• ఒక పెయింటింగ్ గోడకి ఎంతో అందం తెచ్చేది. లేదా అందంగా చెక్కిన ఒక చెక్కతో చేసిన హాల్లో టీపాయి పైన ఉంటె ఇంకెంతో అందం వస్తుంది. ఇప్పుడో ఇల్లు బ్రహ్మాండమైన కళాఖండం చుపేయాలనుకుంటే త్రీడి స్టీరియోస్కోపిక్ ఉడ్ కార్వింగ్ వాల్ పేపర్లను ఒక్కసారి చూడండి. త్రీడి ఎఫెక్ట్ తో హాల్లో మొత్తంగా విశ్వరూపంగా ఆక్రమించే దేవతా మూర్తినో పూలు రెమ్మలు చెక్కిన సహజమైన అడవి దృశ్యమో దారుశిల్ప సౌందర్యమో అమ్మాయిలు నృత్యం చేసే పౌరాణిక దృశ్యమో దేన్నీ కావాలంటే దాన్ని ఆవిష్కరించవచ్చు. సిల్క్ వినైల్ తో తయారయ్యే మందపాటి కాగితం పైన చైనా లో తయారవుతున్న వాల్ పేచర్స్ ఆన్ లైన్లో సంచలనం ఆచ్ఛం గోడపైన నగిషీ తో చెక్కిన పనితనం అందమైన చెక్క శిల్పం మొదలైన బొమ్మలతో ఈ త్రీడి వుడ్ కార్వింగ్ వాల్ పేపర్ల రూపంలో ఇంట్లోకి తెచ్చుకోవచ్చు. పాతబడిన గోడపై ఈ వాల్ పేపర్ అంటిస్తే ఇంటి లుక్ మారిపోతుంది. ఈ ఇంటీరియర్ ట్రెండ్ ని చూడండి.

    త్రీడి తో శిల్ప కళా సౌందర్యం

    ఒక పెయింటింగ్ గోడకి ఎంతో అందం తెచ్చేది. లేదా అందంగా చెక్కిన ఒక చెక్కతో చేసిన హాల్లో  టీపాయి  పైన ఉంటె ఇంకెంతో అందం వస్తుంది. ఇప్పుడో…

  • నానబెట్టిన సెనగలు అరటిపండు తాంబూలం ఇవన్నీ శ్రావణ మాసపు నోముల్లో ముత్తయిదువులకు ఇచ్చే వాయినంలో కనిపిస్తాయి. డాక్టర్లు ఏమంటున్నారంటే సెనగలు లక్ష్మీ ప్రసాదం మాత్రమే కాదు ఇందులో బోలెడన్ని ప్రోటీన్స్ పొటాషియం మాంగనీస్ జింక్ విటమిన్ కె వంటి నిల్వలు పుష్కలంగా వున్నాయి. కనుక ప్రతి రోజు ఆహారంలో తినండి అంటున్నారు. పీచు విటమిన్ సి విటమిన్ బి6 ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పండ్లు కూరగాయల్లో సెలెనియం ఖనిజం అంతగా దొరకదు. సెనగల్లో పుష్కలంగా దొరికే సెలీనియం కాన్సర్ లు రాకుండా కాంతులు పెరగకుండా కాపాడుతుందంటున్నారు. అలాగే డిఎస్ఏ తయారీకి కారణమయ్యే ఫోలేట్ కూడా ఉంటుంది. నిద్రకీ కండరాల కదలికకు అధ్యయనానికి జ్ఞాపక శక్తికీ ఎంతో అవసరమైన కొలీన్ కూడా ఉంటుంది. కనుక సెనగల్ని పచ్చిగా అంటే నానబెట్టి లేదా ఉడికించి రెగ్యులర్ గా కూరల్లో వేసి ఎదో రకంగా ప్రతి రోజూ తినమంటున్నారు.

    విటమిన్లు ఖనిజాల నిండుగా వుండే సెనగలు

    నానబెట్టిన సెనగలు అరటిపండు తాంబూలం ఇవన్నీ శ్రావణ మాసపు నోముల్లో ముత్తయిదువులకు ఇచ్చే వాయినంలో కనిపిస్తాయి. డాక్టర్లు ఏమంటున్నారంటే సెనగలు లక్ష్మీ ప్రసాదం మాత్రమే కాదు ఇందులో…

  • షెరిల్ శాండ్ బర్గ్ రాసిన లీన్ ఇన్ పుస్తకం ఇప్పుడో సంచలనం స్త్రీలు వాళ్ళ వృత్తి ఉద్యోగాల్లో సక్సెస్ సాధించటం గురించి పేస్ బుక్ సంస్థ సీఈఓ షెరిల్ శాండ్ బెర్గ్ ఈ పుస్తకం రాసారు. ఏ ఈపుస్తకం కార్పొరేట్ కార్యాలయాల్లో చర్చలేవనెత్తిందని చెప్పచు. అలాగే నవతరం ఉద్యోగినులకు ఒక కొత్త దృక్పధాన్ని చూపించారు. ఇప్పుడా పుస్తకానికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఆదరణ లో అదే పేరుతో LEANIN.ORG అనే పేరుతో కొత్త సంస్థ ఏర్పాటు చేసారు. జీవితంలో ఎదగాలనుకున్న అమ్మాయిలకు ఇది వేదిక అనుకోవచ్చు. ఉద్యోగానికి సంబంధించిన ఎన్నో విషయాల్లో నిపుణుల చర్చలు ప్రసంగాలు ప్రశ్నలు సమాధానాలు ఈ వెబ్సైట్ లో ఉంటాయి. లీన్ఇన్ సర్కిల్స్ పేరుతో ప్రత్యేక మైన బృందాలు ఏర్పడుతున్నాయి. హైద్రాబాద్ లోనే ఇలాంటి బృందాలు ఇరవై దాకా ఉన్నాయి. వీటిని ఇంకా వృద్ధి చేయాలనుకుంటున్నారు షెరిల్. ఇంతకు ముందు షెరిల్ భర్త గోల్డ్ బెర్గ్ చనిపోయిన నేపథ్యంలో భర్తను కోల్పోయిన అమ్మాయిలకు అతిదగ్గర వాళ్ళని కోల్పోయిన వాళ్లకు సాయం చేసేందుకు ఆప్షన్స్ బి అనే సంస్థకు ఇటు లీన్ ఇన్ సంస్థకు కలిపి 674 కోట్లు విరాళంగా ఇస్తానని చెప్పారు షెరిల్ శాండ్ బర్గ్.

    674 కోట్లు విరాళం ఇచ్చిన షెరిల్ శాండ్ బర్గ్

    షెరిల్ శాండ్ బర్గ్  రాసిన లీన్ ఇన్ పుస్తకం ఇప్పుడో సంచలనం స్త్రీలు వాళ్ళ వృత్తి ఉద్యోగాల్లో సక్సెస్ సాధించటం గురించి పేస్ బుక్ సంస్థ సీఈఓ…

  • హదుడ్లు ఆంక్షల గోడల్ని బద్దలు కొట్టుకుని ఎన్నో రంగాల్లో తమ అసాధారణ విజయాలు నమోదు చేసుకున్న స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. శాస్త్రవేత్తలుగా కవయిత్రులుగా కళాకారిణులుగా విద్యావంతులుగా శక్తిమంతులుగా ఉన్న ఎందరో స్త్రీల గాధలు ఏవీ అక్షరబధం కాలేదు. భారతీయ స్త్రీల గొప్పతనాన్ని తెలియజేస్తూ గూగుల్ ఒక చక్కని ప్రాజెక్ట్ తీసుకొస్తోంది. విమెన్ ఇన్ ఇండియా అన్ హర్ట్ స్టోరీస్ అని గూగుల్ సర్చ్ చేస్తే ఒక అద్భుతమైన స్త్రీలకే సొంతమైన ఒక విశాలమైన ప్రపంచంలోకి అడుగుపెట్టచ్చు. పురాణాల దగ్గర నుంచి సంగీత నృత్యకళాకారుల దగ్గర నుంచి నాట్య నాటక మండళ్ల దాకా సంఘాలు పొలాలు వెయ్యేళ్ళ నాటి పెయింటింగ్స్ ఉన్నాయి. ఇంతకు ముందు తెలుసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మిస్ అవ్వద్దు. అన్ హర్ట్ స్టోరీస్ గుండె నిండే కధలన్నీ వినండి.

    అన్ హర్ట్ స్టోరీస్ ఇప్పుడు మనసారా చదవండి

    హదుడ్లు ఆంక్షల గోడల్ని బద్దలు కొట్టుకుని ఎన్నో రంగాల్లో తమ అసాధారణ విజయాలు నమోదు చేసుకున్న స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. శాస్త్రవేత్తలుగా కవయిత్రులుగా కళాకారిణులుగా విద్యావంతులుగా శక్తిమంతులుగా…

  • సన్నగా ఉంటేనే తెల్లగా ఉంటేనే అందం అన్న అపోహ లోంచి పరిగెత్తుకు బయటకు రావాలిప్పుడు. యూత్ కి ఆదర్శం సినిమా తార లే కదా. కానీ సినిమాల్లో పత్రాలు సహజంగా ఉంటేనే కదా సక్సెస్ అయ్యేది. అప్పుడు అందం మేకప్ సన్నగా ఉండటం. ఖరీదైన బట్టలు ధరించటం పక్కన పట్టేసి కెమెరా ముందుకు వెళ్ళిపోతారు హీరోయిన్లు హీరోలు కూడా. ధమ్ లగాకే పైసా సినిమాలు భూమీ ఫెడ్నేకర్ సౌత్ ఖాన్ మాఫ్ సినిమా లో ప్రియాంక చోప్రా డర్టీ పిక్చర్ లో విద్యా బాలన్ త్రీ ఇడియట్స్ లో కరీనా కపూర్ అలాగే దంగల్ సినిమాకోసం అమీర్ ఖాన్ వళ్ళు బరువు పెంచుకుని మరీ నటించారు. అవార్డులతో నిండా మునిగిపోయిన మన పాత తరం హీరోయిన్స్ శారద సావిత్రి వంటి మహానటుల్ని మనం సన్నగా తెల్లగా వున్నారని చూశామా ? ఒక మనిషి అందం ఆమె లేక అతను చేసే పనుల్లో మనుషుల్ని ప్రేమించటంలో త్యాగంలో దాత్రుత్వంలో మనసు నిండిన కరుణ తో ప్రపంచాన్ని లాలించే నవ్వులో ఉంటుంది. దంగల్ సినిమా కోసం 97 కిలోలు బరువు పెరిగిన అమీర్ ఖాన్ తో మనకు మల్ల యోధుడు మహావీర్ ఫోగట్ ప్రత్యక్షం అవుతాడు. ఎవరి మొహం చుస్తే మన పెదవుల పై చిరునవ్వు వస్తుందో ఆ వ్యక్తి నిజమైన సౌందర్య రూపం కాదంటారా ?

    అందమంటే రంగూ శరీరపు లావణ్యమేనా

    సన్నగా ఉంటేనే తెల్లగా ఉంటేనే అందం అన్న అపోహ లోంచి పరిగెత్తుకు బయటకు రావాలిప్పుడు. యూత్ కి ఆదర్శం సినిమా తార లే కదా. కానీ సినిమాల్లో…

  • శరీరానికి మంచి చేస్తాయనో, నిపుణులు చెపుతున్నారనో కష్ట పడి పచ్చి కూరగాయాలు తినాలని ప్రయత్నిస్తాం. కారెట్ తో ఆగిపోతూవుంటుంది మన వ్రతం. కానీ పచ్చి కూరగాయలు మంచ్ చేస్తాయని అనుకోవడం దండగే పలు పరిశోధనలు చెప్పుతున్నాయి. పచ్చి కూరలు ఎంత కడిగినా వాటి పైన సుక్ష్మ జీవులు నసించవు. అంచేత వాటిని ఆరోగ్యకరమైన పద్దతిలో వండితే పచ్చి వాటికంటే మేలు చేస్తాయి. కూరగాయలు అతిగా నూనెలో వేయించడం,మసాలాలు దట్టించి మైళ్ళ కొద్ది సువాసనలు వచ్చేలా వండటం చేయకుండా కొద్ది పాటి నూనె లేదా ఆవిరిపైన వుడికించడం మేలు అంటున్నారు. టొమాటో, కారెట్, క్యాబేజీ, మిర్చీ వంటివి పచ్చిగా కంటే కొంచం ఉడికాక తింటేనే ఎక్కువ పోషకాలు శరీరానికి లభిస్తాయి అంటున్నారు పరిశోధకులు. నాన బెట్టి, పచ్చిగా కట్ చేసి తింటే మంచి దనుకోవడం కేవలం అపోహే అంటున్నారు.

    పచ్చి కురలకంటే వండినవే బెస్ట్

    శరీరానికి మంచి చేస్తాయనో, నిపుణులు చెపుతున్నారనో కష్ట పడి పచ్చి కూరగాయాలు తినాలని ప్రయత్నిస్తాం. కారెట్ తో ఆగిపోతూవుంటుంది మన వ్రతం. కానీ పచ్చి కూరగాయలు మంచ్…

  • బంగారు నగల్లో, బొమ్మల డిజైన్ ల లో వస్తున్న కిడ్ కలెక్షన్స్ చూసారా. పండ్లు, పువ్వులు, కార్టూన్ బొమ్మలతో చెవిపోగులు, ఉంగరాలు, లాకెట్లు బంగారు నగల్లో పొదిగి వాటిపైన ఫుంకిగా కనిపించే ఎనామిల్ రంగుల్ని అద్దటంతో అవి పిల్లలకు సరిగ్గా నప్పుతాయి. సాధారణంగా ఇలాంటి ఫుంకీ నగలు పిల్లలకు నచ్చుతాయి. కానీ వన్ గ్రామ్ గోల్డ్ లేదా పూసలతో, ప్లాస్టిక్ తో చేస్తే తమ పిల్లలకు వేసి ఆనందించే పెద్దవాళ్ళకు నచ్చవు. అందుకే ఈ బంగారు నగలు పేరున్న బంగారునగల దుకాణాల్లో కనువిందు చేస్తున్నాయి. కొత్త సంవత్సరం పాపాయికు గిఫ్ట్ ఇవ్వాలంటే ఈ నగల వైపు చూడండి. బుల్లి బుల్లి బొమ్మల బ్రేస్ లెట్లు, హ్యాండ్ బ్యాండ్స్ కూడా వుంది. ఇవి పిల్లల మోడ్రన్ డ్రేస్సుల పైకి చాలా బావుంటాయి.

    ఫుంకీ డిజైన్స్ తో బంగారు నగలు

    బంగారు నగల్లో, బొమ్మల డిజైన్ ల లో వస్తున్న కిడ్ కలెక్షన్స్ చూసారా. పండ్లు, పువ్వులు, కార్టూన్ బొమ్మలతో చెవిపోగులు, ఉంగరాలు, లాకెట్లు బంగారు నగల్లో పొదిగి…

  • పది వేలసంవత్సరాలకోక సారి జన్మిస్తుందీ సౌందర్యం అన్నారు. ఫ్యాన్స్ Hang he ని చూసి ఈ పదేళ్ళ అమ్మాయి 'ఎలైట్ మోడల్ లుక్' వెబ్ సైట్ అందాల పోటిలో 70 దేశాల నుంచి 3 లక్షల 50 వేల మంది తో పాటు పోటి పడి ఈ నవంబర్ లో ఫైనల్ కు చేరుకొంది.Giri Hadid, Karlie Kloss, Cara Delevingne వంటి సూపర్ మోడల్స్ అంతర్జాతీయ వేదికలపైన తళుక్కుమంటే ఇప్పుడీ చైనా అమ్మాయి తన సౌందర్యంతో మంచి శరీర సౌష్టవంతో ముందుకు దూసుకు వచ్చింది. ఈమెను అందాల దేవత అంటున్నారు. చైనా యూత్. ఈమె అందాన్ని నిర్వచించే మాటలు లేవు అనేసారట. ఫ్యాషన్ మార్కెట్ లోకి ఇంకో అందాల రాణి రంగ ప్రవేశం చేసింది.

    సౌందర్య దేవత టాన్ హే అనేసారు

    పది వేలసంవత్సరాలకోక సారి జన్మిస్తుందీ సౌందర్యం అన్నారు. ఫ్యాన్స్ Hang he ని చూసి ఈ పదేళ్ళ అమ్మాయి ‘ఎలైట్ మోడల్ లుక్’ వెబ్ సైట్ అందాల…

  • DAPHNE SELFE గురించి ప్రతివాళ్ళు తెలుసుకుని తీరాలి. ఇప్పుడు 88 సంవత్సరాలు . 1949 లో మొదలుపెట్టిన మోడలింగ్ కెరీర్ ను ఇంతవరకు ఆపలేదు. బ్రిటన్ లో వుండే డాఫ్నే సెల్ఫీ ఇంతవరకు ఎన్నో ప్రముఖ కంపెనీలకు మోడల్. వయసు పెరిగిపోతున్నా కళ తగ్గని మొహంతో ప్రజల్లో ఆమెకున్న ఆదరణ తగ్గనేలేదు. ఇప్పటికీ మొగలింగ్ ద్వారా రోజుకి ఆరేడు లక్షల రూపాయలు సంపాదిస్తోంది. నివియా ,ఓలే వంటి సౌందర్య పోషకాల ప్రకటనల్లో కనిపించే ఈ అందమైన మోడల్ రహస్యం నీళ్లు పళ్ళు కూరగాయలు తినటం ,యోగా చేయటం ఈమె ఇచ్చే ఒక అపూర్వమైన ఉపదేశం ఏవిటంటే జీవితంలో వచ్చే ప్రతి స్టేజ్ బాల్యం యవ్వనం వార్ధక్యం ఇలా అన్ని మలుపులు మనలోని సౌందర్యాన్ని ఒక్కరకంగా పెంచేస్తూ ఉంటాయి. ప్రపంచం మొత్తం చుట్టిన అనుభవంతో చెపుతున్న నా మనసుని ప్రతి క్షణం నా కాన్ఫిడెన్స్ తో నింపేసుకుంటూ వుంటా. అని చెప్తోంది. నిజం కదా ఈ రంగు మారే ప్రకృతి ఎప్పుడైనా వృధాప్యంతో బాధపడిందా.. లేదు.. మనం కూడా ఇంతే కాలప్రవాహం తో నడుస్తూ కాలంలోకి జారిపోతాం. మన మనసుకి ముసలి తనం ఏమిటి ?

    88 ఏళ్ల యవ్వన గుళిక

    DAPHNE SELFE గురించి ప్రతివాళ్ళు తెలుసుకుని తీరాలి. ఇప్పుడు 88 సంవత్సరాలు . 1949 లో మొదలుపెట్టిన మోడలింగ్ కెరీర్ ను ఇంతవరకు ఆపలేదు. బ్రిటన్ లో …

  • పిల్లలు కోరిన రుచుల్ని అందమైన బాక్స్ ల్నిఇంకెంతో అందమైన వాటర్ బాటిల్స్ సమకూర్చి వాళ్ళు కడుపునిండా మంచి కలర్ ఫుల్ లంచ్ కష్టపడి చేసి ఇస్తున్నా సరే.. ఊహు.. మాకొద్దు మాకు పేస్ట్రీలు పఫ్ లు కేకులే కావాలి. అని పంతం పట్టి కూర్చున్న పిల్లల సంఖ్యే 90 శాతంగా ఉందని డయాబెటిక్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యయనం చెపుతోంది. లంచ్ బాక్స్ లో సమతులాహారం వుందా ? శరీరానికి కావాల్సిన కొవ్వులు పోషకాలు అందుతున్నాయా లేదా అని తల్లులు ఫుడ్ కోర్సులు చేస్తున్నా పిల్లలు మాత్రం జంక్ ఫుడ్ స్టాల్ల్స్ ఉండటంతో పిల్లల లంచ్ బాక్స్ అవతల పారేసి ఈ క్యాంటిన్లకే ఎగబడిపోతున్నారు. మన దేశంలో 50శాతం మంది ఒక్కపండు గానీ ఒక్క కూర గాని తినని పిల్లలున్నారు. 40 శాతం మంది బ్రేక్ ఫాస్ట్ చేయనేచేయరు. ఇవన్నీ కూడా చిన్న వయసులోబ్ డయాబెటిస్ కు దారితీస్తున్నాయి. 25 శాతం పిల్లలు లావుగా ఆయిపోతున్నారన్నమాట. అందుకే చెన్నయ్ లోని ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్ల కాంపస్ లో జంక్ ఫుడ్ సాఫ్ట్ డ్రింక్ ల అమ్మకాల పైన నిషేధం విధించారట. పిల్లలు విధిగా లంచ్ బాక్స్ లు తేవాలనీ అందులో పండ్లు కూరగాయలు ఎక్కువగా ఉండేలా టీచర్లు కూడా పర్యవేక్షించాలనీ నిషేధించి మరీ మన రాష్ట్రాలు ఎప్పుడు కళ్ళు తెరుస్తాయో ?

    వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది

    పిల్లలు కోరిన రుచుల్ని అందమైన బాక్స్ ల్నిఇంకెంతో అందమైన వాటర్ బాటిల్స్ సమకూర్చి వాళ్ళు కడుపునిండా మంచి కలర్ ఫుల్ లంచ్ కష్టపడి చేసి ఇస్తున్నా సరే..…