• జామ పీడియాట్రిక్స్ అన్ని మెడికల్ జర్నల్ లో తల్లి పాలతో పిల్లల్లో వచ్చే అన్ని రకాల రక్త సంబందమైన కాన్సర్ రానేరావని ఒక రిపోర్ట్ ప్రచురితమైంది. తల్లి పాలు ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. చిన్న పిల్లల్లో వచ్చే కాన్సర్ లలో రక్తసంబంధమైనవి ల్యూకేమియా వంటివి ౩౦ శాతం ఉంటాయి. కనీసం ఆరు నెలల పాటు తల్లి పాలు తాగిన పిల్లల్లో ఇలాంటి బ్లడ్ కాన్సర్ వచ్చే అవకాశం 20 శాతం తగ్గుతోందని అధ్యాయినం రిపోర్ట్ చెప్పుతుంది. అంతే కాదు సడన్ ఇన్ ఫ్యాంట్ డెత్ సిండ్రోమ్, ఉదార కోశ వ్యాధులు, చెవి ఇన్ఫెక్షన్లు తల్లి పాలు నివారిస్తాయని తెలిసిందే. ఇక చాలా కాలం పాటు తల్లి పాలు తాగిన పిల్లలకు భవిష్యత్తులో స్థూలకాయం, టిప్-2 డయాబెటీస్ వచ్చే రిస్క్ చాలా తక్కువని ఈ పరిశోధన తేల్చింది. పిల్లలకు ఎలాంటి అనారోగ్యాలు రానివ్వని ఈ తల్లి పాల విలువ తల్లులు తెలుసుకోవాలని పిల్లలు తాగినంత కాలం వాళ్ళని పాలు తగనివ్వడం వల్ల వాళ్ళకి భవిష్యత్తులో వచ్చే అనారోగ్యాల రిస్క్ తగ్గించినట్లు ఉంటుందని ఈ జర్నల్ లో ప్రచురితమైన వ్యాసంలో పరిశోధకులు చెప్పుతున్నారు.

    తల్లి పాలతో అనారోగ్యాలు దూరం

    జామ పీడియాట్రిక్స్ అన్ని మెడికల్ జర్నల్ లో తల్లి పాలతో పిల్లల్లో వచ్చే అన్ని రకాల రక్త సంబందమైన కాన్సర్ రానేరావని ఒక రిపోర్ట్ ప్రచురితమైంది. తల్లి…

  • బిడ్డకు తల్లిపాలను మించిన ఆహారం లేదు. తల్లిపాలు తాగే బిడ్డను బయటకు తీసుకుపోవటం చాలా సులువు. ఇతరత్రా పాలైతే ఎన్నో జాగ్రత్తలతో వెంట తీసుకుపోవాలి. తల్లి పాలు ఎప్పుడు బిడ్డకు ఆకలేస్తే అప్పుడు తాగించే వీలుంటుంది. ప్రయాణాల్లో ఇబ్బంది ఉండదు. పాపాయికి పాలిచ్చే సందర్భంలో ఎవరైనా కళ్లప్ప గించి చూస్తుంటే ఇబ్బందే కానీ ఆ మనిషి కళ్లలో కళ్ళు పెట్టి చూసి స్నేహంగా నవ్వితే చాలు వారు ఇక తల తిప్పి చూడరు. పాపాయి తల అటు ఇటు తిప్పినా వేళ్ళు నోట్లో పెట్టుకొంటున్నా ఆకలేస్తోందని అర్ధం, ఏడ్చేదాకా ఆగక్కర్లేదు. కానీ ఎక్కడ ఏ సమయంలో పాలు తాగించినా సరైన పొజిషన్ లో కూర్చోవాలి . కూర్చుని తర్వాత బిడ్డను ముంజేతుల పై సన్నిహితంగా పట్టుకుని సౌకర్యాన్ని సరి చూసుకుని స్తన్యం ఇవ్వాలి.తల్లికి బిడ్డకు సౌకర్యంగా ఉండేలా పొజిషన్ సరిచూసుకోవాలి. నర్సింగ్ బ్రా లేదా టాప్ ధరిస్తే వాటికి వుండే కవర్ ఫ్లాప్స్ ల్యాబ్స్ వల్ల ఒక చేత్తో ఓపెన్ చేయచ్చు. లేదా ముంజేతిపైన ఓ వస్త్రం కాపుకుంటే తక్షణ కవరప్ లా పనిచేస్తుంది.

    తల్లిపాలతో బిడ్డకు తల్లికీ సుఖం

    బిడ్డకు తల్లిపాలను మించిన ఆహారం లేదు. తల్లిపాలు తాగే బిడ్డను బయటకు తీసుకుపోవటం చాలా సులువు. ఇతరత్రా పాలైతే ఎన్నో జాగ్రత్తలతో వెంట తీసుకుపోవాలి. తల్లి పాలు…