అమెరికాలో స్థిరపడిన భారత స్టాండప్ కమెడియన్ జర్నా గార్గ్ ఈ మధ్యకాలంలో సినిమాల్లో నటించటం మొదలుపెట్టింది.ఎ నైస్ ఇండియన్ బాయ్ సినిమాలో కీలక పాత్రలు ధరించిందామె అలాగే రి అరేంజ్ అనే సినిమాకు స్క్రిప్ట్ రాశారు. ఆ సినిమాకు ఆస్టిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ కామెడీ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది.జర్నా గార్గ్ చక్కని రచయిత్రి కూడా ఆమె తన జీవిత విశేషాలతో రాసిన థిస్ అమెరికన్ ఉమెన్ కు అద్భుతమైన స్పందన లభించింది. కెన్ వెస్టర్న్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా లో లా చదివారు జర్నా గార్గ్ ఉన్నత చదువులు చదివి స్టాండప్ కమెడియన్ గా నవ్వులు విరబూయిస్తున్న జర్నా గార్గ్ జీవన ప్రయాణమే గొప్ప స్ఫూర్తి.













