• నిహారికా ,మనలో వుండే లోపం మనకు వెంటనే తెలియాలంటే ఎలా అన్నావు. ఎదిగే వయసులో వున్న నువ్వు నీ శత్రువుని గుర్తించాలని తాపత్రయపడటం చాలా అవసరం. మనం సాధారణంగా అద్దం చూసుకుని కనిపించే ప్రతి బింబం ద్వారా మన బాహ్య రూపంలో కనిపించే లోటు పాట్ల ను సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తాం. కానీ ఆంతీర్లనంగా వుండే లోపాలు చూసుకునే అద్దం మనసే. విశ్లేషణ విచక్షణే ప్రతిబింబాలు. మనల్ని మనం నిస్పిక్షపాతంగా విశ్లేషించుకుంటే మన పట్ల మనం నిర్దాక్షణ్యంగా ఉంటే మన లోపం మనకి తెలుస్తుంది. ఈ విచక్షణ నిరంతరం కలిగివుంటే మనల్ని అనుక్షణం విమర్శిస్తోంది. కనక లోపం గుర్తించటం సులువవుతుంది. నిరంతరం మనల్ని మానిటర్ చేసి అంచనా వేసి జడ్జి చేసే మనసాక్షి మనల్ని ఇతరులతో పోల్చి చూస్తుంది. ముందుకు నెట్టి చూడమంటుంది. మహా బలాన్ని తగ్గించి కూడా లోపాల్ని మాగ్నిఫై చేసి గతంలో చేసిన పనుల పట్ల విచారాన్ని భవిష్యత్తు భయాన్ని పెంచుతుంది. ఇలా అని మనం ఆత్మవిశ్వాసాన్ని సృజననీ పోగొట్టుకొకూడదు. మనం ఎటు వైపు నడుస్తున్నామో మన ఆలోచనలు మనల్ని ఉత్తమమైన దిశగా నడిపిస్తున్నాయో లేదా మన లోపల నిద్రలేచిన లోపం అన్న శత్రువుని నిర్ములించామా లేదా అనే ప్రశ్నలు వేసుకుంటే చాలు. అద్దంలో కనబడే శారీరికంగా లోపాల్ని దిద్దుకున్నట్లే మనల్ని మనం సరిదిద్దుకోగలుగుతాం. నీ మనస్సుని తెరచి ఉంచుకో. విశ్లేషించుకో. నీ లోపాల్ని పోగొట్టుకో తల్లీ !

    నిన్ను నువ్వు నిర్మించుకోమ్మా

    నిహారికా , మనలో వుండే లోపం మనకు వెంటనే తెలియాలంటే ఎలా అన్నావు.  ఎదిగే వయసులో వున్న నువ్వు నీ శత్రువుని గుర్తించాలని తాపత్రయపడటం చాలా అవసరం.…

  • సీనియర్ తార ఖుష్బూ తొమ్మిదేళ్ల విరామం అనంతరం టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వనుంది. అలనాటి స్టార్ హీరోయిన్ పవన్ కళ్యాణ్ కధానాయకుడిగా నటిస్తున్న సినిమాలో నటించనున్నారు. త్రివిక్రమ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. స్టోరీ చాలా బావుంది. తన రోల్ ఇంకా బావుండటంతో ఓకే చేసానని ఖుష్బూ ట్విట్టర్ ద్వారా అభిమానులకు వెల్లడి చేసారు. చిరంజీవితో స్టాలిన్ మోహన్ బాబు తో యమ దొంగ చిత్రాల్లో నటించిన ఖుష్బూ శక్తిమంతమైన పాత్రలో మళ్ళీ సినిమాల్లోకి రానున్నది. తొమ్మిదేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత తెలుగు సినిమా చేస్తున్నాననీ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో కలిసి చేస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన సినిమాలో తనూ భాగంగా ఉండటం సంతోషంగా ఉందంటోంది ఖుష్బూ.

    మళ్ళీ సినిమాల్లోకి ఖుష్బూ

    సీనియర్ తార ఖుష్బూ తొమ్మిదేళ్ల విరామం అనంతరం టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వనుంది. అలనాటి స్టార్ హీరోయిన్ పవన్ కళ్యాణ్ కధానాయకుడిగా నటిస్తున్న సినిమాలో నటించనున్నారు. త్రివిక్రమ్…

  • దాదాపుగా మన వంటింట్లోకి అన్నీ నాన్ స్టిక్ పాట్స్ ప్యాన్లే . ఆరోగ్యానికి మంచివని ,నూనె అధికంగా వేయనక్కర్లేదని ఇవే వాడతాం. ఒక్కసారి అను మానం వస్తుంది . వీటివాడకం మంచిదేనా ? వీటి కోటింగ్ విడుదల చేసే రసాయనాలు హానికరం అనటం వాస్తవమేనా అని. కానీ సరైన గైడ్ లైన్స్ అనుసరిస్తే నాన్ స్టిక్ వంట పాత్రలు సురక్షితమే అంటారు. ఎక్సపెర్ట్స్. కానీ నాన్ స్టిక్ కోటింగ్స్ లో పర్ ఫ్లోరో క్లోనిక్ యాసిడ్ ఆనవాళ్లు ఉంటాయి. వీటిని బాగా వేడిచేసినప్పుడు ఏ.ఎఫ్. బి .ఎల్ గ్యాస్ ప్యాన్ ఊపిరి తలపై నుంచి పోతుంది. నాన్ స్టిక్ పాత్రల్ని ఎప్పుడు కూడా తక్కువ మధ్యస్థంగా వుండే సెగపైనే ఉంచాలి.పై ఊపిరితలం పాడైనట్లు అంటే నాన్ స్టిక్ కోటింగ్ పోయి ప్యాన్ తెల్లగా కనిపిస్తుందా వాటిని మార్చేయాలి. ఎంతకాలం వాడచ్చు అన్నది టైం చెప్పటం కష్టం కానీ కోటింగ్ లో తేడా గుర్తించగానే తీసేయటం బెటర్ .

    కోటింగ్ లో తేడా వస్తే వాడొద్దు

    దాదాపుగా మన వంటింట్లోకి అన్నీ నాన్ స్టిక్ పాట్స్ ప్యాన్లే . ఆరోగ్యానికి మంచివని ,నూనె అధికంగా వేయనక్కర్లేదని ఇవే వాడతాం. ఒక్కసారి అను మానం వస్తుంది…

  • వేపాకులు తులసీ ఆకుల్లో ఎన్నెన్నో ఔషధ గుణాలున్నాయని ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయని శాస్త్రీయంగా రుజువయ్యాయి. ఇంకెన్నో కొత్త పరోశోధనా ఫలితాలు వస్తూ వుంటాయి కదా. వేపాకుల పేస్ట్ వార్ట్స్ చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ చికిత్సల్లో బాగా పనిచేస్తుంది. వేపాకులు కాచి వడకట్టిన నీరు తాగటం వల్ల అధిక రక్త పోటు నియంత్రణలో ఉంటుంది. వేపాకుల గింజలు బెరడు ల్లో వుండే కొన్ని గుణాలు ఆర్థరైటిస్ ను సహజంగా నయం చేయగలరు. వేపనూనె మస్సాజ్ చేస్తే కండరాల నొప్పులు తగ్గిపోతాయి. అలాగే తులసి సుగుణాలు అనేకం . నీళ్లలో అర టీ స్పూన్ ఎండు లేదా తాజా తులసి ఆకులపొడి పేస్ట్ కలుపు కొని తాగితే అజీర్ణం తగ్గిపోతుంది. తులసి ఆకులు మరిగించి ఆవిరి పెట్టుకోవటం వల్ల తలనొప్పి తగ్గిపోతుంది. తులసి ఆకుల రసాన్ని గోరు వెచ్చని నీళ్లలో కలుపుకుని స్నానం చేస్తే వత్తిడి తగ్గిపోతుంది.

    సత్ఫలితాలు ఇచ్చే వేప తులసి

    వేపాకులు తులసీ ఆకుల్లో ఎన్నెన్నో ఔషధ గుణాలున్నాయని ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయని శాస్త్రీయంగా రుజువయ్యాయి. ఇంకెన్నో కొత్త పరోశోధనా ఫలితాలు వస్తూ వుంటాయి కదా. వేపాకుల పేస్ట్…

  • డెనిమ్ అంటేనే ఫ్యాషన్. ఈ పదాన్ని బాగా వంట బట్టించుకుని డిజైనర్లు డెనిమ్ తో ఏకంగా యాక్సిసరీస్ కు శ్రీకారం చుట్టారు. సన్నని డెనిమ్ దారాలను జడలా అల్లేసి పువ్వులు రాళ్లతో కలిపి చేసిన బ్రెస్ లెట్లు చాలా ముచ్చటగా వున్నాయి. ఈ క్లాత్ చెక్కు చెదరకుండా కొత్తగా కనిపించటంతో షూ చెప్పులూ టోపీలు రకరకాల నెక్లెస్ లు కఫ్ బ్రెస్ లెట్లు మొదలైనవి ఆధునికమైన పోకడతో చూడ ముచ్చటగా కనిపిస్తున్నాయి. ఎక్కువ భాగం నీలి రంగులోనే ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్ లయితే ముదురు రంగుల్లో వున్నబట్టతో ప్యాచ్ వర్క్ డిజైన్లతో కుందన్ తో స్వర్వోస్కీ రాళ్ళూ పూసలు అతికించి రకరకాల మెటల్ డిజైన్లు కలిపి ఏ డ్రెస్ కన్నా సూటయ్యే రకంగా తయారు చేస్తున్నారు. మామూలు గాజుకు డెనిమ్ క్లాత్ ను చుట్టేసి చూడగానే ఇది ఇవాళ్టి ఫ్యాషన్ అనిపించేలా తయారు చేస్తున్నారు. డెనిమ్ క్లాత్ ఫంకీ జ్యూవెలరీ ఇమేజెస్ లు పూర్తిగా ఈ క్లాత్ తో చేసిన నెక్లెస్ లుచుస్తే ఫ్యాషన్ అంటే డెనిమ్ అనిపించేలా ఉన్నాయి. రెండు రోజుల క్రితం ఫంకీ జ్యూవెలరీ ని ఓసారి చూడండి.

    డెనిమ్ క్లాత్ ఫంకీ జ్యూవెలరీ ఫర్ ఫెక్ట్ ఫ్యాషన్

    డెనిమ్ అంటేనే ఫ్యాషన్. ఈ పదాన్ని బాగా వంట బట్టించుకుని డిజైనర్లు డెనిమ్ తో ఏకంగా యాక్సిసరీస్ కు శ్రీకారం చుట్టారు. సన్నని డెనిమ్ దారాలను జడలా…

  • తల్లి కావటం ఒక అద్భుతమైన అనుభవం శరీరంలో ప్రతి నిమిషం కలిగే మార్పులు అనుభవాలు గర్భవతిగా ఉన్న యువతిని ఎంతో అయోమయానికి గురిచేస్తాయి. అన్నింటికంటే ఎక్కువగా టెన్షన్ పెట్టె విషయం ప్రసవం తర్వాత జుట్టు ఊడి పోతుందని పెద్దవాళ్ళు చెప్పే విషయం. ఎలా అందమైన జుట్టును రక్షించుకోవాలో తెలియటం లేదంటున్నారు. నిజానికి ఈ భయానికి అర్ధం లేదు. గర్భం వచ్చాక హార్మోనల్ మార్పుల వల్ల జుట్టు శరీరం కూడా చక్కగా మెరుపులీనుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది కూడా ప్రసవం తర్వాత హార్మోనల్ స్థాయిలు తగ్గి జుట్టు రాలుతుంది. ఇది ఎవరికైనా సహజం మంచి పోషకాహారం తీసుకోవాలి. కొబ్బరి ఆలివ్ ఆయిల్ తో జుట్టు మస్సాజ్ చేసుకోవాలి. ప్రసవం తర్వాత ప్రోటీన్లు అధికంగా వుండేఆహారం తినాలి. చేపలు లెంటిల్స్ మొలకలు కూరగాయలు , ఇరన్, విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవాలి. అతిగా షాంపూ చేయద్దు. హార్మోన్స్ స్థాయిలు సాధారణ స్థితికి చేరాక జుట్టు రాలటం ఆగిపోతుంది. ఊడి పోయిన జుట్టు కుదుళ్ళు గట్టిగానే వుంటాయి కనుక తిరిగివస్తుంది కూడా.

    ప్రసవానంతరం జుట్టు మళ్ళీ పెరుగుతుంది

    తల్లి కావటం ఒక అద్భుతమైన అనుభవం శరీరంలో ప్రతి నిమిషం కలిగే మార్పులు అనుభవాలు గర్భవతిగా ఉన్న యువతిని ఎంతో అయోమయానికి గురిచేస్తాయి. అన్నింటికంటే ఎక్కువగా టెన్షన్…

  • మాటలు చాలా విలువైనవి. ఆచి తూచి వాడాలంటారు పెద్దలు. హీరోయిన్ల గ్లామర్ దుస్తులపై అనవసరంగా నూరు జారి ఇప్పుడు నాలుక కొరుక్కోబోమంటున్నాడు దర్శకుడు సురాజ్. విశాల్ తమన్నా నటించిన తమిళ సినిమా కత్తి సండై సినిమా ఒకడొచ్చాడు పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళనాట ప్రచార కార్యక్రమాల్లో హీరోయిన్ తమన్నా దుస్తులపై దర్శకుడు సురాజ్ చిట్టి పొట్టి దుస్తులు వేసుకునేందుకే కధానాయికలకు పారితోషకం ఇస్తామని ప్రేక్షకుల ఆనందం కోసం వళ్ళు గ్లామరస్ గా కనిపించాల్సిందేనని ఆయన అనుచితంగా వ్యాఖ్యలు చేసాడు. తమన్నా నయనతార ఆయన పై విరుచుకుపడటం తో ఆయన క్షమాపణలు చెప్పాడు కానీ వివాదం సర్దుమణగలేదు. ఈ విషయం పై తమన్నా కు ఎంతో మంది సాటి నటులు మద్దతుగా నిలబడ్డారు. లక్ష్మీ ప్రసన్న లావణ్య త్రిపాఠీ కృతీ కర్బందా శాన్వీ రీతూ వర్మ సురాజ్ వ్యాఖ్యల్ని ఖండించారు. రకుల్ ఈ విషయంలో తాజాగా స్పందిస్తూ మేమున్నది నటించేందుకే మాకీ వృత్తి ఇష్టం. డబ్బే ప్రాధాన్యం అనుకుంటే సంపాదించే మార్గాలు చాలా వున్నాయి. మహిళల్ని గౌరవించటం నేర్చుకోమంది. కధానాయికలే ఏం చేస్తార్లే అనుకున్న సురాజ్ నోటి దురుసును సారీ అన్నా ఊరుకోలేదు హీరోయిన్స్.

    సారీ అన్నా ఊరుకోలేదు

    మాటలు చాలా విలువైనవి. ఆచి తూచి వాడాలంటారు పెద్దలు. హీరోయిన్ల గ్లామర్ దుస్తులపై అనవసరంగా నూరు జారి ఇప్పుడు నాలుక కొరుక్కోబోమంటున్నాడు దర్శకుడు సురాజ్. విశాల్ తమన్నా…

  • పంజాబీ యువతి పరిణీతి చోప్రా తన నటనతో కోట్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్ లోకి అడుగు పెట్టక ముందర 86 కిలోల బరువున్న ఈ అమ్మాయి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ద్వారా కఠినమైన నియమాలతో చూడ చక్కని రూపాన్ని ఎలా సాధించుకుందో సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కి ఎంతో మంది యువతులు స్పందించారు. తాను చేసిన వర్కవుట్స్ గురించి పరిణీతి చోప్రా మాట్లాడుతూ ఫుడ్ లవర్ గా ఈ వెయిట్ లాస్ ప్రోగ్రాం తనకి కఠిన పరీక్షేనన్నది. ఫాస్ట్ ఫుడ్ ఎంత ఇష్టమైనా నూరు కట్టేసుకున్నాననీ పాలు బ్రౌన్ బ్రెడ్ బటర్ ఎగ్ వైట్ జ్యూస్ గ్రీన్ సలాడ్ బ్రౌన్ రైస్ వెజిటబుల్స్ అదీ చాలా తక్కువ పరిమాణంలో తీసుకున్నానంటోంది. నూనె లేని ఆహారం, తీపి లేని గ్లాసు పాలు చాకొలేట్ షేక్ తోనే సరిపెట్టుకొన్నా నంది. తర్వాత రొటీన్ గా వెళ్లే జిమ్ తో పాటు కేరళ మార్షల్ ఆర్ట్స్ కలరియా పట్టు కూడా నేర్చుకున్నానంది. ఇది నన్ను మరింత సామర్ధ్యంగా శక్తిమంతంగా తీర్చిదిద్దింది. అంటూ చెప్పుకొచ్చింది పరిణీతి. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసిన వీడియోలకు సందర్సకులు వెల్లువెత్తారు.

    పరిణీతి వెయిట్ లాస్ వీడియోస్ ఒక సంచలనం

    పంజాబీ యువతి  పరిణీతి చోప్రా తన నటనతో కోట్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్ లోకి అడుగు పెట్టక ముందర 86 కిలోల బరువున్న ఈ అమ్మాయి…

  • సంతానోత్పత్తికి ఆహార పదార్ధాల లోని కొన్ని పోషకాలు ఎంతో సహకరిస్తాయి. హార్మోన్ల సక్రమ ప్రక్రియ కు అవసరమైన ప్రత్యేక పోషకాలు పిండం ఎదుగుదలఅండం ఆరోగ్యం వీర్య ఆరోగ్యం రక్త ఆరోగ్యం వంటివి శరీరానికి అందిస్తూ శరీరానికి మద్దత్తు ఇచ్చే ఆహారాన్ని సహజ ఫెర్టిలిటీ డైట్ అనచ్చు. ఈ డైట్ లో విటమిన్ సి వుండే తాజా పళ్ళు ఔషధ గుణాల వెల్లుల్లి ఫ్యాటీ యాసిడ్స్ వుండే చేపలు ఆకు కూరలు డైయిరీ ఉత్పత్తులు బాదం వాల్నట్స్ ఉడికించిన బంగాళా దుంపలు చిరు ధాన్యాలు సెరల్స్ బొప్పాయి చెర్రీలు పుట్ట గొడుగులు ఆలివ్ ఆయిల్ కొబ్బరి నూనె వంటివి భాగంగా ఉంటాయి. మహిళలు ఆరోగ్యవంతంగా గర్భం ధరించేందుకు డాక్టర్లు ఇచ్చే మందులతో పాటు ఇచ్చే డైట్ చార్ట్ లు ఇవన్నీ ఉంటాయి. ఈ డైట్ ఫెర్టిలిటీ ఫుడ్ కాబోయే తల్లికీ కడుపులో పెరగబోయే శిశువుకు రక్ష వంటివి. ఆరోగ్యం ఆహారం పక్కపక్కనే ఉంటాయి మనం గ్రహించగలిగితే.

    ఇవన్నీ ఫెర్టిలిటీ డైట్ ఫుడ్ లో భాగం

    సంతానోత్పత్తికి ఆహార పదార్ధాల లోని కొన్ని పోషకాలు ఎంతో సహకరిస్తాయి. హార్మోన్ల సక్రమ ప్రక్రియ కు అవసరమైన ప్రత్యేక పోషకాలు పిండం ఎదుగుదలఅండం ఆరోగ్యం వీర్య ఆరోగ్యం…

  • ఫ్యాషన్ లు ఫ్యాషన్ BODYCON DRESS ఇవి కాస్త ఒంటికి అతుక్కుని కనిపిస్తాయి కానీ అభిరుచిని వయసునీ దృష్టిలో ఉంచుకుని నేలకు తాకేలాంటి పొడవాటి గౌన్లున్నాయి. ఓసారి చూడంది. క్రాప్ టాప్ ఎయిర్ లైన్ కట్ వున్నవి. ఎంచుకుంటే బావుంటుంది. బ్రుకేడ్ జార్జెట్ కుర్తీలు జతగా పలాజో ప్యాంట్లు స్కర్టులు కూడా మంచి ఎంపికే. హైవేయిస్టెర్ స్కర్టులు ఎదుగు దిగుడు డిజైన్ గౌన్లు పొడవుతాయి మాక్సీలు ఎంచుకుని రాబోయే న్యూ ఇయర్ వేడుకలకు కొత్త లుక్ ఇస్తాయి. రాత్రి పూట జరిగే వేడుక కనుక నలుపు ఎరుపు రంగులు లేదా మెరిసే బంగారు వెండి రంగులూ చక్కగా వుంటాయి. కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలికే సమయం కనుక అమ్మాయిలు కాస్త భిన్నంగా మోడ్రన్ గా కనిపించాలనుకుంటే ఈ బాడీ కాన్ ఇమేజెస్ చూసేయండి. కుచ్చిళ్ళు ఎక్కువగా వుండే కుర్తీలు కూడా వున్నాయి చూడంది బోతిక్ లేస్ హై నెక్ బాడీ కాన్ మోడ్రన్ డ్రెస్ KNEE LENGTH DRESS కూడా సెలెబ్రేషన్ కే తగినట్లే ఉన్నాయి.

    న్యూయిర్ కోసం ఫ్యాషన్ లు ఫ్యాషన్

    ఫ్యాషన్ లు ఫ్యాషన్ BODYCON DRESS ఇవి కాస్త ఒంటికి అతుక్కుని కనిపిస్తాయి కానీ అభిరుచిని వయసునీ దృష్టిలో ఉంచుకుని నేలకు తాకేలాంటి పొడవాటి గౌన్లున్నాయి. ఓసారి…