• సలాడ్స్ కోసం తరిగిన కూరగాయ ముక్కల్ని, పండ్ల ముక్కల్ని కొంచం సేపు విడిగా ఉంచిన అవి రంగు మారిపోతాయి. అలాగని సరిగ్గా తినే ముందరే కోయాలంటే టైమ్ సరిపోదు. కొన్ని సార్లు ఇంటికెవరైనా అతిధులు వస్తున్నారంటే ఇలాంటివి కాస్త తీరికగా అందంగా కట్ చేసి పెట్టుకుంటే హడావుడి లేకుండా వుంటుంది. అనిపిస్తుంది అలాంటప్పుడు 'కోల్డ్ బౌల్ ఆన్ ఐస్' వుంటే ఎంతో ఉపయోగ పడుతుంది. గంటా రెండు గంటల పాటు సలాడ్లు, పండ్ల ముక్కలు, అప్పుడే కోసిన వాటిలా తాజాగా వుంటాయి. గట్టి ప్లాస్టిక్ తో చేసిన ఈ బాక్స్ లకు కింద భాగంలో విడిగా తీసి పెట్టుకునే ఇంకో ఆర వుంటుంది. అందులో నిండా ఐస్ ముక్కలు పేర్చి పై భాగంలో పండ్ల ముక్కలు పెడితే ఐస్ చల్లదానం పై వరకు వ్యాపించి గిన్నెలోని ముక్కల్ని ఎక్కువ సేపు తాజాగా ఉంచుతుంది. దీనిలో వుండే ప్లాస్టిక్ సపరేటర్ తీసి ఒకే దాన్లో రెండు మూడు రకాల ముక్కలను అందంగా పేర్చి టేబుల్ పైన పెట్టేస్తే చూసేందుకు ఎంతో బాగుంటుంది.

    చల్ల చల్లగా…….తాజాగా…….ఫ్రెష్ గా…….

    సలాడ్స్ కోసం తరిగిన కూరగాయ ముక్కల్ని, పండ్ల ముక్కల్ని కొంచం సేపు విడిగా ఉంచిన అవి రంగు మారిపోతాయి. అలాగని సరిగ్గా తినే ముందరే కోయాలంటే టైమ్…

  • పోట్టి జుట్టు పొడువుగా అయిపోవాలన్నా పలుచని జుట్టు వొత్తుగా కనిపించాలన్న, రంగులు వేయకుండానే ఏ బంగారు జుట్టు క్షణాల్లో మేరవాలన్నా నో ప్రాబ్లెమ్ అంటున్నారు హెయిర్ స్టయిలిస్ట్ లు అవి విగ్గులు, సవరలు కావు సీక్రేట్ హెయిర్ ఎక్స్ టెన్షన్లు సన్నని హెయిర్ బాండ్స్ కి అతికించిన అందమైన హెయిర్ స్టైల్స్ ఆ బాండ్ తలలో పెట్టుకుంటే చాలు. దానికి అతికించిన పొట్టి జుట్టుతో వత్తుగా కాస్త పొడుగాటి జుట్టు తో పొడుగ్గా, క్షణాల్లో మార్చేయవచ్చు. పొడవాటి పొనీ వేసుకోవాలంటే రెడీ మేడ్ పొనీలున్నాయి. వీటికి అతికించిన రిబ్బన్ ని అసలు జుట్టుకు ముడేస్తే పొడుగాటి పోనీ వస్తుంది. బంగారు రంగు జుట్టు కావాలంటే ఇంతే ఈ సీక్రేట్ హెయిర్ ఎక్స్ టెన్షన్ తో ఏదైనా సులభమే.ఈ కృత్రిమ వెంట్రుకలు కుడా చూసేందుకు చాలా సహజంగా జుట్టు తో కలిసిపోతాయి. ఎటొచ్చి మన జుట్టు లాంటివే చూసి ఎంపిక చేసుకోవాలి.

    క్షణాల్లో కాదు కొన్ని స్టైల్స్

    పోట్టి జుట్టు పొడువుగా అయిపోవాలన్నా పలుచని జుట్టు వొత్తుగా కనిపించాలన్న, రంగులు వేయకుండానే ఏ బంగారు జుట్టు క్షణాల్లో మేరవాలన్నా నో ప్రాబ్లెమ్ అంటున్నారు హెయిర్ స్టయిలిస్ట్…

  • టొమాటోలెన్ని రకాలు అంటే దేశవాళి, హైబ్రీడ్ మహా అయితే చెర్రీ అంటాం, కానీ ప్రపంచ వ్యాప్తంగా 7500 టొమాటో రకాల్ని పండిస్తున్నారు. రకరకాల ఆకారాలు పరిమాణాలు, ఎరుపు, గులాబీ, పసుపు, నారింజ, ఉదా, గోధుమ, తెలుపు, నలుపు ఇంకా గీతాలు రుచులు వేరువేరుగా వున్నాయి. తక్కువ పులుసులు, తియ్యగా వుండే ఎల్లో పెయర్, ముదురు ఎరుపు రంగు తో ఉప్పుగా వుండే బ్లాక్ క్రీమ్, పలుచని తొక్కలు, తీపి పులుసు రుచి తో బ్రాందీ వైన్, తీపి, వగరు రుచులతోగ్రీన్ సాసేజ్, తియ్యని గార్డెన్ పిచు, చెర్రి గ్రేప్, అన్నింటి కంటే బుల్లిగా చప్పరించేటట్లుగా వుండే తియ్యని కరెంట్ ఇలా ఎన్నో రకాలు. తియ్యని చెర్రి గ్రేప్ టొమాటోలను నేరుగా సలాడ్లలోను ఐస్ క్రీముల్లోను ఉపయోగిస్తారు. మనకి దొరికే ఎర్రని టొమాటోల్లో లైకొపిన్ శాతం ఎక్కువగా వుంటుంది. ఇది అద్భుతమైన యంటీ ఆక్సిడెంట్. ఇది ఆహారానికి ఎంతో అవసరం ఇది ఆరోగ్యానికే కాదు సౌందర్యానికి మేలే. టొమాటో గుజ్జు ఫేస్ మాస్క్ గా వేస్తే మొటిమలు పోతాయి చర్మం కాంతి వంతంగా అయిపోతుంది. దీన్ని లవ్ ఆపిల్ అని ఫ్రెంచ్ వాళ్ళు. ది ఆపిల్ పారడైజ్ అని జర్మన్లు పిలుస్తారట.

    ది బెస్ట్ అండ్ టేస్టి లవ్ ఆపిల్

    https://scamquestra.com/17-dokazatelsta-i-probely-afery-41.html

  • ఇవాల్టి రోజుల్లో అబ్బాయిలు, అమ్మాయిలు చేతుల్ని చుట్టేసుకుని కట్టి పడేస్తున్నాయి లెదర్ బ్రేస్ లెట్స్. కాలేజీ కి వెళ్ళే టీనేజర్స్ కి రాక్ స్టార్ లుక్ తెచ్చేలా రకరకాల బ్రేస్ లెట్స్ వస్తున్నాయి. సన్నటి లెదర్ తాళ్ళతో రెండు మూడు రంగులు కలిపి లెదర్ స్ట్రాప్స్ లో అక్షరాలు గుచ్చినవి హృదయాకారం, నక్షత్రాలు, పక్షులు, బొమ్మలు డిజైన్స్ ఎన్నో రకాలు జీన్స్, టీ షర్టులు, స్కర్టులు, గౌన్లు వేటి మేడకైనా సరే బాగుంటాయి. అమ్మాయిలు సాంప్రదాయ దుస్తులు వేసుకోవాలనుకున్నా పెద్ద పెద్ద రెయిన్ స్టోన్స్ పొదిగిన చెల్డ్వాట్ ల డిజైన్లు పువ్వులాంటి లాకెట్లు అమర్చినవి వున్నాయి. సన్నని లెదర్ తాళ్ళు అంటించి అచ్చంగాజుల్లాగా కూడా వున్నాయి బ్రేస్ లెట్స్. ఇవి చేతులకు కొత్త అందానిచ్చాయి అని చెప్పడం లో సందేహం లేదు. ఈ లెదర్ అందాలు ఇప్పుడే ఆన్ లైన్ లో ఆలస్యం ఎందుకు?

    యువత చేతులు చుట్టేస్తూ లెదర్ బ్రేస్ లెట్స్

    ఇవాల్టి రోజుల్లో అబ్బాయిలు, అమ్మాయిలు చేతుల్ని చుట్టేసుకుని కట్టి పడేస్తున్నాయి లెదర్ బ్రేస్ లెట్స్. కాలేజీ కి వెళ్ళే టీనేజర్స్ కి రాక్ స్టార్ లుక్ తెచ్చేలా…

  • చదువుకు, ఆసక్తికి, వృత్తికి, ఉద్యోగాలకు బలమైన సంబందం వుంది. ఆ మూడు ఒక్కటైతేనే జీవితంలో వృద్ధిలోకి వెళతారు. దీన్ని తలుసుకునే మార్గం సైకో మెట్రిక్ పరీక్ష ద్వారా వ్యక్తిత్వాన్ని విశ్లేషించడం. కేధరిన్ కుక్ బ్రిగ్స్ తన కుమార్తె ఇసా బెల్ తో కలిసి రూపొందించిన వ్యక్తిత్వ విశ్లేషణ ప్రశ్నా వాలి మయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్(ఎంబిటిపో) గా ప్రాచుర్యం పొందింది. చదువుకుంటే మహిళల్లో పునరుతృత్తి సమధ్యం తగ్గిపోతుందనే అపోహలు కేధరిన్ తండ్రి ఆమెకు ఇంట్లో పాఠాలు చెప్పారు. తర్వాత కేధరిన్ ఉపాధ్యాయునిగా స్తిరపడి కూడా తన కూతుర్ని ఇంట్లోనే చదివించింది. ఈ తల్లీ కూతుళ్ళు అనేక సంవత్సరాల అధ్యయనంలో వ్యక్తిత్వాన్ని కొలత వేసేందుకు ఈ ఎంబిటిఐ పేరుతో ఓ ప్రశ్నా నిధిని అభివృద్ధి చేసారు. ఫార్బ్యున్ 100 కంపెనీల జాబితాలో90 కంపెనీలు ఈ విధానం తోనే తమ ఉద్యోగులను సెలక్ట్ చేస్తారు. కాకపోతే ఏ అమెరికన్ అలోచనకొ సరిపోయే ప్రశ్నలతో అచ్చమైన భారతీయ విద్యార్ధిని ఎలా కొలుస్తారో తెలియదు. చదువుకునే పిల్లల్ని, చడువుకొన్న తల్లులు ఈ ఎంబిటిఐ, ఎం.సి.ఎం.ఎఫ్ అంటే మైభయిస్ మైఫ్యూచర్ వంటి విధానాలని క్షుణ్ణంగా పరిశోదించండి

    వ్యక్తిత్వాన్ని కొలిచే ప్రశ్నో నిధి

    చదువుకు, ఆసక్తికి, వృత్తికి, ఉద్యోగాలకు బలమైన సంబందం వుంది. ఆ మూడు ఒక్కటైతేనే జీవితంలో వృద్ధిలోకి వెళతారు. దీన్ని తలుసుకునే మార్గం సైకో మెట్రిక్ పరీక్ష ద్వారా…

  • క్రిస్టల్ సాల్ట్ కు కాకుండా నేచురల్ గా తయారయ్యే రాతి ఉప్పు కు మాత్రమే ఎన్నో ఆరోగ్యసమస్యలను తగ్గించే గుణం వుంటుదన్నారు ఎక్స్ పర్ట్స్. ఇది స్వచ్చమైనది. ఆయుర్వేద మందుల తయారీలో ఈ ఉప్పే ఉపయోగిస్తారు. ఈ ఉప్పుతో మధుమేహం, ఆస్ట్రియో పార్సిస్, డిప్రెషన్, స్ట్రెస్, కండరాల నొప్పులు, తల దిమ్ముగా వుండటం లాంటి ఎన్నో సమస్యలు పరిష్కరించ వచ్చు. ఈ ఉప్పుతో అధ్యాత్మిక శక్తి కూడా ఉందంటున్నారు. నమ్మకం వున్న వాళ్ళు ఒక చిన్ని గిన్నె లో ఉప్పు కర్పూరం కలిపి ఉంచితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జిలు పోతాయి అంటున్నారు. ఈ నమ్మకాలు అవతల పెడితే స్నానం చేసేటప్పుడు స్క్రుబ్ కోసం ఉప్పును ఉపయోగిస్తే మలినాలు తొలగిపోతాయట. ఉదయం గోరు వెచ్చని నీళ్ళల్లో పావు టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి తాగితే అంతర్గత వ్యవస్థ శుభ్ర పడుతుందిట. ఇల్లు ఫ్లోర్ లు తుడిచేటప్పుడు ఆ నీళ్ళల్లో ఉప్పు వేసి తుడిస్తే ఈగలు రాకుండా వుంటాయి. అలాగే ఉల్లిపాయ వంటివి కోసిన వాసన పోవాలంటే చేతులు ఉప్పు నీటి తో కడుక్కోవాలి.

    క్రిస్టల్ సాల్ట్ కంటే కల్లుప్పు బెస్ట్

    క్రిస్టల్ సాల్ట్ కు కాకుండా నేచురల్ గా తయారయ్యే రాతి ఉప్పు కు మాత్రమే ఎన్నో ఆరోగ్యసమస్యలను తగ్గించే గుణం వుంటుదన్నారు ఎక్స్ పర్ట్స్. ఇది స్వచ్చమైనది.…

  • ఈ ఐడియా చాలా బాగుంది. Street store. తమకి అవసరం లేని వాటిని వేరే వాళ్ళకు ఇచ్చేయడం. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ కు చెందిన స్నేహితులు కైలి లెవిటన్, మ్యాక్స్ పజక్ లు, అద్దె లేని స్థలంలో అందరికి అందుబాటులో వుండే లాగా ఉదయం నుంచి సాయంత్రం దాక రోడ్ పక్కని ఈ స్ట్రీట్ స్టోర్ తెరిచారు. ఇక్కడ పెట్టిన లోగోలు, అవసరమైన సామాగ్రి వివరాలు రాసి పెడితే సాయంత్రం వరకు ఎంతో మంచి దాతలు తోచినవి ఇచ్చారు. అవసరమైన వాళ్ళు వచ్చి తీసుకు పోయారు. మనం దాన ధర్మం చేసే మొహం పెట్టకుండా ఎదుటివాళ్ళ ఆత్మమ గౌరవం కాపాడే సాయం అన్నమాట బరిస్తా లోని భువనేశ్వర్ లో ఏహా ఇప్పటికి 180 నగరాల్లో స్ట్రీట్ స్టోర్స్ తెరిచారట. పది మంది కలసి ఇందుకు యాభై మంది దగ్గర నుంచి వాళ్ళకు అవసరం లేని బట్టలు, బూట్లు, పుస్తకాలు మిగతా ఎలాంటి సామాగ్రి అయినా సరే కలక్ట్ చేసి ఓ వీధి దుఖానం పెట్టేస్తే బహుశ నిరుపేదల అవసరాలు తిరిపోతాయేమొ. కొంతమంది వాలంటీర్లు ఇచ్చి రాతలు వుంటే చాలు వీధి చివర మన దుకాణం పెట్టేయోచ్చు.

    ఇలా చేస్తే ఎంత మర్యాద

    ఈ ఐడియా చాలా బాగుంది. Street store. తమకి అవసరం లేని వాటిని వేరే వాళ్ళకు ఇచ్చేయడం. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ కు చెందిన స్నేహితులు కైలి…

  • మనకి మూడు రకాలైన ఆకళ్ళు ఉంటాయని మనస్థత్వ శస్త్ర వేత్తలు చెపుతున్నాయి. ఒకటి జీవన వ్యవస్థను నడిపించే ఆకలి, భావోద్వేగపరమైన ఆకలి, సామాజికమైన ఆకలి. మొదటిది ఆకలేస్తే అలవాటుగా తినేసే ఆకలి, భావోద్వేగ ఆకలంటే సంతోషం కలిగినా, చుట్టాలోచ్చినా, ఒంటరితనం అనిపించినా, ప్రతి ఉద్వేగాన్ని ఆకలితో ముడిపెడతాం, ఇక పోతే సామాజికమైన ఆకలి సమాజంలో మనకు ఎదురయ్యె, చూసే అలవాటు చేసుకునే ఆకలి, టివి లో క్రికెట్ చూస్తూ పిజ్జా ఆర్డరు, సినిమాకు పొతే పాప్ కార్న్, కూల్ డ్రింక్, రెస్టారెంట్ కు వెళితే స్టార్టర్ దగ్గర నుంచి ఐస్ క్రీమ్ దాకా సమస్తం స్వాహా చేసే ఆకలి. కొన్ని వాణిజ్య ప్రకటనలైతే ఫలానావి తింటే అధునికులైనట్లు, ఆనందంగా వన్నట్లు భ్రమ కలుగుతుంది. అసలు రుచి కంటే మన మనస్సు చేసే మాయ మన డబ్బుని ఖర్చు చేయిస్తుంది. అందుకే ఆహార మనస్తత్వ శాస్త్రం అధ్యయినం చేస్తేనే మనం తిండి పోటులు కాకుండా వుంటారు. మనస్సు పైన పట్టు సాధించి ఆకలిని అర్ధం చేసుకుని శరీరాన్ని గమనించుకుని తేలికగా కడుపు నిండటం అంటే మైండ్ ఫుల్ ఈటింగ్ అలవరుచుకోవాలి అన్నమాట. అంటే ముందు మనస్సుని సంతృప్తితో నింపేస్తే అది అతి తిండిని కంట్రోల్ చేస్తుందన్నమాట.

    మైండ్ ఫుల్ ఈటింగ్ అలవరుచుకోవాలి

    మనకి మూడు రకాలైన ఆకళ్ళు ఉంటాయని మనస్థత్వ శస్త్ర వేత్తలు చెపుతున్నాయి. ఒకటి జీవన వ్యవస్థను నడిపించే ఆకలి, భావోద్వేగపరమైన ఆకలి, సామాజికమైన ఆకలి. మొదటిది ఆకలేస్తే…

  • చాలా మందికి హీరోయిన్లని తెర పైన చూస్తున్న కొద్దీ రోజు రోజుకీ ఇంకా అందంగా అయిపోతున్నారనిపిస్తుంది. శృతి హాస్సన్,శ్రీదేవి, నయినా తార, సామంత, అంజలి, కరీనా, కంగనా, వళ్ళంతా రెండు, మూడేళ్ళ క్రితం చూసినట్లు ఇప్పుడు లేరు మరి ఎలా పెరుగుతుంది ఇంత అందం. వయస్సుతో పాటు అందం పెరుగుతుంటే ఆశ్చర్యంగా వుండదు. అందంగా కనిపించడం, నటించడం కూడా వృత్తిలో భాగమే. ఆహార నియమాలు, వ్యాయామాలు, ప్లాస్టిక్ సుర్జిరీలు, ఇవన్నీ కారణాలే. ఎప్పుడో 8౦ల్లొ శ్రీ దేవి ముక్కుకు శాస్త్ర చికిత్స చేయించుకుంది. ఇప్పుడు బ్యూటీ బిజినెస్ ఆకాశమంత ఎత్తులో వుంది. వయస్సుని తగ్గించి ముడతలు పోగొట్టుకునెందుకు, శరీర ఛాయను పెంచేందుకు రకరాకాల చికిత్స్యలు వస్తున్నాయి. ఖరీదైన క్రిములి, లోషన్లు, ముఖ్యంగా వ్యాయామాలు, శారీరక సౌష్టవం పైన అందం పైన ప్రభావం చూపిస్తున్నాయి. పెర్స్ నల్ ట్రైనర్స్ ఆద్వర్యంలో గంటలకొద్దీ జిమ్ల్లో చెమటోడ్చి కష్టపడి అందం సాధిస్తున్నారు అంటే ఆశ్చర్యం ఏముందీ? నోరు కట్టేసుకోవడం, ఓ గంట సేపు పరుగెట్టాలి అమ్మాయిలు, అద్దం ముందు పడిగాపులు కాచినా ప్రయోజనం శూన్యం.

    చిందించిన చమటకు బహుమతిగా అందం

    చాలా మందికి హీరోయిన్లని తెర పైన చూస్తున్న కొద్దీ రోజు రోజుకీ ఇంకా అందంగా అయిపోతున్నారనిపిస్తుంది. శృతి హాస్సన్,శ్రీదేవి, నయినా తార, సామంత, అంజలి, కరీనా, కంగనా,…

  • త్రీడి జెల్లీ కేక్ తిన్నారు కదు........... చూసారా అని అడగాలి. పోనీ జెల్లీ కేక్ లు అద్భుతమైన పువ్వులు, ఇవన్నీ కళాత్మకమైన దృష్టితో పిల్లలను ఆకర్షించేందుకు సిరంజీలు, స్పూన్లు, స్ట్రా లు వాడుతూ చేసే కళాకండాలు, కొబ్బరి పాలు, పండ్ల రసాలు, గ్రీన్ టీలు, మిల్క్ షెక్ లు ఎవన్నింటికి జెలటిన్ లేదా సముద్రపు నాచు అగరాను జోడించి ఘనపదార్ధంగా తాయారు చేస్తే అది జెల్లీ అయిపోతుంది. ఇది వరకు జెల్లీ లోపల నిజమైన పండ్లు పూలు పెట్టి డెకరేట్ చేసే వాళ్ళు. ఇప్పుడు పువ్వుల జెల్లీ కేక్ కావాలంటే జెలాటిన్ లో పారదర్శకమైన జెల్లీ కేక్ తాయారు చేసి సిరంజీలు,స్ట్రా లు రకరకాల స్పూన్లు ఉపయోగించి పువ్వుల్ని, ఆకుల్ని అందులో వచ్చేలా చేస్తున్నారు. కేకు పరిమాణం బట్టి ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వులు సృస్టిస్తారు. ఆసక్తి వున్న వాళ్ళు ఈ త్రీడి జెల్లీ కేక్ ఎలా చేస్తున్నారో యు ట్యూబ్ లో చూసి నేర్చుకో వచ్చు. ఇందుకు కావాల్సిన సమస్తమైన సామాన్లు ఆన్ లైన్ లో కొనుక్కోవచ్చు.

    జెల్లీలో పూస్తున్న తినే రంగుల పూలు

    త్రీడి జెల్లీ కేక్ తిన్నారు కదు……….. చూసారా అని అడగాలి. పోనీ జెల్లీ కేక్ లు అద్భుతమైన పువ్వులు, ఇవన్నీ కళాత్మకమైన దృష్టితో పిల్లలను ఆకర్షించేందుకు సిరంజీలు,…