• పిల్లల గురించి మాట్లాడాలంటే జీవితం సరిపోదు. ప్రపంచంలోని పిల్లలందరకు ఎన్నో లేవు. బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇప్పుడు బాలల దుస్థితి పైన ప్రపంచం దృష్టి సాధించాలని పిలుపు ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా కష్టాల్లో వున్నా పిల్లల ఘోష వినిపించుకోమని కోరుతూ ఐ నీడ్ యు అనే వీడియో ను రూపొందించి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తన అభిమానులు ఫాలోవర్లు యూనిసెఫ్ హ్యుమానిటేరియన్ యాక్షన్ ప్లాన్ ఫుడ్ చిల్డ్రన్ ఫర్ 2017 లింక్ ను సందర్శించి పిల్లలకు తమ వంతు సాయం చేయమని విజ్ఞప్తి చేశారు. బాలల హక్కులకు మద్దతు ఇమ్మని కోరారు.

    బాలల హక్కులకు మద్దతు ఇవ్వండి

    పిల్లల గురించి మాట్లాడాలంటే జీవితం సరిపోదు. ప్రపంచంలోని పిల్లలందరకు  ఎన్నో లేవు. బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇప్పుడు బాలల దుస్థితి పైన ప్రపంచం దృష్టి సాధించాలని…

  • తలకి చుండ్రు పట్టుకుంటే ఎన్ని మందులు వాడుతున్నా వదలకుండా విసిగిస్తూ ఉంటుంది. ఖరీదైన మందులు వాడి ఇంకా తగ్గటం లేదు అనుకుంటే ఇలా చేసి చుస్తే ఫలితం ఉండచ్చు. పుష్కలంగా యాంటీ ఫంగల్ గుణాలున్న పెరుగులో నల్ల మిరియాల పొడి కలిపి అప్లయ్ చేసి అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. ఆయిలీ హేయిర్ ఉన్నవాళ్లు పండిన టమాటో గుజ్జుతో ముల్తానీ మట్టి చేర్చి తలకు పట్టించి ఆరాక స్నానం చేసేసినా ఫలితం ఉంటుంది . నానబెట్టిన మెంతులు ఉదయాన్నే పేస్ట్ లాగా రుబ్బి తలకు పెట్టేస్తే ఫలితం ఉంటుంది. కలబంద గుజ్జులో ఉండే యాంటీ బ్యాక్తీరియల్ గుణాలు కూడా ఫంగస్ ను తొలగిస్తాయి. నిమ్మరసం తేనె కలిపి పట్టించినా మంచిదే. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ చుండ్రు తొలగిస్తుంది. తేనె జుట్టుకు కావలిసిన మాయిశ్చరైజర్ అందిస్తుంది. రెండు స్పూన్ల సెనగపిండి పెరుగు కలిపి తలకు పట్టించి అరగంట ఆగాక కడిగేసినా సమస్య తీరిపోయినట్లే. వీటిల్లో కొన్నయినా ట్రై చేయండి. ఇవి ఇంటి చిట్కాలు గనుక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేదు.

    ఈ చిట్కాలతో చుండ్రు మాయం

    తలకి చుండ్రు పట్టుకుంటే ఎన్ని మందులు వాడుతున్నా వదలకుండా విసిగిస్తూ ఉంటుంది. ఖరీదైన మందులు వాడి ఇంకా తగ్గటం లేదు అనుకుంటే  ఇలా చేసి చుస్తే ఫలితం…

  • నన్ను క్షమించి వదిలేస్తున్నారేమో అంటోంది అనుష్క. లోకంలో గాసిప్స్ కు కొదవలేదు. అలాగే క్రికెటర్లు రాజకీయాలు అందరిపైనా గాసిప్స్ ఆలా గాల్లో తెలివస్తూ ఉంటాయి. ఇదివరకటి తో పోలిస్తే నాపై కాస్త తక్కువగానే గాసిప్స్ వస్తున్నాయి. నా మనసు అర్ధం చేసుకుని ఓ అంచనాకు వచ్చారా లేదా నన్ను క్షమించి వదిలేశారో నాకు తెలియటం లేదంటోంది అనుష్క. అనుష్క నటించిన యముడు -3 ఓం నమో వెంకటేశాయ ఒకే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.బాహుబలి డి కంక్లూజన్ ఈ వేసవికి విడుదల కాబోతోంది. ఈ సినిమా గ్గానూ రాజమౌళి ఊహించనమేరకు అనుష్క బరువు తగ్గకపోతే గ్రాఫిక్స్ లోనే ఆమెను అందంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఇంకో గాసిప్ చక్కర్లు కొడుతున్న అనుష్క అవేం పట్టించుకోనని మిగతా కథానాయికలకు కూడా మీమీద మీకు నమ్మకం ఉంచుకోండి కానీ ఎవళ్ళకీ మీరు సమాధానం చెప్పుకోనక్కర్లేదు. మీ కుటుంబ సభ్యులకు తప్ప అని సలహా ఇచ్చేసిందీ స్వీటీ అనబడే అనుష్క

    బహుశ నన్ను క్షమించేసాను

    నన్ను క్షమించి వదిలేస్తున్నారేమో  అంటోంది అనుష్క. లోకంలో గాసిప్స్ కు కొదవలేదు. అలాగే క్రికెటర్లు రాజకీయాలు అందరిపైనా గాసిప్స్ ఆలా గాల్లో తెలివస్తూ ఉంటాయి. ఇదివరకటి తో…

  • ఈసారి బడ్జెట్ లో మహిళల కోసం ఎన్నో ప్రత్యేక కేటాయింపులున్నాయి. మహిళా శిశు సంక్షేమ పధకాల కోసం 1.86 లక్షల కోట్లు కేటాయించారు. అదే గత సంవత్సరం 1. 56 లక్షల కోట్లు గర్భిణుల పాలిచ్చే తల్లులకు ఇందిరా గాంధీ మాతృత్వ సహయోగా యోజన పధకానికి 21000 కోట్లు కేటాయించారు. 14 లక్షల అంగన్వాడీ కేంద్రాలకు గ్రామాల్లో మహిళా శక్తీ ఆరేళ్ళ లోపు వయసుగల పిలల్లకు 15,245 కోట్లు కేటాయింపు జరిగింది. మహిళా శిశు సంక్షేమం కోసం 1,84,632 కోట్ల రూపాయలు కేటాయించారు. గ్రామీణ మహిళల స్కెల్ డెవెలప్మెంట్ ఎంప్లాయిమెంట్ డిజిటల్ విటరసీ హెల్త్ అండ్ న్యూట్రిషన్స్ అలాగే దళిత మహిళలు గిరిజన మహిళలు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం ఈ కేటాయించిన డబ్బులోంచే సంక్షేమ పధకాలు చేపట్టాలి. పాలకులకు ప్రజా సంక్షేమం నిజంగా పట్టినట్లయితే ఏనాడో ప్రపంచంలో మహిళలంతా ఆర్థికాభివృద్ధిని చేతుల్లకి తీసుకుని వాళ్ళని వాళ్ళ కుటుంబాలను సమర్ధవంతంగా నడిపించుకోగలిగేవాళ్ళు . గతం వదిలేస్తే ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు. ఒక కొత్త ఉషోదయం వస్తుంది. రేపటి రోజు బావుంటుందని ఆశిద్దాం .

    మహిళా సంక్షేమానికి పెద్ద పీట

    ఈసారి బడ్జెట్ లో మహిళల కోసం ఎన్నో ప్రత్యేక కేటాయింపులున్నాయి. మహిళా శిశు సంక్షేమ పధకాల కోసం 1.86 లక్షల కోట్లు కేటాయించారు. అదే గత సంవత్సరం…

  • తమన్నా బాహుబలి విజయం ఇచ్చిన ధైర్యం తర్వాత ఇప్పుడిక హిందీ సినిమా కధలు వింటున్నానంటోంది. అవంతిక పాత్ర బాహుబలి ది కంక్లూజన్ లో ఇంకా బావుంటుంది అని చెపుతుందామె. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను తన పాత్రను ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఎంతో టెన్షన్ పడిందట. ఇప్పుడిక బాలీవుడ్ లో సత్తా చాటాలనుకుంటోందిట. అక్కడ హిమ్మత్ వాలా లో నటించి హమ్ షకల్స్ ఎంటర్టైన్మెంట్ టుక్ టుక్ టుటియాల్లో మెరిపించినా అక్కడ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదీ పాల తెలుపు అందాల తమన్నా . ఒక గుర్తింపంటూ వచ్చాక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలనిపించి అభినేత్రి చేసేసా. పెరఫార్మెన్స్ కు స్కోప్ వున్న లేడీ ఓరియెంటెడ్ లో చేయడం మంచిదేననిపించింది. అలాగే స్పెషల్ సాంగ్స్ విషయంలో సినిమా ఆలోచనల్లో మార్పురాలేదు కానీ బాలీవుడ్ లో సూపర్ స్టార్స్ కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తుంటారు . మన వల్ల సినిమాకు అదనపు ఆకర్షణ వుంటే మంచిదే కదా. పైగా రెమ్యునెరేషన్ బ్రహ్మాండంగా వుంటే హ్యాపీ కదా అంటోంది తమన్నా.

    హిందీ లో చేయాలని వుంది

    తమన్నా బాహుబలి విజయం ఇచ్చిన ధైర్యం తర్వాత ఇప్పుడిక హిందీ సినిమా కధలు వింటున్నానంటోంది. అవంతిక పాత్ర బాహుబలి ది కంక్లూజన్ లో ఇంకా బావుంటుంది  అని…

  • బెల్ పెప్పెర్స్ స్వీట్ పెప్పెర్స్ గా పిలుస్తారు గానీ మనకు తెలిసిన వాడకంలో ఉన్న పేరు క్యాప్సికం . గంట లాంటి ఆకారంలో ఉంటుంది కదా . అవి ఇలా పిలుస్తారు. ఆకుపచ్చ ఎరుపు పసుపు రంగుల్లో మనకు దొరికే ఇవి పుష్కలమైన పోషకాల నిలయం విటమిన్ ఏ , సి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు విటమిన్ బి6 అధికంగా వుండే పీచు ఇది ఖచ్చితమైన లోఫ్యాట్ పదార్ధం. జీవక్రియ ప్రక్రియను పెంచి కొవ్వు కరిగించే ఈ క్యాప్సికం కండరాల నొప్పికి మంచి ఉపశమనం. అలాగే స్వీట్ పెప్పర్ టేస్ట్ బావుండటంతో పాటు చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడతాయి. ఇది కారంగా ఉండదు. దృఢమైన యాంటీ ఇన్ఫలమేటరీ కారకంగా పనిచేస్తుంది. ఒక కప్పు కాప్సికం ముక్కలు 22 నుంచి 25 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. బరువు తగ్గులను కొనే వాళ్ళకి ఇది మంచి ఆహారం. ఏ పదార్ధం తో కలుపుకున్న రుచితో పాటు పోషకాలు దక్కుతాయి . వయసు రీత్యా వచ్చే దృష్టిలోపం కాటరాక్ట్ కాకుండా అడ్డుకోవటంలో కూడా ఇది సహకరిస్తుంది.

    బెస్ట్ ఫుడ్ బెల్ పెప్పెర్స్

    బెల్ పెప్పెర్స్ స్వీట్ పెప్పెర్స్ గా పిలుస్తారు గానీ మనకు తెలిసిన  వాడకంలో ఉన్న పేరు క్యాప్సికం . గంట లాంటి ఆకారంలో ఉంటుంది కదా  .…

  • ఆహరం విషయంలో ఎన్నెన్నో అపోహలుంటాయి. ఉదాహరణకు నెయ్యి తింటే కొవ్వు పెరుగు తుందని బరువు పెరుగుతామని అనుకుంటారు . నిజానికి నెయ్యి అలంటి అపకారాలు ఏవీ చేయదు. గుండెకు మేలు చేస్తుంది. దీనిలో ఉండే కాంజుగేటిడ్ లినోసిక్ యాసిడ్ అనే ప్రత్యేక ఫ్యాటీ యాసిడ్ డయాబెటిక్ నుంచి రక్షణ ఇస్తుంది. ధీమనులకు ప్రయోజనకారి. ఈ విధంగా పరోక్షంగా గుండె జబ్బులు రానీయదు. ఉదరంలో వచ్చే ఇబ్బందుల నివారణకు ఇంచి మించి మందు కూడా. ఇది ఔషధంగా పనిచేస్తూ జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. నేతి లోని ఫ్యాటీ యాసిడ్ పేగుల్లోని కణాలకు తగిన పోషకాలు అందించి త్వరగా జీర్ణక్రియ సమస్యలను తొలగిస్తుంది. కడుపునొప్పి మంట తగ్గిస్తుంది. ఆహారానికి అద్భుతమైన రుచి ఇస్తుంది, ముఖంగా శీతాకాలంలో నెయ్యిని తగుమాత్రంగా ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి.

    కొవ్వు పెంచుతుందన్న అపోహ

    ఆహరం విషయంలో ఎన్నెన్నో  అపోహలుంటాయి. ఉదాహరణకు నెయ్యి తింటే కొవ్వు పెరుగు తుందని బరువు పెరుగుతామని అనుకుంటారు . నిజానికి నెయ్యి అలంటి అపకారాలు ఏవీ చేయదు.…

  • కంటికి ఆకర్షణ ఇచ్చేదిగా మంచి ఘుమ ఘుమ లాడే ఆహారం కనబడగానే సాధారణంగా తిండికి సిద్దమై పోతాం. అంతేగాని ఆకలేస్తేనే భోజనం అన్న కాన్సెప్ట్ దాదాపు అందరికీ ఉండదు. ఆకలిని కలిగించే హార్మోన్ ఘెర్లిన్. ఇది కడుపులో గడబిడచేసి తిండికోసం వెతుక్కునేలా చేసే హార్మోన్. దీని ప్రభావానికి విరుగుడు నట్స్ అని చెపుతున్నారు. గుప్పెడు నట్స్ తింటే ఘెర్లిన్ హార్మోన్ స్థాయి పడిపోతుంది. ఆహారంలో ప్రోటీన్స్ అధికంగా ఉంటే అర్ధం లేని ఆకలికి తావుండదు. అంటారు ఆరోగ్య ఆహార నిపుణులు. తక్కువ క్యాలరీలతో పొట్టనిండి నట్లుగా ఆకలి ఆగిపోయేట్లు చేయటం సాధ్యమే అంటారు. ఉదయాన్నే మీగడ తీసిన పాలు పెరుగు మజ్జిగ ఉడికించిన గుడ్డు కూడా ప్రోటీన్లున్నవే. అలాగే ఆకలిలేకపోయిన వాసన కూడా రుచి చూడాలనే కోరిక కలుగజేస్తుంది. నాలుక తినాలని ఆశ పెట్టేస్తుంది. దానికి ఇంకో వాసన అంటే పుదీనా లాంటి వాసన చూస్తేనే ఆశక్తివంతమైన ఆకుల వాసన నాలుకపైనా ఉన్న రుచి గ్రహకాలను తృప్తి పరుస్తాయి. దీని వల్ల పరిమితిని మించి ఆహారం తీసుకోకపోవటం.

    ఆకలికి చెక్ పెట్టె నట్స్

    కంటికి ఆకర్షణ ఇచ్చేదిగా మంచి ఘుమ ఘుమ లాడే ఆహారం కనబడగానే సాధారణంగా తిండికి సిద్దమై పోతాం. అంతేగాని ఆకలేస్తేనే భోజనం అన్న కాన్సెప్ట్ దాదాపు అందరికీ…

  • పవర్ సినిమా తర్వాత హన్సిక తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. మా చిన్న కుష్భు అని తమిళులు ముద్దుగా పిలిచే హన్సిక కుష్భు లాగా బొద్దు గానే ఉండేది కానీ ఇప్పుడు స్క్వాష్ లు యోగాలతో ఏకంగా పదమూడు కిలోల బరువు తగ్గిపోయి చాలా స్లిమ్ గా అయిపోయింది. ఇంత పేరు తెచుకున్నాక లేజీ ఓరియెంటెడ్ సినిమాలు చేయచ్చు కదా అని అడిగితే అబ్బే నేనింకా చాలా పెద్దయి ఎంతో అనుభవం సంపాదించుకోవాలి. తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించి నాకింకా ఐదేళ్లే . ఇప్పుడు నాకున్న కమర్షియల్ హీరోయిన్ అన్న ఇమేజ్ ను నేను చాలా ఇష్టపడుతున్నా. నేనింకా చాలా చిన్నదాన్నే కదా. ఇప్పట్లో అలంటి పాత్రల జోలికి పోను. తమిళంలో ఇప్పుడు చేతిలో నాలుగు సినిమాలున్నాయి. 31 మంది దత్తత తీసుకున్న పిల్లలున్నారు. వాళ్ళకోసం పెద్ద హోమ్ కట్టాలి. వాళ్ళ బాగోగులు చూడాలి. ఇవన్నీ కష్టమైనా పనులు నా కోసం వుంచి ఇప్పుడు ప్రయోగాలు చేయును. కమర్షియల్ సినిమాలే ఇప్పుడు నా ధ్యేయం అంటోంది హన్సిక.

    నేనింకా ఎంతో యంగ్

    పవర్ సినిమా తర్వాత హన్సిక తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. మా చిన్న కుష్భు అని తమిళులు ముద్దుగా పిలిచే హన్సిక కుష్భు లాగా…

  • నీహారికా , ఈ రోజంతా అన్నమాచార్య పాడిన ఒక పాట విన్నాను. ఆ కాలానికి ఆయనకు ఇవాళ్టి ప్రపంచం ఎలా అర్ధం అయిందీ అన్నావు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే విన్నానన్నావు. నిజంగా మనసుతో అన్నమాచార్యులు మారుతున్నా సమాజాన్ని మనసుతో జ్ణానంతో అర్ధం చేసుకున్నారు. మనుషులంతా సమానంగా లేని ఈ సమాజం సమస్యల సమాహారంగా ఉంటుందని అర్ధం చేసుకున్నారు. దారితప్పిన స్వార్ధపరులైన వ్యక్తుల్ని చూసారు. నువ్వు అడిగినట్లు ఈ సమాజాన్ని మనుషుల్ని అవధుల్లేని ప్రేమతో చుస్తే అన్నీ అర్ధం, అవుతాయి. సుఖంగా నిద్రించే రాజుకీ అక్కడే ఆయన సేవ కోసం పడివున్న సేవకుడిదీ నిద్ర ఒక్కటేనన్నారు. ప్రకృతిలో అందరికోసం వీచే గాలి దుర్గంధం పైనా పరిమళం పైనా ఒకే రకంగా తాకి పరుగుతీస్తుందన్నారు. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికీ జీవించే హక్కుందన్నారు. ప్రకృతి దృష్టిలో అందరు ఒక్కటే. ఈ బేధాలన్నీ మనుషులు సృష్టించినవే నన్నారు. జీవితం మొత్తం ప్రచారం చేసారు. మనస్ఫూర్తిగా మనుషుల సుఖం కోరుకున్నారు కనుకనే ఆసాహిత్యం ఇవాళ్టికీ తరాల నుంచి తరాలకు అందుతోంది. ఇప్పుడు ఆ సాహిత్యపు సువాసన నిన్ను తాకింది. అంత గొప్ప రూపంలో ఉన్న ఏనుగుపైన భూమికి జానెడు లేని కుక్కపైన ప్రసరించే సూర్య కిరణం ఒక్కటేనన్నాడాయన. మరి నీకు నాకు అందరికీ నచ్చదా ? నచ్చాలి కూడా !!

    అర్ధం కావాలంటే అవధుల్లేని ప్రేమ కావాలి

    నీహారికా , ఈ రోజంతా అన్నమాచార్య పాడిన ఒక పాట  విన్నాను. ఆ కాలానికి ఆయనకు ఇవాళ్టి  ప్రపంచం ఎలా అర్ధం అయిందీ అన్నావు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే…