హరూన్ ఇండియా 2025 అండర్ 30 జాబితాలో చోటు సాధించింది వృషాలి ప్రసాదే.(Vrushali prasade) ఎ.ఐ పవర్ట్ ఫ్లాట్ ఫామ్ కో ఫౌండర్, సి ఈ ఓ కూడా. మార్కెటింగ్ నిర్ణయాలు ఆటోమేట్ చేసేందుకు వివిధ బ్రాండ్స్ కు ఉపయోగపడే ఫ్లాట్ ఫారం ఇది. ఈ పిక్సిస్ తో బ్రాండ్స్ మార్కెట్ చేసుకోవచ్చు. ఎ.ఐ ఆధారిత వేదిక ఇది. బిట్స్ పిలాని నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వృషాలి నోటి నుంచి ఎప్పుడు రిగ్రేట్ అన్న పదం వినిపించదు. రిస్క్ టేకింగ్ స్వభావం ఆమె చిన్న వయసు నుంచే ఉంది. కొత్తగా ఆలోచించడమే విజయానికి మార్గం అంటుంది వృషాలి.













