ఆన్‌లైన్ లో కాశ్మీర్ వస్త్రాలు

ఆన్‌లైన్ లో కాశ్మీర్ వస్త్రాలు

ఆన్‌లైన్ లో కాశ్మీర్ వస్త్రాలు

కాశ్మీర్ సాంప్రదాయ దుస్తులను అమ్మేందుకు ఫ్యాషన్ స్టోర్ నెలకొల్పింది ఇక్ర అహ్మద్. సైకాలజీ ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేసిన ఇక్ర  సొంతంగా వివిధ మధ్య మాల ద్వారా డిజైనింగ్ నేర్చుకుంది. 2015 లో ఆన్‌లైన్ స్టోర్ తుల్పలావ్ ప్రారంభించింది. ఈ స్టోర్ తో కాశ్మీర్ కే ప్రత్యేకమైన ఫిరాన్ కుర్తీలు వెడ్డింగ్ డ్రెస్ లు ఎన్నో వెరైటీలు దొరుకుతాయి. ఈ స్టోర్స్ లో ప్రత్యేకంగా టిల్లా వర్క్ ఫిరాన్ అంటే బంగారం వెండి దారాలతో తయారు చేసే ప్రత్యేకమైన ఎంబ్రాయిడరీ ఫిరాన్ దొరుకుతుంది. కాశ్మీర్ సాంప్రదాయ దుస్తులు ఇక్కడ కొనుక్కోవచ్చు.