మానసికంగా స్త్రీల పైన ఎంతో ప్రభావం చూపించి వారి ఆరోగ్యాన్ని పాడు చేసే మెనోపాజ్ గురించి,మనం తక్కువ మాట్లాడుకొంటాం,మెనోపాజ్ లో వచ్చే మూడ్ స్వింగ్స్ స్త్రీలను చాలా మానసిక వత్తిడికి గురి చేస్తాయి.అంటుంది ప్రముఖ నటి లారా దత్తా మెనోపాజ్ ఒక అనకూడని వినకూడని మాటల భావిస్తారు.ఆ సమయంలో స్త్రీలకు చాలా సపోర్ట్.దీన్ని ఇంతకుముందే అధిగమించిన వారు తాము ఆ సందర్భాన్ని డీల్ చేసిన తీరును గురించి మాట్లాడుతూ ఉంటే,మెనోపాజ్ గురించి అందరికి అర్థం అవుతుంది.ఇది వ్యక్తిగత విషయం కాదు.ఖచ్చితంగా స్త్రీల జీవితం లో వచ్చే ఈ దశ కుటుంబం పైనే నేరుగా ప్రభావం చూపిస్తుంది అంటోంది బాలీవుడ్ నటి లారా దత్తా.













