• ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను ఎంతో మంది చూశారు. బంగ్లాదేశ్ కు చెందిన ఓ ఆయిల్ ప్రొడక్ట్స్ సంస్థ రూపొందించిన వీడియోలో ఒక యువతి బ్యూటీ పార్లర్ కు వెళుతుంది. చాలా పొడుపుగా వున్న తన జుట్టు కత్తిరించమంటుంది. అక్కడ వుండే ఒక హెయిర్ స్టయిలిస్టు కాస్త కత్తిరించి ఆగిపోతూ ఇంకా ఆ పేయనా అని అడుగుతుంది. ఆ యువతి పూర్తిగా జుట్టు పట్టుకుని పడేస్తుంది. అక్కడ వళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఎందుకు ఏడుస్తున్నావంటే ఈ జుట్టే లేకపోతె ఆయన నన్ను ఈ జుట్టు ఈడ్చికొట్టలేడుగదా అంటోంది. బంగ్లాదేశ్ మహిళల నిళువెత్తు నిదర్శనం అని ఈ వీడియో అప్ లోడ్ చేసారు కానీ జుట్టు మహిళలకు అందం హుందాతనం ఇస్తుంది కానీ అదే జుట్టు భర్త చేతికి చిక్కితే ఒళ్ళు హూనం అవుతుందని వీడియో ద్వారా ప్రచారం చేసారు. ఇది బంగ్లాదేశ్ మాత్రని కేనా, ఈ ప్రపంచం అంతా ఇలాగే లేదా? ఇప్పటికైనా వదిలి పెట్టి ఏ విచారమైనాఎంచుకోండి, హింసలోంచి బయటపడండి అని చెప్పుతున్న ఈ ప్రచార చిత్రంలో ఇంకా ఎన్నో రావాల్సి వుంది.

    ఈ జుట్టే లేకుంటే హింస కాస్తయినా తప్పేది

    ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను ఎంతో మంది చూశారు. బంగ్లాదేశ్ కు చెందిన ఓ ఆయిల్ ప్రొడక్ట్స్ సంస్థ రూపొందించిన వీడియోలో ఒక యువతి…

  • Donna Ferrato గృహ హింస పైన ఫోటో తీసిన మహిళా ఫోటో గ్రాఫర్ 1982 లో ఫోటో తీసింది. నాలుగు గోడలు మధ్య భర్త భార్య ఎలా వుంటారో ఎవ్వరికి తెలియదు. కానీ భర్తలు భార్యల పైన చేయిచెసుకుంటారు అన్నది జగమెరిగిన సత్యం. తన ఆధిపత్య ప్రదర్శనకు పురుషుడు స్త్రీ ని లొంగదీసు కుంటాడు. దాన్ని ఇప్పుడు గృహ హింస అంటున్నాం. ఆప్తులకు కూడా చెప్పుకోలేని గృహ హింసకు తోలి సాక్షి ఈ ఫోటో. ఆమె తనకు పరిచయం వున్న ఒక జంట ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ భర్త భార్య పైన స్నానాల గదిలో దాడి చేయడం చుసిన డోనా గబగబా హింసను క్లిక్ చేసింది. ఇదే గృహ హింస తోలి చిత్రీకరణ కానీ ఏ పత్రికల వాళ్ళు వేసుకోలేదు.1991 లో ఫోటో తీసిన 11 ఏళ్ళ తర్వాత తనే సొంతంగా తన ఫోటోలను పుస్తక రూపం లో తెచ్చింది డోనా. ఇక ఆ తర్వాత ఎన్ని వేల గృహ హింస సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయో లెక్కలు చెప్పలేము.

    గృహ హింస పై తోలి ఫోటో

    Donna Ferrato గృహ హింస పైన ఫోటో తీసిన మహిళా ఫోటో గ్రాఫర్ 1982 లో ఫోటో తీసింది. నాలుగు గోడలు మధ్య భర్త భార్య ఎలా…

  • భూమి గుండ్రంగా వుంది. ఇది మార్చలేని విషయం అలాగే ప్రపంచమంతా చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల చులకనగా వుండే అభిప్రాయముతోనే ఉన్నారు. ఎందుకు పనికి రాని ఆవారా అవచ్చు అర్జెంటీనా రాజధాని బ్యూనోస్ ఎయిర్స్ మాజీ మేయర్ మరిషియా మెక్రీ కావచ్చు. ఆయన ఇప్పటి ఆదేశ అధ్యక్షుడు కావచ్చు. అభిప్రాయం మాత్రం సేమ్ ఆయనో వ్యాఖ్య వినిపించాడు. అబ్బాయిలు చేసిన వ్యాఖ్యలు ఎంత అసభ్యంగా ఉన్నా సరే వాటిని ఇష్టపడని అబ్బాయిలంటూ ఉండరు . వాళ్లకవి నచ్చవంటే నేను నమ్మలేను. అనేసారు. ఆయనే ఇంత ఆలోచనారహితంగా మాట్లాడితే అమ్మాయిల రక్షణ ఏకంగా ఆ నగర పరిస్థితిని మేయర్ వ్యాఖ్యలకి ఎలా ఊహించాలి. అడుగడుగునా వేధింపులే. వెంబడించటాలు. చివరికి మేయర్ వ్యాఖ్యలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ నగరం ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. అమ్మాయిల పై వేధింపులే కాదు. వాళ్లకి నచ్చని మాట విసిరినా చాలు 3600 రూపాయల జరిమానా. వాళ్ళ భాషలో వెయ్యి పెసోలు. ఇందుకు కారణం అక్కడ మొదలైన ఒక ఉద్యమం IVI UIVA MENOS అంటే ఇంకొక్కరికి ఇలా కాకూడదు అని ఉద్యమ ఫలితమే ఇప్పటి చట్టం.

    చిన్నమాటన్నా సరే జరిమానా

    భూమి గుండ్రంగా వుంది. ఇది మార్చలేని విషయం అలాగే ప్రపంచమంతా చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల చులకనగా వుండే అభిప్రాయముతోనే ఉన్నారు. ఎందుకు పనికి రాని…

  • వయోతారతమ్యాలు ,చదువు సంధ్యలు సామాజిక హోదాలు ఆర్థిక స్తితిగతులతో సంబంధం లేకుండా మహిళలంతా ఎదో రకమైన హింసకు గురవుతున్నారని కాకపోతే హింసకు వ్యతిరేకంగా 119 దేశాల్లో చట్టాలు అమలుచేస్తున్నాయి. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 125 దేశాల చట్టాలు అమలు చేస్తున్నాయి. కానీ ఈ చట్టాలు మహిళలలకు సత్వర న్యాయం కల్పిస్తున్నాయనే దాఖలాలు మాత్రం ఏవీ లేవు. చట్టాలున్నా బాధ్యత మహిళలు ఫిర్యాదు చేసేందుకుఅనుకూలమైన పరిస్థితులు లేవు. మూడేళ్ళలో గృహ హింసకు సంబంధించి దేశవ్యాప్తంగా 3. లక్షల కేసులు నమోదయ్యాయి. కాలం గడుస్తుంటే హింస రూపం మార్చుకుంటుంది. ఇప్పుడైతే ఇల్లు, బడి, గుడి, ఆఫీస్ ,బస్స్టాండ్ ,సినిమా హాల్ ,షాపింగ్ మాల్ , జన నమ్మకం ఉన్న ప్రదేశాలు ఏవీ మహిళలలకు వంద శాతం సురక్షితమైన ప్రదేశాలు కానేకావు. రేపు నవంబర్ 25వ తేదీన ఇంటర్నేషనల్ డే ఆన్ వయొలెన్స్ ఎగైనెస్ట్ ఉమెన్. కానీ హింసధ్వని అసలు ఎప్పటికైనా ఆగుతుందా?

    ఈ హింసధ్వని అసలు ఆగుతుందా ?

    వయోతారతమ్యాలు ,చదువు సంధ్యలు సామాజిక హోదాలు ఆర్థిక స్తితిగతులతో సంబంధం లేకుండా మహిళలంతా ఎదో రకమైన హింసకు గురవుతున్నారని కాకపోతే హింసకు వ్యతిరేకంగా 119 దేశాల్లో చట్టాలు…