చండీగఢ్ కు చెందిన జాన్వి జిందాల్ చాలా ప్రత్యేకం యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫ్రీ స్టైల్ లో స్కేటింగ్ మెళకువలు నేర్చుకొని 17 ఏళ్లకే ఐదు గిన్నిస్ రికార్డులు సాధించింది. 8 ఏళ్ల వయసులో తండ్రి మనీష్ జిందాల్ సాయంతో రోలర్ స్కేట్స్ తో సాధన చేసింది జాన్వి. 2019లో తొలిసారి జాతీయ స్థాయి స్కేటింగ్ ఛాంపియన్ షిప్ లో తొలి పతకం సాధించింది జాన్వి. ఆ తర్వాత పలు జాతీయ స్థాయి పోటీల్లో స్వర్ణ,కాంస్య పతకాలు గెలుచుకుంది స్కేటింగ్ చేస్తూ బాగ్రా నృత్యం చేసిన మొదటి అమ్మాయి కూడా జాన్వినే. ఈ విన్యాసానికి ఆమెకు 2021 లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. గత సంవత్సరం స్కేటింగ్ లో 5 గిన్నిస్ రికార్డ్స్ లో తన పేరు సుస్థిరం చేసుకోంది జాన్వి.













