ఐదేళ్ల వయసుకే సారా అర్జున్ 100 వాణిజ్య ప్రకటనల్లో కనిపించి తెలుగు,తమిళం హిందీ,మలయాళ చిత్రాల్లో బాల నటిగా నటించింది అవార్డులు అందుకొంది సారా. పొన్నియన్ సెల్వన్ లో ఐశ్వర్య రాయ్ చిన్నప్పటి పాత్రలో నందిని గా నటించి ప్రశంసలు అందుకుంది సారా అర్జున్. ఆమె తండ్రి రాజ్ అర్జున్ కూడా నటుడే. ఆమెది ముంబై. దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న బాలనటిగా సారా కి గుర్తింపు ఉంది తాజాగా ఆమె రణబీర్ సింగ్ కొత్త సినిమా దురంధర్ లో హీరోయిన్ గా నటించనున్నది ఇప్పటివరకు నటనలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు సారా.













