• ఈ ప్రపంచంలో పనికి రానిది ఏదీ ఉండదని నిరూపించింది పాకిస్థానీ సామజిక కార్యకర్త నర్గీస్ లతీఫ్. పనికి రాణి చెత్త చెదారం ప్లాస్టిక్ వ్యర్ధాలతో పేద ప్రజలకు ఇల్లు కట్టించి ఇస్తోంది. గుల్బహార అన్న పేరుతో సంస్థ స్థాపించి పరిశ్రమలు దుకాణాలు షాపింగ్ మాల్స్ నుంచి ప్లాస్టిక్ వ్యర్ధాలు కొనుగోలు చేసింది. వాటిలో నిరుపేదలకు గృహాలు నిర్మించింది. ఇప్పుడు ఆ ఆలోచన కరాచీ పరిసర ప్రాంతాల్లో మంచి ఫలితాన్నే ఇస్తోంది. 1960 లో ఆమె చేపట్టిన ఉద్యమం నేడు సానుకూల ఫలితాలు ఇస్తోంది. చెత్త పర్యావరణానికి హాని చేస్తుందని భావించి దాన్ని ఎలా సద్వినియోగం చేద్దామనే ఆలోచనకు పదును పెడితే వ్యర్ధ పదార్థమైనా పనికొచ్చే వనరు అవుతుందని ఆమె 50 ఏళ్ల పాటు కృషి చేసింది.

    ప్లాస్టిక్ చెత్తతో పేదలకు ఇళ్ళు

    ఈ ప్రపంచంలో పనికి రానిది ఏదీ ఉండదని నిరూపించింది పాకిస్థానీ సామజిక కార్యకర్త నర్గీస్ లతీఫ్. పనికి రాణి చెత్త చెదారం ప్లాస్టిక్ వ్యర్ధాలతో పేద ప్రజలకు…

  • కరాచీలో జరిగిన ఫ్యాషన్ వీక్ లో 44 సంవత్సరాల ముక్తార్ మాయీ పాల్గొన్నాది. ఆమె సెలెబ్రెటీలకే సెలబ్రెటీ. 14 సంవత్సరాల క్రితం ఆమె గ్యాంగ్ రేప్ కు గురైంది. 2002 సంవత్సరంలో మాయీ సోదరుడు తన ప్రత్యర్థి కుటుంబాన్ని అవమానించాడు. దానికి బదులు గ్రామా గిరిజన పెద్దలు ముక్తార్ మాయీ పై సామూహిక అత్యాచారం జరపాలని ఆమెను బహిరంగంగా నగ్నంగా వీధుల్లో తిప్పాలని కఠిన శిక్ష విధించారు. శిక్ష అనుభవించిన ముక్తార్ తనకు జరిగిన అన్యాయం పై న్యాయ పోరాటం చేసింది. సుప్రీమ్ కోర్టు కు ఎక్కింది. తన అనుభవాలతో ముక్తార్ మహిళల హక్కుల కోసం ఉద్యమించింది. తాను మీర్ వారా గ్రామంలో ఒక ఆడపిల్లల స్కూల్ అనాధ మహిళల కోసం కేంద్రాన్ని స్థాపించింది. ఈ సెలబ్రెటీ రాంప్ వాక్ లో అందరు ఆమెను అభినందించారు.

    ఎన్ని నోళ్లతో పొగడాలి ఈమెను

    కరాచీలో జరిగిన ఫ్యాషన్ వీక్ లో 44 సంవత్సరాల ముక్తార్ మాయీ పాల్గొన్నాది. ఆమె సెలెబ్రెటీలకే సెలబ్రెటీ. 14 సంవత్సరాల క్రితం ఆమె గ్యాంగ్ రేప్ కు…