• ఔషధ మూలికలుగా పెరిగే ఎన్నో మొక్కల్ని మనం పట్టించుకోము.. అలంటి వాటిల్లో పుదీనా ఒకటి. వేసవి వస్తోందంటే పుదీనా షర్బత్ పుదీనా ఆకులు వేసిన మజ్జిగ తాగి తేటగా వుంటారు. ఇందులో మెంథాల్ కారణంగా గ్యాస్ట్రిక్ అల్సర్లు తగ్గుమొహం పడతాయి. పుదీనా ఆకులు నోటిని శ్వాసనీ తాజాగా ఉంచుతాయి. దోమ కాట్లకు దద్దుర్లకు ఇతరత్రా అలర్జీలకు పుదీనా తో చేసిన నూనె ఎంతో ఉపయోగం. ఆరోగ్యాన్ని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఖనిజాలు అంటే మనకు కూరగాయలు పండ్లే గుర్తొస్తాయి. కానీ పుదీనా లో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు గాను యాంటీ ఇన్ఫలమేటరీ గానూ పనిచేసే మారినిక్ ఆమ్లం పుదీనాలో వుంది . ఇది అలర్జీలు తగ్గిస్తుంది. ఇందులో ఉండే మెంథాల్ శేష్మం తగ్గిస్తుంది. దీనితో చేసిన టీ తాగటం వల్ల గొంతు నొప్పులు తగ్గుతాయి. అజీర్తిని గ్యాస్ట్రిక్ సమస్యని త్రేపుల్ని నిరోధిస్తుంది. పుదీనా టీ బడలికను కూడా తగ్గిస్తుంది. పుదీనా పచ్చడి రుచి గురించి కొత్తగా చెప్పుకునేందుకు ఏమీ లేదు. పుదీనా రెగ్యులర్ డైట్ లో చేర్చటం ఉత్తమం.

    పుదీనా లో ఏముందీ ?

    ఔషధ మూలికలుగా పెరిగే ఎన్నో మొక్కల్ని మనం పట్టించుకోము.. అలంటి వాటిల్లో పుదీనా ఒకటి. వేసవి వస్తోందంటే పుదీనా షర్బత్ పుదీనా ఆకులు వేసిన మజ్జిగ తాగి…

  • వేసవి వస్తే ఎండల భయం ఉంటుంది. మల్లెల సుగంధం మనసుని పరవళ్లు తొక్కిస్తుంది. మాఘ మాసం నుండి మొదలై ఆషాఢ జల్లుల వరకు పలకరించే ఈ అద్భుతమైన మల్లెల సౌరభాలంటే అందరికీ ఇష్టమే. ప్రపంచవ్యాప్తంగా జాస్మిన్ జల్లులు ఎన్నో ఉన్నప్పటికీ మనకు తెలిసిన మల్లె జాతి మాత్రం జాస్మినం సంబర్.దీన్నే అరేబియన్ జాస్మిన్ మల్లికా కుండ మల్లిగై మోగ్రా అంటూ అనేక రకాల పేర్లతో పిలుస్తారు. పూలరేకులు పరిమళం బట్టి కూడా ఇందులోనూ రకాలున్నాయి. ఒకే వరసలో ఐదు అంతకంటే ఎక్కువ రేకులతో ఉండేదే బొండుమల్లి గుండుమల్లి రేఖ మల్లి అంటారు. ఎండ తగులుతుంటే ఏడాది పొడవునా పూసే మల్లెలుంటాయి. చూసేందుకు చిన్న గులాబిల్లా ముద్దుగా వుండే రోజ్ జాస్మిన్ లేదా నెంటు మల్లె అంటారు. దొంతర మల్లెల్లో పూరేకులు అరలు అరలుగా ఉంటాయి. మాఘ మల్లికా స్టార్ జాస్మిన్ అని పిలిచే మల్లియలు ఆకు కనిపించకుండా మొత్తం తెల్లగా పూసేస్తాయి. ఇవే కాదు నేల తీరు వాతావరణం బట్టి ఒక్కో మల్లె మొగ్గది ఒక్కోఅందం. ఒక్కో మధురమైన పరిమళం. ఈ మధ్యనే పేటెంట్ పొందిన మధురై మల్లెలు మీనాక్షి అమ్మవారికి ఎంతో ప్రీతికరం. ఆమెను అలంకరించేది ఈ మల్లెలతోనే . అసలే అందమైన మీనాక్షి దేవి విగ్రహంపైన మల్లెల మాలలు అందమే అందం.

    మల్లె విరిసే వేళలు

    వేసవి వస్తే ఎండల భయం ఉంటుంది. మల్లెల సుగంధం మనసుని పరవళ్లు తొక్కిస్తుంది. మాఘ మాసం నుండి మొదలై ఆషాఢ జల్లుల వరకు పలకరించే ఈ అద్భుతమైన…

  • నీహారికా , నాపైన ఎవరన్నా చిన్నగా విసుక్కున్నా కోపం తెచ్చుకున్నా నాకు చాలా కోపం వచ్చేస్తుంది . చదువుకోవటం కూడా చిరాగ్గా ఉంటోంది అన్నావు బావుంది. అప్పుడు నిన్ను గురించి నువ్వు నీవైపు తప్పువుందా అని ఆలోచించావా ? ఎదుటివాళ్ళ ఉద్వేగాన్ని మనం యధాతధంగా అర్ధం చేసుకోవాలనిపించలేదా .. ఇప్పుడు తప్పు నీదే . ఇంట్లో వాళ్ళనుకో వాళ్లకు నీ వల్ల కలిగిన చిరాకు ఏమిటి ? నా వైపు నుంచి ఎంత తప్పువుందో ఓ నిముషం ఆలోచిస్తే చేసిన తప్పుకు సారీ చెప్పేస్తే సరిపోతుంది . మధ్యలో నీకు కోపం రావటం ఏమిటి ? ఇప్పుడు నువ్వు సెన్సిటివ్ గా మనసుతో ఆలోచించకుండా తీక్షణంగా బుద్ధితో ఆలోచించాలన్నమాట. అంటే బుర్రతో ఆలోచించి అరె తప్పు నాదనే అనుకోవచ్చు లేదా అనవసరంగా నా పైన విసుక్కున్న వాళ్ళను నిలదీయచ్చు. ఇక బయటవాళ్ళనుకో అప్పుడు ఇదే ముందు ఆలోచన చేయి . వెంటనే కోపం తెచ్చేసుకుని నీ బలహీనత బయట పెట్టకుండా అసలు నేనింత బాధపడటం అవసరమా ? దీనివల్ల నాకొచ్చిన లాభమేమిటి ? ఈ చిరాకు కోపం వల్ల నేనెంత నష్టపోతున్నాను. అసలా ఉద్వేగానికి లోనైనప్పుడు నేనెలా ఉంటున్నాను ? ఇలా ఆలోచించు . ఇప్పుడు నీ ఆలోచనలు అలా సుడిగాలి లాగ నీ చుట్టూనే తిరిగి నిన్ను గందరగోళం లోకి నెట్టకుండా దూదిపింజెల్లా ఎగిరిపోతాయి. అతి సున్నితత్వం అనే మానసిక స్థితి నుంచి ముందు బయటకు రా .. ప్రాక్టికల్ గా వుండు.

    అసలా ఆలోచనే పరమ దండగ

    నీహారికా , నాపైన ఎవరన్నా చిన్నగా విసుక్కున్నా కోపం తెచ్చుకున్నా నాకు చాలా కోపం వచ్చేస్తుంది . చదువుకోవటం కూడా చిరాగ్గా ఉంటోంది అన్నావు బావుంది. అప్పుడు…

  • 14 కిలోల బరువున్న బంగారు లెహెంగా తో నమో వేంకటేశాయ లో నటించిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కనిపించిన కొద్దిసేపే నూరు మార్కులు తెచ్చేసుకుంది. ఆమె ఆ లెహెంగా తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగానే నాగార్జున ఇది పూర్తి బంగారు లెహెంగా కాకపోయినా ప్రగ్యా చక్కగా ఉంది అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అప్పటికే ప్రగ్యా రెండో సినిమా కంచె కు నేషనల్ అవార్డు వచ్చింది. తన సినీ రంగ ప్రవేశాన్ని గుర్తుచేసుకుంటూ ప్రగ్యా జైస్వాల్ అందరు బెస్ట్ డైరెక్టర్స్ వల్లనే తనకు పేరు వచ్చిందన్నది. కాలేజీలో చదువుకునేటప్పుడు సరదాగా పాకెట్ మనీ కోసం అందాల పోటీల్లో పాల్గొనన్నాన్నది. అక్కడ నుంచి సినిమాల పైన ఆసక్తి పెరిగి ఇంట్లో వాళ్ళని కష్టం మ్మీద ఒప్పించి ఇక ప్రయత్నాలు ఆరంభించానన్నది.ఈమెకు మంచి అవకాశాలే వస్తున్నాయి.

    ఇంట్లో వాళ్ళను ఒప్పించటమే కష్టం అయింది

    14 కిలోల బరువున్న బంగారు లెహెంగా తో నమో వేంకటేశాయ  లో నటించిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కనిపించిన కొద్దిసేపే నూరు మార్కులు తెచ్చేసుకుంది. ఆమె ఆ…

  • ఇష్టమైన ప్రతిదాన్ని మనసుకు దగ్గరగా తీసుకుంటాం. చాలా అతిగా ఓన్ చేసుకోవాలని చూస్తాం. మానవ సహజం. ఇప్పుడు టెక్నాలజీని కూడా ఇంతే వదల్లేనంతగా ... వాట్సాప్ ఫెస్ బుక్ ఈమెయిల్స్ పదే పదే చెక్ చేసుకోవటం ఇలాంటిదే. ఈ అలవాటు ఇష్టంతో చేస్తే అలవాటైనా సరే డిజిటల్ స్ట్రెస్ కు గురవుతారని చెపుతున్నాయి అధ్యయనాలు. ఫెస్ బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వంటి సోషల్ వెబ్ సైట్స్ తో పాటు కొత్త విషయాలు తెలుసుకోవాలనే సినిమా న్యూస్ కోసం నెట్ వెతుకుతూనే ఉంటారు. ఇదే పరిస్థితి అన్ని దేశాల్లోనూ ఉందని నిపుణులు చెపుతున్నారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పరిశోధన మొదలైంది. భోజనం చేసేటప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ ను పక్కనే ఉంచుకునే వాళ్ళు 80 శాతం నిద్రపోయే ముందర కూడా దాన్ని వదిలిపెట్టని వాళ్ళ శాతం కూడా తక్కవగా ఏం లేదు. 60శాతం, మంది తల్లి తండ్రులే పిల్లలకు ట్యాబ్ లు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారని రిపోర్ట్. ఏది ఎలాగైనా అతిగా వాడటం వల్ల జరిగే ముప్పే ఎక్కువంటున్నాయి అధ్యయనాలు.

    వీటి వాడకంలో నష్టం ఎక్కువ

    ఇష్టమైన ప్రతిదాన్ని మనసుకు దగ్గరగా తీసుకుంటాం. చాలా అతిగా ఓన్ చేసుకోవాలని చూస్తాం. మానవ సహజం. ఇప్పుడు టెక్నాలజీని కూడా ఇంతే వదల్లేనంతగా … వాట్సాప్, ఫెస్…

  • మానసిక శారీరిక ఆరోగ్యాల గురించి ఎప్పటికప్పుడు కొత్త అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాయామం కంటే యోగా మంచిదంటున్నారు నిపుణులు. అధిక బరువు తగ్గించటానికి ఒత్తిడి తగ్గించుకోవటానికి యోగా బాగా ఉపకరిస్తుందంటున్నారు. యోగాలో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫ్యాట్ కరిగించే యోగా భంగిమలు లెక్కలేనన్ని వున్నాయి. వీటితో జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. పొట్ట భాగంలో అదనపు కొవ్వు కరిగి నడుము నాజూకుగా అయిపోవటమే కాక కండరాలు బలంగా అయ్యేందుకు యోగ బాగా ఉపయోగాడుతుంది. ఉదయాన్నే ప్రాణాయామం చేస్తే శరీర వ్యవస్థ మొత్తం ఉత్తేజితం అవుతుంది. శ్వాసకు సంబంధించిన యోగాసనాలు కార్టిసాల్ హార్మోన్ ను ఉత్తేజపరుస్తుంది. యోగా తో అలర్జీ పై పోరాడే శక్తీ శరీరానికి సమకూరుతుంది. బ్రీతింగ్ ఎక్సర్ సైజులు మనసుకి కావాల్సిన రిలాక్సేషన్ అందుతుంది. డిప్రెషన్ తోబాధపడేవారికి యోగా మంచి ఉపశమనం. ఏ రకంగా చూసినా యోగాతో మెరుగైన ప్రయోజనాలున్నాయి. మానసిక శారీరిక ఆరోగ్యాల గురించి ఎప్పటికప్పుడు కొత్త అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాయామం కంటే యోగా మంచిదంటున్నారు నిపుణులు. అధిక బరువు తగ్గించటానికి ఒత్తిడి తగ్గించుకోవటానికి యోగా బాగా ఉపకరిస్తుందంటున్నారు. యోగాలో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫ్యాట్ కరిగించే యోగా భంగిమలు లెక్కలేనన్ని వున్నాయి. వీటితో జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. పొట్ట భాగంలో అదనపు కొవ్వు కరిగి నడుము నాజూకుగా అయిపోవటమే కాక కండరాలు బలంగా అయ్యేందుకు యోగ బాగా ఉపయోగాడుతుంది. ఉదయాన్నే ప్రాణాయామం చేస్తే శరీర వ్యవస్థ మొత్తం ఉత్తేజితం అవుతుంది. శ్వాసకు సంబంధించిన యోగాసనాలు కార్టిసాల్ హార్మోన్ ను ఉత్తేజపరుస్తుంది. యోగా తో అలర్జీ పై పోరాడే శక్తీ శరీరానికి సమకూరుతుంది. బ్రీతింగ్ ఎక్సర్ సైజులు మనసుకి కావాల్సిన రిలాక్సేషన్ అందుతుంది. డిప్రెషన్ తోబాధపడేవారికి యోగా మంచి ఉపశమనం. ఏ రకంగా చూసినా యోగాతో మెరుగైన ప్రయోజనాలున్నాయి.

    వ్యాయామం కంటే యోగా బెస్ట్

    మానసిక శారీరిక ఆరోగ్యాల గురించి ఎప్పటికప్పుడు కొత్త అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాయామం కంటే యోగా మంచిదంటున్నారు నిపుణులు. అధిక బరువు తగ్గించటానికి ఒత్తిడి తగ్గించుకోవటానికి యోగా…

  • ఇలాంటివి వింటే ఇక ప్రతిదానికీ ఉలిక్కిపడుతూనే ఉండాలనిపిస్తోంది. మనం సాధారణంగా మంచి హోటల్స్ వెతుక్కుని వెళతాం. అంటే ఖరీదైన వ్యవహారం ఆహరం అన్నీ ఉంటాయి. అయినా ఒక్కసారి ఆ టిఫినో భోజనమో తర్వాత స్టమక్ అప్సెట్ అవుతోంది. ఫుడ్ పాయిజనింగ్ అన్నంత దూరం పోతుంది. అందరికీ సరిపడిన ఆహారం మనకెందుకు ప్రాబ్లమ్ అయిందో అర్ధం కాదు. ఇప్పుడిక డాక్టర్ల నివేదికవచ్చింది. హోటల్లో వుండే మెనూ కార్డుల్లో వుండే క్రీములు మురికి టాయ్ లెట్ నీట్ కవర్ పైన కూడా ఉండదట. డాక్టర్లు ఏం చెపుతున్నారంటే హోటల్ కు వెళ్ళగానే మెనూ కార్డు చూసి ఏం కావాలో ఆర్డర్ ఇచ్చేసి వెంటనే పోయి వాష్ చేసిన దగ్గర శుభ్రంగా చేతులు కడుక్కోమంటున్నారు. కుర్చీలు బల్లలు కింద నెల ఎప్పుడు శుభ్రపరుస్తారు కానీ ఈ ప్లాస్టిక్ లేమినేటెడ్ మెనూ కార్డ్స్ వైపు ఎప్పుడూ పట్టించుకోరని హోటల్స్ లో వుండే బాత్ రూమ్స్ హ్యాండిల్స్ గ్లాస్ డోర్స్ అన్నీ క్రిములు మాయం అంటున్నారు . ఒక చిన్న లింక్ ఇచ్చారు కదా మిగతా అంతా ఊహించి హోటల్స్ కు వెళ్లకుండా ఎలా వుండగలమో ఆలోచించాలి.

    మెనూ కార్ట్స్ యమ డర్టీ

    ఇలాంటివి వింటే ఇక ప్రతిదానికీ ఉలిక్కిపడుతూనే  ఉండాలనిపిస్తోంది. మనం  సాధారణంగా మంచి హోటల్స్ వెతుక్కుని వెళతాం. అంటే ఖరీదైన వ్యవహారం ఆహరం అన్నీ ఉంటాయి. అయినా ఒక్కసారి…

  • మెరుగైన జీవితం కోసం నడక

    నడిస్తే కాళ్ళు నొప్పులంటారు గానీ రోజువారీ నడక వల్ల  కండరాలు నొప్పులు రాకపోగా చాలా రిలాక్స్ అవుతాయంటున్నారు నిపుణులు . ఇతర తరహా వ్యాయామాలతో వెన్నుముక్క పైన…

  • దాదాపుగా అందరి దినచర్య కాఫీ తోనే మొదలవుతుంది. కానీ కాఫీ మనల్ని చురుగ్గా ఉంచటమే కాదు ,ముఖ సౌందర్యానికీ ఎంతో ఉపయోగపడుతుందంటారు సౌందర్య నిపుణులు. పొడిచర్మం ఉన్నవాళ్లు కాఫీ డికాషన్ లో ఆలీవ్ నూనె కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే చర్మం సహజమైన మెరుపుతో తేమతో ప్రకాశిస్తూ ఉంటుంది . చెంచా ఓట్ మీల్ పొడి కొంచెం కాఫీ పొడి తేనే కలిపి ముఖం మర్దనా చేస్తే మృత కణాలు పోతాయి. కాఫీ పొడిలో తేనే పసుపు కలిపి రాసుకుని ఓ అరగంట తర్వాత కడిగేస్తే చర్మం శుభ్రంగా కనిపిస్తుంది. పాలు కాఫీ పొడి నెయ్యి కలిపి పూతలా వేసి కాస్సేపటికి కాటన్ తో ఆ పూతను తుడిచేస్తే ముఖం పైన మురికి మృతకణాలు పోయి బావుంటుంది . కాఫీ పొడి నిమ్మరసం కలిపి పూతలా వేసుకుంటే చర్మం ముడతలు లేకుండా ఉంటుంది . ఇది ప్రతి రోజు అన్ని చర్మ తత్వాలున్నవాళ్ళు ట్రై చేయచ్చు. ఇక కాఫీ పొడి మెత్తగా దంచిన దాల్చిన చెక్క పొడి పాలు తేనె కలిపి మెత్తని పేస్ట్ లా చేసి ఫేస్ ప్యాక్ గా వేసుకోవచ్చు. వారానికి రెండుసార్లు ఈ ఫేస్ ప్యాక్ వేస్తె చర్మం కళగా ఉంటుంది.

    సొగసైన చర్మానికి ఫెస్ ప్యాక్

    దాదాపుగా అందరి దినచర్య కాఫీ తోనే మొదలవుతుంది. కానీ కాఫీ మనల్ని చురుగ్గా ఉంచటమే కాదు ,ముఖ సౌందర్యానికీ ఎంతో ఉపయోగపడుతుందంటారు  సౌందర్య నిపుణులు. పొడిచర్మం ఉన్నవాళ్లు…

  • పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలనుకుంటే అందులో మూడు ముఖ్య విషయాలు కలగలిసి ఉండాలని తల్లితండ్రులు తెలుసుకోవాలి. మెచ్చుకోలు ఒక చిన్న గిఫ్ట్ ఒక పనిష్ మెంట్ ఈ మూడింటిని సరైన సమయంలో ఉపయోగించి పిల్లల్ని జీవితపు విలువలు పాటించేలా ఉత్తమ పౌరులుగా పెంచుకోవచ్చు. ముందుగా వారికీ మనపై నమ్మకం కలిగేలా పెద్దలు ప్రవర్తించాలి . తమ క్షేమం కోరేది తల్లి తండ్రులే నన్న భావన పిల్లల్లో కలిగితే ఒక పెద్ద పని అయినట్లే. అలాగే పిల్లలు మంచి పని చేస్తే తప్పని సరిగా పొగడాలి. ఆ పొగడ్త వారిని మరిన్ని మంచి పనులు చేసేందుకు ప్రోత్సాహం. అలాగే వారిని సంతోషపెట్టే ఒక చిన్న బహుమతి. పిల్లలు ఈ రెండింటితో తమలో ఉండే దుడుకుతనం సగం తగ్గించుకుంటారు. పెద్దలు నచ్చేలా మెలిగి ఆనందపెట్టాలనుకుంటారు. అలాగే ప్రతి చిన్న పొరపాటుని సమర్ధించవద్దు. ఒక చిన్న పొరపాటు చేస్తే అది ఎందుకు తప్పో ఆలా చేయటంవల్ల ఎవరికీ ఎందుకు నష్టమో అసలు తప్పు ఎందుకు చేయకూడదు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పే ఓర్పు నేర్పు తల్లి తండ్రులకు ఉండాలి. అప్పుడు ఇచ్చే ఒక చిన్న శిక్ష పిల్లలో మార్పు తెస్తుంది. ఫలానా కారణంగా నా వల్ల పొరపాటు జరిగిందనీ దాన్ని చేయటం నష్టమనీ తెలుసుకుంటారు. ఇచ్చే శిక్షని మనసులో నిల్చుకుని కష్టం కలిగేలా ప్రవర్తించకుండా వుంటారు. తప్పు చెప్పాలి సరిదిద్దాలి. మందలించాలి. ఆ హక్కు పెద్దలకు ఉందని పిల్లవాడు నమ్మగలగాలి.

    ఇదంత ఆషా మాషీ ఏం కాదు

    పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలనుకుంటే అందులో మూడు ముఖ్య విషయాలు కలగలిసి ఉండాలని తల్లితండ్రులు తెలుసుకోవాలి. మెచ్చుకోలు ఒక చిన్న గిఫ్ట్ ఒక పనిష్ మెంట్ ఈ మూడింటిని…