచా తేనె  అంతే కొబ్బరి నూనె నిమ్మరసం కలిపితే అదే…

  • వింటర్ కేర్ ప్రాడక్ట్స్ ఎన్నో కనిపిస్తాయి మార్కెట్ లో. ఒక్కటి తెచ్చి నాలుగు రోజులు వాడి చూసుకునే సరికి చలికాలం కాస్తా వెళ్లిపోతుంటుంది. ఇక మళ్ళీ సమ్మర్ కేర్ కోసం పరుగెత్తాలి. ఇప్పడూ ఇంట్లో చేసుకున్న వస్తువులతో ఆ ప్రయత్నాలు ఏవో చేస్తే సగం సమయం కలిసొస్తుంది. ఎంత ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటున్నా చర్మం చక్కగా కనిపించటం కోసం కొంత పోషణ అవసరం. రసాయనాల కంటే సహజ మైన వస్తువులు నయం కదా. ముఖ చర్మం ఎండిపోయి పగుళ్లు వచ్చినట్లు అయితే బనానా ఫేస్ మాస్క్ ట్రై చేయచ్చు. అరటిపండు పేస్ట్ గా చేసి కొత్త వెన్న కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. వెన్న లేకపోయినా మీగడ అయినా సరే. ఇవే ముఖానికి కావలిసినంత తేమను ఇస్తాయి. అరటిపండు గుజ్జు ఆ తేమను ఇంకొంత సేపు నిలబెడుతుంది. అలాగే అరటిపండు గుజ్జుకు తేనె ఒక టీస్పూన్ రోజ్ వాటర్ జతచేసి ఆ మిశ్రమాన్ని అప్లయ్ చేసినా ఇది ఫలితం ఉంటుంది. తేనె సహజమైన మాయిశ్చరైజర్ గా రోజ్ వాటర్ టోనర్ గా పనిచేస్తాయి. చలికాలంలో చర్మకాంతి కోసం ఈ కాంబినేషన్ ట్రై చేయండి.

    ఇంట్లోనే వింటర్ కేర్ ఫేస్ మాస్క్

    వింటర్ కేర్ ప్రాడక్ట్స్ ఎన్నో కనిపిస్తాయి మార్కెట్ లో. ఒక్కటి తెచ్చి నాలుగు రోజులు వాడి చూసుకునే సరికి చలికాలం కాస్తా వెళ్లిపోతుంటుంది. ఇక మళ్ళీ సమ్మర్…