పిల్లలకు పాఠాలు నేర్పే ‘స్కిల్ మేటిక్స్’ కు కో ఫౌండర్ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ దేవాన్షి కేజ్రీవాల్. ముంబైలో ప్రారంభమైన ఈ స్కిల్ మేటిక్స్ కో ఫ్రెండ్లీ ఫ్రీ ఎడ్యుకేషనల్ గేమ్స్ క్రియేట్ చేస్తోంది. పిల్లలు పాఠాలు నేర్చుకునే విధానంలో ఎంతో గొప్ప మార్పు తెచ్చింది. స్పెల్లింగ్ గేమ్స్ తో మొదలైన స్కిల్ మేటిక్స్ స్క్రీన్ అవసరం లేకుండా పిల్లలకు నచ్చేలాగా వారి ఆలోచనలకు పదును పెట్టే లాగా పజిల్స్ ను క్రియేట్ చేసింది. ఈ స్టార్టప్ కు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ఎంతో గొప్ప పేరుంది. 2016 లో స్థాపించిన స్టార్టప్ ఈరోజు పిల్లల విద్యారంగంలో ప్రముఖ శక్తి. దేవాన్షి తాజాగా హరూన్ ఇండియా 2025 అండర్ 30 జాబితాలో చోటు సాధించారు.













