రోమితా మజుందార్ ఒకప్పటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, వెంచర్ కాపిటలిస్ట్. 2021 లో స్కిన్ కేర్ బ్రాండ్ ఫాక్స్ టెల్ ప్రారంభించారు ఇది ప్రస్తుతం భారత దేశంలోని ప్రముఖ D2C స్కిన్ కేర్ బ్రాండ్స్ లో ఒకటి ఝార్ఖండ్ లోని రాంచి లో పుట్టి పెరిగిన రోమిత యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ లో బిజినెస్ ఎకనామిక్స్ ఫైనాన్షియల్ మ్యాథమెటిక్స్ లో డిగ్రీ చేశారు. ఏ నిర్ణయం తీసుకున్న ముందు మనపై మనకు నమ్మకం ఉండాలని చెప్పే రోహిత తాజాగా హరూన్ ఇండియా 2025 (అండర్ 30) జాబితాలో చోటు సంపాదించారు.













