• ఈ మధ్య కాలంలో ఎన్నో భాషలు కనుమరుగైపోతున్నాయని లిపి లేక కొన్ని పోగొట్టుకుంటున్నామని కొన్ని రకరకాల ప్రాంతాల భాషలు కలిసిపోయి అసలు జీబ్ భాష పోతుందని అనుకుంటున్నాం. సరేనా ఇప్పుడో అమ్మాయి మెలేసామే ఏకంగా ఒక కొత్త భాష కనిపెట్టింది. అంతేకాదు ఆ భాషకు సంబంధించిన ఒక నిఘంటువును రూపొందించేసింది. ఇంగ్లాండ్ కొర్షమ్ పట్టణానికి చెందిన ఈ టీనేజ్ అమ్మాయి మెలీసా మాతృ భాష తో పాటు జర్మన్ ఫ్రెంచ్ స్పానిష్ పోర్చగీస్ ఇంకా ఇతర భాషలు నేర్చుకుంది. అయితే ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి. తానూ ఒక భాష కనిపెడితే ఎలా ఉంటుంది అని ఆలోచించిందట. మూడేళ్లు కష్టపడి 1500 పదాలతో కొత్త భాష రూపొందించింది. వేరు వేరు భాషల్లో పదాలు అక్షరాలు పలికితే వచ్చే శబ్దాల ఆధారంగా ఈ భాష కనిపెట్టిందిట. ఈ భాషకు స్కెన్వన్స్ అనే పేరు పెట్టింది. ఆటే మాట్లాడే భాష అని అర్ధం. ఇది అరబిక్ లిపిని పోలి ఉంటుంది . తానూ రూపొందించే నిఘంటువు లో ప్రతి పదానికి అర్ధం ఆ పదం ఎలా వచ్చిందన్న అంశాలు నిఘంటువులో ప్రతి పదానికి అర్ధం ఆ పదం ఎలా వచ్చిందన్న అంశాలు రాస్తోందిట. మొత్తానికి ప్రపంచ భాగాల్లో ఇంకో భాష వచ్చి చేరింది.

    కొత్త భాష కనిపెట్టిందండి

    ఈ మధ్య కాలంలో ఎన్నో భాషలు కనుమరుగైపోతున్నాయని లిపి లేక  కొన్ని పోగొట్టుకుంటున్నామని కొన్ని రకరకాల ప్రాంతాల  భాషలు కలిసిపోయి  అసలు జీబ్ భాష  పోతుందని అనుకుంటున్నాం.…

  • ఉదయపు వేళకు స్వాగతం పలుకు

    నీహారికా, నాకు కష్టాతి కష్టం అనిపించింది ప్రొద్దున్నే నిద్రలేవడం అంటే ఎంతో నవ్వొచ్చింది. నిద్ర వదులుకోవడం కష్టమే నన్న విషయం పక్కన పెట్టు కానీ ప్రకృతి ద్వారా…

  • నీహారికా, నాకు కష్టాతి కష్టం అనిపించింది ప్రొద్దున్నే నిద్రలేవడం అంటే ఎంతో నవ్వొచ్చింది. నిద్ర వదులుకోవడం కష్టమే నన్న విషయం పక్కన పెట్టు కానీ ప్రకృతి ద్వారా అందుకోగలిగే ప్రయోజనాలు అనేకం ప్రతిరోజు సూర్యకాంతి లో కాసేపు తిరగగలిగితే ఎంత ఆరోగ్యం. ప్రకృతి విహారంగా పచ్చిక బయళ్ళు, పార్కుల్లో తిరగండి. ప్రకృతిలో వచ్చే సహజమైన వాసనలు, పూవుల రంగులు మనసు పైన ఎంతో ప్రభావం చూపెడతాయి. పక్షుల కిలకిలారావాలు, అరుణోదయపు కాంతులు, ప్రశంతమిన్ శబ్దాలు లేని వాతావరణం, నీలాకాశం, ప్రవహించే నదులు, జలపాతాలు, ఉప్పొంగే సముద్రం ఇవన్నీ ప్రకృతిలో భాగం కదా. కళ్ళు అలసినట్లు ఉంటే కాసేపు పచ్చని మొక్కల వైపు చూడు. చక్కగా ఫ్రెష్ గా వుంటుంది. మనసు సేదదీరాలంటే పువ్వుల్ని, మెరిసే ఉదయపు కాంతుల్ని చూస్తూ మౌనం గా నడిస్తే కొత్త శక్తి వస్తుంది. పాజిటివ్ ఫీలింగ్స్ తో మనసు నిండిపోతుంది.మనమూ ప్రకృతిలో ఒక భాగమే. అందుకే ప్రకృతికి దగ్గర గానే ఉండాలి. నాలుగ్గోడల మధ్యన క్లాస్ రూమ్ లో గంటల తరబడి చదువు ఎలాగూ వుంటుంది. ఆ ఎనర్జీ నింపుకొనేందుకు ఉదయం వేళ లేచి ఆ రోజుని ఆహ్వానించా. ప్రతి ఉదయం నీకు సంతోషాన్ని కానుకగా ఇస్తుంది.

    ఎంతో మందికి ఆదర్శం సుగుణ

    తమిళనాడు కు చెందిన సుగుణకు చూపు లేదు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని పిల్లల్ని చదివించుకోవాలని ఆరాటపడుతోంది. ఏడాది వయసులో చూపు పోయిన సుగుణకు ఓ…

  • కొన్ని అలంకరణ వస్తువులకు కొంత ఎక్సపైరి డేట్ లాంటిది వుంటుంది. అది ఆ ప్యాక్ మీది రాసి ఉండకపోయినా అవి అయిపోయేదాకా వాడాలనుకోకూడదు. ఉదాహరణకు మస్కారా ఫౌండషన్ కాటుక వంటి ఉత్పత్తులు జీవిత కాలం ఆరునెలలే. కనుక అంతకుమించి వాడకపోవడం బెస్ట్.అలాగే ఎంత రాత్రైనా మొహం పైన రాసుకునే ఫౌండేషన్ క్రీములు మేకప్ తొలగించే పడుకోవాలి. లేకపోతే ఆ రసాయనాలతో మొటిమలు మచ్చలు ఎదురవుతాయి . కాను బొమ్మల్ని తీర్చిదిద్దుకునే సమయం లేనప్పుడు చాలాసార్లు ఫ్లక్కర్ వంటి చిన్న పరికరం తో లాగేస్తూ వుంటారు. అలా లాగేసి కనుబొమ్మల వెంట్రుకలను తీసేస్తే పల్చగా అయిపోతాయి. దాంతో ,ముఖం పెద్దగా వయసు పైబడినట్లు అయిపోతుంది. వీటికోసం ప్రత్యేకంగా ఉండే జెల్ రాసుకుంటే కనుబొమ్మలు దట్టంగా కనిపిస్తాయి. అలాగే కళ్ళ అలంకరణకు ఉపయోగించే బ్రెష్ లు తరచూ మార్చాలి. వారానికి ఒకసారి షాంపూ తో శుభ్రం చేయాలి. లేకపోతే కళ్ళకు ఇన్ఫెక్షన్ వస్తుంది . మనం చేతి వేళ్ళతో కీ బోర్డు ఉపయోగిస్తాం. అలాగే ఇంట్లో ఎన్నో శుభ్రం చేసే పనులు చేస్తాం. అదే చేతుల్ని మొహం పైన పెట్టేస్తే వేళ్ళపై క్రిములు ముఖం పై చేరి చర్మ రంధ్రాలు మూసేస్తాయి. మొటిమలు వస్తాయి. చేతులు శుభ్రం చేసుకోకుండా మొహం పై పెట్టుకోకూడదు.

    అయిపోయేదాకా వాడద్దు

    కొన్ని అలంకరణ వస్తువులకు కొంత ఎక్సపైరి డేట్ లాంటిది వుంటుంది. అది ఆ ప్యాక్ మీది రాసి ఉండకపోయినా అవి అయిపోయేదాకా వాడాలనుకోకూడదు. ఉదాహరణకు మస్కారా ఫౌండషన్…

  • మన చేతులు ఎంత పరిశుభ్రంగా ఉంటె మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. దీన్ని పిల్లలకు పసితనం నుంచే బోధించాలి. ఇంటినిండా అందుబాటులో వుండే వాటర్ ట్యాపుల వద్ద వారిని ఎప్పటికప్పుడు చేతులు కడుక్కునేలా ప్రోత్సహించాలి. ఆహారం తినే ముందర తీసుకున్న తర్వాత చేతికి అంటుకునేలా పానీయాలు తాగినా మందులు వేసుకునే సమయంలో అనారోగ్యంగా ఉన్నవారి దగ్గరకు వెళ్లి వచ్చాక టాయిలెట్ కు వెళ్ళాం ఆటలాడుకుని వచ్చాక ప్రతి పని తర్వాత కాస్త బాదస్తంగా అనిపించినా పిల్లలకు చేతుల శుభ్రత గుర్తు చేయటం మంచిదే. ముఖ్యంగా మరీ పసిబిడ్డల దగ్గరకు వెళ్ళినప్పుడు వారిని ఎత్తుకోవాలని అనుకుంటే తప్పనిసరిగా బయటనుంచి వచ్చిన వారు కాళ్ళు చేతులు కడుక్కునే వెళ్ళాలి. ఈ పరిశుభ్రత పెద్దవాళ్ళు చిన్నవాళ్లు ఎవరైనా సరే పాటిస్తేనే వైరల్ ఇన్ఫెక్షన్ లో ఉదర కోస రుగ్మతలకు గురికాకుండా వుంటారు .

    మన చేతుల్లోనే ఆరోగ్య రక్షణ

    మన చేతులు ఎంత పరిశుభ్రంగా ఉంటె మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. దీన్ని పిల్లలకు పసితనం నుంచే బోధించాలి. ఇంటినిండా అందుబాటులో వుండే వాటర్ ట్యాపుల వద్ద…

  • మెరిసే చర్మం కోసం మంచి డైట్ ని సూచిస్తున్నారు నిపుణులు . అయితే ఈ డైట్ లో రాత్రికి మార్పులురావు . చర్మం పైన మార్పురావాలంటే కనీసం ఆరు వారాల వ్యవధి కావాలి. మనం తినే ఆరోగ్యాన్ని బట్టే చర్మం ఆరోగ్యాంగా కాంతులీనుతూ ఉంటుంది. బ్రొకోలి , జామ , కివి పండ్లు ఆరెంజ్ బొప్పాయి స్ట్రా బెర్రీలు చిలకడ దుంప నేరేడు కొలెజాన్ ఉత్పత్తికి సహకరిస్తాయి . ఒమేగా 3 ఒమేగా 6 ఈ రెండు అత్యవసర ఫ్యాటీ యాసిడ్లు. ఆయిలీ ఫిష్ అవిసె నూనెలు ఒమేగా 3 లభిస్తుంది. సన్ ఫ్లవర్ కార్న్ ఆయిల్ లో ఒమేగా 6 దొరుకుతుంది. ఉల్లి వెల్లుల్లి లోదొరికే సల్ఫర్ చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. లివర్ గుడ్లు పాలు ఆయిలీ ఫిష్ గింజ ధాన్యాలు విటమిన్ ఏ కు మంచి ఆధారం కొత్త చర్మం ఎదగటానికి ఇవి సహకరిస్తాయి. డ్రై ఆప్రికాట్స్ నువ్వుల్లో ఐరన్ బాగా దొరికి స్కిన్ టోన్ మెరుగవుతుంది. చర్మం మెరిసేందుకు విటమిన్ బి 2 చీజ్ గుడ్లు లివర్ లో అధికంగా దొరుకుతాయి. ఇవన్నీ సరైన మోతాదులో వుండేలా హెల్త్ చార్ట్ లో చూసుకోవాలి.

    మెరిసే చర్మం కోసం మంచి ఆహారం

    మెరిసే చర్మం కోసం మంచి డైట్ ని సూచిస్తున్నారు నిపుణులు . అయితే ఈ డైట్ లో రాత్రికి మార్పులురావు . చర్మం పైన మార్పురావాలంటే కనీసం…

  • తల్లి పాలు నాణ్యతమా చర్మం మృదుత్వాన్ని శిరోజాలు గోళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు క్యారెట్ సూప్ ప్రభావవంతమైన సహజ చిట్కా అంటున్నాయి పరిశోధనలు. బయోటిన్ పొటాషియం ఫాస్ఫరస్ ఆర్గానిక్ సోడియం కొన్ని ఖనిజాలు లభిస్తాయి. విటమిన్ A ,C, D ,K E B1, B6 విటమిన్లకు మంచి ఆధారం . క్యారెట్లు తినటం కళ్ళకు ఎప్పుడు మంచిదే అని వినే మాటే గాని ఇంకా ఎన్నో సుగుగుణాలున్నాయి. ఎన్నో రుగ్మతల నుంచి క్యారెట్లు పరిరక్షిస్తాయి . ఎన్నో విటమిన్లు ఖనిజాలు లభిస్తాయి. క్యారెట్ జ్యూస్ జ్యూస్ లో కొంచెం పాలకూర కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే ఉదార ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందిట . కానీ రెగ్యులర్ గా క్యారెట్ జ్యూస్ తీసుకుంటేనే ఏ ఫలితాలైన వెంటనే ఫలితాలు ఆశించకూడదు కనీసం రెండు నెలల్లో తేడా తెలిసిపోతుంది. పెప్టిక్ అల్సర్లు గ్వ సిట్రస్ దీర్ఘకాలిక ఇన్ఫలమేటరీ రుగ్మతలు మొదలైనవి క్యారెట్ జ్యూస్ తో తగ్గిపోతాయి

    ఎలా తీసుకున్నా ఇది గోల్డెన్ క్యారెట్టే

    తల్లి పాలు నాణ్యతమా చర్మం మృదుత్వాన్ని శిరోజాలు ,గోళ్ళ  ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు క్యారెట్ సూప్ ప్రభావవంతమైన సహజ చిట్కా అంటున్నాయి పరిశోధనలు. బయోటిన్ పొటాషియం ఫాస్ఫరస్ ఆర్గానిక్…

  • ఒక్కో సారి ఇరవై ఏళ్ళు కూడా దాటకుండానే చర్మం నిగారింపు తగ్గడం, కళ్ళ చుట్టూ వలయాలు నల్లగా కనిపించడం, అమ్మాయిలకు చాలా కష్టం కలిగిస్తాయి. చాలా మట్టుగు రాత్రింబవళ్ళు తిరిక లేకుండా చదువు పైనే ద్రుష్టి వుంచడం, మంచి ఆహారం తీసుకోక పోవడం, ఒక వేల కడుపు నిండా తిన్నా బరువు పెరుగుతామని వద్దనడం కూడా కారణం కావొచ్చు, నిద్ర లేమి, ఒత్తిడి, డిప్రేషన్ నల్లని వలయాలకు కారణం. విటమిన్ బి12 లోపం, లివర్ సంబందిత రుగ్మతలు, వారసత్వంగా వచ్చే ఇతర శారీరక కారణాలు కూడా కావొచ్చు ముందుగా ఎటువంటి ఆరోగ్య పరమైన కారణాలు లేవని నిర్ధారించలేం కనుక జీవన విధానం లో మార్పులు అరంబించాలి. ప్రతి రోజు తప్పనిసరిగా ఏడు ఎనిమిది గంటల నిద్ర చాలా అవసరం . చదువుకు సంబందించిన వత్తిడి తగ్గించుకోవాలి. యంటి ఆక్సిడెంట్స్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి12 ,కె వంటి సంపూర్ణమైన ఆహారం తినాలి. పై పూత మందుల తో ఎలాంటి లాభం వుండదు. ఆమంచి ఆహారం తీసుకున్నా కళ్ళ చుట్టూ నలుపు తగ్గకపొతే డెర్మటాలజిస్ట్ ను సంప్రదించాలి. ప్రత్యేకమైన ఆయింట్మెంట్లు ఏవైనా సజెస్ట్ చేయవచ్చు.

    జీవన విధానం లో మార్పుల తో నే ఆరోగ్యం అందం

    ఒక్కో సారి ఇరవై ఏళ్ళు కూడా దాటకుండానే చర్మం నిగారింపు తగ్గడం, కళ్ళ చుట్టూ వలయాలు నల్లగా కనిపించడం, అమ్మాయిలకు చాలా కష్టం కలిగిస్తాయి. చాలా మట్టుగు…

  • పాత్రల్లో ఏముంటుందీ, పదార్ధాలు వండే తీరులో రుచి నోరూరిస్తుంది అనుకుంటాం కానీ, తినే పాత్రల రంగు రూపం మెటీరియల్ రుచిని మార్చేస్తాయంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు. క్రాకరీ, కట్లెరీ, సంగీతం ఇవి మూడు ఆహారాన్ని ఎంజాయ్ చేయడాన్ని రెండింతలు పెంచుతాయని వారు గుర్తించారు. అలాగే తినే ప్లేట్ లేదా బౌల్ రంగు, స్పూన్ బరువు కూడా రుచిని ప్రభావితం చేస్తాయంటున్నారు. సాల్టెడ్ పాప్ కార్న్ ను ఎర్రని బౌల్ లో కంటే బ్లూ బౌల్ లో తిన్నప్పుడు రుచి ఎక్కువగా ఉన్నట్లు ఫీలయ్యారని అధ్యయనంలో పాల్గొన్న వారు చెపుతున్నారు. రంగుల కాంట్రాస్ట్, అలవాటు ఇష్టాలు కూడా కీలకంగా ఉంటాయి. అలాగే కొంచెం బరువు గల క్రాకరీలు, కట్లేరీలు ఆహారం మరింత టేమ్టింగ్ గా ఉంటుందిట. రంగు రంగుల పింగాణీ పాత్రలు టేబుల్ పై వుంటే అందంగా అతిధులను ఆహ్వానించేలా వుంటాయి. అంటే ఆహారాన్ని చక్కగా వండటమే కాదూ, డెకరేట్ చేయటమే కాదూ, తినే పాత్రల ప్రభావం వల్ల కూడా బాగా తినగలమని అధ్యయనాలు చెప్తున్నాయి.

    పింగాణీ పాత్రలు రుచిని రెట్టింపు చేస్తాయి

    పాత్రల్లో ఏముంటుందీ, పదార్ధాలు వండే తీరులో రుచి నోరూరిస్తుంది అనుకుంటాం కానీ, తినే పాత్రల రంగు రూపం మెటీరియల్ రుచిని మార్చేస్తాయంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు. క్రాకరీ, కట్లెరీ,…

  • నెమ్మదిగా చలి తగ్గిపోతుంది. వాతావరణం వేడెక్కుతుంది. ఇప్పుడు చూసేందుకు పచ్చగా కాస్త ఎర్రగా కళ్ళకు విందు చేసే పుచ్చకాయల సీజన్ మొదలైంది. పుచ్చకాయ తినేనేదుకు రుచికరమనే కాదు. ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం తప్పకుండా రోజుకో స్లైస్ తప్పకుండా తింటే కోలేస్త్రోల్ తగ్గడం మాత్రమే కాదు, బరువు పెరగకుడా అదుపులో ఉంచుతుంది. పుచ్చకయలో వుండే సిట్రలాయిన్ అనే కెమికల్ ఈ విధమైన పనితీరుకు సహకరిస్తుందని అమెరికాలోని పర్ద్యు యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అత్యధిక కొవ్వు పదార్ధాల తో పాటు పుచ్చకాయ ఇచ్చి పరిశోధనలు చేయగా రక్తనాళాల్లో కొవ్వు డిపాజిట్ లను అడ్డుకోవడం తో పుచ్చకాయ బ్రహ్మాండంగా పనిచేసిందని వారు వివరించారు. వేసవి సిజన్ అనే కాదు సంవత్సరం పొడుగునా పుచ్చకాయ దొరుకుతూనే వుంటుంది కనుక రోజుకో ముక్క తినడం పెద్ద సమస్యే కాదు. తప్పని సరిగా రోజులో ఎదో ఒక సమయంలో ఒక ముక్క తిని చూడండి.

    రోజుకో పుచ్చ ముక్క

    నెమ్మదిగా చలి తగ్గిపోతుంది. వాతావరణం వేడెక్కుతుంది. ఇప్పుడు చూసేందుకు పచ్చగా కాస్త ఎర్రగా కళ్ళకు విందు చేసే పుచ్చకాయల సీజన్ మొదలైంది. పుచ్చకాయ తినేనేదుకు రుచికరమనే కాదు.…