• మాఫలానీ క్రీమ్ రాసుకోండి తెల్లగా ఆయిపోతారు నేను హామీ అని యాడ్స్ లో మెరిసే యామీ గౌతమ్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ . యాంటీ రోల్ లో నటిస్తోంది . తన తండ్రిని చంపిన సర్కార్ పై పగ తీర్చుకోవటానికి వచ్చే యువతీ పాత్రలో యామీ నటిస్తోంది. విలన్ పాత్రలో యామీ ఎంతో బావుందని టాక్. నిజానికి తనకి నెగిటివ్ రోల్స్ అంటే పెద్ద ఇష్టంలేదని అయితే బిగ్ బీ సినిమాలో పాత్ర అనేసరికి వచేసుకున్న అని చెపుతోంది. యామీ గౌతమ్ . ఇంకోవైపు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ యామీ గౌతమ్ జంటగా నటిస్తున్న కాబిల్ చిత్రం తెలుగులో బలం పేరుతో విడుదల కానుంది. సంజయ్ గుప్తా డైరెక్షన్ లో తెరకెక్కిన ఏ చిత్రంలో హృతిక్ యామీ అంధులుగా నటించారు ఈ సినిమా ఈనెల 26 న విడుదలౌతుంది.

    విలన్ పాత్రలో యామీ గౌతమ్

    మాఫలానీ  క్రీమ్  రాసుకోండి తెల్లగా ఆయిపోతారు నేను హామీ అని యాడ్స్ లో మెరిసే యామీ గౌతమ్ బాలీవుడ్ మెగాస్టార్  అమితాబ్ బచ్చన్ . యాంటీ రోల్…

  • ఫ్యాషన్ ప్రపంచంలో పది హలచల్ చేస్తుందో దాన్ని ఫాలో అవటం సెలబ్రెటీల రహస్యం . ఈ సంవత్సరం బాలీవుడ్ మొదలుకుని టాలీవుడ్ వరకు ఏ సినిమా వేడుకల్లో అయినా త్రిష తమన్నా సమంతా కాజల్ రెజీనా అందరూ హై నెక్ బ్లౌజ్ డిజైన్లతో చాలా సార్లు కనిపించారు. బ్రొకేడ్ హై నెక్ డిజైన్ తో క్లాసీ లుక్ తో నలుచదరపు బాక్స్ కట్ తో కొన్ని బ్లౌజ్ లు మల్టీ కలర్స్ తో నెట్ ఫ్యాబ్రిక్ తో చక్కని ఎంబ్రాయిడరీ పూల డిజైన్ లతో కొన్న ఫ్యాషన్ ప్రపంచంలో ఓ సంవత్సరంగా ఈ బ్లౌజ్ లు రాజ్యంపలుతున్నట్లే సాదా చీరపైకి హెవీ డిజైన్లు వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన జార్దోసీ వర్క్ లు ఫుల్ హ్యాండ్స్ పైన కూడా అదే అల్లిక డిజైన్స్. లేస్ డిజైన్స్ తో హై నెక్ బ్లౌజ్ లు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. నెట్ తో వెతికితే చౌక ధర నుంచి ఖరీదైన ధరకు క్లాత్ డిజైన్ ను బట్టి అందుబాటులో ఉన్నాయి. ఈ హై నెక్ డిజైన్స్ అన్ని ఇమేజెస్ చూసేయండి.

    బ్లౌజ్ కో ధీమ్ లుక్ హై నెక్

    ఫ్యాషన్ ప్రపంచంలో పది హలచల్  చేస్తుందో దాన్ని ఫాలో అవటం సెలబ్రెటీల రహస్యం . ఈ సంవత్సరం బాలీవుడ్ మొదలుకుని టాలీవుడ్ వరకు ఏ సినిమా వేడుకల్లో…

  • పరిమితికి మించిన ఆహారం తీసుకుంటే దాన్ని అరిగించుకోవటానికి సరిపడా స్రావాలను విడుదలచేయటానికి అంతర్గత అవయవాలు అవసరానికి మించి శ్రమపడాల్సి వస్తుందని ఇలా తరచుగా జరుగుతూవుంటే మెటాబాలిజమ్ ఎండోక్రైన్ పనితీరు గాడితప్పి గ్రోత్ హార్మోన్ తగ్గటం జరుగుతుందని డాక్టర్లు చెపుతారు. ఆహారాన్ని జీర్ణం చేసుకునే జీర్ణరసాలు సరిపోక పొట్టలో అసౌకర్యం మొదలవుతుంది. అప్పుడు కొన్ని చిట్కాలు పాటించమంటున్నారు. పెద్దవాళ్ళు రెండు టేబుల్ స్పూన్ల సోంపు వేయించి పొడిచేసి గ్లాసునీళ్లలో ఓ స్పూన్ పొడి వేసుకుని రెండు సార్లు తాగితే ఈ ప్రాబ్లమ్ పోతుంది. ఒక టీ స్పూన్ అల్లం తురుము గోరు వెచ్చని నీళ్లతో కలిపి దీనికి కాస్త నిమ్మరసం తేనె కలిపి తీసుకున్నా సూపర్. ఇక వాము అల్లం కలిపి నూరి ఆ ముద్దను గోరు వెచ్చని నీళ్లతో కలిపి తాగితే చాలు. అలాగే ఎక్కువ నీళ్లు తగవుతున్న ఈ సమస్య రాదు. అసిడిటీ వదలాలంటే సోడా ఉప్పు కొద్దీ చుక్కల నిమ్మరసం కలిపి తాగచ్చు.

    ఉదరాన్ని కష్టపెడితే సమస్యే

    పరిమితికి మించిన ఆహారం తీసుకుంటే దాన్ని అరిగించుకోవటానికి సరిపడా స్రావాలను విడుదలచేయటానికి అంతర్గత అవయవాలు అవసరానికి మించి శ్రమపడాల్సి వస్తుందని  ఇలా తరచుగా జరుగుతూవుంటే  మెటాబాలిజమ్ ఎండోక్రైన్…

  • నాలుగు సినిమాలలో ఎంతో బిజీగా వున్నానంటోంది అనుష్క. సూర్యతో సింగం 3 ప్రభాస్ తో బాహుబలి లేడీ ఓరియెంటెడ్ మూవీ భాగమతి నాగార్జున రాఘవేంద్ర రావులతో ఓం నమో వెంకటేశాయ . అన్నీ సెట్స్ పైనే ఉన్నాయి. ఈ నాలుగు నెక్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అవుతాయి. సింగం ఒకటి రెండు ఇప్పుడు మూడు సినిమాల్లో అనుసఙ్కా జోడీగా నటించింది. ఇప్పటి సింగం 3 లో అనుష్క తో హీరోయిన్ శ్రుతీ హాసన్ కూడా కలిసి నటిస్తోంది. శృతికి ఇందులో గ్లామరస్ పాత్ర యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయిట. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించటం వల్లనా ఏమో అనుష్క భుజాలపై సినిమా మొత్తం హీరోల మాదిరి మోయటం నేర్చుకొన్నదనీ అందుకే సినిమా సినిమాకు గెటప్ శరీరం నాజూకుతనం చూపిస్తుందని ఇందుకు సైజ్ జీరో ఉదాహరణ చాలుననీ సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలుసుకున్న సత్యం అనుష్క అందమైనదే కాదు. నిజమైన యాక్టర్ .

    టాప్ హీరోస్ కంటే ఎక్కువ ఈమె

    నాలుగు సినిమాలలో ఎంతో బిజీగా వున్నానంటోంది అనుష్క. సూర్యతో సింగం 3 ప్రభాస్ తో బాహుబలి లేడీ  ఓరియెంటెడ్ మూవీ భాగమతి నాగార్జున రాఘవేంద్ర రావులతో ఓం…

  • మనకి కొన్ని రోల్స్ వుంటాయి. కొన్ని పదార్ధాలు వంటకీ కొన్ని శిరోజాలకు కొన్ని ఆహారం తో తీసుకుంటేనో అని విడివిడిగా ఆలోచిస్తాం. ఇప్పుడు చూడండి వంటింట్లో వాడే బేకింగ్ సోడా చర్మ సౌందర్యానికి మెరుగులు దిద్దుతుంది. అంటున్నారు. సౌందర్యాన్ని నిపుణులు. బేకింగ్ సోడా నీళ్లతో కలిసి పేస్ట్ లా చేసి ముఖం పై రాసుకుని ఆరనిచ్చి కడిగేస్తే చర్మం మురికిపోయి కాంతులీనుతుంది. అంటున్నారు. ఇదే పేస్ట్ ను వంటికి రాసుకుంటే మంచి డియోడ్రెంట్ గా పనిచేస్తుంది. ఒక బేసిన్ లో వేడి నీళ్లలో కొద్దిగా ఈ వంట సోడా ఉప్పు వేసి రెండు కళ్ళు అందులో ఉంచి పదినిముషాలు విశ్రాంతిగా కూర్చుని తర్వాత పొడి టవల్ తుడిస్తే పాదాల పగుళ్ల సమస్య పోతుంది. చలికాలంలో చర్మం పగిలి దురదలు రాకూండా గోరువెచ్చని నీళ్లలో వంటసోడా వేసి స్నానం చేస్తే రిలీఫ్ గా ఉంటుందంటున్నారు. ఎక్సపెర్ట్స్ వంటల్లో వాడేవి తినేవి ప్రమాదం లేనివి సైడ్ ఎఫెక్ట్స్ రానివి గనుక ఓసారి వాడి చూసినా పెద్ద నష్టం ఏమీ లేదు.

    ఇది సౌందర్య నిపుణుల సలహానే

    మనకి కొన్ని రోల్స్ వుంటాయి. కొన్ని పదార్ధాలు వంటకీ కొన్ని శిరోజాలకు కొన్ని ఆహారం తో తీసుకుంటేనో  అని విడివిడిగా ఆలోచిస్తాం. ఇప్పుడు చూడండి  వంటింట్లో వాడే…

  • ప్రకృతిలో ఎన్నో వర్ణాలు. ప్రపంచంలో మనం సృష్టించిన ఇంకెన్నో రంగులు అలాగే కొన్ని రంగులు కలిపేస్తే ఇంకో కొత్త షేడ్ వస్తూ ఉంటుంది. ఎన్ని కొత్త వర్ణాలు కనిపెట్టినా దేని అందం దానిదే. ఒక కొత్త సర్వే రిపోర్ట్ లు మహిళలు నీలిరంగు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని తేలింది . ఇంతకంటే అందమైన ఇంకొటిలేదని ఎక్కువమంది తేల్చిచెప్పినట్లు రిపోర్టులు. ఇక రంగుల్ని గురించిన అభిప్రాయాలు ఎలా వున్నాయంటే 29 శాతం నీలిరంగే. మేలైన రంగన్నారు . 27 శాతం పర్పుల్ మెరుపు ఎంతో బావుందన్నారు. 19 శాతం మంది ఆకుపచ్చ అందమైన రంగన్నారు. 9 శాతం మంది బెంగాలీ ఎరుపు బావుంటుందంటే ఏడు శాతం మంది గులాబీ కి ఓటేశారు. ఆరు శాతం పసుపు వర్ణం బావుందంటే మూడు శాతం ఆరెంజ్ చక్కనిరంగన్నారు. ఇంతకీ అందమైన తెల్లని రంగుని ఎక్కువ మంది మెచ్చుకునే లేదు. ఇంతకీ ఈ రంగుల రీసెర్చ్ ఎందుకు అంటే ఫ్యాషన్ బిజినెస్ మొత్తం ఆధారపడింది. ఈ రంగుల డిజైన్లపైనే కదా. ప్రపంచంలో ఎక్కువ బిజినెస్ జరిగేది ఫ్యాషన్ బ్యూటీ పైనే కదండీ !!

    నీలివర్ణమే నిజమైన అందం

    ప్రకృతిలో ఎన్నో వర్ణాలు. ప్రపంచంలో మనం సృష్టించిన ఇంకెన్నో రంగులు అలాగే కొన్ని రంగులు కలిపేస్తే ఇంకో కొత్త షేడ్ వస్తూ  ఉంటుంది. ఎన్ని కొత్త వర్ణాలు…

  • అందం అభినయం ఉంటే చాలు అనుకునే రోజులు పోయాయి. కధలు ఎంపిక చేసుకునే విషయంలో శ్రద్ధ చూపించాలని తెలుసుకొన్నానంటోంది తమన్నా. నాలుగైదు సినిమాలు చేస్తే కనీసం ఒక్కటైనా పేరు తెచ్చేదిగా వుండాలని అనిపించింది. ఆ వ్యూహం ఫలించింది ఇప్పుడు రాబోయే బాహుబలి విషయంలో నేను ఇటు మంచి కధ. అందంగా కనిపించటం ముఖ్యంగా నాలో ఒక నటి వుండటం ప్రేక్షకులకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. అన్నదామె. ఇప్పుడు ట్రెండ్ మారిపోతుంది. మంచి నటన కనబరచగలిగినవాళ్లు ఓమెట్టుపైన వుంటున్నారు. ఇవాళ్టి అమ్మాయిలు ఖచ్చితంగా తమకు పేరు తెచ్చిపెట్టే మంచి కధ బలం ఉన్న పాత్రల్లో నటించాలని ఆశపడుతున్నారు. ఈ విషయం ఇప్పుడు గుర్తించానంటోంది తమన్నా. తొలినాళ్లలోనే నటన ప్రాధాన్యమేమిటో తెలిసొచ్చింది. నేనందంగా ఉన్నానని నాకు గుర్తింపు రావటం నాకు సంతోషమే. కానీ గురించి నటిగా గుర్తింపు వస్తే అది నా అదృష్టంగా భావిస్తానంటోంది తమన్నా. బాహౌబలి - 2 త్వరలోనే రాబోతోంది. ఇందులో తమన్నా అందమా ? నటనా ? ప్రేక్షకులే నిర్ణయించాలి.

    మంచి కథ అయితే గొప్ప పేరొస్తుంది.

    అందం అభినయం ఉంటే చాలు అనుకునే రోజులు పోయాయి. కధలు ఎంపిక చేసుకునే విషయంలో శ్రద్ధ  చూపించాలని తెలుసుకొన్నానంటోంది తమన్నా. నాలుగైదు సినిమాలు చేస్తే కనీసం ఒక్కటైనా…

  • కేన్సర్ వస్తే సిగ్గు పడద్దనీ వ్యాధిపై సైనికుల్లా పోరాడాలనీ లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ చైర్ పర్సన్ ప్రముఖ నటి గౌతమి పిలుపు నిచ్చారు. ఈ మహమ్మారిని జయించటం గొప్ప కష్టం ఏమీ కాదనీ దానికి తనే ఉదాహరణ అని ఆమె అన్నారు. కేన్సర్ పై శ్రీ రక్ష చారిటబుల్ ట్రస్ట్ అడపాలు ఫౌండేషన్ బహ్రెయిన్ కువైట్ తెలంగాణా జాగృతి ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగిన ఒక అవగాహన సదస్సులో ఆమె మాట్లాడేరు. కెరీర్ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు తనకు బ్రెస్ట్ కేన్సర్ సోకిందనీ ఈ వ్యాధి సోకిన విషయాన్నీ లక్షణాల ద్వారా తానే గుర్తించాలనీ కుంగిపోకుండా ఎంతో నిబ్బరంగా ఈ వ్యాధి నుంచి తనను తాను కాపాడుకోగలననీ ఆమె చెప్పారు. తనకు అండగా నిలబడిన తన స్నేహితులు తనకెంతో ధైర్యం చెప్పారనీ తనకు వ్యాధి సోకిన విషయాన్నీ మరచిపోయేంత ధైర్యంగా ఉన్నందువల్లే ఇవ్వాళ్ళ ఇలా ఆరోగ్యాంగా ఉన్నానన్నారామె. ఆడవాళ్ళూ సిగ్గుపడి భయపడి ఇలాంటి అనారోగ్యాలు దాచుకోవద్దనీ ఆమె హితవు చెప్పారు.

    కేన్సర్ గొప్ప సమస్యేమీ కాదు

    కేన్సర్  వస్తే సిగ్గు పడద్దనీ వ్యాధిపై సైనికుల్లా పోరాడాలనీ లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ చైర్ పర్సన్ ప్రముఖ  నటి గౌతమి పిలుపు నిచ్చారు. ఈ మహమ్మారిని జయించటం…

  • అంతర్జాతీయ సైన్స్ అకాడమీలో మహిళా సైంటిస్టుల సంఖ్య పైన ఒక గ్లోబల్ సర్వే జరిగింది. 66 దేశాల్లోని సైన్స్ అకాడమీలో మహిళా సభ్యులు కేవలం 12 శాతం మాత్రమే వున్నారని సర్వే రిపోర్ట్. ఒక్క మన దేశంలో 2011-12 లెక్కల ప్రకారం రీసెర్చ్ అండ్ డెవలెప్మెంట్ మొత్తం 1.93 లక్షల మంది సైంటిస్టులు పనిచేస్తుంటే వారిలో మహిళా సైంటిస్టులు 27,532 మంది మాత్రమే అంటే 14 శాతంగా ఉన్నారు. పెళ్లి కుటుంబ బాధ్యతలు పిలల్ల పెంపకం ఉద్యోగ బదిలీలు వంటి విషయాల కారణం తోనే స్త్రీలు ఈ రంగంలో సుదీర్ఘమైన కాలం కొనసాగలేకపోతున్నారు. రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ ద్వారా స్త్రీలను ఎక్కువగా తీసుకోవటం ద్వారా సాంకేతిక రంగంలో అసమానతలు పోగొట్టాలని భారత ప్రభావం భావించింది. మహిళా శాస్త్ర వేత్తలను ప్రోత్సాహకరంగా ఎన్నో కార్యక్రమాలు చెప్పట్టింది. ఇండియన్ ఎకాడమీ ఆఫ్ సైన్సెస్ లో కూడా మహిళా సభ్యుల సంఖ్య ఎక్కువగా వృద్ధి చేయాలన భావిస్తోంది. ఈ రిపోర్టుల అమ్మాయిలు సవాల్ గా తీసుకుంటేనే మహిళా సైంటిస్టులు సంఖ్యా పెరుగుతోంది.

    మహిళా సైంటిస్ట్ సంఖ్య చాలా తక్కువ

    అంతర్జాతీయ సైన్స్ అకాడమీలో మహిళా సైంటిస్టుల సంఖ్య పైన ఒక గ్లోబల్ సర్వే జరిగింది. 66 దేశాల్లోని సైన్స్ అకాడమీలో మహిళా సభ్యులు కేవలం 12 శాతం…

  • నీహారికా , ఇప్పుడు రెండు వేమన పద్యాల్లోని ఒక్క లైను చెపుతూ కోపముండు బతుకు కొంచమై పోవును. ఇదొక పద్యం లోది. శాంతభావ మహిమ చర్చించ లేమయా. ఇది ఇంకో పద్యంలోని లైవ్. ఎంచెపుతున్నాడంటే కోపం వలన మనిషి తన వివేకాన్ని ఆలోచననీ కోల్పోతున్నాడు. పరాజయానికి కారణం విశ్లేషించుకోలేడు. అంచేత ఎంతటి విద్యావంతుడైన కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే అందరినీ దూరం చేసుకుంటాడు అని. అలాగే శాంతం వలన మనిషి తన ఆలోచనలు అదుపులో వుంచుకోగలుగుతాడు. అన్నింటా జయం కలుగుతోంది. శాంత స్వభావి ప్రజల మన్నన పొందుతాడు అవి, పదకొండవ శతాబ్దపు దక్షిణ భారత దేశపు సంఘ సంస్కర్త మహర్షి బసవన్న ఇంట్లో మంటలు చెలరేగితే ఇంటిని దహిస్తాయి. కోపం అన్న అగ్ని అది తెచ్చి పెట్టుకున్న మనిషిని దగ్ధం చేస్తుంది. తర్వాత ఇతరులకు హాని చేస్తుంది అవి. ఇలా పద్యాలూ సుభాషితాలు చెప్పి కోపం వస్తే చంపుకో నిన్ను నువ్వే బాధించుకో అని కాదు చెప్పటం. అసలు శాంతంగా కోపకారణమైన అంశం గురించి ఒక్క నిమిషం ఆలోచించి తప్పు నీదా ఇతరులంతా అని నిస్పక్షపాతమైన జడ్జిమెంట్ ఇచ్చుకో. ఒకవేళ నీదే అయితే కోపం తెచ్చుకోవటం ఖచ్చితంగా నీ అసమద్దత నిస్సహాయత. తప్ప అవతల వాళ్లదే అయితే నిగ్గదీసి అడుగు. నిలదీసి తేల్చుకో. అప్పుడు నోరెత్తకపోవటం నీ తప్పు. సమాధానం చెప్పలేకపోతే ఎదుటివాళ్ళ పరాజయం. నీ గెలుపు. ఇక గెలుపులో కోపం ఎందుకే నీహారికా !!

    తప్పునీదా ఇతరులదా ? తేల్చుకోముందు

    నీహారికా , ఇప్పుడు రెండు వేమన పద్యాల్లోని ఒక్క లైను చెపుతూ కోపముండు బతుకు కొంచమై పోవును. ఇదొక పద్యం లోది. శాంతభావ మహిమ చర్చించ లేమయా.…