• పండ్లు పండ్ల రసాలు రెండు మంచివే.

    మనం తినే అహరాన్ని బట్టే మన జీవన శైలి తెలుసుకోవచ్చునంటారు. శరీరం చక్కగా పనిచేస్తుంటే, పోషకాలతో ఆరోగ్యంగా వుంటే పండ్లు ఎక్కువగా తిసుకుమ్తునట్లు అర్ధం చేసుకోవాలంటారు డాక్టర్లు.…

  • చలువ చేస్తుందనో, దాహం వేస్తుందనో గబుక్కున రోడ్డు పక్కన కనిపించే సోడాలు, పండ్లరసాలు, శీతల పానీయాలు తాగేయకండి వాటిలో నిలువ ఉంచేందుకు కానీ చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించే రసాయినాలు కలుపుతారు. ఇందులో చక్కెర ఎక్కువే. అలా దాహం తీరేలా చలువ చేసేలా కావాలంటే ఫ్రెష్ గా కొట్టిన కొబ్బరి నీళ్ళు తాగచ్చు. ఇంట్లో అయితే ఉప్పు జీలకర్ర వేసిన పచ్చి మామిడి రసం కుడా వాడదెబ్బకు ప్రత్యామ్నాయమె అవ్వుతుంది. ఎక్కువ చమట పోస్తుంది కనుక చమట తో పాటు కీలకమైన కొన్ని పోషకాలు పోతాయి. సోడియం పొటాషియం వంటివి శరీరం కోల్పోతుంది. వీటి పని శరీరంలో జీవక్రియలు తిన్నగా జరిగేలా చూడటం. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తీసుకుంటే నిస్సత్తువ లేకుండా వుంటుంది. అన్నం, చపాతిలు తేలికగా అరిగే ఆకుకూరలు, తాజాగా వుండే మాంసాహార పదార్ధాలు మంచివే. పళ్ళ రసం, చెరుకు రసం ఇవి కూడా తీయగానే తగేయడం ఉత్తమం.

    ఎండల్లో వాడిపోకుండా ఇవే రక్షణ

    చలువ చేస్తుందనో, దాహం వేస్తుందనో గబుక్కున రోడ్డు పక్కన కనిపించే సోడాలు, పండ్లరసాలు, శీతల పానీయాలు తాగేయకండి వాటిలో నిలువ ఉంచేందుకు కానీ చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించే…

  • తాజా పండ్ల రసాలు అలసిన శరీరం సేద తీరడానికి కొత్త శక్తిని ఇచ్చేందుకు పనికి వస్తాయి. అవి పండ్లే కానక్కరలేదు. కాయిగురల రసాల్లోనూ ఆ శక్తే వుంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువే వుంది. మనిషికి ఆరోగ్యానిచ్చే ఎన్నో పోషకాలు విటమిన్లు పుష్కలంగా వున్న క్యారెట్లును ముక్కలుగా తినడమే కాదు జ్యూస్ గానూ బావుంటుంది. కప్పు క్యారెట్ రసంలో 94 కాలరీల శక్తి వుంటుంది. ప్రకృతి సిద్ధమైన చక్కెర లభిస్తుంది. రొజువారీ అవసరమైన సి-విటమిన్ లో నాలుగోవ వంతు ఇ- విటమిన్ లో సగం లభిస్తాయి. క్యా రెట్ రసంలో బి-6 విటమిన్ లో 39 శతం ధేయామిన్ లో 20 శాతం రిబో ఫ్లోవిన్ లో 12 శాతం వుంటుంది. నరాలు, ఎముకల వ్యవస్థ ఆరోగ్యంగా వుంటుంది. కండరాళ్ళ సంక్షోబానికి పనికి వచ్చే మెగ్నీషియమ్ లో 10వ వంతు క్యారేట్ రసం ద్వారా లభిస్తుంది. శరీరం మరింతగా విటమిన్లు ఖనిజాలను పోషణం చేసుకో గలుగుతుంది. శరీరంలోని మలినాలు బయటకు పోతాయి. టమాటాలు, అనాసలు, బత్తాయిలో, కమలాలు, ఎర్ర ద్రాక్షలు, నిమ్మకాయలు వంటివి శరీరానికి అవసరమైన సి-విటమిన్ ను అధిక స్తాయిలో అందిస్తాయి.

    తినడం కంటే జ్యూస్ లా తాగడం బెస్ట్

    తాజా పండ్ల రసాలు అలసిన శరీరం సేద తీరడానికి కొత్త శక్తిని ఇచ్చేందుకు పనికి వస్తాయి. అవి పండ్లే కానక్కరలేదు. కాయిగురల రసాల్లోనూ ఆ శక్తే వుంది.…

  • పిల్లలకు తాజా పండ్లు కూరగాయలు పోషకాహరంగా ఇస్తారు. ఎక్కువ పోషకాల కోసం రెండు రకాల పండ్లు కలిపి పెడతారు. వాళ్ళకోసం ఈ కాంబినేషన్స్ ఇవ్వమంతున్నారు పోషకాహార నిపుణులు. పీచ్, యాపిల్, కర్జూర్, పుచ్చకాయ, ఫిగ్, వంటివి స్వీట్ ఫ్రూట్ రకానికి చెందిన పండ్లు కలిపి తినొచ్చు. నిత్రిన్ జాతి అంటే నారింజ, కమలాఫలం, బత్తాయి, నిమ్మ, కివి, ద్రాక్ష, పైనాపిల్, చెర్రి వంటి ఆమ్ల గుణాలన్నపండ్ల రసానికి, కలిపి చిన్నారులకు ఇవ్వొచ్చు. మామిడి రస్ చెర్రీ, గ్రీన్ చెర్రి, స్ట్రాబెర్రీ, ఆపిల్ వంటి సెమి సెమి ఆసిడ్ రకానికి చెందిన పండ్లు మిశ్రమం గా చేసి పిల్లలకు ఇస్తే మంచిది. ప్రోటీన్లు ఖనిజ లవణాలు నూనె లో వంటి గుణాలు కలగలిసిన తటస్థ రకానికి చెందిన అవకడో, బాదాం, కొబ్బరి, వాల్ నట్స్ కూడా కలిపి ఇవ్వొచ్చు. కానీ జమ పండు, అరటి పండు కలిపి ఇవ్వడం, బొప్పాయి, కమలా ఫలం, క్యారెట్ కలిపి ఇవ్వడం మంచిది కాదు. కూరగాయలు, పండ్లు కలిపి చేసే సలాడ్ కూడా పిల్లలకు మంచిది కాదు. కొన్ని తేలికగా అరిగే గుణం వల్ల, కొన్నింటిలో అలంటి లక్షణం లేకపోవడం వల్ల సమస్యలు వస్తాయి.

    ఇలా కలిపి ఇస్తే చాలా లాభం

    పిల్లలకు తాజా పండ్లు కూరగాయలు పోషకాహరంగా ఇస్తారు. ఎక్కువ పోషకాల కోసం రెండు రకాల పండ్లు కలిపి పెడతారు. వాళ్ళకోసం ఈ కాంబినేషన్స్ ఇవ్వమంతున్నారు పోషకాహార నిపుణులు.…

  • సాధారణంగా పిల్లలు ఉదయం పూట పాలు సాయంత్రం పూట స్కూలు నుంచి రాగానే పండ్ల రసాలు ఇస్తుంటారు తల్లులు . పండ్ల రసం ఆరోగ్యవంతమైన ఆహారంగా భావిస్తుంటారు. విటమిన్ సి కాల్షియం కు పండ్ల రసాలు మంచి ఆధారమే అయినా ఇందులో చాలా లోపాలున్నాయి. నాలుగు పండ్లు రసం తీస్తే కానీ గ్లాసుడు రసం కాదు. కానీ ఇందులో గుర్తించదగిన ప్రోటీన్లు ఫ్యాట్ పీచు విటమిన్లు వుండవు. ఇవన్నీ ఎదిగే పిల్లలలకు పండ్ల ద్వారా లభించే పోషకాలు. కానీ పండ్ల రసాలు కార్బోహైడ్రేట్స్ చక్కెరలుంటాయి. కనుక పిల్లల్లకు వీలైనన్ని పండ్లను యధాతధంగా ఇవ్వటమే మంచిది. పైగా రుచి కోసం పండ్ల రసం లో కలిపే చక్కెర కూడా అనారోగ్యమే. పిల్లలు ఇష్టంగా తాగే ప్యాకెట్లలో ఉండే పండ్ల రసాలు ఎక్కువ ఉప్పు చక్కెర రసం పాడవకుండా నిల్వ చేయటం కోసం కలిపే రసాయనాలు ఉంటాయి . ఈ రకం పండ్ల రసాలు వల్ల మేలు కంటే కీడే ఎక్కువ. సురక్షితమైన మార్గం వలచిన బత్తాయి దానిమ్మ ఆలా ఇవ్వటమే.

    రసాల కంటే పండ్లే బెటర్

    సాధారణంగా పిల్లలు ఉదయం పూట పాలు సాయంత్రం పూట  స్కూలు నుంచి రాగానే పండ్ల రసాలు ఇస్తుంటారు తల్లులు . పండ్ల రసం ఆరోగ్యవంతమైన ఆహారంగా భావిస్తుంటారు.…

  • పళ్ళు తినటం మంచిదే కానీ పళ్ళ రసాలు ఆరోగ్యం కావని చెపుతున్నారు శాస్త్రజ్ఞులు. గ్లాస్ జ్యూస్ కోసం నాలుగు పళ్ళు అవసరమైతే ఆ పళ్ళు జ్యూస్ తీయటం కన్నా తినటం బెటర్ అంటున్నారు. పెద్ద గ్లాస్ పళ్ళ రసంలో పోషకాల కన్నా క్యాలరీ లే ఎక్కువగా శరీరానికి అందుతాయి. అలాగే తేలికగా ఉంటుండీ కదా అని ప్యాక్ చేసిన జ్యూస్ టిన్ పైన లో ఫ్యాట్ అని రాసి ఉన్నప్పటికీ అది నిజం కాదని గ్రహించాలంటున్నారు. అంతే కాదు ప్యాక్ చేసి నిల్వ చేసిన జ్యూస్ లో ఏ ఏ ఫ్రూట్స్ ని కలిపారు నిల్వ ఉండేందుకు వాడిన రసాయనాలు రుచికోసం చేర్చిన చక్కర తక్కువ శాతంలో ఉప్పు ఇవన్నీ లెక్కలు చూడమంటున్నారు. ఒక గ్లాస్ తాజా ఆరెంజ్ జ్యూస్ ద్వారా 110 క్యాలరీలు లభిస్తే అదే తాజా ఆరెంజ్ ద్వారా 62.9 క్యాలరీలు లభిస్తాయి. తాజా ఆపిల్ ద్వారా 87. 9 క్యాలరీలు లభిస్తాయి. ఇదే సాఫ్ట్ డ్రింక్స్ ద్వారా 138 క్యాలరీలు లభిస్తాయట. మిగతా పండిన పండ్ల లో ఫైబర్ శాతం ఎంతో ఎక్కువగా ఉంటుందనీ ఆలా పండిన పండే రుచిగా ఆరోగ్యానికీ మేలు చేస్తుందనీ గ్రహించాలని సలహా ఇస్తున్నారు.

    పళ్ళా ? పళ్ళ రసాలా ?

    పళ్ళు తినటం మంచిదే కానీ పళ్ళ రసాలు ఆరోగ్యం కావని చెపుతున్నారు శాస్త్రజ్ఞులు. గ్లాస్ జ్యూస్ కోసం నాలుగు పళ్ళు అవసరమైతే ఆ పళ్ళు జ్యూస్ తీయటం…