• ఇలాంటి టిప్స్ తో వంటలు ఈజీ.

    కొన్ని టిప్స్ తెలుసుకుంటే వంటింట్లో అవలీలగా పని చేసుకోవచ్చు. వంటలో ట్రిక్స్ తెలిస్తే అద్భుతమైన వంట వండవచ్చు. పెద్ద వాళ్ళు పూర్వం ఇంటికి పది మంది చుట్టాలు…

  • ఎన్నో ఆహార పదార్దాలు నిల్వ చేసే టప్పుడు, వాటిని వండేటప్పుడు చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంగాళా దుంపలు బాగా పెద్దవిగా వస్తు వున్నాయి మార్కెట్ లో కానీ చిన్న దుంపల్ని తీసుకుంటే వాటిని చెక్కు తీసె పని ఉండదు. ఆ చెక్కులో వుండే పిచులో మనకు 50 శాతం ఫాలి ఫినాల్స్ అందుతాయి. పాలకూర సలాడ్ లో వేసే ముందర కొన్ని నిమిషాలు పెనం పైన వేడి చేస్తే అందులోని విటమిన్-ఎ శాతం మూడు రెట్లు పెరుగుతుంది. ద్రాక్ష పండ్లు ఫ్రిజ్ లో పెట్టక పోవడం మంచిదే. బయట టేబుల్ పైన గాలి లో ఉంచితే వాటి పైన పేరుకున్న రాసాయినాలు పోతాయి. బజార్లో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు దొరుకుతాయి. వీటిని ఎప్పటి కప్పుడు వంటల్లో వదేయాలి. నిల్వ ఉంచితే పొట్టు ఉంటేనే మంచిది. గాలికి వెలుతురికి వాటిల్లో వుండే వాసన రుచి పోతుంది. టొమాటో ఫ్రిజ్ లో ఉంచితే వాటిల్లో వుండే పోశాకాలైన లికోపిన్ ఫైటో న్యూట్రియంట్లు యంటి ఆక్సిడెంట్ గుణాలు తగ్గిపోతాయి.

    అన్ని ఒకేలా వుండవు

    ఎన్నో ఆహార పదార్దాలు నిల్వ చేసే టప్పుడు, వాటిని వండేటప్పుడు చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంగాళా దుంపలు బాగా పెద్దవిగా వస్తు వున్నాయి మార్కెట్ లో…

  • వంటలో సాధారణ పద్దతిగా కురగాయల్ని ఉడికిస్తే పోషకాలు పోతాయి అంటున్నారు. కురగాయల్ని వుడికించే సమయంలో నీటిలో కరిగే పోషకాలు, విటమిన్ బి, సి లు వంటివి కొంత మాత్రం కోల్పోతాయి అయితే వండటం వల్ల బీటాకెరోటిన్, లికోపెన్ వంటి కాన్సర్ తో పోరాడగల వాటిని శరీరం గ్రహించగలుగుతుంది. పోషకాలు ఎక్కువగా ఉండాలంటే వండే సమయాన్ని తగ్గించాలి. మైక్రోవేవ్ లో కూరగాయలు వుడికే వాసన వచ్చేదాకా అంటే ఏడు నుంచి పది నిముషాలు. క్యారెట్స్, బంగాళ దుంపలు వంటివి ఐడు నిముషాలు ఉడికిస్తే సరిపోతుంది. కూరగాయల్ని పల్చని స్లైసులుగా కట్ చేస్తే త్వరగా వుడుకుతాయి. ముక్కలు వుడికించే ముందే బాగా వేడి చేస్తే త్వరగా కూర ముక్కలు వేడిగా అయిపోతాయి. ఎక్కువ పోషకాలు పోవక్కరలేదు. తరచూ కలియబెడుతూ వుండాలి. ఒకటి రెండు నిమిషాలకు రుచి చూడాలి. ప్యాన్ అడుగున ఏదైనా లిక్విడ్ మిగిలిపోతే మళ్ళి కలియబెట్టాలి. కూరగాయలు ఉడికించిన నీటిని ఎప్పుడు వృధా చేయకూడదని. ఆ నీటితో చారు వంటివి చేసుకున్న ప్రయోజనమే.

    వండే సమయం తగ్గిస్తే చాలు

    వంటలో సాధారణ పద్దతిగా కురగాయల్ని ఉడికిస్తే పోషకాలు పోతాయి అంటున్నారు. కురగాయల్ని వుడికించే సమయంలో నీటిలో కరిగే పోషకాలు, విటమిన్ బి, సి లు వంటివి కొంత…

  • పాలకూర ఆకుల్ని ఎక్కువ రోజులు తాజాగా వుంచాలంటే కొనగానే పేపర్ టవల్ చుట్టి ఫ్రిజ్ లో పెడితే ఐదు రోజులు తాజాగా వుంటుంది. అయితే వీలున్నంతవరకు కొన్న మరునాడే వండటం బెటర్. ఆకుల్ని ఐస్ వాటర్ లో ముంచితే మరింత తాజాగా కూర ఆకుపచ్చదనం పోగొట్టుకోకుండా వుంటుంది. బ్రొకోలీని స్టీమ్ చేసి ఆహారంలో భాగంగా తింటే ఆరెంజ్ కంటే ఎక్కువ విటమిన్ సి వుంటుంది. అన్నంలో చాలినన్ని పాలుపోసి బ్లెండ్ చేసి కొద్దిగా ఉప్పు మిరియాల పొడి వెన్న వేసి రెండు నిమిషాల ఉడక పెడితే ఇన్స్టెంట్ వైట్ సాస్ రెడీ. చాకును మరుగుతున్న నీళ్లలో వుంచి ఛీజ్ కాటేజ్ ఛీజ్ లను కట్ చేయటం వల్ల స్లైసులు పొడి కాకుండా నీట్ గా వుంటాయి. కాచిన పాల గిన్నె పైన చిల్లుల ప్లేట్ వుంచితే మీగడ మందంగా కడుతుంది. పాత్రల నుంచి కోడి గుడ్డు వాసన పోవాలంటే సెనగ పిండి వేడి నీటితో గానీ నిమ్మచెక్క రుద్దిగానీ కడిగేయాలి.

    వంటింట్లో ప్రయోగాలు చేస్తున్నారా ?

    పాలకూర ఆకుల్ని ఎక్కువ రోజులు తాజాగా వుంచాలంటే కొనగానే పేపర్ టవల్ చుట్టి ఫ్రిజ్ లో పెడితే ఐదు రోజులు తాజాగా వుంటుంది. అయితే వీలున్నంతవరకు కొన్న…

  • మనకి వంట బాగా వచ్చినా సరే అనుభవం ఉన్నవాళ్ళు చెప్పిన కిటుకులు పాటిస్తే వండే వంట మరింత టేస్టీ గా వుంటుంది. కాఫీ ఫిల్టర్ లో పంచదార వేసి ఆ తరువాత కాఫీ పొడి, వేడి నీళ్ళు పోస్తే కాఫీ టేస్టీ గా వుంటుందట. ఇలా ట్రై చేసి వుందం కదా. ఇంకోటి కోడి గుడ్డు సొనలో కొన్ని పాలు లేదా టేబుల్ స్పూన్ నీళ్ళు కలిపి ఆమ్లెట్ వేస్తే రుచిగా వుంటుంది, చూసేందుకు కూడా బావుంటుంది. కాలీఫ్లవర్ వండేప్పుడు ఓ టేబుల్ స్పూన్ పాలు పోస్తే కాలీఫ్లవర్ రంగు మారదు. బెండ కాయలు వేయించేప్పుడు పెరుగు ఓ స్పూన్ కలిపితే వేపుడు కరకరలాడుతుంది. ముక్కలు అతుక్కోవు. మిక్సీ లో ఇడ్లీ పిండి రుబ్బితే ఇడ్లీలు గట్టిగా వస్తుంటే ఇడ్లీ రవ్వ వేడి నీళ్ళలో నాననివ్వాలి. వెల్లుల్లి, అల్లo పేస్టు ఎక్కువగా మిగిలిపోతే అందులో కాస్త వేడి నూనె పోసి కలిపి ఫ్రిజ్ లో పెట్టాలి. పకోడీ పిండి కలిపాక అందులో కాస్త మొక్కజొన్న పిండి కలిపితే పకోడీలు కరకరలాడతాయి.

    ఈ టిప్స్ తో వంట అదుర్స్

    మనకి వంట బాగా వచ్చినా సరే అనుభవం ఉన్నవాళ్ళు చెప్పిన కిటుకులు పాటిస్తే వండే వంట మరింత టేస్టీ గా వుంటుంది. కాఫీ ఫిల్టర్ లో పంచదార…

  • మిగిలిపోయిన ఆహార పదార్ధాలు, టైమ్ లేక ఉదయం సాయంత్రం కోసం ఒకే సారి వేడి చేసి తినేస్తాము కానీ అన్నింటినీ అలా వేడి చేయొద్దు అంటారు డైటీషియన్లు. బచ్చల కూర లో ఇనుము నైట్రేట్ లు పుష్కలంగా వుంటాయి. ఈ కూరను వండాక మళ్ళి నేరుగా వేడి చేయకూడదు. వేడి నీళ్ళ గిన్నెలో వుంచి వేడెక్కేలా చేయాలి. అలాగే ఉడికించి లేదా కూర చేసిన గుడ్లు కూడా మళ్ళి వేడి చేస్తే అందులోని పోషకాలు పోతయి. చికెన్ కూడా అంతే, వండాక మళ్ళి మళ్ళి వేడి చేస్తే మాంసకృతులు పోతాయి సరి కదా జీర్ణ సంబందమైన సమస్యలు వస్తాయి. బంగాళా దుంప కూర కూడా వేడి చేసి తింటే విషపదార్ధాలు శరీరంలోకి చేరినట్లే. మాంసకృతులు పుష్కలంగా అందించే పుట్ట గొడుగు కూర కూడా ఫ్రిజ్ లో వుంచి, సాయంత్రం వేడి చేసి తినాలి అని చుస్తే అనారోగ్యాలు తధ్యం . సాధ్యమయినంత వండిన కూరలు మళ్ళి మళ్ళి వేడి చేసి తినడం వల్ల నష్టమే.

    వండినవి మళ్ళి వేడి చేస్తే నష్టం

    మిగిలిపోయిన ఆహార పదార్ధాలు, టైమ్ లేక ఉదయం సాయంత్రం కోసం ఒకే సారి వేడి చేసి తినేస్తాము కానీ అన్నింటినీ అలా వేడి చేయొద్దు అంటారు డైటీషియన్లు.…