• ఈ సీజన్ లో ఆ ఆకుపచ్చ పండు కన్నులపండుగ్గా నోటికీ కంటికీ విందు చేస్తూ ఉంటుంది. ఇళ్లలో కూడా సులువుగా పెంచుకునే సీతాఫలాల నిండా చెప్పలేనంత కాల్షియం నిల్వలుంటాయి. కానీ వీటిని కొనే సమయంలో మిగతా పండ్ల తో పోల్చితే అదనపు శ్రద్ధ కావాలి. కాయ పండి గట్టిగ ఉండాలి. నొక్కితే బ్రేక్ అవకూడదు. సీతా ఫలం కళ్ళ మధ్య తెల్లని బూజు వంటిది అంటుకునే ఉంటే వాటిని కొనగూడదు. ఇవి ఫంగస్ ఇన్ఫెక్ట్ అయి ఉంటాయి. పండు పైన నల్లని మచ్చలు చుక్కలు వున్నా కొనద్దు. ఎల్లోయిష్ గ్రీన్ గా వున్నాయంటే లోపల పాడయి పోయినట్లు లెక్క వీటిని ఒక్కసారిగా ఎక్కువగా కొనకూడదు. త్వరగా పాడై పోతాయి. ఒకటి రెండు రోజులకు మించి తాజా తనం ఉండదు. సీతాఫలాన్ని సాధారణ గది ఉష్ణోగ్రతలు ఫ్రూట్ నెట్ లో ఉంచుకోవాలి. ఇతర క్రిముల్ని బాగా ఆకర్షిస్తాయి. సీతాఫలాల్లో విటమిన్ ఏ మెగ్నీషియం పొటాషియం ఫైబర్ విటమిన్ బి 6 కాల్షియం విటమిన్ సి ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలున్నాయి. శీతాకాలపు పండు ఇది

    శీతాకాలపు పండు ఇది

    ఈ సీజన్ లో ఆ ఆకుపచ్చ పండు కన్నులపండుగ్గా నోటికీ కంటికీ విందు చేస్తూ ఉంటుంది. ఇళ్లలో కూడా సులువుగా పెంచుకునే సీతాఫలాల నిండా చెప్పలేనంత కాల్షియం…

  • హాబీలకు సమయం కేటాయించాలి

    నీహారికా , రోజుకు 12 గంటలే మేలుకుని ఉంటాం . ఈ కాస్త సమయం చదువుకు మిగతా పనులకే చాలవు. ఇంకా హాబీలు సృజనాత్మకమైన పనులు ఎక్కడ…

  • ఒకప్పుడు గ్లామర్ డాల్స్ గా కేవలం సినిమాకు అందం ఇస్తున్నట్లు ఉండే తారలు ఇప్పుడు పంధా మార్చేశారు. గ్లామర్ తో నెగ్గుకొచ్చిన వీళ్ళు యాక్షన్ తో ఫైట్లతో సందడి చేస్తున్నారు. ఈ రూట్లోకి ఇప్పుడు త్రిష కూడా వచ్చారు . దాదాపు పదిహేనేళ్ల పాటు కమర్షియల్ సినిమాలు చేసిన ఈమె అందమైన నటిగా పేరుతెచ్చుకున్నారు . గ్లామర్ కే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ప్రతి సినిమాకు ప్రత్యేకత చూపించారు. ఇప్పుడు ఆ గ్లామర్ పక్కన పెట్టేసి ఓన్లీ యాక్షన్ అంటోంది త్రిష . లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ సినిమా భారమంతా తన భుజాలపై వేసుకుంటోంది త్రిష. ఇప్పుడు చేస్తున్న ముహని సదురంగ వేట్టయ్ -2 1818 లాంటి సినిమా లన్నీ లేడీ ఓరియెంటెడ్ లే.. హిందీ సూపర్ హిట్ ఎన్ హెచ్ 10 తమిళ రీమేక్ గర్జనై తో యాక్షన్ హీరోయిన్ గా హిట్ అందుకోవాలని త్రిష తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

    గ్లామర్ కంటే యాక్షన్ కె ఓటు

    ఒకప్పుడు గ్లామర్ డాల్స్ గా కేవలం సినిమాకు అందం ఇస్తున్నట్లు ఉండే తారలు ఇప్పుడు పంధా మార్చేశారు. గ్లామర్ తో నెగ్గుకొచ్చిన వీళ్ళు యాక్షన్ తో ఫైట్లతో…

  • డెస్క్ వర్క్ చేసినప్పుడు అస్తమానం మోచేతులు టేబుల్ కి ఆనించటం వల అక్కడంతా నల్లగా అయిపోతుంది. ఈ మోచేతుల నలుపు వదిలించటం కాస్త కష్టమే. కానీ రెగ్యులర్ గా ఈ ఇంటి చిట్కాలు ఉపయోగించి ఆ నలుపు పోగొట్టచ్చు. సెనగపిండి పెరుగు కలిపి ప్రతిరోజు స్నానం చేసే ముందర మోచేతులకు పట్టించి కాసెప్పాయాక కడిగేస్తే ఆ నలుపు నెమ్మదిగా తగ్గిచర్మంలో కలిసిపోతుంది . అలాగే దోసకాయ బొప్పాయి గుజ్జుగా చేసి రాసినా సరే. ఒక టేబుల్ స్పున్ గంధంలో రెండు స్పూన్ల తేనే వేసి పేస్టులా కలపాలి . దాన్ని ఆరిపోయే దాకా మోచేతులు రాసి వదిలేసి తర్వాత కడిగేస్తే ఫలితం బావుంటుంది. ఈ మిశ్రమం మోచేతులు రాసి కనీసం అరగంట ఉంచుకోవాలి . పంచదార ఆలివ్ ఆయిల్ పేస్ట్ లా చేసి ఆ మిశ్రమం తో నలుపు ఉన్న భాగంలో మస్సాజ్ చేస్తే ఫలితం ఉంటుంది. ఏ చిట్కాలు ప్రతి రోజు చేస్తే ,మంచి ఫలితం ఉంటుంది. నలుపు తప్పకుండా పోతుంది.

    మోచేతుల నలుపు సులువుగా పోతుంది

    డెస్క్ వర్క్ చేసినప్పుడు అస్తమానం మోచేతులు టేబుల్ కి ఆనించటం వల  అక్కడంతా నల్లగా అయిపోతుంది. ఈ మోచేతుల నలుపు వదిలించటం కాస్త కష్టమే. కానీ రెగ్యులర్…

  • వాతావరణంలో మార్పులకు ఎక్కువగా స్పందించేది చర్మమే . నెమ్మదిగా చలి తగ్గి మొహం పడుతోంది. చర్మం పేలవంతంగా అయిపోతుంది. క్యారెట్ చిన్న బీట్ రూట్ టమాటో కలిపి పేస్ట్ లాగా చేసి దీనికి పెరుగు కలిపి ఈ మిశ్రమం మొహానికీ మెదడు అప్లయ్ చేయాలి. అరగంట తర్వాత కడిగేస్తే ఖరీదైన మాస్క్ వేసుకున్నంత మెరుపుతో ఉంటుంది మొహం. పెరుగు పసుపు మిశ్రమం కూడా చాలా పనిచేస్తుంది. పాలలో మెంతులు నానబెట్టి పేస్ట్ చేసి ముఖ్నైకి మాస్క్ లా వేసుకోవాలి. వేడి నీళ్లతో కడిగేస్తే మొహం మెరుపుగా ఉంటుంది. జీడిపప్పు పచ్చి పాలతో కలిపి మెత్తగా పేస్ట్ చేసి ఫెస్ మాస్క్ వేసుకోవచ్చు . ఆవ నూనె నిమ్మరసం కూడా మంచి ఫలితం ఇస్తుంది. బాదం పప్పు నాననిచ్చి రోజ్ వాటర్ పచ్చి పాలతో కలిపి పేస్ట్ చేసి ఈ మిశ్రమంతో మొహం నృదువుగా మర్దనా చేయాలి. తర్వాత మొహానికి ఆవిరిపెట్టి తుడిచేయాలి. మొహంతో మెరుపు ఎంతోసేపు ఉంటుంది. చర్మం నిగారింపు కోసం ఇలా ఇంట్లోవాడే వస్తువులు ట్రై చేస్తే మొహం ఫ్రెష్ గానూ ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్టులు వుండవు.

    పాలు జీడిపప్పు పేస్ట్ అప్లయ్ చేస్తే

    వాతావరణంలో మార్పులకు ఎక్కువగా స్పందించేది చర్మమే . నెమ్మదిగా చలి తగ్గి మొహం పడుతోంది. చర్మం పేలవంతంగా అయిపోతుంది. క్యారెట్ చిన్న బీట్ రూట్ టమాటో కలిపి…

  • శారీరికమైన అనారోగ్యాలకు ఎన్నో మందులున్నాయి. కానీ మానసిక సమస్యలపైనా ఇంకా ఎన్నెన్నో అధ్యయనాలు జరగాలి. ఇంకా ఎన్నో మందులు కనిపెట్టాలని ఇప్పుడు ఆ సమస్య పైనే దృష్టి పెట్టింది రిచా సింగ్. ఈ ఏడాది ఫోర్బ్స్ పత్రికలో సామజిక సేవా విభాగంలో స్థానం సంపాదించింది. కర్ణాటక కు చెందిన రిచా సింగ్ మానసిక రుగ్మతతో సతమత మయ్యేవారు చక్కని కౌన్సెలింగ్ తీసుకునేందుకు వీలుగా యువర్ దోస్తే ఏర్పాటు చేశారు. మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించేందుకు ఏర్పాటైన ఈ వేదిక సిఇఓ రిచా సింగ్. 2014 లో ఈ వేదిక ఏర్పాటైంది. ప్రతిరోజు 750 మందికి పైగా నిపుణులు 1200 సెషన్స్ ద్వారా తొమ్మది లక్షల మంది బాధితులకు సేవలందిస్తారు రీచా. ఎందరో యువర్ దోస్తే ఇస్తున్న సేవలతో ఆరోగ్యం పొందారు. లాభపడ్డారు. సోషల్ ఇంటర్ప్రెన్యూర్ గా రాణిస్తున్న రీచా ఈ ఏడాది. సామజిక సేవా విభాగంలో ఫోర్బ్స్ లో స్థానం దక్కించుకున్నారు.

    సామజిక సేవా విభాగంలో ఫోర్బ్స్ రిచా సింగ్

    శారీరికమైన అనారోగ్యాలకు ఎన్నో మందులున్నాయి. కానీ మానసిక సమస్యలపైనా ఇంకా ఎన్నెన్నో అధ్యయనాలు జరగాలి. ఇంకా ఎన్నో మందులు కనిపెట్టాలని ఇప్పుడు ఆ సమస్య పైనే దృష్టి…

  • కంప్యూటర్ ముందు గంటల కొద్దీ పనిచేయటం లేదా ఫోన్ వైపే చూస్తూ చాటింగ్ చేయటం చాలా మందికి అలవాటే . కానీ కంప్యూటర్ వాడే వాళ్ళతో 50 శాతం నుంచి 90 శాతం మందికి దృష్టి సంబంధ మైన సమస్యలు వస్తున్నాయని అధ్యయనాలు చెపుతున్నాయి. కంప్యూటర్ నుంచి వచ్చే వెలుగులు కళ్ళు అలసి పోవటానికి కారణం అవుతున్నాయి. అందుకే ఆఫీసైనా ఇల్లయినా కంప్యూటర్ ముందు కూర్చునే చోట తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి. కంప్యూటర్ తెరను కూడా వెలుతురు కాస్త తగ్గించుకోవాలి. అక్షరాలూ మరీ చిన్నవిగా ఉంటే అప్పుడు దృష్టి అంతా అక్కడే పెట్టాల్సివస్తుంది. అంచేత అక్షరాలు కాస్త సైజు పెంచుకోవాలి. అప్పుడు కళ్ళకు సంబంధించిన వ్యాయామం చేయాలి. కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉండాలి. అప్పుడే కళ్ళకు కావలిసినంత తేమ అందుతుంది. కళ్ళు అలసి పోకుండా ఉంటాయి. అలాగే కూర్చునే కుర్చీ కూడా వెన్నుముక్క అనే విధంగా ఉంటే పోశ్చర్ సరిగ్గా ఉంటుంది. ఇంకా ఫోన్ ల విషయంలో కాస్తంత విరామం ఇస్తూ ఉండదంటున్నారు నిపుణులు.

    అంతటా చుస్తే కళ్ళు అలసిపోతాయి

    కంప్యూటర్ ముందు గంటల కొద్దీ పనిచేయటం లేదా ఫోన్ వైపే చూస్తూ చాటింగ్ చేయటం చాలా మందికి అలవాటే . కానీ కంప్యూటర్ వాడే వాళ్ళతో 50…

  • సినిమా సినిమాకు గ్లామర్ పెంచుతూనే ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ నేను మంచి భోజన ప్రియురాలిని నా ముందు రకరకాల వంటకాలు పెట్టాల్సిందే. నేనవన్నీ రుచి చూడవలిసిందే. అంటే జీరో సైజ్ అంటే మోజుపడే అమ్మాయిలంతా ఉలిక్కి పడ్డారు. ప్రతి సినిమా కొత్త కొత్త ముస్తాబవుతూ శరీరంలో ఎక్కడా బరువే కనిపించనివ్వని రకుల్ నేను నచ్చిన వన్నీ తినేస్తా.. శరీరంలో ఆశ్చర్యంగా ఉంటుంది. అది పెద్ద అద్భుతం మాత్రం కాదు. జిమ్ ఓనర్ రకుల్ గంటల తరబడి జిమ్ లో సాధన చేస్తూ కేలరీలు కరిగించుకునే ఆమెను మంచి భోజనం చేసే అలవాటుంటే కష్టం ఏముందీ ? వారం మొత్తం సెట్లోనే కదా ఉండేది వాళ్ళు ఏం పెడితే అది తినేసి డైట్ పూర్తిగా కంట్రోల్ లో ఉంచుకుని చాలా తక్కువే తిని ఇక దగ్గర్లో ఎక్కడెక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయో వాకబ్ చేసి పెట్టుకుని ఇక ఆదివారం రాగానే ఫుడ్ మీద పడిపోతాను . అక్కడ బఫె లో వంద ఐటమ్స్ అన్నా ఉండాల్సిందే .ఆ ఒక్కరోజు మాత్రం ఇక చాలు అనేవరకు తింటానంటోంది. రకుల్. ఏదైనా నేర్చుకోవటమే ఇష్టంమొచ్చిన ఆహారం తింటూనే కేలరీస్ కరిగించుకోవటం రకుల్ నేర్చుకుంది. అలానేర్చుకుంటే నోరుకట్టేసుకోవటం ప్రసక్తే ఉండదు.

    బఫెలో వంద ఐటమ్స్ లేకపోతే నాకు నచ్చదు

    సినిమా సినిమాకు గ్లామర్ పెంచుతూనే ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ నేను మంచి భోజన ప్రియురాలిని నా ముందు రకరకాల వంటకాలు పెట్టాల్సిందే. నేనవన్నీ రుచి చూడవలిసిందే.…

  • మంచి పోషకాలతోనే శరీరారోగ్యం . కానీ కొన్ని పోషకాలు తినేందుకు శరీర లావణ్యం పెంచుకునే పూతలగానూ ఉపయోగపడతాయి. దాన్ని అటు ఆహారంలో తీసుకోవాలి చర్మానికీ రాసుకోవాలి. చర్మం కాంతిగా తేజస్సు తో కనిపించాలంటే విటమిన్ ఇ అండ్ పదార్ధాలు రోజు తినాలి. అప్పుడు అందులోని పోషకాలు శరీరానికి అంది చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. కానీ విటమిన్ ఇ మాత్రల రూపంలో దొరుకుతుంది. రోజు ఉదయాన్నే ఇ విటమిన్ నూనెను ఒంటికి పట్టించి మర్దనా చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేసినా చర్మం చక్కగా మృదువుగా కాంతిగా అయిపోతుంది. మొహం పైన పట్టేస్తే కళ్ళ కింద నలుపు మడతలు తగ్గుతాయి. మొటిమల తాలూకు మచ్చలు సన్నటి గీతలు కూడా ఈ విటమిన్ ఇ నూనె రాస్తూ ఉంటే క్రమంగా తగ్గిపోతాయి . రాత్రివేళ రోజు ఈ నూనె అప్లయ్ చేస్తే ఉదయం చల్లని నీళ్లతో కడిగేస్తే ముఖంలో మురికి పోయేందుకు కూడా ఈ నుయ్న్ చక్కగా పనిచేస్తుంది. విటమిన్ ఇ ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల చర్మం సాగే గుణం పెరిగి ఆరోగ్యంగా అయిపోతుంది.

    అందాన్ని పెంచే విటమిన్ ఇ

    మంచి పోషకాలతోనే శరీరారోగ్యం . కానీ కొన్ని పోషకాలు తినేందుకు శరీర లావణ్యం పెంచుకునే పూతలగానూ  ఉపయోగపడతాయి. దాన్ని అటు ఆహారంలో తీసుకోవాలి చర్మానికీ  రాసుకోవాలి. చర్మం…

  • సాధారణంగా ఎవరైనా డెలివరీ తర్వాత కాస్తో కూస్తో మారతారు.. బరువు పెరుగుతారు. హార్మోన్ల సమతుల్యత లోపించటం కొవ్వులు పెరగటం ఇంకా ఎన్నో ఇతర కారణాలతో ప్రసవం తర్వాత తేడా వస్తుంది . వెంటనే బరువు తగ్గటం చాలా కష్టం కూడా కానీ బాలీవుడ్ నటి కరీనా కపూర్ మాత్రం ఈ సమస్యను రెండు నెలలోపునే అధిగమించింది. ప్రముఖ డైటీషియన్ రుజుత్ దివేకర్ కరీనా స్లిమ్ గా అయ్యేందుకు డైట్ చార్ట్ ఇచ్చారు. కరీనా కూడా నేను తక్కవ ఏమీ తినలేదు. నెయ్యి వాడాను పిజ్జా లు తిన్నాను పరోటాలు లాగించాను ఆకలేసినంతవరకు తిన్నానన్నారు. కానీ ప్రెగ్నెన్సీ కి ముందు సినిమాల్లో ఉన్నప్పుడు ఆమె ఎలా ఉందో ఇప్పుడు వెంటనే అలంటి షేప్ ;లోకి మారిపోయింది కరీనా. నలుపు రంగు హాఫ్ షోల్డర్ బార్ డాట్ డ్రెస్ ధరించిన కరీనా కపూర్ ఫోటో చూసి అందరూ ఎంత బావుందో అనేసారు. ఏ బ్యూటిఫుల్ మదర్ ని చూసి సైఫ్ ఏమని అంటాడో.. డిసెంబర్ లో మగబిడ్డను జన్మనిచ్చిన కరీనా రెండు నెలలకే రుజుత్ ఆధ్వర్యంలో తిరిగి చక్కగా అయిపోయారు. ఈ క్రెడిట్ అంతా రుజుత్ దే నన్నారు కరీనా...

    రెండింతలు అందంతో కరీనా

    సాధారణంగా ఎవరైనా డెలివరీ తర్వాత కాస్తో కూస్తో మారతారు.. బరువు పెరుగుతారు. హార్మోన్ల సమతుల్యత లోపించటం కొవ్వులు పెరగటం ఇంకా ఎన్నో ఇతర కారణాలతో ప్రసవం తర్వాత…