• చర్మం బావుంటుంది.

    చర్మం పైన శ్రద్ధ తగ్గితే వార్ధాక్య లక్షణాలు వస్తాయి. కళ తగ్గి చర్మమ వయస్సుని పెంచేస్తుంది. అందుచేత చర్మం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఉదయం వేసుకున్న…

  • రుతువులు మారిపోతూవుంటాయి. మారే కాలానికి శరీరం కూడా స్పందిస్తుంది. చర్మం పొడిగా అయిపోవటం, పగిలిపోవడం వేడి వాతావరణంలో పొక్కులు రావటం చెమటలు ఒకటేమిటి విసిగించే ప్రతి సమస్యకు సమాధానంగా ఎదో క్రీము ఎంచుకోవటం రాసుకోవటం. ఇలా చేస్తే సమస్య పోదంటున్నారు ఎక్స్ పెర్ట్స్. చల్లగా వుందని వేడినీళ్ళ స్నానం అస్సలు వద్దు. వేడి చర్మం లోని తేమను లాగేస్తుంది. గోరువెచ్చని నీరు ఎంచుకోవాలి. చర్మం పొడిగా అయి చేత్తో గీస్తే తెల్లని గీతాలు కనిపిస్తూ చిరాకేస్తే మాయిశ్చరైజర్ పులిమేస్తే ప్రయోజనం ఉండదు.స్నానం చేసిన వెంటనే చర్మం తడిపొడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాయాలి. పొడిబారే సమస్య అప్పుడు అదుపులో ఉంటుంది. అవసరానికి మించి స్క్రబ్ వాడకూడదు . రెండు స్పూన్ల చక్కర లో కొబ్బరి నూనె కలిపి ముఖానికి రాసుకుని పది నిముషాల తర్వాత కడిగేయాలి. సబ్బులోని రసాయనాలు చర్మం దెబ్బతినేందుకు కారణం కావచ్చు. చర్మ తత్వానికి సరిపోయే ఫెస్ వాష్ ఎంచుకుని వాడుకోవాలి. సమస్యను అసలైన కారణం తెలుసుకుని పరిష్కారం కోసం చుస్తే ప్రయోజనం ఉంటుంది.

    ఎదో ఒకటి వాడితే ఎలా ?

    రుతువులు మారిపోతూవుంటాయి. మారే కాలానికి శరీరం కూడా స్పందిస్తుంది. చర్మం పొడిగా అయిపోవటం, పగిలిపోవడం వేడి వాతావరణంలో పొక్కులు రావటం చెమటలు ఒకటేమిటి విసిగించే ప్రతి సమస్యకు…

  • అడ్వార్టైజ్మెంట్స్ చూసో అలవాటుగానో సౌందర్య ఉత్పత్తులను కొంటారు. వాటిని ఎంత మోతాదు లో వాడాలో రాసివుండదు కనుక తోచినంత రాస్తూ వుంటారు. ఈ ఉత్పత్తి ఈ మోతాదులో రాసుకుంటే ఫలితం ఉంటుందో ఎలా ఉపయోగించాలి. అప్పుడే సరైన ఫలితమ్ కనిపిస్తుంది. ముఖాన్ని శుభ్రం చేసే క్లీన్సర్ ని రెండు బఠాణీ గింజల పరిమాణంలో తీసుకోవాలి. అందులో దూది ముంచి రాస్తే ముఖం పైన తేలికగా పరుచుకునేంతగా సరిపోతుంది. మిలిగిలినది మీద భాఫానికి సరిపోతుంది. సీరమ్ లేదా చర్మ చికిత్స కు వాడే క్రీములు వేలిపైకి తీసుకుని ముఖానికి ఎక్కడ అవసరమో అక్కడే రాయాలి. తక్కువే రాస్తే మంచిది. మొహం మొత్తం పరుచుకోకుండా చూడాలి. మృతకణాలను తొలగించే పూతైతే అందులో రసాయనాలు ఉంటాయి కనుక వేలితో చాలా తక్కువ పరిమాణంలో తీసుకుని వారానికి ఒక్కసారి మాత్రమే రాయాలి. అదే సహజమైన పదార్ధాలతో చేసిన దైతే వారానికి మూడు సార్లు రాసినా నష్టం లేదు. దేనినెంత వాడాలో తెలుసుకుంటే ఉపయోగం.

    అవసరాన్ని మించి వాడితే నష్టం

    అడ్వార్టైజ్మెంట్స్ చూసో  అలవాటుగానో సౌందర్య ఉత్పత్తులను కొంటారు. వాటిని ఎంత మోతాదు లో వాడాలో రాసివుండదు కనుక తోచినంత రాస్తూ వుంటారు. ఈ ఉత్పత్తి ఈ మోతాదులో…