ఉత్తరాఖండ్ లో నివసించే డాక్టర్ మేఘ సక్సేనా అక్కడి ఆల్మోరా జిల్లా గవర్నమెంట్ కాలేజీ లో పనిచేశారు. ఆమెకు పర్యావరణ పరిరక్షణ ఇష్టమైన అంశం అడవుల్లో రాలి పడిపోయే దేవదారు ఆకుల వల్ల అక్కడి అడవుల్లో కారు చిచ్చు రగులుతోందని ఆమె గ్రహించింది. ఎండి రాలే ఈ ఆకులపై ఆమె పరిశోధనలు చేసి వాటిని చక్కని సేంద్రియ ఎరువుగా ఫీల్డ్ ఫామ్ లు కోళ్లకు చేపల చెరువులు చేపలకు సేంద్రియ దానా ను తయారు చేసింది ఏకో చార్ పేరుతో ఆమె ప్రారంభించిన స్టార్టప్ ఆమెను వ్యాపారవేత్తను చేసింది ఆమె తయారు చేయించే ఈ దేవదారు ఆకుల ఎరువు కు ఉత్తరాఖండ్ లోనే కాదు భారతదేశం లోని చాలా రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది.













