ధిక్కార సూచన

ధిక్కార సూచన

ధిక్కార సూచన

ఆడపిల్లలు జుట్టు కత్తిరించుకొని నిరసన తెలియజేయటం ఒక బలమైన పోరాట చిహ్నం,లేదా ధిక్కారాన్ని సూచిస్తోంది తాగాజా కేరళ లో ఆశా వర్కర్స్ మెరుగైన జీవితం,పని ప్రదేశాలలో కాసిని సౌకర్యాలు పదవీ విరమణ ప్రయోజనాలు వంటి వాటి కోసం పోరాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే నిరసనగా జుట్టు కత్తరించుకొన్నారు.గతంలో కాలేజీ యాజమాన్యం తిరుగు నిరసనగా కేరళ విద్యార్థినులు తమ జుట్టు కత్తరించుకొన్నారు. ఈ కత్తిరింపు ఇక ధిక్కారం తిరుగుబాటు సూచన కాబోతోంది అమ్మాయిల జీవితాల్లో జుట్టు కు ప్రత్యేక స్థానం దాన్నే నిర్లిప్తంగా కత్తరించుకొంటున్నారు అంటే తమ జీవితాన్ని తమ చేతుల్లోకి తీసుకొంటున్నారు ప్రపంచానికి చాటి చెప్పటం.