అరుణ సరీన్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుని యోగా గురువు కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ లో కార్యకర్తగా పనిచేసేది.20 ఏళ్ల నుంచి మధ్యప్రదేశ్ లోని ఎన్నో కారాగారాల్లో ఖైదీలకు యోగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడినవారు డిప్రెషన్ బారిన పడిన వారికి అరుణ సరీన్ ఇచ్చే శిక్షణ ఎంతో ఉపయోగపడేది. రెడ్ క్రాస్ సంస్థతో కలిసి ఆమె డి అడిక్షన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఖైదీలు తమ నడవడిని మార్చుకుని సాధారణ జీవితాన్ని గడిపేలా చేయడం ఆమె ధ్యేయం అని చెప్పుకుంటారు అరుణ సరీన్.ఆమె భర్త కర్నూల్ సరీన్ సైన్యంలో పనిచేశారు.













