• ఎప్పుడూ ఒకే రకమైన శరీర లావణ్యం వుండదు. వయస్సు పెరుగుతున్నా, పిల్లలు పుట్టినా కొద్ది పాటి మార్పులు వస్తాయి. కాస్త పొట్ట ఉచ్చేత్తుగా కనబడటం ఇబ్బంది పెట్టే విషయాల్లో ఒక్కటి. కొద్ది జాగ్రత్తలతో ఈ సమస్య నుంచి బయట పడవచ్చు, పొట్ట కనిపించకుండా బెల్ట్ ఉపయోగించవచ్చు. దాన్ని పొట్ట పై భాగంలో, ఛాతీకి కిందగా వుంచుకోవాలి. అలాగే పెద్ద పువ్వులున్న టాప్ ఎంచుకోవాలి. బిగుతుగా వుండే దుస్తుల జోలికి వెళ్ళక పోవడం మంచిది. మంచి రంగులు ఎంచుకోవచ్చు. ముదురు రంగు దుస్తులు కాస్త వదులుగా వున్నవి పొట్ట కనిపించనీయావు. నిలువు చారలున్న టాప్ ఎంచుకోవడం మంచిది. పొడవాటి రంగు రంగుల మెరిసే టాప్ లు, టైట్ గా వుండే లెగ్గింగ్స్ వేసుకోవచ్చు. ఈ మార్పుల వల్ల ఆకృతి తేడా తెలుస్తుంది.

    మెరిసే పువ్వుల టాప్సే బెస్ట్

    ఎప్పుడూ ఒకే రకమైన శరీర లావణ్యం వుండదు. వయస్సు పెరుగుతున్నా, పిల్లలు పుట్టినా కొద్ది పాటి మార్పులు వస్తాయి. కాస్త పొట్ట ఉచ్చేత్తుగా కనబడటం ఇబ్బంది పెట్టే…

  • కొన్ని వస్తువులు చూసేందుకు చాలా ముద్దుగా ఉంటాయి. అది ఫ్యాషన్ గా వుంటే, నలుగురి ద్రుష్టి పడేలా వుంటే, ఉపయోగంగా వుంటే ఇక దాని దారే వేరు. మనం పౌడర్ ను ముఖానికి సమంగా వేసుకోవాలంటే స్పాంజు లాంటి పఫ్ ని వాడతాం. అయితే వీటి స్థానంలో సిలికాన్ తో చేసిన, పారదర్శకంగా వుండే సిలీ స్పాంజులు వస్తున్నాయి. మాములు స్పాంజుతో సన్నని రంద్రాలు వుండటం వల్ల చాలా పౌడర్ వృధా అవుతుంది. అదే జారి పోయే ఉపరితలంతో వుంటే ఈ సిలీ స్పాంజ్ వల్ల, స్పాంజితో పోలిస్తే సగం పౌడరే పడుతుంది. చూసేందు చాలా కొత్తగా వుంది. ఆర చేతిలో వుంచుకుంటే అసలు అది అద్దపు బిళ్ళలాగా కనిపించనే కనిపించదు. అయితే ఈ సిలీ స్పాంజ్ లో కూడా కలర్స్ వున్నాయి. ఒక్కసారి ఇమేజస్ చుస్తే అవెంత బావుంటాయో తెలుస్తుంది.

    ఇదీ మేకప్ స్పాంజే

    కొన్ని వస్తువులు చూసేందుకు చాలా ముద్దుగా ఉంటాయి. అది ఫ్యాషన్ గా వుంటే, నలుగురి ద్రుష్టి పడేలా వుంటే, ఉపయోగంగా వుంటే ఇక దాని దారే వేరు.…

  • ఆఫీసుకీ, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఫ్యాషన్ గా ఉంటుందని ఎత్తు మడమల చెప్పులేసుకుంటారు. కానీ ఎక్కువ సమయం నడవాల్సి వచ్చినా గబగబా ఏ మెట్లో ఎక్కవలసిన ఈ మడమలతో కష్టమే అయితే కావాలనుకోన్నప్పుడు ఎత్తుగా ఉండేలా, అవసరం లేనప్పుడు లోపలి ముడుచుకునేలా, రన్ వాకబుల్ హై హీల్ షూలు మార్కెట్ లోకి వచ్చాయి. కేలమిన్ హీల్స్, షీలాస్ హీల్స్ పేరుతో వస్తున్న ఈ చెప్పుల అడుగు భాగం, సగం వరకు లేదా, మొత్తం గా లోపలికి మడిచే వీలుంటుంది. ఇలా ఫ్లాటైపోయే హీల్స్ ని అమ్మాయిలు ఎంతగానో లవ్ చేస్తున్నారు. అస్తమానం ఎత్తు చెప్పులతో మడమ నొప్పులు తెచ్చుకోకుండా ఈ మడిచే చెప్పుల ధీమ్ బావుంది కదూ.

    ఇలా వుండటం అమ్మాయిలకు నచ్చేసింది.

    ఆఫీసుకీ, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఫ్యాషన్ గా ఉంటుందని ఎత్తు మడమల చెప్పులేసుకుంటారు. కానీ ఎక్కువ సమయం నడవాల్సి వచ్చినా గబగబా ఏ మెట్లో ఎక్కవలసిన ఈ మడమలతో…

  • శరీరపు బడలిక వదిలి హాయిగా ఉండాలంటే స్నానం ఒక్కటే దారి. అది పరిమళ ద్రవ్యాలతో అయితే ఆ ఘుమఘుమల వాసన తో మనస్సు తేలికైపోతుంది. వేడి నీళ్ళ స్నానం బావుందంటారు. కానీ వేడి నీళ్ళతో చర్మం, జుట్టు పై వుండే సహజమైన తేమ మాయమైపోతుంది. తేమ తగ్గి చర్మం వెంట్రుకలు పోడిబారిపోతాయి. అంచేత గోరు వెచ్చని నీళ్ళలో గుప్పెడు గులాబీ రేకులు, రెండు చుక్కల లవెందర్ నూనె కలపాలి. అంతకంటే ముందు ఒక కప్పు గులాబీ రేకుల్ని తీసుకుని మెత్తని గుజ్జులా చేసి అందులో కొంచం పంచదర, కొబ్బరి నూనె తీసుకుని మెత్తని గుజ్జుగా చేసి ఒంటికి నెమ్మదిగా మర్దనా చేసుకుని పరిమళ ద్రవ్యాలు కలిపిన నీటి తో స్నానం చేస్తే చర్మం తాజాగా కనిపించడమే కాదు శరీరానికి రక్త ప్రసరణ కూడా అందుతుంది. ఆలివ్ నూనె వేడి చేసి దానికి ఓ స్పూన్ తేనె కలిపి ఒంటికి పట్టించాలి. కనీసం పది నిముషాలు మర్దనా చేయాలి. తర్వాత వెచ్చని నీళ్ళలో గులబీ రేకులు పాలు కలిపి స్నానం చేస్తే చర్మం నిగనిగలాడుతుంది.

    బడలిక పోయేందుకు పరిమళస్నానం.

    శరీరపు బడలిక వదిలి హాయిగా ఉండాలంటే స్నానం ఒక్కటే దారి. అది పరిమళ ద్రవ్యాలతో అయితే ఆ ఘుమఘుమల వాసన తో మనస్సు తేలికైపోతుంది. వేడి నీళ్ళ…

  • బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నప్పుడే చర్మం సాగిపోకుండా, వదులుగా అయిపోకుండా, సాధారణ స్తితిలో ఉండేలా శ్రద్ధ పెట్టాలి. బరువు తగ్గే క్రమంలో నీళ్ళు ఎక్కువగా తాగాలి. చర్మానికి కావాల్సిన నీరు అందితే ఎప్పుడూ ఆరోగ్యంగానే వుంటుంది. అలోవీరా, కాఫీ, విటమిన్- ఇ, విటమిన్-ఎ ల తో కూడిన స్కిన్ లోషన్స్ ఉపయోగించాలి. తాజా అలోవీరా గుజ్జులో కొంచం నిమ్మరసం కలిపి చర్మానికి అప్లయ్ చేసి ఆరిపోయాక కదిగేయోచ్చు. కల్లుప్పు తో చర్మానికి స్క్రబ్ చేయొచ్చు. చాక్లెట్ పొడి లేదా కాఫీ పొడి తో చర్మం రుద్దితే పునరుత్తేజం వస్తుంది. విటమిన్-ఇ ఆయిల్ తో చర్మానికి మసాజ్ చేసిన చర్మం బిగుతుగా వుంటుంది. కొబ్బరి నూనె కొంచం వెచ్చగా చేసి ఉపయోగించినా మేలే, బాదాం నూనె చర్మానికి మాయిశ్చురైజర్ లా ఉపయోగ పడుతుంది. నూనె వెచ్చ చేసి చర్మం పై నెమ్మదిగా మర్దనా చేస్తే మంచి ఉపయోగం వుంటుంది.

    చర్మం బిగుతుగా ఉండాలంటే………!

    బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నప్పుడే చర్మం సాగిపోకుండా, వదులుగా అయిపోకుండా, సాధారణ స్తితిలో ఉండేలా శ్రద్ధ పెట్టాలి. బరువు తగ్గే క్రమంలో నీళ్ళు ఎక్కువగా తాగాలి. చర్మానికి…

  • మెరిపించే చాయ కోసం ఫేస్ పాక్

    ఇంట్లోనే చేసుకోగలిగే ఫేస్ ప్యాక్స్ లో ఎలాంటి రసాయినాలు కలవవు కనుక మొహానికి ఎలాంటి హనీ జరగదు. అలాగే పెద్ద ఖరీదు కూడా అవ్వువు కనుక కొన్ని…

  • మెరిసే కురుల కోసం ఆలివ్ నూనె

    జుట్టు పొడిబారిపోకుండా సహజ సౌందర్యంతో నిగనిగలాడాలంటే ఆలివ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్ తో జుట్టును అందంగా వుంచుకోవలనుకొంటే కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ సమపాళ్ళలో…

  • ఫ్యాషన్ అంటే ఇప్పుడు అనేక వస్తు సముదాయం అనచ్చు. ఎలాంటి దుస్తులు అలాంటి మాచింగ్ నగలు, గాజులు, లిప్స్ టిక్, బొట్టు, చెప్పులు అన్నీ కాలన్ ఉంటాయి. లేకపోతె తన ఒక దానికొక్కటి పొంతన వుండదు. ఇప్పుడు జీన్స్ టీషర్ట్స్ లేదంటే కప్తాన్ మీదకు ఎత్తు చెప్పులు బావుంటాయి. ఆఫీసు కు వెళ్తుంటే స్టిలెట్టూన్ ఎంచుకోవచ్చు. ఇప్పుడు కుర్తిలకు జతగా జీన్స్ లెగ్గిన్స్తోడయ్యాయి. కాళ్ళకు బ్యాలే తరహా చెప్పులు అందమే కాదు సౌకర్యంగా ఉంటాయి. ఇప్పటి ఫ్యాషన్ అనార్కలి లేదా ఫ్రాక్ మోడల్ గౌన్లు. ఇవి హెవీ ఎంబ్రాయిడరీ తో వుండే నగలు కొంత ట్రెండీ లుక్ ఇస్తాయి. ఇక వీటి పైకి చెప్పులైతే సౌకర్యంగా వుండే శాండల్స్ జూతీ తరహ చెప్పులు కూడా బాగుంటాయి. ఇవి చీరు లేహంగాలకు కూడా బావుంటాయి.

    జీన్స్ లెగ్గింగ్స్ కు బ్యాలేతరహా చెప్పులు అందం

    ఫ్యాషన్ అంటే ఇప్పుడు అనేక వస్తు సముదాయం అనచ్చు. ఎలాంటి దుస్తులు అలాంటి మాచింగ్ నగలు, గాజులు, లిప్స్ టిక్, బొట్టు, చెప్పులు అన్నీ కాలన్ ఉంటాయి.…

  • పళ్లు తెల్లగా మెరుస్తాయి

    తెల్లగా మిలమిలలాడే పళ్లు ముచ్చటగా ఆరోగ్యంగా  కనిపిస్తాయి. పళ్లపై పసుపు రంగు మరకలు రావడం మామూలే. ఈ పసుపురంగు వదలాలంటే నెలలో ఒకసారైనా  బేకింగ్ సోడా, నీరు…

  • ఈ హెయిర్‌ మాస్క్‌లతో మంచి ఫలితం

    https://scamquestra.com/24-bekapy-sohranenie-informacii-dlya-sledstviya-19.html

  • పురాణాల్లో మార్కండేయ మహర్షి కలువపువ్వుల నారతో దేవతలకు వస్త్రాలు నేసి ఇచ్చారని చెపుతారు. అవి చుస్తే రావివర్మ చిత్రాల్లో లక్ష్మీదేవి కట్టుకొన్న కంచి కామాక్షి అమ్మంత దైవత్వం కనిపిస్తుందీ కంచి చీరల్లో. ఈ కంచి చీరలు కాస్త బరువు. పల్లు, అంచులు రెండు చీర ప్రధాన భాగం కన్నా భిన్నమైన రంగుల్లో ఉంటాయి. విడిగా నేసిన పల్లు, అంచుని చీర ప్రధాన భాగంలోకి నేర్పుగా ముడి వేసే అల్లిక కంచి పట్టు చీరల ప్రత్యేకత చీర పాత బడి పోయిన కళకళలాడే అంచును, చీర కొంగును విదదీయడం సాధ్యం కాదు. చీర తో జరి కలిపేస్తారు. జరీ అతి సన్నని వెండితీగ, బంగారు ద్రవంలో ముంచిన జరీ తీగలు వాడి బంగారు జరీ చీరలు నేస్తున్నారు కళాకారులుఇద్దరు చేనేత కళాకారులు కలిసి నెల రోజులు కష్టపడితే ఒక చీర తయ్యారవ్వుతుంది. మామిడి పిందెలు, నెమళ్ళు, చిలుకలు వంటి ప్రకృతి అంశాలతో పాటు పలు రూపాలను చీర పైన చెక్కగా అల్లుతారు. ఈ చీరల డిమాండ్ ఎన్నేళ్ళ నుంచి వస్తున్నా ఇప్పటికీ తగ్గలేదు.

    బంగారు జరీ తీగల అల్లిక కంచి పట్టు

    పురాణాల్లో మార్కండేయ మహర్షి కలువపువ్వుల నారతో దేవతలకు వస్త్రాలు నేసి ఇచ్చారని చెపుతారు. అవి చుస్తే రావివర్మ చిత్రాల్లో లక్ష్మీదేవి కట్టుకొన్న కంచి కామాక్షి అమ్మంత దైవత్వం…

  • వీటిని వెంట వుంచుకోవాలి

    వేసవిలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి. పగటి వేళల్లో మైల్డ్ క్లెన్సర్ తో రోజుకో నలుగు సార్లు అయిన ముఖం శుబ్రం…

  • ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయ వల్ల కలిగే ఉపయోగపడే లిస్టు లో ఇప్పుడు జుట్టు సంరక్షణ కూడా చేరింది. వాతావరణంలో కలిగే ఎన్నో మార్పులతో జుట్టు వుదిపోతూ వుంటుంది. ఖరీదైన వైద్యాలకి కూడా లొంగని పక్షంలో ఉల్లిపాయ వైద్యం వైపు చూడొచ్చు. ఉల్లిపాయ వాసన భరించడం కాస్త కష్టమే కానీ అందమైన జుట్టు కావాలంటే ఆ కష్టం భరించాలి. ఉల్లిపాయ ముక్కలు కోసి మెత్తగా గ్రయిడ్ చేసి ఉల్లి రసం తీసుకోవాలి. కుదుళ్ళ లోపల దాకా పట్టించి ఓ అరగంట పాటు ఆరనిచ్చి ఆ తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే ఫలితం తెలుస్తుంది. అలాగే ఉల్లిపాయ రసం లో తేనె కలిపి ఈ మిశ్రమం తలకు అప్లయ్ చేసి ఆరనిచ్చి ఈ ఉల్లిపాయ లోనే కొబ్బరి నూనె కలిపి తలకు మసాజ్ చేసే కొంతసేపయ్యాక తలస్నానం చేసిన ఫలితం బావుంటుంది. ఉల్లి రసంలో రమ్ కలిపి ఒక రాత్రంతా అలాగే ఉంచాలి. తెల్లవారాక ఈ రసం తలకి పట్టించి స్నానం చేస్తే చాలా మంచి ఫలితం వుంటుంది. ఏ రకంగా వాడినా వట్టి ఉల్లిరసం లో నైనా ఫలితం మాత్రం అద్భుతంగానే వుంటుంది.

    అందమైన కురుల కోసం ఉల్లిపాయ వైధ్యం

    ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయ వల్ల కలిగే ఉపయోగపడే లిస్టు లో ఇప్పుడు జుట్టు సంరక్షణ కూడా చేరింది. వాతావరణంలో కలిగే ఎన్నో…

  • కొందరి పెదవులు ఏడాది పొడవునా డ్రై గానే వుండి హైడ్రేషన్ అవసరం అవుతుంది. కొందరికి సెబాషియన్ గ్రంధాలు ఎక్కువగా ఉంటాయి. ఎండ వేడికి, కోల్డ్ డ్రై ఎయిర్ కి దేనికి ఎక్స్ పోజ్ అయినా పెదవుల పై తేమ నిమిషాల్లో తగ్గిపోతుంది. దీనికి ఏకైక పరిష్కారం వీలైనంతగా మాయిశ్చురైజ్ చేసుకోవడం లిప్ స్టిక్ ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి.చాలా రకాల్ని అందంగా కనబడేలా చేస్తారే తప్ప సూర్యకిరణాల నుంచి పరి రక్షించే మాదిరి తాయారు చేయరు. మాయిశ్చురైజింగ్ లిప్స్ స్టిక్ లను ఎస్.పి. ఎఫ్ ౩౦ వుండే మాదిరి ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ ద్రవ పదార్ధాలు తీసుకోవాలి. ఒక్కసారి పగిలిన పెదవులు పోషకాహారలేమికి బి-విటమిన్ తక్కువగా ఉండటానికి సూచన కావచ్చు. టూత్ పేస్టూ, మౌత్ వాష్ ల లో ఏవైనా ఎలర్జీక్ రీయాక్షన్ వున్న పెదవుల డ్రైనెస్ కు కారణం కావచ్చు. మెత్తని టూత్ బ్రష్ తో నెమ్మదిగా స్ట్రెచ్ చేస్తే మృతకణాలు పోతాయి. తర్వాత గోరు వెచ్చని నిల్ల తో కడిగేయాలి.కొందరి పెదవులు ఏడాది పొడవునా డ్రై గానే వుండి హైడ్రేషన్ అవసరం అవుతుంది. కొందరికి సెబాషియన్ గ్రంధాలు ఎక్కువగా ఉంటాయి. ఎండ వేడికి, కోల్డ్ డ్రై ఎయిర్ కి దేనికి ఎక్స్ పోజ్ అయినా పెదవుల పై తేమ నిమిషాల్లో తగ్గిపోతుంది. దీనికి ఏకైక పరిష్కారం వీలైనంతగా మాయిశ్చురైజ్ చేసుకోవడం లిప్ స్టిక్ ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి.చాలా రకాల్ని అందంగా కనబడేలా చేస్తారే తప్ప సూర్యకిరణాల నుంచి పరి రక్షించే మాదిరి తాయారు చేయరు. మాయిశ్చురైజింగ్ లిప్స్ స్టిక్ లను ఎస్.పి. ఎఫ్ ౩౦ వుండే మాదిరి ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ ద్రవ పదార్ధాలు తీసుకోవాలి. ఒక్కసారి పగిలిన పెదవులు పోషకాహారలేమికి బి-విటమిన్ తక్కువగా ఉండటానికి సూచన కావచ్చు. టూత్ పేస్టూ, మౌత్ వాష్ ల లో ఏవైనా ఎలర్జీక్ రీయాక్షన్ వున్న పెదవుల డ్రైనెస్ కు కారణం కావచ్చు. మెత్తని టూత్ బ్రష్ తో నెమ్మదిగా స్ట్రెచ్ చేస్తే మృతకణాలు పోతాయి. తర్వాత గోరు వెచ్చని నిల్ల తో కడిగేయాలి.

    లిప్ స్టిక్ ఎంపికలో శ్రద్ధ తీసుకోవాలి

    కొందరి పెదవులు ఏడాది పొడవునా డ్రై గానే వుండి హైడ్రేషన్ అవసరం అవుతుంది. కొందరికి సెబాషియన్ గ్రంధాలు ఎక్కువగా ఉంటాయి. ఎండ వేడికి, కోల్డ్ డ్రై ఎయిర్…

  • మెడ చుబుకం, ముక్కు కిందగా వుండే అవాంచిత రోమాలు చాలా ఇబ్బంది పెడతాయి. త్రేడ్డింగ్ తో తొలగించినా మళ్ళి మళ్ళీ వస్తుంటాయి. వీటి నివారణ కు కొన్ని గృహ చిట్కాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కప్పు అప్రికాట్స్ గ్రైడ్ చేసి ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లయ్ చేసి 15 నుంచి 20 నిమిషాలు గుండ్రని స్ట్రాక్స్ ఇస్తూ మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటి తో కడిగేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయాలి. అలాగే ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున ఆరంజ్ పీల్ పొడి, లేమెన్ పీల్ పొడి, బాదాం పొడి, ఓట్ మీల్, రోజ్ వాటర్, ఆలివ్ ఆయిల్ కలిపి పేస్టుగా చేసి ఫేస్ ప్యాక్ లాగా వేసి ఆరనివ్వాలి. తర్వాత ఐదు పది నిముషాలు రుబ్ చేసి కడిగేయాలి. వారానికి రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం వుంటుంది. రెండు నిమ్మకాయల రసం, పంచదార కలిపి పల్చని పేస్టు లాగా చేసి అప్లయ్ చేయాలి చేసి పావుగంట ఆగి కడిగేయాలి. గుడ్డు పచ్చ సోన, పిండి, పంచదార కలిపి గిలకొట్టి జిగురుగా వున్న పేస్టు తయ్యారయ్యాక అప్లయ్ చేసి ఆరాక కడిగేయాలి. నెల రోజుల్లో వెంట్రుకల పెరుగుదల ఆగిపోతుంది.

    ఈ వైద్యం తో నెల రోజుల్లో ఫలితం

    మెడ చుబుకం, ముక్కు కిందగా వుండే అవాంచిత రోమాలు చాలా ఇబ్బంది పెడతాయి. త్రేడ్డింగ్ తో తొలగించినా మళ్ళి మళ్ళీ వస్తుంటాయి. వీటి నివారణ కు కొన్ని…

  • నాజుగ్గా చక్కగా కనిపించాలని అందరికి కోరికే. లావుగా వున్న వాళ్ళకు కాస్త సన్నగా కనిపించాలన్న. ఫ్యాషన్ గానూ వుండాలనుకొన్న వేసుకొనే దుస్తుల్లో కొంత స్టయిల్ చూపించ వచ్చు. పొట్ట పై భాగం కాస్త బొద్దుగా కనిపిస్తూ వుంటే రెండు మూడు అంగుళాలు లూజ్ గా ఉండేవి వేసుకోవాలి. ఫ్యాంట్లు, లేహంగాలు నిండుగా కుచ్చుల్లు లేకుండా చూసుకుంటే బావుంటుంది. కుర్తీ విషయంలో ఇదే జాగ్రత్త, పటియాలా ఫ్యాంట్ల కన్నా చుడీదార్లే బాగుంటాయి. ఎంచుకొనే కుర్తీలు కూడా మోకాలి పై భాగం వచ్చేలా డిజైన్ చేయించుకోవాలి. పై నుంచి కింద వరకు కుర్తీ ఒకే లా కాకుండా కిందకి వస్తున్న కొద్ది వెడల్పుగా ఉండేలా చూసుకోవాలి. పెద్ద ప్రింట్లు కాకుండా చిన్న ప్రింట్లు ఉండేలా చూసుకోవాలి. సన్నని అంచున్న మెత్తని క్రేప్, షిఫాన్ చీరలు, ఎంబ్రాయిడరీ పనితనం వున్న చీరల్లో నాజూగ్గా సన్నగా కనిపిస్తారని ఫ్యాషన్ ఎక్స్ పర్ట్స్ చేఅప్పుతున్నారు.

    వేసుకునే దుస్తుల్లోనే నాజుకంతా

    నాజుగ్గా చక్కగా కనిపించాలని అందరికి కోరికే. లావుగా వున్న వాళ్ళకు కాస్త సన్నగా కనిపించాలన్న. ఫ్యాషన్ గానూ వుండాలనుకొన్న వేసుకొనే దుస్తుల్లో కొంత స్టయిల్ చూపించ వచ్చు.…

  • ఇవి సహజమైన మార్గాలు

    ముంజేతి కింద చర్మం నల్లగా అయ్యిపోయి తర్వాత స్కిన్ లైటనింగ్ సాధ్యం కాదనిపిస్తుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అధిక బరువు, స్వేదం, తరచూ వ్యాక్సింగ్, షేవింగ్,…

  • ముఖం అందంగా తాజాగా ఉండాలంటే ఖరీదైన క్రీములే వాడవలిసిన అవసరం ఎమీ లేదు. ఇంట్లో అందుబాటులో వుండే ఎన్నో వస్తువులు ఖరీదైన ఫేస్ పాక్ ల కాంటే బాగా పని చేస్తాయి. సహజమైన ఫీలింగ్ ఏజెంట్ బొప్పాయి. మొటిమలు మచ్చల్ని సులువుగా నివారిస్తుంది. బాగా మగ్గిన బొప్పాయి గుజ్జులో చెంచా పెరుగు, కాసిని పాలు కలిపి ఫేసు ప్యాక్ వేస్తె చాలు. మచ్చల్లేకుండా చర్మం నునుపుగా వుంటుంది. తరచూ బయటకి వెళతాం కనుక ముహం పై మురికి పేరుకుంటుంది. బొప్పాయి గుజ్జులో వరిపిండి పాలు. కోడి గుడ్డు తెల్లసొన నిమ్మ రసం కలిపి ఫేస్ ప్యాక్ వేస్తె ముడతలు పడ్డ చర్మం బిగుతుగా అయిపోతుంది. బంగాళ దుంప గుజ్జులో ఓట్స్, పాలు చేర్చి తేనె, ఆలివ్ నూనె కలిపి ముఖం మర్ధనా చేస్తే చర్మం చక్కగా ఆరోగ్యంగా మెరిసిపోతుంది.

    ఖరీదైనవే కవాలనుకోవద్దు

    ముఖం అందంగా తాజాగా ఉండాలంటే ఖరీదైన క్రీములే వాడవలిసిన అవసరం ఎమీ లేదు. ఇంట్లో అందుబాటులో వుండే ఎన్నో వస్తువులు ఖరీదైన ఫేస్ పాక్ ల కాంటే…

  • Flower eyeliner..... అందమైన కళ్ళ పైన అంతకంటే అందమైన పువ్వుల అలంకరణ లో కొత్త ట్రెండ్ . ఇప్పుడు కళ్ళ పైన హరివిల్లు అందాలు తేవచ్చు. పూల పొదలు సృస్టించచ్చు. ఎప్పుడు కళ్ళకి ఆనల్లని కళ్ళ ఐలైనర్ ఎందుకు? కొన్ని వెరైటీగా ప్రయత్నిద్దాంఅనుకొన్నారేమో మేకప్ నిపుణులు. అలా వచ్చిందే ఈ ఫ్లోరల్ ఐలైనర్ తెలుపు, నీలం, ఉదా రంగుల్లోని ద్రవరూపంలో ఈ ఫ్లోరల్ ఐలైనర్ ని ఎంచుకుని వాటి తో నే వాటితోనే పూల డిజైన్లు వేసేస్తున్నారు. చెక్కని పూలతో, ఆకులతో కళ్ళపైన అద్భుతమైన పూల ఐలైనర్ లో ఎలా వేసుకోవాలో కూడా యు ట్యూబ్ లో చుదోచ్చు.

    సోగకళ్ళ పైన పువ్వుల అందాలు

    Flower eyeliner….. అందమైన కళ్ళ పైన అంతకంటే అందమైన పువ్వుల అలంకరణ లో కొత్త ట్రెండ్ . ఇప్పుడు కళ్ళ పైన హరివిల్లు అందాలు తేవచ్చు. పూల…

  • ఇలాoటి ప్యాక్ ట్రై చేయండి

    ముప్పయిలు దాటి నలభైల్లోకి అడుగుపెడుతూ ఉండగానే అప్పటివరకు నున్నగా అందంగా కనబడే ముఖంపైన చిన్న మచ్చలు మొదలవుతాయి. రొటీన్ గా ఎదురయ్యే ముడతలకు తోడుగా అన్నమాట. దీన్ని…