డ్రాగన్ జ్యూస్ తో ఉపాధి

డ్రాగన్ జ్యూస్ తో ఉపాధి

డ్రాగన్ జ్యూస్ తో ఉపాధి

ఢిల్లీ లో ఉద్యోగం చేస్తూ భర్తకు క్యాన్సర్ రావటం తో రీవా సూద్ తన స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా జిల్లా కు తిరిగి వచ్చింది. రసాయనాలతో పొందిన ఆహార పదార్థాల వల్లనే భర్తకు క్యాన్సర్ వచ్చిందని రీవా నమ్మకం ఆ ఆలోచన తోనే తమ వ్యవసాయ భూముల్లో రసాయనాలు లేని డ్రాగన్ పండ్ల సాగు మొదలు పెట్టింది.డ్రాగన్ పండ్ల రసాన్ని మార్కెట్ చేసి విజయం సాధించింది. ఈ డ్రాగన్ పండ్ల ప్రాసెసింగ్ ద్వారా హిమాచల్ ప్రదేశ్,హరియాణా,పంజాబ్ ఉత్తరాఖండ్ లోని ౩౦౦ మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు.తమ డ్రాగన్ ఫ్రూట్స్ ను అగ్రీవ్ నేచురల్లీ పేరుతో గ్లోబల్ మార్కెట్ లోకి తెస్తోంది రీవా సూద్ ఆమె వ్యాపారం టర్నోవర్ సంవత్సరానికి కోటి రూపాయలు దాటింది.