మోహినియాట్టం మోడరన్ రాప్ ను మిక్స్ చేసి ఎనిమిది మందితో ఒక వినూత్న నృత్యం రూపొందించింది శ్వేత వారియర్. ఈ డాన్స్ వీడియోస్ 13 మిలియన్ ల వ్యూస్ వచ్చాయి. కేరళలోని పాలక్కాడ్ కు చెందిన శ్వేత వారియర్ మూడేళ్ల వయసు నుంచే డాన్స్ నేర్చుకొంది. భరతనాట్యం స్టైల్ మిక్స్ చేసి సృష్టించిన స్ట్రీట్ ఓ క్లాసికల్ సూపర్ హిట్ అయింది. రకరకాల హై బ్రీడ్ డాన్స్ లతో కొత్త డాన్స్ స్టైల్స్ సృష్టించగల ప్రత్యేకమైన నృత్య కళాకారునిగా గుర్తింపు తెచ్చుకుంది శ్వేతా వారియర్ సోనీ టీవీ ఇండియన్ బెస్ట్ డాన్సర్ లో రన్నరప్ గా నిలిచింది.













