• నీహారికా , ఈ లోకం లో ప్రమాదకరమైన దేదీ అని అడిగావు కదా అది జెలసీ . అసూయ అడవిలో పుట్టే కార్చిచ్చు తో సమానం. ఇది బాధ పడేవారిని బాధకు కారణమైన వారినీ సమానంగా దహిస్తుంది. ఈ లోకం లో ఆనందం లేకపోవటనికి ఎన్నో కారణాలు. కోరికలు అంచనాలు అవసరాలు బులపాటం అసంతృప్తి అత్యాశ అన్నింటికంటే ప్రధానం ప్రమాదం అసూయ. అసూయాపరులకు రెండే చింతలు తనకులేదని ఇతరులకు ఉందనీ. మానసిక శాస్త్ర పరంగా చుస్తే ఈ అసూయకు పాజిటివ్ గా వాడుకుంటే స్ఫూర్తి అభివృద్ధి సాధించవచ్చు. ఈర్ష్య తో దేన్నయినా సాధించాలన్నా పట్టుదల పెంచుకోవచ్చు. కానీ మనుషులకు దృష్టిలోపం. మనకున్న బలహీనతలను ఇతరులకు బలాల తో పోల్చుకుంటాం. మనల్ని బాధ పెట్టె బాధలు ఎన్నో ఉంటాయి. అందుకే పోల్చుకోకూడదు. అప్పుడు మన కున్న సంపదను గుర్తించలేదని గుడ్డివాళ్లం అవుతాము. అనుబంధాలు ఏర్పరుచుకోలేకపోతాము. ఎంత నష్టపోతామో చూడు. ఎప్పుడైతే మనం దృఢమైన చిరకాలం నిలిచే అనుబంధాలు నమ్మటం పరస్పర గౌరవం స్నేహాలు నిలుపుకుంటామో అప్పుడిక ఈ నిర్దయమైన కార్చిచ్చు మన దగ్గరకు రాకుండా పోతుంది. ఏమంటావు ??

    అసూయ అడవిలో కార్చిచ్చు ఎంతో

    నీహారికా , ఈ లోకం లో  ప్రమాదకరమైన దేదీ అని అడిగావు కదా అది జెలసీ . అసూయ అడవిలో పుట్టే కార్చిచ్చు తో సమానం. ఇది…

  • ఒక చక్కని హిట్ సినిమాలో రీమేక్ లో నటించబోతోంది తమన్నా. విజయ్ దేవరకొండ రీతూ వర్మ నటించిన పెళ్లి చూపులు తమిళ రీమేక్ లో తమన్నా హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మించనున్నారు, చాలా అందమైన చక్కని సినిమాగా తెలుగులో మార్మోగిన పెళ్లి చూపులు తమన్నా స్టార్ డమ్ తోడైతే బావుంటుందంటున్నారు గౌతమ్ మీనన్. తమన్నా కూడా ఈ సినిమా తోనే గానూ అసలు సినిమాల్లో కథానాయికల కిచ్చిన స్థానంలోనే తన సంతోషం అంటోంది. స్టార్ కిరీటాలు సెట్లో సకల సౌకర్యాలు కల్పించిన ఈ సినీ రంగంలో నాకెప్పుడూ లోటు లేదన్నది తమన్నా . సెట్లో దర్శకుడు చెప్పినట్టు విని ఆ పాత్రలో చాలా కాలం ప్రయాణం ఉంటుంది కాబట్టి అనుకోకుండానే తెలియకుండానే ఆ పాత్ర పై ఇష్టం వస్తుంది అందుకే న పాత్రలన్నీ హిట్. ఇలాంటి మంచి వాతావరణం ఉంటుంది కనుక సెట్టు కూడా ఇల్లు లాగే ఉంటుందంటోంది తమన్నా. తెలుగు ప్రేక్షకులు మెచ్చిన పెళ్లిచూపులు తమిళ ప్రేక్షకులనీ అలరించబోతోంది.

    పెళ్లి చూపులు రీమేక్ లో తమన్నా

    ఒక చక్కని హిట్ సినిమాలో రీమేక్ లో నటించబోతోంది తమన్నా. విజయ్ దేవరకొండ రీతూ వర్మ నటించిన పెళ్లి చూపులు తమిళ రీమేక్ లో తమన్నా హీరోయిన్…

  • భగవంతుడిని పూజించటం గురించి కోట్లమంది చెప్పి వుంటారు. కనే దేవుడిని పూజించే పుష్పాల్లో ఇవి ఉండాలంటారు. హింసించకుండా ఉండటం ఒక పుష్పం. ఇతరులకు గాయపరచకుండా తొలినాడకుండా ఉండటం కూడా భగవంతుడికి అర్పించే ఒక పువ్వులాగా జీవించటం. పుష్పంఇంద్రియ నిగ్రహం పలుక కూడని మాటలను పెదవులు పలకకపోవటం నాలుకను చూపును ఘ్రణ శక్తినీ అదుపులో పెట్టుకోవటం ఇంకో పుష్పం. ఎదుటివారికి కష్టం వస్తే మనకే వచ్చిందని భావించటం. ఓర్పు కలిగి ఉండటం. జ్ఞానంతో ఉండటం సత్య గుణంతో ఉండటం పెద్దలు దేన్నైతే అర్ధం చేసుకుని దాన్ని అనుసరించటకమ్ ఇవన్నీ అష్టాదశ పద్మాల్లాంటివి. నిజానికి ఈ పుష్పాలతో ఈ జగత్తులో అణువణువుగా వ్యాపంచి ఉన్న అసలు రూపం అంటూ లేని అన్నీ రూపాల్లోనూ తానై నిండిన ఆ సర్వసాక్షిని అర్ధించాలట. ఇంతకీ ఆ సర్వ సాక్షి నివాసస్థలం నిర్మలంగా వుండే మన హృదయం.

    ఆ సర్వ సాక్షి ఆరాధనకు ఈ అష్టదళ పద్మాలు

    భగవంతుడిని పూజించటం గురించి కోట్లమంది చెప్పి  వుంటారు. కనే దేవుడిని పూజించే పుష్పాల్లో ఇవి ఉండాలంటారు. హింసించకుండా ఉండటం ఒక పుష్పం. ఇతరులకు గాయపరచకుండా తొలినాడకుండా ఉండటం…

  • శరీరానికి విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా చర్మానిగారింపు తో ఉంటుంది. ఆ విటమిన్లు లభించే ఆహారం కోసం వెతికిపట్టుకోవటం మంచిది. చిలకడదుంపలు బ్రొకోలీ క్యారెట్ లివర్ ఫిష్ ఆయిల్ ఆప్రికాట్స్ లో ఫ్యాట్ మిల్క్ విటమిన్ ఎ కు మంచి ఆధారం. ఇవి చర్మ కణాల పునరుత్తేజానికి ఉపకరిస్తాయి. బి కాంప్లెక్ విటమిన్లు స్కిన్ ఫుడ్స్ ఈ విటమిన్ లోపిస్తే పెదవుల చివరలు మిగిలిపోతాయి. బి .కె లోపిస్తే చర్మం కమిలిపోతుంది. బి 6 లోపిస్తే చర్మం పైన ర్యాష్ వస్తుంది. రైస్ పాలు గుడ్లు పెరుగు లో బి 6 పుష్కలం. విటమిన్ C తో చర్మ మృదువుగా ఉంటుంది. బ్రోకలీ కొత్తిమీర మొలకలు కాలీఫ్లవర్ నిమ్మరసం కమలా ద్రాక్ష పైనాపిల్ అన్నింటిలో సి విటమిన్ దొరుకుతుంది. విటమిన్ ఇ బాదం పొద్దు తిరుగుడు గింజలు గుమ్మడి గింజలు పాలకూర ఆలివ్స్ ఆలివ్ ఆయిల్ బొప్పాయిలో లభిస్తుంది. విటమిన్ కె కళ్లకింద వలయాల తో పోరాడుతుంది. పాలకూర తోట కూర ద్రాక్ష కివి పండ్లు ఈ విటమిన్ లభిస్తుంది.

    విటమిన్స్ మంచి ఫ్రెండ్

    శరీరానికి విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా చర్మానిగారింపు తో ఉంటుంది. ఆ విటమిన్లు లభించే ఆహారం  కోసం వెతికిపట్టుకోవటం మంచిది. చిలకడదుంపలు బ్రొకోలీ క్యారెట్ లివర్ ఫిష్ ఆయిల్…

  • ఈ సీజన్ చల్లగా హాయిగా ఉంటుంది కానీ శరీరం ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది. కనుక అలసట అనిపిస్తూ ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రత మేనేజ్ చేయటానికి జీవక్రియ పెరుగుతుంది. దీనివల్ల చలిఅనిపించినప్పుడు వణుకు వస్తుంటుంది. శరీరం ఉషోగ్రతను ఉత్పత్తి చేసుకునే మార్గం ఇది. అలసటగా ఉందీ అంటే శరీరం త్వరగా వేడి ఉత్పత్తి కోసం క్యాలరీలు దాచుకునే ప్రయత్నం అన్నమాట. అంతేకాక వేసవితో పోల్చితే కండరాలు లిగమెంట్లు టెండాన్లు ఎక్కువ సఫర్ అవుతాయి. ఇవన్నీ కలిసి ఈ సీజన్ లో తాజాగా ఉండేందుకు దారితీస్తాయి. అలసట ఎదుర్కొనేందుకు వర్కవుట్స్ మిస్ చేయకూడదు. ఎక్కువ క్యాలరీల కోసం శరీరం కొవ్వును కరిగిస్తుంది కాబట్టి మంచి నాణ్యమైన ప్రోటీన్లు ఫ్యాట్స్ లోడ్ చేసుకోవాలి. చల్లని తియ్యని పానీయాలు దూరంగా ఉంచి ఓ కప్పు కాఫీ ఎంజాయ్ చేయాలి. అవుట్ డోర్ వర్కవుట్స్ కార్డియో చెస్ట్ వర్కవుట్స్ చేయాలి. వార్మప్ మరచి పోవద్దు , వర్కవుట్లకు కండరాలు సిద్ధం కావాలంటే డైనమిక్ స్ట్రెచ్ చేయాలి. వర్కవుట్స్ తర్వాత సక్రమంగా కూల్ అయితే ఎలాంటి నొప్పులూ సోర్ నెస్ వుండవు.

    అలసట వస్తుంది జాగ్రత్త

    ఈ సీజన్ చల్లగా హాయిగా ఉంటుంది కానీ శరీరం ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది. కనుక అలసట అనిపిస్తూ ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రత మేనేజ్ చేయటానికి జీవక్రియ…

  • అలవాటుగా కొన్ని పనులు చేస్తాం. వంటల విషయమైతే కొన్ని ఇలాగె వండాలని పేదవాళ్ళనుంచో ఆలా చేస్తే రుచిగా ఉందని తెలుసుకున్నాకనో దాన్ని ఫాలో అయిపోతాం. మాంసాహార పదర్ధాలు ఉడికించి ముందర అందులో వేసే కొన్ని దినుసుల్ని కలిపి నానబెడతాం. ఇలా మెరినేట్ చేయటం వల్ల ఉప్పు కరం మసాలాలు ముక్కలకు బాగా పడతాయని త్వరగా ఉడుకుతుందనుకుంటాం. కానీ మాంసాహారాన్ని ఇలా దినుసులతో నానబెట్టి వండటం వల్ల అందులోని కార్సినోజన్ల ప్రభావం తగ్గుతుందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో గుర్తించారు. గ్రిల్ల్డ్ మీట్ లో హెటేరో సైక్లిక్ ఎమెన్లు అనే కార్సిజెనిక్ ఉత్పత్తి అవుతుంది. అయితే మాంసాన్ని రోజ్ మేరీ వెల్లుల్లి వంటి ఇతర హెర్బ్స్ స్పైస్ లతో కొద్దిసేపు నానబెట్టి గ్రిల్ చేస్తే కార్సిజెనిక్ ప్రభావం 87 శాతం తగ్గిపోయిందని శాస్త్ర వేత్తల రిపోర్ట్. ఆహారం లోని కార్సినోజెన్స్ అనేక రకాల కాన్సర్ లకు దారితీసే అవకాశాలున్నాయట. ఆవటుగానో రుచిగా వుంటుందనో ఈ నానబెట్టే ప్రక్రియ మొత్తానికి ప్రయోజనకారమే నాని తేలింది.

    నానబెట్టి వండటం వల్లనే ఈ ప్రయోజనం

    అలవాటుగా కొన్ని పనులు చేస్తాం. వంటల విషయమైతే కొన్ని ఇలాగె వండాలని పేదవాళ్ళనుంచో ఆలా చేస్తే రుచిగా ఉందని తెలుసుకున్నాకనో దాన్ని ఫాలో అయిపోతాం. మాంసాహార పదర్ధాలు…

  • తలకింద మెత్తని తలగడ వుంటేనే నిద్ర సుఖంగా హాయిగా పడుతుంది. దిండు లేకపోతే ఎదో అసఔకర్యంగానే ఉంటుంది. మంచి నిద్ర లకు ఇదెంత అవసరమో దాని పట్ల జాగ్రత్తలు తీసుకోవలిసిన అవసరమో అంతే ఉంటుంది. దాని పట్ల జాగ్రత్తలు తీసుకోవలిసిన అవసరమూ అంతే వుంటుంది. ఆర్నెల్లు వాడేశాక తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మొటిమలు ఎలర్జీలకు ఆ దిండే కారణం అవుతుంది. పాతబడుతున్న దిండ్ల పై తల అదిమి పెట్టుకోవటం వల్ల వాటిలోని దుమ్ము జిడ్డు మృతకణాలు వంటివన్నీ మొటిమలకు కారణం అవుతాయి. డస్ట్ మైట్స్ కూడా దిళ్ళలో నివాసం ఏర్పరుచుకుంటాయి. వాటివల్ల ఆస్తమా ఇతర ఎలర్జీ రియాక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎలర్జీలు 20 శాతం మంది బాధపడుతున్నారంటే వారిలో రెండొంతుల మందికి బెడ్స్ పై నివసించే డస్ట్ మైట్స్ కారణం అవుతుంటాయి. వీటిని మంచి ఎండలో ఆరబెడుతూ ఉండాలి. నాలుగైదు రోజులకు దిండు కవర్లు మార్చేయాలి.

    తలగడల్లో దుమ్మే సగం కారణం

    తలకింద మెత్తని తలగడ వుంటేనే  నిద్ర సుఖంగా హాయిగా పడుతుంది. దిండు లేకపోతే ఎదో అసఔకర్యంగానే ఉంటుంది. మంచి నిద్ర లకు ఇదెంత అవసరమో దాని పట్ల…

  • ప్రతిభ అనేది ప్రాంతాలకు భాషలకు పరిమితం కాదనీ సినీ నటులు రుజువు చేస్తూనే వున్నారు. ఇప్పుడు భారత దేశ సరిహద్దులు చెదిరిపోయి అంతర్జాతీయ పరుగులు మొదలయ్యాయి. ఉదాహరణకు ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ సౌందర్యవతిగా ఐశ్వర్య రాయ్ కు తిరుగేలేదు. బహుశ ఈ ట్యాగ్ దక్కించుకున్న ఏకైక భారతీయురాలు కూడా ఐశ్వర్యానే. 1994 లో విశ్వసుందరి కిరీటం ధరించాక ఇరువది చిత్రం ఇదే తెలుగులో ఇద్దరుగా వచ్చిన సినిమాల్లో మెరిసిపోయాక జార్ ప్యాక్ హోగయా తో హిందీ చిత్రసీమకు వెళ్లిపోయి అన్నీ బ్లాక్ బస్టర్లే సాధించి అవార్డులు తీసుకుంది . అందంతో అభినయంతో బ్రహ్మాండమైన కీర్తితో పాటు పద్మశ్రీ అవార్డు తీసుకుంది బ్రేడ్ అండ్ ప్రెజుడీస్ ది మిసెస్ ఆఫ్ మ్రిసెస్ ,ప్రహాక్ట్ లాఫ్ట్ లెజియన్ పింక్ ఫాందర్ 2 వంటి అద్భుతమైన చిత్రాలున్నాయి. పెళ్లియినా పాపాయికి తల్లయినా ఆమె అంతర్జాతీయ ఖ్యాతిని ఎవళ్ళూ అందుకోలేదు. అంతర్జాతీయ మేకప్ బ్రాండ్ లోరియల్ లో ఆమెను చుస్తే లోరియల్ కొనాల్సిందే. ఇక క్వీన్స్ చిత్రోత్సవాలు ఆమె అందం గురించి మాటల్లో చెప్పలేనంత ప్రశంసలు. ప్రపంచ సినిమాలో భాగం అయిన ఐశ్వర్య అందం చెక్కు చెదరలేదంటే ఆ రహస్యం ఏమిటోమరి .

    ప్రపంచ సినిమా లో భాగం ఐశ్వర్య

    ప్రతిభ అనేది ప్రాంతాలకు భాషలకు పరిమితం  కాదనీ సినీ నటులు రుజువు చేస్తూనే వున్నారు. ఇప్పుడు భారత దేశ  సరిహద్దులు చెదిరిపోయి అంతర్జాతీయ పరుగులు మొదలయ్యాయి. ఉదాహరణకు…

  • కళలు అందరికీ వస్తాయా ? వస్తే అన్నీ గుర్తుంటాయా ? అసలు కలంటే ఏమిటి ? ఫ్రాయిడ్ ప్రకటించిన స్వప్న విశ్లేషణ గ్రంధం ప్రకారం కళలంటే అంతకుముందు మన జీవితంలో జరిగిన సంఘటనల జ్ఞాపకం అది మనసుపై వేసిన ముద్ర మనకే తెలియని మనసులో అచేతనంగా ఉన్న విషయాలు ఇవన్నీ కలిస్తే కల అంటాడు. ఈ కాలనీ సరిగ్గా విశ్లేషించగలిగితే మంసేహి వక్తిత్వాన్ని సరిగ్గా అంచనా వేయచ్చు. అంటాడు ఫ్రాయిడ్ .అసలు పైకి చెప్పం కానీ మన మనసు నిర్మాణం ఇడ్ ,ఇగో సూపర్ ఇగో అన్న మూడు అంశాలపైన ఆధార పడివుంటుంది. కలలో కనిపించే విషయాలు మన మనసులో దాచుకున్న భావాలకు గుర్తులు. వీటిని గనుక అర్ధం చేసుకుని సరిగ్గా విశ్లేషించగల్గితే ఎన్నో మానసిక రుగ్మతలు పోగొట్టవచ్చంటాడు ఫ్రాయిడ్. మన తీరని కోరికలే మనసులో వచ్చే కలలు. ఈ సిద్ధాంతాన్ని ఇర్మా ఇంజెక్షన్ అవే కలల విశ్లేషణ సిదాంతంగా స్థిరపడిపోయింది. అసలీ లోకమే గందరగోళం ఇంక ఈ కలలు మహా గందరగోళం. అంటదు హెసియాడ్ అన్న చిత్రకారుడు. ఇందులో ఏది నిజమో ? అరే భలే కలొచ్చిందే అని అనుకున్నారనుకో ఇలా దాన్ని విశ్లేషించుకుంటారని ఈ వార్త.

    కలలకు ప్రపంచ భాష

    కళలు అందరికీ వస్తాయా ? వస్తే అన్నీ గుర్తుంటాయా ? అసలు కలంటే ఏమిటి ? ఫ్రాయిడ్  ప్రకటించిన స్వప్న విశ్లేషణ గ్రంధం ప్రకారం కళలంటే  అంతకుముందు…

  • శరీరాన్ని ఆరోగ్యాన్ని ముడిపెట్టి వుంచే బంగారు జలతారు లాంటిది నిద్ర. పడుకునే ముందర గ్లాసు పాలు తాగాలి. మెదడులోని ట్రెప్టోపాన్ అనే ఎమినో యాసిడ్ ను ఉపయోగించుకోవటానికి పాలు సాయపడతాయి. ఈ యాసిడ్ తేలికపాటి నెగిటివ్ ఎఫెక్ట్ కలిగి మెలటోనిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. మెలటోనిన్ నిద్ర మేలుకునే సైకిల్ ను నియంత్రిస్తుంది. మెలటోనిన్ స్థాయిలు సాయంత్రం వేళలో పెరగటం మొదలై ఉదయాలు తగ్గిపోతాయి. పాలలోని కాల్షియం సహజ మజిల్ రిలాక్సెంట్ గా పనిచేస్తుంది. అలాగే భారతీయ వంటకాల్లో వాడే పవర్ ఫుల్ స్పైస్ జాజికాయ. అయితే చిన్న మోతాదులో ఈ జాజికాయ పొడిని కూడా తీసుకోవచ్చు. ఒక అరటిపండు కూడా పడుకునే మూడ్ను తింటే మజిల్ రేలక్సెంట్ గా పనిచేసి నిద్రాయిస్తుంది. క్వాలిటీ నిద్రకు అవసరమయ్యే మెగ్నీషియం ఖనిజాలు బాదం పప్పులు ఎక్కువగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం అధికంగా వుండి శరీరాన్ని మనసునూ ప్రశాంతంగా వుంచి మంచి నిద్ర నిస్తాయి. టీ కాఫీ ఆల్కోహాల్ భారీ స్పైసీ ఆహారం వల్ల నిద్ర సరిగా తేలికగా తీసుకుని కాసేపు వాకింగ్ చేసి చక్కని సంగీతం వింటూ హాయిగా నిద్ర పోవచ్చు .

    హాయిగా ప్రశాంతంగా నిద్ర

    శరీరాన్ని ఆరోగ్యాన్ని ముడిపెట్టి వుంచే   బంగారు జలతారు లాంటిది నిద్ర. పడుకునే ముందర గ్లాసు పాలు తాగాలి. మెదడులోని ట్రెప్టోపాన్ అనే ఎమినో యాసిడ్ ను ఉపయోగించుకోవటానికి…